samkranthi
-
సంబరాల సాగరమై..
జలధిని మించినట్టుగా.. అంబరాన్ని తాకిట్టుగా జనకెరటం ఎగసిపడింది. సంక్రాంతి సెలవులకు బంధుమిత్రులంతా రావడం.. భోగి పండగ సాయంత్రం అందరూ కలిసి, కాసేపు సరదాగా గడపాలని కోరుకోవడంతో.. సాగర సంబరాల్లో రెండో రోజైన శుక్రవారం కాకినాడ తీరం జనసంద్రాన్ని తలపించింది. సంబరాల వేదికపై ప్రదర్శించిన జానపద కళా, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఉర్రూతలూగించాయి. కాకినాడ రూరల్ : సంబర సమయాన సాగరతీరం సందడిగా మారింది. ఉవ్వెత్తున ఎగసే కెరటంలా.. రెండోరోజూ శుక్రవారం పర్యాటకులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల నృత్యాలు, హాస్యస్కిట్లు, మ్యూజికల్ నైట్స్, గాత్ర సంగీతం, నృత్యనాటికలు, జానపద కళారూపాలు, ఫ్యాష¯ŒSషో వంటి ప్రదర్శనలు పర్యాటకులను అలరించాయి. జిల్లాలోని అనేక పాఠశాలలకు చెందిన 550 మందికి పైగా విద్యార్థులు కోలాటం, నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, సినీ డా¯Œ్సలు, సినీ నృత్యాలు, రింగ్ డ్యాన్సులతో అదరగొట్టారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులు, అధికారులు మెమెంటోలు అందజేశారు. ‘ఫ్లవర్’ఫుల్ షో.. బీచ్ సంబరాల్లో బెంగళూరు ఫ్ల్లవర్షోతో పాటు కడియం, కడియపులంక నర్సరీ యజమానులు పెద్ద ఎత్తున పూలు, పండ్లు, కూరగాయలు జౌషధ, బోన్సాయ్ మొక్కలతో 60కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల రోగాలను నయం చేసే ప్రకృతి సిద్ధమైన వేర్లు, కాయలు, పండ్లను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనగా ఉంచారు. ఆకట్టుకున్న పలు స్టాళ్లు మారేడుమిల్లి, అడ్డతీగల ప్రాంతాలకు చెందిన బొంగు చికె¯ŒS స్టాల్స్, ఆత్రేయపురం పూతరేకులు, పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెలు, గోదావరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీత, రొయ్య, సొర్ర, పండుగొప్ప, వంజురంలాంటి 34 రకాల వంటకాలు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులు, మత్స్యశాఖ ఏర్పాటు చేసిన వివిధ రకాల చేపల అక్వేరియం, చేనేత వస్త్ర ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. తూరంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన పాడిన పాటలు, ఆడిన ఆటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు కళాకారులు నిర్వహించిన మ్యూజికల్ నైట్స్, జబర్దస్త్ టీము సభ్యుల హాస్యస్కిట్లు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించాయి. -
ఎయిర్‌పోర్టుకు సంక్రాంతి సందడి
పెరుగుతున్న విమాన ప్రయాణికులు టికెట్ ధరలు పైపైకి మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సంక్రాంతి సందడి వచ్చింది. శుక్రవారం విమాన ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి చేరుతున్న ప్రయాణికుల కారణంగా రద్దీ ఏర్పడింది. కొంతకాలంగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండగా సంక్రాంతి నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం అన్ని విమాన సర్వీసులలో 60–70 మంది చొప్పున ప్రయాణించారు. పండగ రద్దీ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రోజూ ఐదు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్ సర్వీసులు 2, స్పైస్‌జెట్ 2, ట్రూజెట్ 1 సర్వీసు నడుస్తున్నాయి. హైదరాబాద్ వైపు నుంచి జిల్లాకు, ఇక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూర్‌లకు తిరిగి వెళ్తున్న విమానా లున్నాయి. వీటి రాకపోకలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4–40 గంటల వరకూ జరుగుతాయి. పెరుగుతున్న టికెట్ ధరలు సంక్రాంతి పండగ సందర్భంగా విమాన సర్వీసుల టికెట్ ధరలు రూ.3,000 నుంచి రూ.6,000 వరకూ పెరిగాయి. పండగకు ముందు రూ.2,500 నుంచి రూ.3,500 ఉన్న టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ¯ŒSలై¯ŒS విక్రయాలతో వీటిని పెంచుతున్నారు. మొదటి 20 టికెట్లు ఒక ధర కాగా ఆ తర్వాత నుంచి ధరలను పెంచుతున్నారు. ఆలస్యంతో ఇబ్బంది శీతాకాలం వాతావరణం అనుకూలించక విమానాలు ఆలస్యం కావడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. విమానం రద్దు, ఆలస్యాన్ని మందే ప్రకటించకపోవడంతో కూడా సమస్యలుత్పన్నం అవుతున్నాయి. -
ఊరూరా పండుగే
జిల్లావ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో పెద్ద పండుగ సంక్రాంతి సందడి నెలకొంది. విద్యార్థులే రైతులుగా, సంక్రాంతి లక్ష్ములుగా, కొత్త అల్లుళ్లుగా, ఇంటి ఆడపడుచులుగా, హరిదాసులు, కొమ్మదాసులుగా, డూడూ బసవన్నలుగా, కోడి పందెగాళ్లుగా అలరించారు. విద్యాసంస్థలకు బుధవారం నుంచి సంక్రాంతి సెలవులు. దీంతో వివిధ విద్యాసంస్థల ఆవరణల్లో మంగళవారం భోగి మంటలు వేసి, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి, పొంగలి వండి, కోడి పందేలు నిర్వహించి సంక్రాంతి సందడి చేశారు. రంగు రంగుల దుస్తుల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు.