- పెరుగుతున్న విమాన ప్రయాణికులు
- టికెట్ ధరలు పైపైకి
ఎయిర్‌పోర్టుకు సంక్రాంతి సందడి
Published Fri, Jan 13 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
మధురపూడి (రాజానగరం) :
రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సంక్రాంతి సందడి వచ్చింది. శుక్రవారం విమాన ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి చేరుతున్న ప్రయాణికుల కారణంగా రద్దీ ఏర్పడింది. కొంతకాలంగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండగా సంక్రాంతి నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం అన్ని విమాన సర్వీసులలో 60–70 మంది చొప్పున ప్రయాణించారు.
పండగ రద్దీ
రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రోజూ ఐదు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్ సర్వీసులు 2, స్పైస్‌జెట్ 2, ట్రూజెట్ 1 సర్వీసు నడుస్తున్నాయి. హైదరాబాద్ వైపు నుంచి జిల్లాకు, ఇక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూర్‌లకు తిరిగి వెళ్తున్న విమానా లున్నాయి. వీటి రాకపోకలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4–40 గంటల వరకూ జరుగుతాయి.
పెరుగుతున్న టికెట్ ధరలు
సంక్రాంతి పండగ సందర్భంగా విమాన సర్వీసుల టికెట్ ధరలు రూ.3,000 నుంచి రూ.6,000 వరకూ పెరిగాయి. పండగకు ముందు రూ.2,500 నుంచి రూ.3,500 ఉన్న టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ¯ŒSలై¯ŒS విక్రయాలతో వీటిని పెంచుతున్నారు. మొదటి 20 టికెట్లు ఒక ధర కాగా ఆ తర్వాత నుంచి ధరలను పెంచుతున్నారు.
ఆలస్యంతో ఇబ్బంది
శీతాకాలం వాతావరణం అనుకూలించక విమానాలు ఆలస్యం కావడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. విమానం రద్దు, ఆలస్యాన్ని మందే ప్రకటించకపోవడంతో కూడా సమస్యలుత్పన్నం అవుతున్నాయి.
Advertisement
Advertisement