![Tollywood Heroine Ananya Nagalla Reaction after Her Airport Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Tollywood-Heroine-Ananya.jpg.webp?itok=Sbdsnmii)
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉంది. గతేడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను మెప్పించింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సిన అనన్య నాగళ్లకు ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. తన బ్యాగేజ్ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఇంత సింపుల్‌గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ విమానసంస్థ కస్టమర్ కేర్ వారితో ఫోన్‌లో మాట్లాడింది. మీరు ఆలస్యం చేయడం వల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఓ వీడియోను షేర్ చేసింది.
అనన్య తన ట్వీట్‌లో రాస్తూ..'నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు వారు సింపుల్‌గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్‌ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారట. ఇది ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్యాసింజర్ ఒక నిమిషం ఆలస్యం అయితే.. అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడేమో 6 గంటల లగేజీ ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ విమానయాన సంస్థ కస్టమర్ కేర్‌కు ఇచ్చిపడేసింది డార్లింగ్ బ్యూటీ'.
కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది.
I was travelling from Hyderabad to Madhurai today morning for an event . I have checked in two baggages and one of it got delayed for 6 hours. when i contacted the customer care they are simply saying sorry and they will send it in next available flight. @IndiGo6E this is… pic.twitter.com/WtbFgST7ff
— Ananya Nagalla (@AnanyaNagalla) February 14, 2025
Comments
Please login to add a commentAdd a comment