
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్‌డీటీ18 వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.
అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు.
కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍
Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024