
తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాల గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అయితే చైతూతో పెళ్లి తర్వాత ఇటీవల తండేల్ మూవీ ఈవెంట్‌లో మెరిసింది అక్కినేని కోడలు. తాజాగా తన పెళ్లి తర్వాత తొలిసారిగా మూవీ సెట్‌లో అడుగుపెట్టింది శోభిత. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారామె. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చైతూతో పెళ్లి తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అంతకుముందు బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శోభిత ధూళిపాల. బాలీవుడ్‌లో 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.
Here are some photos of #SobhitaDhulipala shooting for her next film. ✨#Celebs pic.twitter.com/PTAXN54Ab4
— Filmfare (@filmfare) February 24, 2025