
ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరోయిన్ కాయాదు లోహర్. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించింది. ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఇందులో తమిళంతో పాటు తెలుగులోనూ మాట్లాడి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అస్సాం బ్యూటీ.. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్‌లో యంగ్ హీరోతో జత కట్టనుందని లేటేస్ట్ టాక్. అందుకే తెలుగు భాషను నేర్చుకుంటోందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్ కా దాస్ నటించబోయే ఫంకీ మూవీలో కాయదు లోహర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది. ఈ మూవీ జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గ్లామర్ బ్యూటీ నటిస్తే యూత్ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. కాయదు లోహర్ ఇప్పటికే శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
కాయాదు లోహర్ తెలుగులో మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. నేను త్వరలో టాలీవుడ్‌లో సినిమా కనిపించబోతున్నా. మీ అందరూ నన్ను బాగా ఆదరించారు. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు' అని వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఫంకీ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment