baggage
-
Viral: ఎయిర్‌పోర్టు బ్యాగేజ్ బెల్టుపై యువతి రీల్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇప్పటివరకు మెట్రో రైళ్లలో రీల్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్రెండ్ ప్రస్తుతం ఎయిర్‌పోర్టులకు కూడా పాకింది. ఓ యువతి ఎయిర్‌పోర్టులోని బ్యాగేజ్ కన్వేయర్ బెల్టుపై పడుకొని కొద్దిసేపు బెల్టుతో పాటు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ఈ ఫీట్ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో హిందీ సినిమా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో దేసీ మోజిటో అనే హ్యాండిల్లో పోస్టు చేసినప్పటి నుంచి ఏకంగా 32 లక్షల వ్యూస్ రావడం విశేషం. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. రీల్ల వైరస్ ఎయిర్‌పోర్టులను కూడా చేరింది అని ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరికొందరైతే ఏకంగా ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో బ్యాగేజ్ బెల్ట్ అంత చెత్త ప్రదేశం ఇంకొకటి ఉండదని, దానిపై ఎలా దొర్లుతారని మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా, ఇటీవలే ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేసిన మహిళలపై మెట్రో రైలు యాజమాన్య సంస్థ న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH — desi mojito 🇮🇳 (@desimojito) March 29, 2024 ఇదీ చదవండి.. ప్రజల గొంతునవుతా.. కంగనా రనౌత్ -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 30 నిమిషాలే టైమ్!
Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. -
వైరల్ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్ బెల్ట్‌పై మృతదేహం?
London Airport Viral Video: ఎయిర్‌పోర్టులో తమ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఓ వస్తువును చూసి తీవ్ర భయాందోళన చెందారు. కన్వేయర్ బెల్ట్‌పై పార్సిల్లో చుట్టబడిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకొని హమ్మయ్యా అనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 2017కు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి నెట్టింట్లోచక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లండన్ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఇందులో విమానం దిగిన ప్యాంసిజర్లు తమ సామాన్ల కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వింత పార్సిల్ బెల్ట్ మీద రావడం గమనించారు. అది అచ్చం మనిషి శవాన్ని ప్యాక్ చేసిన ఆకారంలో కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఇది నిజంగా మృదేహమా, లేక వస్తువా అనే ఆలోచనలో పడ్డారు. అయితే తరువాత అది ఓ బొమ్మ ల్యాంప్ అని నిజం తెలుసుకొని నవ్వుకున్నారు. ఈ వీడియోను వైరల్‌హాగ్ అనే ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు.‘ స్కాట్లాండ్లో నేను బొమ్మ దీపం (mannequin lamp) కొనుగోలు చేశాను. అక్కడి నుంచి తిరిగి వస్తూ దీనిని తీసుకొచ్చాను. కన్వేయర్ బెల్ట్ నుంచి దీనిని తీసుకుంటుండగా అక్కడ ఉన్న వారి ఎక్స్‌ప్రేషన్స్ చూసి చాలా నవ్వొచ్చింది. ’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by ViralHog (@viralhog) -
కస్టమర్ కోరిన చోటుకే లగేజీ డెలివరీ...!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. డోర్ టు డోర్ బ్యాగేజ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్పోర్ట్ పేరుతో ఈ సేవలను కార్టర్‌పోర్టర్ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇండిగో అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరుకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఒకవైపుకు చార్జీ రూ.630తో మొదలు. కస్టమర్‌కు చెందిన లగేజీని పూర్తిగా ట్రాక్ చేస్తారు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు బుక్ చేయాల్సి ఉంటుంది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన కార్టర్‌పోర్టర్ ఆన్ డిమాండ్ బ్యాగేజ్ డెలివరీ సేవలను విస్తారా, ఎయిర్ ఏషియాకు సైతం అందిస్తోంది. చదవండి: కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు -
40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!
దుబాయ్: ఎయిరిండియా సంస్థకు చెందిన విమానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు 40 కేజీల లగేజీని తమ వెంట తీసుకెళ్లొచ్చు. బ్యాగేజీ పరిమితిని ఎయిరిండియా మరో 10 కేజీలు పెంచడంతో 40 కేజీల వరకు తీసుకెళ్లే వెసులుబాటు కలిగింది. టికెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా లగేజీ పరిమితి పెంపు వర్తిస్తుందని ఎయిరిండియా చైర్మన్, సీఎండీ అశ్విని లొహానీ వెల్లడించారు. సాధారణంగా ప్రయాణికుడి వెంట ఉంచుకుని తీసుకెళ్లే 7 కేజీల లగేజీకి అదనంగా 40 కేజీలు విమానంలో తీసుకెళ్లే అవకాశం కలగనుంది. ఇండోర్–దుబాయ్, కోలకతా–దుబాయ్ విమాన సేవల ప్రారంభం సందర్భంగా దుబాయ్‌లోని ఇండియా క్లబ్లో నీలగిరి ట్రేడింగ్ కంపెనీ సీఈవో చంద్రశేఖర్ భాటియా అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశ్విని లొహానీ మాట్లాడుతూ.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బ్యాగేజీ పరిమితిని పెంచినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంపై విమాన ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యాగేజీ పరిమితిని 30 నుంచి 40 కేజీల పెంచడం చాలా సంతోషంగా ఉంది. విమానాశ్రయంలో ప్రతిసారి అధికంగా ఉన్న లగేజీ తీసేస్తుంటే ఎంతో బాధ కలిగేది. సాధారణంగా విదేశాల్లో ఉండేవారు. రెండుమూడేళ్లకు ఒకసారి స్వదేశానికి వస్తుంటారు కాబట్టి వెళ్లేటప్పుడు బ్యాగేజీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. నా వరకు చూస్తే దుబాయ్ నుంచి వెళ్లేటప్పుడు ఇక నుంచి ఎక్కువ డ్రైఫ్రూట్స్ తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు మా అమ్మ చేసిన స్వీట్లు ఈసారి ఎక్కువగా తెచ్చుకుంటాన’ని ముంబైకి చెందిన అతిథి చందన్ అన్నారు. -
15కేజీల బ్యాగేజీ దాటితే వాతే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులపై ప్రైవేటు విమాన సంస్థలు భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై ప్రయాణికుల బ్యాగేజీ 15 కేజీలు దాటితే.. అదనపు లగేజీకి వాతలు తప్పవు. ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్లు ఈ 15 కేజీల నిబంధనను తీసుకొచ్చాయి. పరిమితి తర్వాత ఒక్కో కేజీకి రూ.400 రూపాయలు వసూలు చేయనున్నారు. గో ఎయిర్‌లో శని వారం నుంచే ఈ వడ్డింపు అమల్లోకి రాగా.. ఇండిగో, స్పైస్ జెట్లలో వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ ముందుగానే బుక్ చేసుకున్నట్లయితే.. 5 కేజీలకు రూ.1,900, 10 కేజీలకు రూ. 3,800లు వసూలు చేస్తామని గో ఎయిర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో, స్పైస్జెట్లలోనూ కాస్త అటు, ఇటుగా ఇదే వడ్డింపు ఉంటుంది. గత నెల్లో, జెట్ ఎయిర్వేస్ కూడా కొత్త బ్యాగేజీ నిబంధనలను (వచ్చే నెల నుంచి అమల్లోకి) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా మాత్రమే తమ ప్రయాణికులకు 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతినిస్తోంది. -
చేతిలో బరువు పెరిగితే బాదుడే..!
దుబాయ్ : అంతర్జాతీయ షాపింగ్ మాల్గా పేరున్న దుబాయ్‌కి ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుంటారు. మరి అలాంటి అత్యంత రద్దీగల దేశంలో ఉన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే వారి జేబులకు చిల్లులు పేట్టేందుకు విమానాశ్రయ అధికారులు సిద్ధమవుతున్నారు. చేతిలో ఉన్న బ్యాగుల బరువు ఆధారంగా అదనపు చార్జీలను వసూలు చేయనున్నట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విమానాలలో ప్రయాణించే వారు కొంత లగేజ్‌ను(హ్యాండ్ బ్యాగ్‌లు, చిన్నపాటి సూట్‌కేసులు) తమతో పాటు తీసుకుని వెళ్తారు. సాధారణంగా వాటికి ఎటువంటి చార్జీలు ఉండవు. కానీ దుబాయ్ ఎయిర్ పోర్టులో చేతిలో తీసుకువెళ్లే లగేజ్‌కు అదనపు చార్జీని వసూలు చేయనున్నారు. అయితే, లగేజ్ ఎంత బరువు ఉండాలి, ఎంత మొత్తంలో ఫీజును వడ్డించనున్నారో ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. అదనపు ఫీజు మాత్రం ఉంటుందని ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు తమ తమ క్యారియర్స్ వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. -
సామాన్యుడికీ విమానయోగం!
♦ కొత్త పౌర విమానయాన పాలసీకి కేబినెట్ ఆమోదం ♦ అరగంట ప్రయాణ వ్యవధికి చార్జీ రూ.1,250 మాత్రమే... ♦ వివాదాస్పద 5/20 నిబంధనకు చెల్లు... ♦ ప్రాంతీయ కనెక్టివిటీ పెంపునకు పాలసీలో పెద్దపీట... ♦ దీనికోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు... టికెట్లపై అదనపు పన్ను ♦ ప్రయాణాల రద్దు రుసుములపైనా పరిమితి.. బ్యాగేజీ చార్జీల తగ్గింపు న్యూఢిల్లీ: సామాన్యుడికి విమానయానాన్ని మరింత చేరువచేయడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే టికెట్ చార్జీని వసూలు చేయాల్సి ఉంటుంది. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అంతేకాకుండా దేశంలోకి మరిన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు అడుగుపెట్టేందుకు వీలుగా వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా చరమగీతం పాడింది. ప్రయాణికులకు టికెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు. బుధవారమిక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఏవియేషన్ పాలసీకి ఆమోదముద్ర పడింది. ఇప్పటిదాకా విమానసర్వీసులు లేని రూట్లలో విమానాలను నడిపే ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్ కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలను కూడా పాలసీలో కల్పించారు. మరోపక్క, ప్రాంతీయంగా విమాన సర్వీసులను పెంచేందుకు వీలుగా రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులపై అదనంగా స్వల్ప పన్నును విధించనున్నారు. గేమ్ చేంజర్ పాలసీ ఇది: అశోక్ గజపతి రాజు దేశీ విమానయాన రంగాన్ని సమూలంగా మార్చివేసే(గేమ్ చేంజర్) పాలసీగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దీన్ని అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి సమీకృత జాతీయ పౌర వియానయాన పాలసీని తీసుకొచ్చిన ఘనత తమ ఎన్డీఏ ప్రభుత్వానిదేనని ట్వీట్ చేశారు. ఈ కొత్త విధానం కారణంగా 2022 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించనుందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా విమానయాన ప్రయాణాన్ని మరింత మందికి చేరువచేసేలా టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేలా చర్యలు తీసుకోవడం, ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, మౌలిక వసతుల ను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలని అశోక్ గజపతి వివరించారు. కాగా, 5/20 నిబంధన రద్దుపై కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. అసంబంద్ధమైన ఈ నిబంధనను చెత్తబుట్టలోకి విసిరేశామన్నారు. కొత్త పాలసీ విమానయాన పరిశ్రమకు కీలక మలుపు అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు, నిపుణులు పేర్కొన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు రావడానికి, సామాన్యునికి విమాన సేవలను చేరువ చేయడానికి దోహదం చేస్తుందన్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ హెలికాప్టర్ సర్వీసులకు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక నిబంధనలను రూపొందించనుంది. నిషేధిత ఎయిర్‌స్పేస్ వెలుపల 5,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో తిరిగే హెలీకాప్టర్లకు ఇప్పటిదాకా అనేక ♦ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇకపై ఈ అడ్డంకులు తొలగించనుండటంతో ప్రమాద, నిర్మాణ ప్రదేశాల నుంచి సులువుగా ల్యాండింగ్, టేకాఫ్‌లకు వీలు కలగనుంది. ♦ భారత్‌ను విమాన మరమ్మతులు, మెయింటెనెన్స్ కార్యకాలాపాలకు(ఎంఆర్ఓ) ప్రధాన గమ్యం(హబ్)గా చేసేందుకు పాలసీలో చర్యలు చేపట్టారు. పాలసీ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఐదేళ్లపాటుఎంఆర్ఓ బిజినెస్ సంస్థలకు ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు అదనపు చార్జీలు, రాయల్టీలను విధించకూడదు. అదేవి దంగా తగినంత స్థలాన్ని కూడా చూపాల్సి ఉంటుంది. ఈ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను విధించకూడదు. ♦ కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) కొనసాగించనుంది. ఇప్పటికే ఏఏఐ ఎయిర్‌పోర్టు ఉన్న 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టుకు గనుక అనుమతిస్తే.. ఏఏఐకి తగువిధంగా నష్టపరిహారాన్ని ఇవ్వనున్నారు. ♦ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం. గంట ప్రయాణానికి చార్జీ రూ.2,500 మాత్రమే...! విమానయానాన్ని చౌకగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇకపై అరగంట ప్రయాణ వ్యవధిగల టికెట్లపై రూ.1,250... గంట ప్రయాణ వ్యవధిగల టికెట్ చార్జీ రూ.2,500కు మాత్రమే పరిమితమయ్యేలా పాలసీలో ఫిక్స్ చేశారు. 130 కోట్ల మంది ప్రజలున్న మన దేశంలో ఏటా 80 లక్షల మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారని.. తాజా పాలసీ చర్యలతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మంత్రి అశోక్ గజపతి చెబుతున్నారు. ఈ రేట్లను కంపెనీలు భరించేందుకుగాను ప్ర భుత్వం పన్ను రాయితీలను కల్పిస్తోంది. విమాన ఇంధనం(ఏటీఎఫ్)పై అన్ని రాష్ట్రాలూ ఇక వ్యాట్‌ను 1 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను కల్పించనుంది. 5/20 రూల్ ఇక 0/20... విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలకు అడ్డంకిగా ఉన్న వివాదాస్పద 5/20 రూల్‌ను కొత్త పాలసీలో పూర్తిగా రద్దు చేశారు. ఏదైనా దేశీ ఎయిర్‌లైన్స్ విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలంటే కార్యకలాపాలు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తవడంతోపాటు కనీసం 20 విమానాలు కంపెనీకి ఉండాలనేది 5/20 నిబంధన. కొత్తగా ప్రారంభమైన ఎయిర్ఏషియా, విస్తారా వంటి ఎయిర్‌లైన్స్ దీన్ని రద్దు చేయాలని వాదించగా.. పాత ఎయిర్‌లైన్స్ మాత్రం తమకు వర్తింపజేసిన ఈ రూల్‌ను అర్ధంతరంగా ఎలా రద్దు చేస్తారంటూ అభ్యంతరాలను లేవనెత్తాయి. అయితే, కేంద్రం ఈ రూల్‌ను తొలగించే విషయంలో కొంత మధ్యేమార్గాన్ని అనుసరించింది. 5/20 స్థానంలో ఇప్పుడు 0/20 నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. అంటే విదేశీ రూట్లకు విస్తరించాలంటే కనీసం 20 విమానాలు ఉంటే సరిపోతుంది. లేదంటే తమకున్న విమానాల్లో 20 శాతాన్ని దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తే చాలు అనుమతి లభిస్తుంది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్... దేశంలో విమాన సర్వీసులకు ప్రాంతీయ అనుసంధాన్ని పెంచేందుకు దీన్ని ప్రవేశపెడుతున్నారు. దీనిప్రకారం నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం గుర్తించింది. వీటిని డిమాండ్‌కు అనుగుణంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై అదనంగా స్వల్ప పన్ను విధింపు ద్వారా ఈ ఫండ్‌కు నిధులను సమకూర్చనున్నట్లు పాలసీలో ప్రకటించారు. రద్దు ఫీజులు, రిఫండ్స్ ఇలా... ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే ఇకపై ఎయిర్‌లైన్స్ చార్జీలో బేస్ ధర కంటే ఎక్కువగా ఫీజు రూపంలో కోతవేయడానికి లేకుండా పాలసీలో పరిమితి విధించారు. అదేవిధంగా ఫ్లైట్ లేదా టికెట్ రద్దయితే ప్రయాణికుడికి 15 రోజుల్లోగా రిఫండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక, రాయితీ ధరలపై విక్రయించే టికెట్లపై కూడా ఇకపై రిఫండ్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ అవకాశం లేదు. మరోపక్క, బోర్డింగ్ పాస్ ఇచ్చాక ఏ కారణంగానైనా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌ను రద్దు చేయడం, ప్రయాణానికి అనుమతించకపోతే ఇకపై భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది. కొత్త పాలసీ ప్రకారం తొలుత నిర్దేశించిన ప్రయాణ సమయానికి 24 లోపు మళ్లీ ప్రయాణానికి వీలుకల్పిస్తే... నష్టపరిహారం 200%(బేస్ ధర, ఇంధన సర్‌చార్జీలపై) ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి రూ.10,000. అదే 24 గంటల తర్వాత ప్రత్యామ్నాయ ఫ్లైట్ చూపిస్తే... నష్టపరిహారం 400%(గరిష్టంగా రూ.20,000) చెల్లించాలి. గంటలోపు మరో ఫ్లైట్‌కు గనుక పంపిస్తే ఎలాంటి నష్టపరిహారం ఉండదు. అదనపు బ్యాగేజీపై ఫీజు తగ్గింపు.. ఇప్పటివరకూ విమానాల్లో చెక్-ఇన్ కింద ఉచితంగా 15 కేజీల వరకూ బ్యాగేజీని అనుమతిస్తున్నాయి. చార్జీ చెల్లిస్తే గరిష్టంగా 20 కేజీలకు అనుమతి ఉంది. ప్రస్తుతం అదనపు బ్యాగేజీపై ప్రతి కేజీకి ఎయిర్‌లైన్స్ రూ.250-350 వరకూ చార్జీని విధిస్తున్నాయి. పాలసీలో దీన్ని తగ్గిస్తూ కేవలం రూ.100కే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. అయితే, ఎయిరిండియా ఫ్లైట్లలో 25 కేజీల వరకూ ఉచిత బ్యాగేజీకి అనుమతిస్తుండటంతో ఈ రూల్ దీనికి వర్తించదు. -
విమాన టికెట్ల రద్దు నిబంధనల మార్పు?
♦ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది: మంత్రి అశోక గజపతి ♦ వృత్తి నైపుణ్యాల శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ రద్దు, బ్యాగేజ్, బోర్డింగ్ వంటి అంశాల్లో కొత్త నిబంధనలు తేవాలని చూస్తోంది. టికెట్ రద్దు ఛార్జీలను ఈ మధ్య పలు విమానయాన సంస్థలు ఇష్టానుసారం పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ‘‘విమాన టికెట్ రద్దుకు సంబంధించి మాకు సలహాలు, సూచనలు, విన్నపాలు అందాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త నిబంధనలు తెస్తాం’’ అని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏవియేషన్ రంగంలో వృత్తి నైపుణ్యాల శిక్షణ నిమిత్తం.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), నేషనల్ స్కిల్ డె వలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎన్ఎస్డీఎఫ్) మధ్య ఈ సందర్భంగా ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఇందులో భాగంగా ఏఏఐ తన సీఎస్ఆర్ నిధులలో రూ.5.25 కోట్లను ఎన్ఎస్డీఎఫ్కు అందిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా ఇస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ కార్యదర్శి రోహిత్ నందన్ మాట్లాడుతూ.. వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి ప్రతి మంత్రిత్వ శాఖ కూడా కొన్ని ప్రణాళికలతో ముందుకు రావాలని తెలిపారు. భారత విమానయాన రంగంలో అత్యధికంగా 22 శాతం వృద్ధి నమోదయిందని, ప్రపంచంలోని ఏ ఇతర దేశమూ ఈ స్థాయి వృద్ధిని చూడలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనమే ఈ వృద్ధికి కారణమై ఉండొచ్చన్నారు.