Viral: ఎయిర్‌పోర్టు బ్యాగేజ్‌ బెల్టుపై యువతి రీల్‌.. వీడియో వైరల్‌ | Woman Recline On Airport Baggage Carousel, Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు బ్యాగేజ్‌ బెల్టుపై యువతి రీల్‌.. వీడియో వైరల్‌

Published Sat, Mar 30 2024 5:07 PM | Last Updated on Sat, Mar 30 2024 5:44 PM

Woman Recline On Airport Baggage Carousel Video Goes Viral - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటివరకు మెట్రో రైళ్లలో రీల్‌లు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ట్రెండ్‌ ప్రస్తుతం ఎయిర్‌పోర్టులకు కూడా పాకింది. ఓ యువతి ఎయిర్‌పోర్టులోని బ్యాగేజ్‌ కన్వేయర్‌ బెల్టుపై పడుకొని కొద్దిసేపు బెల్టుతో పాటు వెళ్లిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ఈ ఫీట్‌ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో హిందీ సినిమా సాంగ్‌ ప్లే అవుతూ ఉంటుంది.

ఈ వీడియోను ఎక్స్‌(ట్విటర్‌)లో దేసీ మోజిటో అనే హ్యాండిల్‌లో పోస్టు చేసినప్పటి నుంచి ఏకంగా 32 లక్షల వ్యూస్‌ రావడం విశేషం. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. రీల్‌ల వైరస్‌ ఎయిర్‌పోర్టులను కూడా చేరింది అని ఓ నెటిజన్‌ పోస్టు చేశాడు. మరికొందరైతే ఏకంగా ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎయిర్‌పోర్టులో బ్యాగేజ్‌ బెల్ట్‌ అంత చెత్త ప్రదేశం ఇంకొకటి ఉండదని, దానిపై ఎలా దొర్లుతారని మరో నెటిజన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా, ఇటీవలే ఢిల్లీ మెట్రోలో రీల్స్‌ చేసిన మహిళలపై మెట్రో రైలు యాజమాన్య సంస్థ న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. 

ఇదీ చదవండి.. ప్రజల గొంతునవుతా.. కంగనా రనౌత్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement