
London Airport Viral Video: ఎయిర్‌పోర్టులో తమ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఓ వస్తువును చూసి తీవ్ర భయాందోళన చెందారు. కన్వేయర్ బెల్ట్‌పై పార్సిల్‌లో చుట్టబడిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకొని హమ్మయ్యా అనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 2017కు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి నెట్టింట్లోచక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లండన్ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఇందులో విమానం దిగిన ప్యాంసిజర్లు తమ సామాన్ల కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వింత పార్సిల్ బెల్ట్ మీద రావడం గమనించారు.
అది అచ్చం మనిషి శవాన్ని ప్యాక్ చేసిన ఆకారంలో కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఇది నిజంగా మృదేహమా, లేక వస్తువా అనే ఆలోచనలో పడ్డారు. అయితే తరువాత అది ఓ బొమ్మ ల్యాంప్ అని నిజం తెలుసుకొని నవ్వుకున్నారు. ఈ వీడియోను వైరల్‌హాగ్ అనే ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు.‘ స్కాట్లాండ్‌లో నేను బొమ్మ దీపం (mannequin lamp) కొనుగోలు చేశాను. అక్కడి నుంచి తిరిగి వస్తూ దీనిని తీసుకొచ్చాను. కన్వేయర్ బెల్ట్ నుంచి దీనిని తీసుకుంటుండగా అక్కడ ఉన్న వారి ఎక్స్‌ప్రేషన్స్ చూసి చాలా నవ్వొచ్చింది. ’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42 మిలియన్ల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment