London airport
-
వైరల్ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్ బెల్ట్‌పై మృతదేహం?
London Airport Viral Video: ఎయిర్‌పోర్టులో తమ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఓ వస్తువును చూసి తీవ్ర భయాందోళన చెందారు. కన్వేయర్ బెల్ట్‌పై పార్సిల్లో చుట్టబడిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకొని హమ్మయ్యా అనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 2017కు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి నెట్టింట్లోచక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లండన్ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఇందులో విమానం దిగిన ప్యాంసిజర్లు తమ సామాన్ల కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వింత పార్సిల్ బెల్ట్ మీద రావడం గమనించారు. అది అచ్చం మనిషి శవాన్ని ప్యాక్ చేసిన ఆకారంలో కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఇది నిజంగా మృదేహమా, లేక వస్తువా అనే ఆలోచనలో పడ్డారు. అయితే తరువాత అది ఓ బొమ్మ ల్యాంప్ అని నిజం తెలుసుకొని నవ్వుకున్నారు. ఈ వీడియోను వైరల్‌హాగ్ అనే ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు.‘ స్కాట్లాండ్లో నేను బొమ్మ దీపం (mannequin lamp) కొనుగోలు చేశాను. అక్కడి నుంచి తిరిగి వస్తూ దీనిని తీసుకొచ్చాను. కన్వేయర్ బెల్ట్ నుంచి దీనిని తీసుకుంటుండగా అక్కడ ఉన్న వారి ఎక్స్‌ప్రేషన్స్ చూసి చాలా నవ్వొచ్చింది. ’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by ViralHog (@viralhog) -
హీత్రూను మించనున్న ఢిల్లీ ఐజీఐ
న్యూఢిల్లీ: రద్దీ విషయంలో లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ) అధిగమించనుందని సిడ్నీకి చెందిన ఆసియా–పసిఫిక్ ఏవియేషన్(కాపా) ఇండియా నివేదించింది. 2017–18లో ఐజీఐ నుంచి 6.57కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2019–20 నాటికి ఈ సంఖ్య 8 కోట్లకు చేరొచ్చని నివేదికలో తేలింది. ఈ ఒరవడి కొనసాగితే 2020నాటికి హీత్రూ విమానాశ్రయం ట్రాఫిక్‌ను ఐజీఐ మించిపోనుందని కాపా విశ్లేషించింది. ఐజీఐ విమానాశ్రయం ద్వారా నిత్యం 1,200 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి 4 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో ఢిల్లీ ఐజీఐ తొలిæ స్థానంలో ఉందని ‘ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్’ సంస్థ గతంలో తెలిపింది. -
హీరో అక్షయ్ కు చేదు అనుభవం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న పిరియాడిక్ మూవీ 'రుస్తుం' కోసం లండన్ వెళ్లిన అక్షయని అక్కడి హెత్రో ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన పత్రాలు సరిగా లేవంటూ ఆయనను గంటన్నర పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంచేశారు. ఈ సమయంలో అక్షయ్‌తో పాటు వ్యక్తిగత సహాయకుడు కూడా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2 షూటింగ్ షెడ్యూల్ ముగించుకొన్న అక్షయ్, రుస్తుం షూటింగ్ కోసం మంగళవారం లండన్ బయలుదేరారు. బుధవారం ఉదయానికి లండన్ చేరుకున్న అక్షయ్‌ని ఎయిర్‌పోర్ట్‌లోనే గంటన్నర పాటు నిలిపివేశారు. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులతో పాటే అక్షయ్‌ని కూడా ఉండమనటం హీరోను మరింత అసహనానికి గురిచేసింది. అభిమానులు ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఇబ్బంది పెడుతున్నారని, ఎక్కడైన ప్రైవేట్ ప్లేస్‌లో వెయిట్ చేయడానికి అనుమతించాలని అక్షయ్ కోరినా, ఎయిర్ పోర్ట్ అధికారులు అంగీకరించలేదు. -
లండన్ ఎయిర్‌పోర్టులో 8 గంటలు రాందేవ్ నిర్బంధం
యోగా గురు బాబా రాందేవ్‌కు ఇంగ్లండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు. శనివారం రాందేవ్‌ను విడిచిపెట్టినట్టు ఆయన ప్రతినిధి ఎస్.కె.తేజరావాలా తెలిపారు. వేధింపులకు గురైనట్టు 'స్వామీజీ' భావించారని తెలిపారు. కస్టమ్స్ అధికారులు రాందేవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్రిటన్‌కు విజట్ వీసాపై వచ్చారా లేక బిజినెస్ వీసాపైనా అన్న విషయం గురించి ఆరా తీశారు. ఆయన వెంట తీసుకెళ్లిన ఆయుర్వేద మందుల గురించి ప్రశ్నించారు. రాందేవ్ తన వెంట నాలుగు జతల దుస్తులు, కొన్ని మందులు, పుస్తకాలు తీసుకెళ్లారు. 'తనను ఎందుకు నిర్బంధించారని బాబా పలుసార్లు అధికారులను ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడూ నేరం, అనైతిక పనులు చేయలేదని చెప్పారు. ఐతే అధికారులకు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు' అని తేజరావాలా చెప్పారు. 125 కోట్ల భారతీయులందరికీ ఇది అవమానకర సంఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేళ్లుగా బాబా పలుసార్లు ఇంగ్లండ్ వెళ్లి యోగా తరగతులు నిర్వహించారని తెలిపారు. పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు.