న్యూఢిల్లీ: రద్దీ విషయంలో లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఐజీఐ) అధిగమించనుందని సిడ్నీకి చెందిన ఆసియా–పసిఫిక్ ఏవియేషన్(కాపా) ఇండియా నివేదించింది. 2017–18లో ఐజీఐ నుంచి 6.57కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2019–20 నాటికి ఈ సంఖ్య 8 కోట్లకు చేరొచ్చని నివేదికలో తేలింది. ఈ ఒరవడి కొనసాగితే 2020నాటికి హీత్రూ విమానాశ్రయం ట్రాఫిక్‌ను ఐజీఐ మించిపోనుందని కాపా విశ్లేషించింది. ఐజీఐ విమానాశ్రయం ద్వారా నిత్యం 1,200 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి 4 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో ఢిల్లీ ఐజీఐ తొలిæ స్థానంలో ఉందని ‘ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్’ సంస్థ గతంలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment