indira gandhi international air port
-
అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..!
దేశంలో బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత వీలైతే అంత దేశాల సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్ని అన్వేషిస్తున్నారు. సినిమా స్టైల్లో బంగారాన్ని తరలిస్తున్నారు.కొన్ని సార్లు అధికారులకు అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు విచిత్రంగా బంగారాన్ని తరలిస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. సినిమాల్లో బంగారాన్ని కడుపులో, లేదంటే తలపై విగ్గులో పెట్టుకొన్ని స్మగ్లింగ్ చేసే సన్నివేశాల్ని చూసే ఉంటాం. ఆ సన్నివేశాలు ఈ ఉబ్బెకిస్తాన్ గోల్డ్ స్మగ్లర్లు బాగా నచ్చినట్లన్నాయి. అందుకే తెలివిగా బంగారాన్ని నోట్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దుబాయ్ నుంచి వచ్చిన ఉజ్బెకిస్తాన్ స్మగ్లర్లను ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరి వద్ద నుంచి సుమారు 951 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశారో తెలుసా? బంగారాన్ని పళ్ల సెట్ల తరహాలో డిజైన్ చేయించారు.ఆ సెట్ ను నోట్లో అమర్చుకుని దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అంత బంగారాన్ని నోట్లో ఎలా పెట్టుకున్నారనేదే ఆశ్చర్యంగా ఉన్నా.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించగా..స్మగ్లింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నోట్లో బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో 'అంత బంగరాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. -
హీత్రూను మించనున్న ఢిల్లీ ఐజీఐ
న్యూఢిల్లీ: రద్దీ విషయంలో లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ) అధిగమించనుందని సిడ్నీకి చెందిన ఆసియా–పసిఫిక్ ఏవియేషన్(కాపా) ఇండియా నివేదించింది. 2017–18లో ఐజీఐ నుంచి 6.57కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2019–20 నాటికి ఈ సంఖ్య 8 కోట్లకు చేరొచ్చని నివేదికలో తేలింది. ఈ ఒరవడి కొనసాగితే 2020నాటికి హీత్రూ విమానాశ్రయం ట్రాఫిక్‌ను ఐజీఐ మించిపోనుందని కాపా విశ్లేషించింది. ఐజీఐ విమానాశ్రయం ద్వారా నిత్యం 1,200 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి 4 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో ఢిల్లీ ఐజీఐ తొలిæ స్థానంలో ఉందని ‘ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్’ సంస్థ గతంలో తెలిపింది. -
టేకాఫ్ అయిన ఆరు గంటలకు వెనక్కి!
న్యూఢిల్లీ: షికాగోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సోమవారం టేకాఫ్ అయిన ఆరు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ‘బోయింగ్ 777-300 ఈఆర్’ ట్రాన్స్‌పాండర్‌లో వైఫల్యం తలెత్తడంతో ఉదయం 5 గంటలకు పైలట్ తిరిగి వెనక్కి తీసుకువచ్చినట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. సంఘటన సమయంలో విమానంలో 313 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత అఫ్ఘానిస్థాన్‌ను దాటుతుండగా విమానంలో ట్రాన్స్‌పాండర్ విఫలమైంది. దీంతో ట్రాన్స్‌పాండర్ పనిచేయకపోతే ఐరోపాలోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో పైలట్ విమానాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికులను షికాగో చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. కాగా 15 రోజుల క్రితం కూడా అఫ్ఘానిస్థాన్ మీదుగా వెళుతుండగా ఓ ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో ట్రాన్స్‌పాండర్ విఫలమైంది. గతకొద్ది నెలలుగా బోయింగ్ విమానాల్లో తరచూ ట్రాన్స్పాండర్లు విఫలమవుతుండటంతో అమెరికా సంస్థ బోయింగ్‌కు ఎయిరిండియా ఫిర్యాదు కూడా చేసింది. -
స్వాగతం పలికేవారే లేరు..!
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన ఆనందంలో స్వదేశానికి చేరుకున్న భారత ఆర్చర్లను అధికారుల తీరు నిరాశ పర్చింది. పోలండ్‌లో జరిగిన ఈపోటీల టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో పటిష్టమైన కొరియాను మట్టి కరిపించిన దీపికా కుమారి, బొంబేలా దేవి, రిమిల్ మంగళవారం తెల్లవారుజామున ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అయితే వీరికి స్వాగతం పలికేందుకు అక్కడికి ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. దీంతో ఈ బృందం కాస్త నిరాశకు గురైంది. ‘మేం సాధించిన విజయాన్నే ఇతర క్రీడల్లో సాధిస్తే విమానాశ్రయానికి పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు వచ్చేవారు. కానీ ఇక్కడ మాకు ఎదురైన అనుభవం నిరాశకు గురిచేసింది. మేం చాలా గొప్ప విజయాన్ని సాధించాం. కొరియాను ఓడించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మాకు కూడా ఘనస్వాగతం లభిస్తే సంతోషించేవాళ్లం. అయినా పోటీల్లో మంచి ప్రదర్శన ఇవ్వడం మా బాధ్యత. దాన్ని సక్రమంగా నెరవేర్చాం’ అని ఆర్చర్ రిమిల్ పేర్కొంది. మంగళవారం సాయంత్రం వీరికి భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) అధ్యక్షుడు వీకే మల్హోత్రా నివాసంలో సన్మానం చేశారు. స్వాగతించేందుకు అధికారులెవరూ వెళ్లకపోవడాన్ని మల్హోత్రా మరోరకంగా సమర్థించుకున్నారు. ‘జట్టు ఆటగాళ్లు మాత్రమే అందరి దృష్టినీ ఆకర్షించాలని అధికారులు అక్కడికి వెళ్లలేదు. చానెళ్లలో కేవలం అధికారులు మాత్రమే కనబడడం నాకిష్టం లేదు. అందుకే నా నివాసంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశాను. వారికి రివార్డు విషయమై సమాఖ్యలో చర్చిస్తాం’ అని మల్హోత్రా తెలిపారు.