Congestion
-
నాగపూర్ కోచ్‌లు రానట్లే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో రైళ్లలో నిత్యం రద్దీ నెలకొంటోంది. ఏ స్టేషన్లో చూ సినా ప్రయాణికులు మెట్రో కోసం ఎదురుచూస్తూ కనిపిస్తున్నారు. కానీ అందుకు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచటం లేదు. ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఒక్కో రైలుకు 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళిక రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూ ర్ మెట్రో నుంచి కోచ్‌లను తెప్పించాలనుకు న్నా.. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. రోజంతా రద్దీనే రద్దీ ఎక్కువగా ఉన్న రాయదుర్గం–నాగోల్, మియాపూర్–ఎల్బీనగర్ రూట్లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నా ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో మాత్రమే కాదు, అన్ని సమయాల్లోనూ ఈ కారిడార్లలో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఐటీ కారిడార్లలో పనిచేసే ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు. సాధారణంగా రద్దీ కారణంగా ఒక రైలు ఎక్కలేకపోయినా మరో రైలు ఉందిలే అనే భరోసా ఉంటుంది. కానీ ఆ తరువాత వచ్చే మరో రెండు రైళ్లలోనూ ప్రయాణం భారంగానే ఉంటుందని హబ్సిగూడ నుంచి నిత్యం హైటెక్‌సిటీకి ప్రయాణించే శ్రీకాంత్ వాపోయాడు. పెరిగిన ప్రయాణికులు ప్రస్తుతం మూడు కారిడార్లలో 59 మెట్రో రైళ్లు రోజుకు సుమారు 1,065 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ సుమారు 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ సంఖ్య 5.10 లక్షల వరకు కూడా ఉంటున్నది. నగరంలో మెట్రో సేవలను ప్రారంభించినప్పటి నుంచి 40 కోట్లకుపైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారు.2017 నవంబర్‌లో మెట్రోరైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దశలవారీగా మెట్రో విస్తరణతో పాటే ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా ట్రిప్పులు కూడా పెంచారు. కానీ కోచ్‌ల కొరత వల్ల ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికుల రద్దీ మా త్రం తగ్గటంలేదు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతి రోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షలకుపైగా సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు ఉంటున్నట్లు అంచనా. నష్టాల నెపంతో... మెట్రో రైళ్ల నిర్వహణలో భారీగా నష్టాలొస్తున్నాయనే కారణంతో కొత్త కోచ్‌ల కొనుగోలుపై వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఒక కోచ్‌ను కొనాలంటే సుమారు రూ.10 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ లెక్కన 59 రైళ్లకు అదనంగా 3 చొప్పున కొనుగోలు చేయాలంటే రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోచ్‌ల కొనుగోలు అసాధ్యమని అంటున్నారు. మెట్రో నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని చెప్తూ మెట్రో నిర్వహణ సంస్థ ఎల్అండ్టీ కోచ్‌ల పెంపుపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.500 కోట్లు వెచి్చంచడం సాధ్యం కాకపోవచ్చునని అధికారులు అంటున్నారు. అద్దె ప్రాతిపదికన నాగపూర్ మెట్రో నుంచి అదనపు కోచ్‌లను తెప్పించే అవకాశం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
రహదారులు.. రద్దీ
బీబీనగర్/చౌటుప్పల్: విజయదశమి, బతుకమ్మల పండుగల ప్రభావం జాతీయ రహదారులపై పడింది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారులపై శనివారం వాహనా లు భారీగా బారులు తీరాయి. పండుగలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల కూడళ్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు, వాహనదారులు అవస్థలు పడ్డారు. -
‘ఉప్పల్ కష్టాల్’ ఇలా తీరున్.. ప్రత్యామ్నాయ మార్గాలెన్నో..
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చదవండి: ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఆ స్థలాన్ని సేకరిస్తే.. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. జిల్లా బస్టాప్‌ను మారిస్తే.. ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్‌ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు. సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే.. వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే.. ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్‌పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. పనుల నత్తనడకకు స్వస్తి పలికితే.. ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. బస్టాప్‌తో బోలెడు కష్టాలు.. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్అండ్బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్‌స్టాప్‌ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్‌స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్‌స్టాప్ ఉంది. అది వరంగల్ బస్‌స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్‌జాం సమస్య తలెత్తుతోంది. -
మృత్యు మార్గం.. ఆ మూలమలుపు..!
ఇంటి నుంచి బయటికి వెళ్లిన మనిషి తిరిగొచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకులేకుండా పోతుంది. నాలుగింతలు పెరిగిన వాహనాల రద్దీకి తగినట్టుగా పదేళ్లుగా రహదారుల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో రహదారులు ‘మృత్యు మార్గాలు’ మారి రక్తపుటేరులను పారిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితులు అనేకం. సాక్షి, పేరేచర్ల: మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ప్రధాన రహదారుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. రహదారులు విస్తరణకు నోచుకోక పోవటం వలన ఫిరంగిపురం, మేడికొండూరు పరిధిలోని గుంటూరు–కర్నూలు, గుంటూరు–హైదరాబాద్ ప్రధానరహదారుల మీద ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. పెద్ద వాహనాల మితిమీరిన వేగం, మూల మలుపులు, ఇరుకు రోడ్లు, కాలం చెల్లిన బ్రిడ్జిలుతో పాటు అడ్డదారుల్లో వేగంగా వచ్చే టిప్పర్లతో మనిషి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. దీనికి తోడు డివైడర్లు వద్ద ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు లేక పోవటంతో వాహనాల వేగం అదుపు చేయలేక డివైడర్లను ఢీకొట్టి మృత్యువాత పడిన దాఖలాలు ఎన్నో. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వం కొన్నేళ్లుగా పేరేచర్ల నుంచి కొండమోడు వెళ్లే రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తామన్న మాట ఆచరణలో కనిపించడం లేదు. ఫిరంగిపురం వైపు వెళ్లే గుంటూరు–కర్నూలు రహదారిని కూడా విస్తరిస్తామని చెప్పినా దాని గురించి పట్టించు కోలేదు. ముఖ్యంగా ఈ మార్గాల గుండా వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీనికి తోడు వేగాన్ని నియంత్రించాల్సిన రవాణాశాఖ చోద్యం చూస్తుండటంతో డ్రైవర్లు మరింత రెచ్చి పోతున్నారు. రెండు మండలాల్లో టిప్పర్లు 500కి పైనే ఉన్నాయి. ఇటీవల హార్స్ పవర్ ఎక్కువగా ఉన్న టిప్పర్ల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడపడంతో పాటు కార్లు, ట్రాలీ ఆటో వాలాలు ఎదురుగా ఉన్న వాహనాలను వేగంతో ఓవర్ టేక్ చేస్తూ భయపెడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రమాదాలు మేడికొండూరు పరిధిలోని పేరేచర్ల నుంచి కొర్రపాడు ఉన్నత పాఠశాల వరకు అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పేరేచర్ల ఫైల్ ఓవర్‌తో పాటు జోసిల్ కంపెనీ, డోకిపర్రు అడ్డరోడ్డు, సబ్‌స్టేషన, మేడికొండూరు పరిధిలోని కోల్డ్‌స్టోరేజీ, ఈద్గా సమీపంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఫిరంగిపురం పరిధిలోని కారం మిల్లు నుంచి పొనుగుపాడు వరకు ఉన్న 19.5 కిలోమీటర్ల రహదారి ఉంది. 3 కిలోమీటర్లు నాదెండ్ల పరిధి పోనూ 16.5 కిలోమీటర్లు ఫిరంగిపురం లోకి వస్తుంది. ఇందులో 4.6 కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరంగా గుర్తించారు. దీని మధ్యలో వేములూరిపాడు, రేపూడి, వేమవరం క్రాస్ తగులుతాయి. కేవలం నాలుగేళ్లలో ఈ రహదారిలో 50కి పైగా ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారు. మేడికొండూరు మండలంలో.. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2013 47 26 21 2014 51 29 22 2015 57 32 25 2016 49 25 24 2017 48 35 13 2018 42 18 34 ఫిరంగిపురం పరిధిలో .. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2015 20 10 10 2016 20 13 7 2017 28 13 15 2018 32 11 21 -
హీత్రూను మించనున్న ఢిల్లీ ఐజీఐ
న్యూఢిల్లీ: రద్దీ విషయంలో లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ) అధిగమించనుందని సిడ్నీకి చెందిన ఆసియా–పసిఫిక్ ఏవియేషన్(కాపా) ఇండియా నివేదించింది. 2017–18లో ఐజీఐ నుంచి 6.57కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2019–20 నాటికి ఈ సంఖ్య 8 కోట్లకు చేరొచ్చని నివేదికలో తేలింది. ఈ ఒరవడి కొనసాగితే 2020నాటికి హీత్రూ విమానాశ్రయం ట్రాఫిక్‌ను ఐజీఐ మించిపోనుందని కాపా విశ్లేషించింది. ఐజీఐ విమానాశ్రయం ద్వారా నిత్యం 1,200 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి 4 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో ఢిల్లీ ఐజీఐ తొలిæ స్థానంలో ఉందని ‘ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్’ సంస్థ గతంలో తెలిపింది. -
లారీ బీభత్సం
బ్రేక్‌లు ఫెయిలై ఆగి ఉన్న కార్లు, బస్సును ఢీకొన్న వైనం రెండు కార్లు నుజ్జునుజ్జు తప్పిన పెను ప్రమాదం లంకెలపాలెం కూడలిలో ఘటన అగనంపూడి : నిత్యం రద్దీగా ఉండే లంకెలపాలెం కూడలిలో బ్రేకులు ఫెయిలై ఓ లారీ బీభత్సం సృష్టించింది. భయానక వాతావరణాన్ని కల్పించింది. సంఘటన తీరు చూసిన వారికి పెద్ద ఘోర కలి జరిగే ఉంటుందని భావించినా, పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధి లంకెలపాలెం కూడలిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖనగరానికి చెందిన నాగేశ్వరరావు, చక్రధర్, శరత్‌కుమార్‌లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం మూడు కార్లలో తలుపులమ్మలోవకు బయలుదేరారు. ఉదయం 8.30 గంటలకు లంకెలపాలెం కూడలిలో సిగ్నల్ లైట్లు పడడంతో మూడు కార్లు వరుసగా ఆగాయి. పక్కనే శివాజీపాలేనికి చెందిన వెంకటస్వామి అనకాపల్లి వెళ్లడానికి భార్య సత్యవేణితో కలిసి మరో కారులో ప్రయాణిస్తూ మూడు కార్ల పక్కనే ఆగారు. దాని వెనక ఫార్మాసిటీ రోడ్డులోకి మలుపు తిరగడానికి మైలాన్ కంపెనీ ఉద్యోగుల బస్సు నిలిచింది. ఇంతలో గాజువాక వైపు నుంచి వెనకగా వచ్చిన లారీ బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడంతో ముందు ఆగిన కారును ఢీకొంది. అక్కడితో ఆగకుండా మరో మూడు కార్లను, ఫార్మా కంపెనీ బస్సును ఢీకొంది. + ఇదే సమయంలో కూడలిలోని బ్యాకరీలో పనిచేస్తున్న కె.విష్ణు(19) రోడ్డు దాటుతుండగా, రెండు కార్ల మధ్యలో ఇరుక్కోవడంతో ఎడమ కాలు విరిగిపోయింది. ఈ సంఘటనలో శివాజీనగర్‌కు చెందిన వెంకటస్వామి, సత్యవేణి, మరో రెండు కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, నాగేశ్వరరావు, చక్రధర్, శరత్‌కుమార్, సత్యవతి, సౌజన్యలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి 108 సర్వీసులో ఇంటికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు కార్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. దీంతో లంకెలపాలెం కూడలిలో సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రమాదానికి గురైన కార్లను అక్కడ్నుంచి తొలగించారు. -
పల్లెటూర్
పల్లెబాట పట్టిన నగరం రైళ్లు, బస్సులు కిటకిట ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపర్వం ఏయూలో అలరించిన పండుగ సంబరాలు పండుగ సెలవులిచ్చేశారు. తెల్లారితే భోగి పండుగ..దాంతో నగరం సొంతూరికి పయనమైంది... బస్టాండు, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడి టికెట్లు కొనుక్కొని రైళ్లు, బస్సులపైకి జనం ఎగబడ్డారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా.. రద్దీని అవి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడుతున్నారు. అదిరిపోయే రేట్లతో బెదరగొడుతున్నారు. అయినా సరే ప్రయాణికులు వాటిని ఆశ్రయించక తప్పడంలేదు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో పల్లె వాతావరణం సృష్టించాయి. ధింసా నృత్యాలు.. తప్పెటగుళ్లు.. సంప్రదాయ పిండివంటల ఘుమఘుమలు.. బొమ్మలకొలువులు.. భోగిమంటలు.. ముగ్గుల పోటీలతో ఏయూ మైదానం అచ్చమైన తెలుగు పల్లెను తలపించింది. ఆటపాటలు, పోటీలతో హోరెత్తింది.. విశాఖపట్నం : సంక్రాంతి పండగను సొంత ఊళ్లల్లో జరుపుకోవడానికి నగరం నుంచి భారీ ఎత్తున ప్రజలు ప్రయాణæమవుతున్నారు. సిటీలో పుట్టిపెరిగిన వారు సైతం బంధువులు, స్నేహితుల ఊళ్లకు పయణమవుతున్నారు. దీంతో గురువారం నగరమంతా సందడి సందడిగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆర్టీసీ 600 రెగ్యులర్, 95 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రైళ్లకు ఆ శాఖ అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో సుమారు 6 లక్షల మంది, రైళ్లల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు నగరం నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీకి గురువారం ఒక్కరోజే రూ.95 లక్షల ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లో కంటే ఇది సుమారు రూ.20 లక్షలు అదనం. రద్దీతో తప్పని తిప్పలు తాటిచెట్లపాలెం : రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. సంతోషంగా గడపాల్సిన పండగకు వ్యయ ప్రయాసలతో వెళుతున్నారు. దీనికి తోడు ఎప్పటిలాగే రైల్వే శాఖ వేసిన అరకొర రైళ్లతో ప్రయాణంలో సీట్లు రిజర్వుగాక, జనరల్‌లో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీలు చార్జీలను అమాంతం పెంచేశాయి. చార్జీల భారాన్ని భరించలేక సాధారణ జనం విసుగు చెందుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు జేబుదొంగలు రద్దీని ఆసరా చేసుకొని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఇప్పటికే రైల్వే పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఆర్పీఎఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటునట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సొంతూరులో సంతోషాలు తెలుగు వారి పండగల్లో అత్యంత విశిష్టత కలిగిన సంక్రాంతి పండగను ఎవరికి వారు తమ స్వగ్రామాల్లో జరుపుకోవాలనుకుంటుంటారు. బంధు మిత్రులతో, పిండి వంటలతో అత్యంత శోభాయమానంగా ఉండే పల్లె లోగిళ్లలో సంబరాలు చేసుకోవాలనుకుంటారు. అందుకే సొంత ఊరికి వెళ్లేది ఏడాదికి ఒక్క సారే అయినా సంక్రాంతికే వెళ్లాలనుకుంటారు. విశాఖ నగరానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ఇతర ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వారంతా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉపాధి కోసం కూడా విశాఖ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంతూరులో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. -
సాగర్– హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ
కొండమల్లేపల్లి కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించడం కోసం హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న వాహనాల రద్దీ కొనసాగుతోంది. గురువారం రాఖీ పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొండమల్లేపల్లి పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఉండేందుకు దేవరకొండ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బైపాస్ మీదుగా వాహనాలను మళ్లించారు. -
దెబ్బకు ఠా.. దొంగల ము ఠా..
-
దెబ్బకు ఠా.. దొంగల ము ఠా..
నీరూస్ జంక్షన్ వద్ద కాల్పుల కలకలం మెట్రో కార్మికుడికి బుల్లెట్ గాయాలు భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసుల అదుపులో దుండగులు సిటీబ్యూరో: హైటెక్ సిటీ... మాదాపూర్... జూబ్లీహిల్స్... ఈ ప్రాంతాలు ప్రముఖ దుకాణాలు, కార్యాలయాలకు నెలవు. ఈ మార్గం వీఐపీలు... సాఫ్ట్వేర్ ఉద్యోగుల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతంలోనే ఉన్న జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. మెట్రో కార్మికుడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకపోవడం... మిగతా కార్మికులు ఏకమై దొంగలను పట్టుకునేలోపు పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. రెక్కీకి వచ్చి: చార్మినార్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ దోపిడీ చేయాలన్నది మీర్జా మహమ్మద్ అబ్దుల్లా ముఠా ప్లాన్. ఈ లక్ష్యంతోనే వారు ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చారు. గుల్బర్గాకు వలస వెళ్లిన మీర్జా మహమ్మద్ అబ్దుల్లాకు టోలిచౌకిలో ఇల్లు ఉంది. అక్కడే వీరు ఉంటున్నారు. తొలి మూడు రోజులు నగల దుకాణం వద్దనే రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమచారమందింది.ఈ మేరకు వారిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా వేశారు. మాదాపూర్ బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద గురువారం రెక్కీ నిర్వహించేందుకు మీర్జా మహమ్మద్, అబ్దుల్ ఖదీర్ వస్తున్నారని... గుల ్బర్గాలో ఉంటున్న లంగర్‌హౌస్ వాసి మహమ్మద్ సమీయుద్దీన్‌ను నీరూస్ షాప్ వెనకాల ఉన్న ప్రాంతంలో కలుసుకుంటారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. 12.45: బిగ్‌సీ నుంచి బయలుదేరి నీరూస్ షాప్ సమీపంలో మహమ్మద్ సమీయుద్దీన్‌ను కలిసేందుకు బయలుదేరారు. అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు బైక్‌పై వెళుతున్న వీరిని వెంబడించారు. 12.55: మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద తృటిలో తప్పించుకున్నారు. 12.57: నీరూస్ జంక్షన్ వద్ద సిగ్నల్ పడినా ముందుకెళ్లారు. అప్పటికే అక్కడే ఎదురుగా మాటువేసిన పోలీసులు వాహనాన్ని ఆపడంతో కిందపడ్డారు. మూడు నిమిషాల పాటు వీరి మధ్య భారీ ఘర్షణ జరిగింది. మీర్జా మహమ్మద్ అబ్దుల్లా పోలీసులతో చేసిన పెనుగులాటలో అతడి ఎడమ కాలి షూ ఎగిరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 మార్గం వైపు పడింది. 1.00: మీర్జా మహమ్మద్ అబ్దుల్లా నాటు తుపాకీ తీసి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. తొలి బుల్లెట్ డీసీఎం వ్యాన్‌లో ఉన్న మెట్రో కార్మికుడికి తగి లింది. రెండోది గాల్లోకి వెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 1.03: వెంటనే తేరుకున్న పోలీసులు మెట్రో కార్మికుల సహకారంతో మీర్జా మహమ్మద్, అబ్దుల్ ఖదీర్‌లను పట్టుకున్నారు. 1.05: సమీపంలోనే మహమ్మద్ సమీయుద్దీన్‌ను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఏం చేశారంటే... మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల వరకు బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారు. రోడ్డుపై ఉన్న ఓ కొట్టులో టీ తాగారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ అనుమానాస్పదంగా కనిపించారు. ఓ వ్యక్తి రోజూ అక్కడికి వచ్చి... కలెక్షన్ డబ్బులను తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ప్రధాన బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్నారు. శుక్రవారం వద్దామనుకుని నిర్ణయించుకున్నారు.