
సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది అంతేకాదు భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్ కూడా ఇచ్చింది.
గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా. సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా. నేను సరిగ్గానే సమాధానం చెప్పానా?’ కామెంట్ చేయాలంటూ నెటిజనులను కోరింది.
చదవండి: వింగ్‌డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!
ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన
నెటిజన్లు ఏమన్నారంటే
ఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే వేసుకుంటాను.. సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెస్సికా సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని మరొక యూజర్ రాశారు.
కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్‌క్లబ్‌లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
https://www.instagram.com/reel/DGdYI6dxmSo/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Comments
Please login to add a commentAdd a comment