Bangles
-
ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించిందని భార్యను బెల్టుతో చితకబాది..
ముంబయి: నవీ ముంబయిలో అమానవీయ ఘటన జరిగింది. ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించినందుకు భార్యను చితకబాదాడో వ్యక్తి. అత్త, మరో బంధువు కూడా ఇందులో పాలుపంచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నవీ ముంబయిలో నివాసం ఉంటున్న ప్రదీప్ అర్కడే(30) భార్య, అతని అమ్మతో కలిసి నివసిస్తున్నాడు. ఫ్యాషన్ బ్యాంగిల్స్ వేసుకోకూడదని భార్యపై ఆంక్షలు విధించేవాడు. ఈ క్రమంలో నవంబర్ 13న ఆమె ఆ బ్యాంగిల్స్‌ను ధరించింది. దీనిపై ఇరువురు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రదీప్ తన భార్యను విచక్షణా రహితంగా కొట్టాడు. భర్త తనను బెల్ట్‌తో విచక్షణా రహితంగా కొట్టాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. అత్త తన జుట్టు పట్టి పలుమార్లు చెంపపై కొట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో బంధువు కూడా తనను కిందపడేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత బాధితురాలు తన తండ్రి ఉంటున్న పుణెకి వెళ్లింది. అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నవీ ముంబయికి బదిలీ చేశారు. ఇదీ చదవండి: హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేసిన హైకోర్టు -
జరీ అంచు ఆభరణం
సంప్రదాయ వేడుకలలో జరీ అంచు చీరల రెపరెపలు మనకు పరిచయమే. పువ్వులు, హంసలు, గోపురపు డిౖజైన్లతో అవి అందంగా ఆకట్టుకుంటాయి. వాటిని అంచు వరకే ఎందుకు పరిమితం చేయాలనే ఆలోచనతో ఆభరణంగా రూపుకడుతున్నారు డిజైనర్లు. పాత చీరెల అంచులైనా కొత్తగా మార్కెట్లో లభించే జరీ బార్డర్స్ అయినా ఇలా మనసుదోచేలా మురిపిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు వేడుకకు తగినట్టు డ్రెస్ ఎంపిక ఉంటుంది. దానికి మ్యాచింగ్‌గా ఈ జరీ మాలలు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. ఫ్యాబ్రిక్ రోలర్ నూలు దారాలను ఉండగా చేసి, వాటికి కట్ చేసుకున్న బార్డర్ని అతికించి, కావల్సిన పరిమాణంలో ఫ్యాబ్రిక్ బీడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. లాకెట్స్‌తో ప్రత్యేకం ముగ్గు, గోపురం, దేవతా మూర్తుల లాకెట్స్ని ఈ జరీ అంచు చెయిన్స్‌కు జత చేయచ్చు. లేదంటే, బార్డర్ ఫ్యాబ్రిక్‌నే లాకెట్‌లా తయారు చేసి, వేసుకోవచ్చు. బీడ్స్‌తో జత కట్టి రంగు రంగుల పూసలను ఎంపిక చేసుకొని, వాటితో జరీ బాల్స్‌ను జత చేసి దండగా సిద్ధంగా చేసుకోవచ్చు. గాజుల అందం రంగు వెలసిన వెడల్పాటి గాజులను వాడకుండా పక్కన పడేయటం ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. వాటితో జరీ అంచును ఇలా అందంగా తయారుచేసుకోవచ్చు. 1.పాత సిల్క్ , జరీ అంచు ఉన్న చీరను ఎంపిక చేసుకోవాలి. జరీ అంచు బాగుంటే, దానిని చీర నుంచి కట్ చేసుకోవాలి. 2. ఎంపిక చేసుకున్న గాజుకు కట్ చేసిన జరీ అంచును చుట్టి, అన్నివైపులా గ్లూతో అతికించాలి. 3. ఎక్కడా జరీ పోగులు బయటకు రాకుండా సరి చూసుకోవాలి. 4. పూర్తిగా గాజు తయారీ పూర్తయ్యాక ఫ్యాబ్రిక్ చివర్లు కూడా బయటకు కనిపించకుండా అతికించాలి. 5. రెండు రకాల గాజు మోడల్స్ తయారు చేసుకొని, కాంబినేషన్‌గా ధరించవచ్చు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం (ఫొటోలు)
-
మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్
పట్నా: బిహార్‌లో ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడుతోంది. దీంతో స్వాధీనం చేసుకున్న బాటిళ్లను పారవేయడంలో తరుచుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని బిహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ అన్నారు. ఈ మద్యం బాటిళ్లను మట్టిని తొలగించే ఎర్త్ మూవర్ మిషన్లతో చితక్కొట్టడం వల్ల భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందుకని ఈ వ్యర్థాలను తగ్గించేలా జీవనోపాధిని ఇచ్చేలా బిహార్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అదే మద్యం బాటిళ్లతో గాజుల తయారీ. ఈ గాజుల తయారీని 'జీవిక పథకానికి' చెందిన మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక తయారీ యూనిట్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు బిహార్‌ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోహిబేషన్ శాఖ అందుకోసం దాదాపు కోటి రూపాయాల మొత్తాన్ని మంజూరు చేసింది. దీంతో ప్రోహిబేషన్ శాఖ గాజుల తరయారీ ముడి సరుకు కోసం జీవనోపాది కార్మికులను నియమించుకుంటుంది. ఆ కార్మికులకు పగిలిన మద్యం బాటిళ్ల పొడిని అందజేస్తారు. ఆ జీవనోపాది కార్మికులు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గాజులు తయారు చేయడంలో శిక్షణ పొందుతారు. తొలుత తయారీ యూనిట్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని రానున్న నెలల్లో మరింతగా పెంచుతామని ప్రోహిబేషన్ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఒక కుటీర పరిశ్రమలా పనిచేస్తుందన్నారు. అంతేకాదు దీన్ని మరింతగా విస్తరించగలమా లేదా అనే దానిపై నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో పేదరిక నిర్మూలన చేయడమే 'జీవిక పథకం' లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, ముఖ్యంగా మహిళలకు మరింత ఉపాధిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం అని చెప్పారు. ఈ ప్రాజెక్టును పట్నాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి బీహార్‌లో ఏప్రిల్ 2016లో మద్యం నిషేధించబడింది. దీనితో పాటు, మద్యం నిల్వ, వినియోగం, అమ్మకం, తయారీ వంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. -
బెస్టాఫ్ ‘లక్క’!
సాక్షి, హైదరాబాద్: భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విశిష్టతలున్న తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తోంది. రామప్పగుడితో యునెస్కో గుర్తింపు పొందిన రాష్ట్రం.. తాజాగా హైదరాబాద్ లక్కగాజులతో భౌగోళిక సూచీ(జీఐ)లో స్థానంకోసం పోటీ పడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ హలీం, పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందగా.. ఈసారి లక్కగాజులు రేసులో నిలిచాయి. దీని కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా... రాష్ట్రానికి చెందిన తాండూరు కందులు కూడా జీఐ పరిశీలనలో ఉన్నాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రత్యేకత ఒక ప్రాంతంలోని (భౌగోళికంగా) నాణ్యత, నిర్దిష్ట లక్షణాలతో ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులు, వస్తువులు, చరిత్రాత్మక వారసత్వంగా కొనసాగుతున్న కళలు తదితర విభాగాల్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను అందిస్తారు. ప్రత్యేకమైన సహజ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, పారిశ్రామిక ఉత్పత్తులను ఎంపిక చేస్తారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ‘ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్’ (రిజిస్ట్రేషన్, రక్షణ) యాక్ట్ 1999 ఆధారంగా ఈ గుర్తింపు ఇస్తారు. ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 2004–2005లో ‘డార్జిలింగ్ టీ’ దేశంలో మొట్టÐð ¬దట జీఐ ట్యాగ్ పొందింది. ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల ఇతర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు పొందిన ఉత్పత్తులు, వస్తువులు, పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు 10 సంవత్సరాలు వర్తిస్తుంది. తరువాత మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. లక్షణమైన లక్క గాజులు... హైదరాబాద్ పాతబస్తీలోని ‘లాడ్ బజార్’ లక్క గాజులకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ అందమైన గాజులను కొన్ని కుటుంబాలు వందల ఏళ్లుగా తయారు చేస్తున్నాయి. లక్కను కరిగించి దానిని గాజుల ఆకారంలో మలిచి, వాటిపై అందమైన రంగు రాళ్లు, రత్నాలు, మెరిసే గాజు ప్రతిమల వంటివి అతికిస్తారు. దేశ నలుమూలల నుంచే కాదు, నగర పర్యటనకు వచ్చిన విదేశీయులు సైతం ఈ గాజులను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. నగరంలోని క్రిసెంట్ హ్యాండ్‌క్రాఫ్ట్ సొసైటీ ఈ లక్క గాజులకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసింది. లాడ్ బజార్లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు వస్తే... వీటి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకున్న తాండూరు కందులు కూడా జీఐ ట్యాగ్ కోసం పరిశీలనలో ఉందని సమాచారం. గతంలోనే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రాష్ట్రంలోని పలు వస్తువులు, ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. హైదరాబాదీ ప్రత్యేక వంటకం ‘హలీమ్’ నగరం నుంచి మొదటగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. రెండు తెలుగురాష్ట్రాల్లో దొరికే బంగినపల్లి మామిడిపండ్లు, పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ కార్వింగ్స్, ఆదిలాబాద్ దోక్రా, నిర్మల్ బొమ్మలు–పెయింటింగ్స్– టాయ్స్–ఫర్నిచర్, గద్వాల్ చీరలు, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, వరంగల్ దర్రీస్, సిద్దిపేట గొల్లభామ చీర, చేర్యాల పెయింటింగ్స్, పుట్టపాక తేలియా రుమాలు, నారాయణపేట నేత చీరలు జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ బిర్యానీకి కూడా జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నించినప్పటికీ.. దాని భౌగోళిక అంశాలు, పుట్టు పూర్వోత్తరాలు తదితర కారణాల వల్ల తిరస్కరణకు గురైంది. జీఐ గుర్తింపుతో డార్జిలింగ్ టీ, పాష్మినా షాల్, కన్నౌజ్ పెర్ఫ్యూమ్, పోచంపల్లి ఇక్కత్ వంటి వాటికి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
గాజుల గలగలలకు నెలవు లాడ్‌బజార్
చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా...5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు...రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి. ఎన్నో రకాలు... లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే. లాడ్‌బజార్ అంటే.... లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. రూ.లక్షల్లో వ్యాపారం.... ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు. (చదవండి: పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం) -
గాజుల గలగలలకు నెలవు లాడ్‌బజార్
చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా... 5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు... రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి. ఎన్నో రకాలు... లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే. లాడ్‌బజార్ అంటే.... లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. లక్షల్లో వ్యాపారం.... ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ. 50 వేల నుంచి రూ. లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు. -
వజ్రాల గాజు మిస్సింగ్.. వెలకట్టలేని నిజాయతీ
బెంగళూరు: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే జేబులో వేసుకునేవారు కొందరైతే, ఎవరో పడేసుకున్నారని వెతికి సొంతదారుకు ఇచ్చేవారు మరికొందరు. వజ్రాలు పొదిగిన చేతి గాజు దొరికితే ఒక కార్మికుడు ఎంతో నిజాయతీగా యజమానికి ఇచ్చేసిన సంఘటన మంగళూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విమానంలో మంగళూరుకు బంధువుల ఇంటికి వచ్చిన మహిళ ఒక చేతికున్న వజ్రాల గాజును పోగొట్టుకుంది. అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీకి దొరకడంతో దానిని అధికారులకు ఇచ్చాడు. కొంతసేపటికి బాధిత మహిళ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి గాజు పోయిన విషయం చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించి అష్రఫ్ చేతనే గాజును అందజేశారు. -
Charminar: ‘లాడ్‌బజార్’.. తళుక్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే
సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్బజార్కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్‌ను సందర్శిచిన తర్వాత లాడ్బజార్లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు. రాత్రిపూట లాడ్బజార్లోకి వెళ్తే జిగేల్మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్‌బజార్‌ను నైట్ బజార్‌గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్‌గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్‌కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్‌బజార్‌లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి. ఆ పేరెలా వచ్చిందంటే.. ►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ► మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. -
దుర్గమ్మకు గాజుల మహోత్సవం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో శనివారం గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని గాజులతో అలంకరించారు. యమ ద్వితీయను పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రెండు లక్షల గాజులతో అలంకరించారు. శనివారం అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా, ఆది, సోమవారాలు కూడా ఆలయ ప్రాంగణం గాజుల అలంకరణతోనే ఉంటుందని ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో మల్లేశ్వరస్వామికి పెద్ద ఎత్తున భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, దీపార్చన నిర్వహించారు. -
ఇనుపగాజులకు పసిడిపూసి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇనుప గాజులకు బంగారుపూత పూసి వాటిని అసలైనవిగా నమ్మించి పలు గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో డబ్బులు రుణంగా తీసుకున్న ఘటన కరీంనగర్లో వెలుగుచూసింది. మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠా రుణం కోసం ఇనుపగాజులపై ఏడు బంగారుపూతలు పూసి వాటిని గతనెల 11న రుణం కోసం ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ మొలుగూరి కిరణ్ పేరుతో పరిచయం చేసుకుని ఈ గాజుల్ని ఇచ్చి రుణం కావాలని అడిగారు. కరీంనగర్ లోని అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆధార్ కార్డు కూడా వారికి చూపించారు. అక్కడ తనిఖీలు చేసే ఓ వ్యక్తి ఆ గాజులను పరీక్షించగా తొలుత బంగారంగానే అనుకున్నారు. దీంతో పలు దఫాల్లో దాదాపు రూ.5.09 లక్షలు రుణంగా తీసుకున్నారు. అయితే.. అన్ని గాజులు ఒకే బరువు, ఒకే ఆకృతిలో ఉండటంతో అక్కడ పనిచేసేవారికి అనుమానం వచ్చింది. వాటిని లోతుగా పరీక్షించగా, ఏడు బంగారుపూతల తరువాత లోపల వారికి ఇనుపగాజు కనిపించడంతో అవాక్కయ్యారు. ఇదేతరహాలో ఐఐఎఫ్ఎల్ బ్రాంచిలో ఆరు బంగారుగాజులు కుదవబెట్టి రూ.2.14 లక్షలు రుణం తీసుకున్నారు. కోర్టు సమీపంలోని ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ కంపెనీలోనూ ఇదే తరహాలో 10 గాజులు కుదవపెట్టి రూ.3.50 లక్షలు రుణంగా పొందారు. వీరు కూడా అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కంపెనీలోనూ ఈ మోసం జరిగిందని కానీ, ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదని సమాచారం. నగరంలో ఇప్పటివరకూ ఇలా దాదాపు రూ.17 లక్షలు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది. పలు ప్రాంతాల్లో కూడా...! గోదావరిఖని, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు బ్రాంచీల్లో ఇనుపగాజులతో లక్షలాది రూపాయలు టోకరా వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి గోల్డ్‌ఫైనాన్స్ కంపెనీల్లో బంగారం పరీక్షల విధానంపై పూర్తి అవగాహన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే.. సులువుగా ఆయా కంపెనీలను మోసం చేయగలిగారన్న నిర్ధారణకు వచ్చారు. బాధితులు సమర్పించిన ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పోలీసులు నిందితుల వేట ప్రారంభించారు. -
జీఆర్టీ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జీఆర్టీ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా నిర్వహిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విస్తృత శ్రేణిలో వివిధ రకాల మోడల్ గాజులను ఆకర్షణీయమైన ఆఫర్లతో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేళాలో భాగంగా బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.50లు, వజ్రాలు, అన్‌కట్ వజ్రాలపై 10 శాతం, వెండి ఆభరణాల ఎంఆర్పీపై పదిశాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. కస్టమర్లకు తమకు నచ్చిన డిజైన్లు, గాజులను ఎంపిక చేసుకోవడానికి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఎండీ జీఆర్ పద్మనాభన్ తెలిపారు. -
ఇంద్రకీలాద్రి: గాజుల ఉత్సవం
-
దుర్గమ్మకు గాజుల ఉత్సవం
సాక్షి, ఇంద్రకీలాద్రి : కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకుని సోమవారం దుర్గమ్మకు గాజులతో అలంకరించనున్నారు. ప్రస్తుతం నెలకున్న కోవిడ్ నేపధ్యంలో ఈ ఏడాది కేవలం అంతరాలయంలో అమ్మవారికి మాత్రమే గాజుల అలంకారం చేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఈ ఏడాది గాజులతో అలంకరిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి సన్నిధిలో ధనలక్ష్మీ పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. సేవ అనంతరం ఆలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్ముల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన జ్యోతులను ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు దంపతులు, చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ అర్చకులు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు, సిబ్బంది టపాసులు కాల్చి, మిఠాయిలను పంచుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం తొలి రోజు సోమవారం కావడంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దుర్గమ్మకు బంగారు హారం బహూకరణ.. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన భక్తులు బంగారపు హారాన్ని కానుకగా అందచేశారు. విజయవాడ కాళేశ్వరరావు రోడ్డుకు చెందిన భార్గవ రాము దంపతులు అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 40 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఆలయ ఈఓ ఎంవీ. సురేష్‌బాబుకు అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. -
'మైండు దొబ్బింది.. గాజులు కొట్టేశా'
సాక్షి, అనంతపురం : ‘మైండు దొబ్బింది..బంగారు గాజులు కొట్టేశాను. అంతే తప్ప నాకింకేం తెలియదు అంటూ సర్వజనాస్పత్రిలో ఓ హెడ్‌నర్సు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... గత నెల 26న ఆస్పత్రిలోని లేబర్ వార్డు ఉదయం పేషంట్‌కు సేవలందించిన తర్వాత చేతులు కడుక్కునే సమయంలో ఓ స్టాఫ్‌నర్సు గాజులను తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచింది. దీనిని గమనించిన హెడ్‌నర్సు గుట్టుచప్పుడు కాకుండా వాటిని కొట్టేసింది. కాసేపటికి స్టాఫ్‌నర్సు బ్యాగ్‌ను చెక్ చేసుకోగా అందులో గాజులు కన్పించలేదు. రూ.లక్ష విలువ చేసే బంగారు గాజులు పోయాయని కన్నీటి పర్యంతమైంది. ఆదివారం కావడంతో సూపరింటెండెంట్ కార్యాలయంలో సీసీ పుటేజ్ చూసేందుకు కూడా వీలు కాలేదు. ఆ మరుసటి రోజు విషయాన్ని నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. సీసీ పుటేజ్‌ను పరిశీలించిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై సూపరింటెండెంట్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించడంతో ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్ల సమక్షంలో సదరు హెడ్‌నర్సు నిజాన్ని ఒప్పుకుంది. ఎందుకు అలా చేశావని అడిగితే మైండు దొబ్బిందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీనిపై తదుపరి చర్యలు ఏం తీసుకుంటారోనని ఆస్పత్రి ఉద్యోగులు ఉత్కంఠగా చూస్తున్నారు. -
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం
-
కోటి గాజులతో విజయవాడ అమ్మవారికి అలంకరణ
-
కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం
సకలశుభాల తల్లి కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 29వ తేదీ గాజుల ఉత్సవాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమవుతోంది. సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 29వ తేదీన గాజుల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేస్తారు. ఇంద్రకీలాద్రిపై 2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందుతాయి. భక్తులు అందించే గాజులను స్వీకరించేందుకు దేవస్థానం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పలువురు భక్తులు అందచేసిన గాజులు దేవస్థానానికి చేరాయి. ఉత్సవానికి మరో 5 రోజులు ఉండటంతో గాజులు మరిన్ని విరాళాలుగా దేవస్థానానికి అందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ప్రాచీనకాలం నుంచి చేస్తున్న పూజ 15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. 15వ శతాబ్దంతో విజయనగర మహారాజు అమ్మవారి అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించడంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు చెప్పబడుతోంది. కార్తీక మాసంలో రెండో రోజున భగిని హస్త భోజనం అని, యమ ద్వితీయ అని పిలవబడుతుంది. ఆ రోజున తమ్ముళ్లు, అన్నయ్యలు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి.. వారి చేతి భోజనం చేసి చల్లగా ఉండాలని దీవించి పసుపు, కుంకుమ, గాజులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. అమ్మవారి ప్రసాదంగా వితరణ అమ్మవారికి అలంకరించే ఆభరణాల నుంచి పూల వరకు అన్నీ గాజులతోనే తయారు చేసి ముస్తాబు చేయడం ఈ ఉత్సవంలో విశేషం. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులుకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను ధరించడం శుభకరం.. మంగళకరమని భక్తులు భావించి గాజుల కోసం దేవస్థానానికి తరలివస్తారు. దుర్గమ్మకు 10 లక్షల గాజులు విరాళం ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ అలంకరణ కోసం అవసరమైన మట్టి గాజులను బుధవారం భక్తులు విరాళంగా అందజేశారు. శ్రీకనకదుర్గా లలితా పారాయణ బృందానికి చెందిన గ్రంథి శ్రీరామసుబ్రహ్మణ్యం, రాధిక, ఇతర భక్త బృంద సభ్యులు సుమారు పది లక్షల గాజులను దేవస్థానానికి అందించారు. గాజులు, పూజాసామగ్రి, పసుపు, కుంకుమతో ఆలయానికి చేరుకున్న భక్త బృందం సభ్యులకు ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ సాదరంగా స్వాగతం పలికారు. దాతలు అమ్మవారికి గాజులను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. -
ఏమీ చేయలేకపోతే.. గాజులు తొడుక్కో..!!
ముంబై: 13 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా ఏ పని చేయకపోతే.. ఆ వ్యక్తి గాజులు తొడుక్కోవడం ఉత్తమమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విరుచుకుపడ్డారు. అహ్మద్ నగర్ జిల్లా శ్రీగోండా నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్సీపీ మాజీ నేత బాబన్‌రావు పచ్పుటేపై పవార్ నిపులు చెరిగారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల మంత్రిగా పనిచేసిన పచ్పుటే 2014లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్-ఎన్సీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పటికీ తనను ఏ పని చేయనివ్వలేదని పచ్పుటే విమర్శలు చేశారు. తాజాగా శ్రీగోండా నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ఘనశ్యాం షెలార్ తరఫున ప్రచారం నిర్వహించిన పవార్.. పచ్పుటే విమర్శలపై స్పందించారు. ‘పచ్పుటే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు చేయడం తప్ప ఏ పనిని చేయనివ్వలేదని పేర్కొన్నారు. మంత్రి సంతకాలు చేస్తేనే ఏదైనా ఉత్తర్వుగా మారుతోంది. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులకు ఆమోదం లభిస్తుంది. సంతకాలు చేసి కూడా.. ఏ పని చేయలేకపోయానని అనడంలో అర్థముందా? మంత్రిగా ఉండి కూడా ఏ పనిచేయలేకపోతే.. ఆ వ్యక్తి గాజులు ధరించాలి’ అని పవార్ ఘాటుగా పేర్కొన్నారు. -
రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’ నిర్వహిస్తోంది. జూన్ 22 నుంచి ప్రారంభమైన ఈ మేళా, జూలై 8 వరకు కొనసాగనుంది. ఈ మేళలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట, కూకట్పల్లి షోరూంలలో బంగారపు గాజులను(గోల్డ్ బ్యాంగిల్స్‌ను) ప్రదర్శనకు ఉంచింది. మొత్తం 200 కిపైగా డిజైన్లతో కళకళలాడుతున్న ఈ మేళలో, రోజువారీ, ఫంక్షన్లకు వేసుకెళ్లే గాజులు ఉన్నాయి. తాము బ్యాంగిల్ మేళ నిర్వహించడాన్ని ఎంతో సంతోషిస్తున్నామని, తమ ప్రదర్శనలో ఇదీ ఒకటని రిలయన్స్ జువెల్స్ సీఈవో సునిల్ నాయక్ చెప్పారు. ప్రతి ఒక్క సందర్భాన్ని వేసుకెళ్లే గాజులను అందుబాటులో ఉంచామన్నారు. భారతీయ మహిళల సంస్కృతి, సంప్రదాయాల్లో గాజులు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. నగరంలోని గాజుల అభిమానులందరికీ ఈ బ్యాంగిల్ మేళ ఎంతో ఉత్తేజకరమైన అవకాశమని పేర్కొన్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ గాజులను ఎంపిక చేసుకోవచ్చని నాయక్ చెప్పారు. రిలయన్స్ జువెల్స్ ప్రస్తుతం గోల్డ్, డైమాండ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మొత్తం 47 నగరాల్లో ఈ కంపెనీ 77 షోరూంలను కలిగి ఉంది. ప్రతి ఒక్క ప్రత్యేక సందర్భంలో అద్భుతమైన డిజైన్లను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ గోల్డ్‌ను మాత్రమే రిలయన్స్ జువెల్స్ విక్రయిస్తోంది. -
మెరుపు వెనక చీకటి..
బాల్యం భలే బాగుంటుంది. అమ్మ పెట్టే గోరుముద్దలు.. నాన్న తెచ్చే ఐస్‌క్రీములు.. నానమ్మ చెప్పే చిట్టి కథలు.. ఆటలు.. పాటలు.. అల్లరి.. బాల్యం నిజంగానే బాగుంటుంది! అయితే అందరి బాల్యం ఇలాగే ఉండదు.. ఇటుకలు మోసి.. కమిలిపోయిన భుజాలు. అంట్లు తోమి.. అలిసిపోయిన చేతులు. కప్పులు కడిగి.. ముతకబారిన వేళ్లు. పశువులు కాసి.. బొబ్బలు తేలిన కాళ్లు. తిట్లు.. దెబ్బలు.. రకరకాల హింసలు. నిజంగా బాల్యంలో కూడా బాధలుంటాయి. సాక్షి, ప్రత్యేకం: బజారులో గాజుల దుకాణానికి వెళ్తే మన కంటికి ఆ గాజుల మెరుపే కనిపిస్తుంది. కానీ ఆ మెరుపు వెనక ఉన్న చీకటి గురించి ఎప్పుడూ ఆలోచించం. ఒక్కసారి ఆలోచిస్తే.. ఆ చీకటిలో ఎన్ని చిన్నారి చేతులున్నాయో తెలుస్తుంది! అవి పడుతున్న బాధలెన్నో తెలుస్తుంది! పట్టుమని పదేళ్లయినా నిండని ఆ లేలేత చేతివేళ్లు.. వేడిని భరిస్తూ, హానికారక వాయువులను పీలిస్తేనే.. రంగురంగుల మెరిసే గాజులు తయారవుతున్నాయనే విషయం మీకు తెలుసా? దేవ్ ప్రతాప్ సింగ్.. వయసు 23.. ఒకప్పుడు ఓ గాజుల కర్మాగారంలో బాల కార్మికుడు. ప్రస్తుతం క్లే ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. మనోజ్ శంఖ్వార్.. వయసు 24.. ఒకప్పుడు బాల కార్మికుడే. ప్రస్తుతం ఓ మున్సిపల్ వార్డుకు కౌన్సిలర్‌గా కొనసాగుతున్నాడు. చైల్డ్ ఫండ్ అనే స్వచ్చంద సంస్థ కాపాడిన వీరిద్దరు.. ఇప్పుడు ఎంతోమంది బాలకార్మికుల విముక్తి కోసం కృషి చేస్తున్నారు. ఊహించుకుంటేనే భయమేస్తుంది: ‘ప్రతి పిల్లవాడు పాఠశాలకు వెళ్లాలనేది మా లక్ష్యం. అందుకోసమే మా ఈ ప్రయత్నం. ప్రతి చిన్నారికి బతుకు మీద ఆశ కల్పించే భరోసాను మనమంతా ఇవ్వాలి. లేదంటే ఎంతోమంది చిన్నారులు మొగ్గలుగానే రాలిపోతారు. బాలకార్మికుడిగా నేను పడిన అవస్థలు గుర్తుకొస్తేనే భయమేస్తుంది. బయటపడ్డాం కాబట్టి.. ఇప్పుడు ఇలా ఉన్నాం. లేదంటే.. మా పరిస్థితి ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంద’ని తన గతం గురించి చెప్పుకొచ్చాడు శంఖ్వార్. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ..: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి ఏళ్లు గడుస్తున్నా.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఇప్పటికీ వందలాది గాజుల పరిశ్రమల్లో వేలాదిగా బాలకార్మికులు పనిచేస్తున్నారు. భరించరాని వేడి, హానికరమైన వాయువుల మధ్య వారు పనిచేస్తున్నారు. దారుణమైన విషయమేంటంటే.. తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఈ నరకంలోకి దింపుతున్నారు. అన్షుల్‌కు ఐదుగురు పిల్లలు. అందరూ 13 ఏళ్ల లోపువారే. వీరిలో నలుగురు అన్షుల్‌తోపాటు గాజుల పరిశ్రమలో పనిచేస్తున్నారు. అన్షుల్ సతీమణికి రోడ్డు ప్రమాదంలో భుజానికి గాయమైతే 3.5 లక్షలు అప్పు తెచ్చి, చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ కుటుంబమంతా కష్టపడితే వచ్చే రూ.20 వేలు అప్పు మీద వడ్డీకే సరిపోతోంది. ఒక్కో చిన్నారిది ఒక్కో సమస్య..: బాల కార్మికులకు విముక్తి కల్పిం చేందుకు పనిచేసే ఎన్జీవోలు ఈ గాజుల తయారీ పరిశ్రమల్లోని పిల్లల్ని కలిసినప్పుడు వారు చెప్పిన విషయాలు ఎంతో కదిలించాయట. చైల్డ్ఫండ్ సీఈవో నీలం మఖిజాని ఈ విషయమై మాట్లాడుతూ.. ‘పిల్లల్లోని సృజనాత్మకతను చూశాక ముచ్చటేసింది. కానీ వారు గడుపుతున్న జీవితం చూస్తే బాధగా అనిపించింది. పనిచేయకపోతే పూట గడిచే పరిస్థితి లేదు. దీంతో ముందుగా పిల్లల తల్లిదండ్రుల జీవితాలను బాగుపర్చాలని నిర్ణయించుకున్నాం. వారికి మెరుగైన వేతనాలు అందేలా ఉన్నతాధికారుల సాయం తీసుకున్నాం. తల్లిదండ్రుల ఆదాయం పెరిగితే పిల్లలను పనికి పంపకుండా బడికి పంపుతారనే ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశాం. కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ కుటుంబాల్లోని తల్లిదండ్రులెవరూ తమ పిల్లల్ని బడికి పంపే ఆలోచన చేయడంలేదు. దీంతో పోలీసుల సాయంతో కఠిన చర్యలే తీసుకోవాల్సి వచ్చింద’న్నారు. మరోకోణం బాలల అపహరణ..: దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పిల్లల్ని కొనుక్కొచ్చి, అపహరించి తీసుకొస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. అలా తీసుకొచ్చిన పిల్లలతో బలవంతంగా పనిచేయిస్తున్నట్లు వెల్లడైంది. పనిచేసినందుకు ఇంత తిండి పెడతారు తప్ప డబ్బులేమీ ఇవ్వరు. ఎదురు తిరిగితే హింసిస్తారు. -
గాజులు పెట్టించుకోవడానికి వెళ్లి..
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని కొండపూర్ శివారు మల్లన్నగుట్ట తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ దారావత్ గీత(26) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గీత గురువారం సాయంత్రం తన ఆడబిడ్డలతో కలిసి కొండపూర్‌లో గాజులు పెట్టుకోవడానికి వెళ్లింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గురువారం రాత్రి గ్రామ శివారులోని రోడ్డుపై గీత కింద పడి రక్తం మడుగులో ఉంది. విషయాన్ని గమనించిన కొందరు భర్త భోజ్యానాయక్‌కు తెలిపారు. భోజ్యానాయక్ సంఘటన స్థలానికి వెళ్లి గీతను చేర్యాలలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిఖిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం గీత మృతి చెందింది. మృతురాలికి భర్త, మగ్గురు కుమారైలు ఉన్నారు. గాజుల దుకాణం వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను ఇంటి వద్ద దింపుతానని బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లి తలపై బండతో కొట్టి చంపాడని మృతురాలి భర్త భోజ్యానాయక్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని మద్దూరు ఎస్ఐ ఎన్ వీరేందర్ తెలిపారు. -
ఇవాంకకు ప్రత్యేక గాజులు.. ఓ లుక్కేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) కు నగరం ముస్తాబైంది. జీఈఎస్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇవాంకా రావడానికి మునుపే హైదరాబాద్‌లో హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా చార్మినార్‌ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అధికారులు చార్మినార్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దాంతో పాటు గాజులకు ప్రసిద్ధిగాంచిన లాడ్ బజార్లో ఇవాంకా షాపింగ్ చేస్తుందనే సమాచారంతో అక్కడి వ్యాపారులు వారి సృజనాత్మకతకు పదును పెట్టారు. ఇవాంక పర్యటన నేపధ్యంలో లాడ్ బజార్ వ్యాపారులు 'భారత-అమెరికా స్నేహం' పై ప్రత్యేకంగా గాజులు తయారు చేశారు. గాజుల మీద ఇవాంకా పేరుతో పాటు ఇండియా, అమెరికా జాతీయ జెండాలను కూడా వేశారు. ' ఇవాంకా ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఈ గాజులను తయారు చేశాను. ఈ గాజుల సెట్ ను తయారు చేయడానికి 45 రోజులు పట్టింది. ఆమె లాడ్ బజార్ ను సందర్శిస్తే ఈ గాజులను అమెకు బహుమతిగా అందజేస్తాం' అని వ్యాపారి మహ్మద్ అన్వర్ తెలిపారు. ఇవాంకా లాడ్ బజార్లో షాపింగ్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఆమె పేరుతో తయారు చేసిన బ్యాంగిల్స్ నగర మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. -
పెళ్లి వేడుక... గాజుల కానుక
అమలాపురం టౌన్ :ఆడంబరాలదే పైచేయి అవుతున్న నేటి వివాహ తంతులో సంప్రదాయానికి పెద్దపీట వేసి అందరినీ ఆకట్టుకున్నారు వంటెద్దు నారాయణ స్వామి. ఎన్ని పిండివంటలు పెట్టామా? ఎంత అట్టహాసంగా వివాహం చేశామా? అని తలపోస్తున్న ఈ ఆధునిక కాలంలో సంప్రదాయానికి ఆయన ఊపిరులూదారు. ఒకప్పుడు ఏ ఇంటైనా పెళ్లి జరుగుతుంటే ఆ ఉళ్లో ముత్తైదువలందరినీ ఇంటికి సాదరంగా ఆహ్వానించి గాజుల మూటలతో ఊరూరా...తిరిగి అమ్మే గాజులమలారం వారిని రప్పించి అందరికీ గాజులు తొడిగించేవారు. ఆ సంప్రదాయ వేడుకనే ‘గాజుల కానుక’ అంటారు. ఆ సంప్రదాయాన్నే నారాయణ స్వామి తన కుమారుడి వివాహంలో పునరుద్ధరించారు. ఆ విశేషాన్నే వివాహ ఆహ్వాన పత్రికపై ముద్రించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలో రైల్వే ఉద్యోగిగా పని చేసి ఇటీవలే వంటెద్దు నారాయణ స్వామి పదవీవిరమణ చేశారు. నారాయణస్వామి, సుబ్బలక్షి ్మ దంపతుల కుమారుడు శ్రీరామ భూషణం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతని వివాహం ఈనెల 11న జరగనుంది. ఆ సందర్భంగా అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో తమ ఇంటికి ఆవీధి, కల్వకొలనువారి వీధిలలోని ముత్తైదువలను పిలిపించి గాజుల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గతంలో గాజుల అమ్మేవారిని తీసుకు వచ్చారు. అనేక రకాల గాజులను ప్రదర్శనగా ఉంచారు. వాటిని ముత్తైదువులకు తొడిగించారు. కనుమరుగైపోయిన ‘గాజుల పండుగ’ను సంప్రదాయబద్దంగా చేసిన నారాయణస్వామి దంపతులను ఆ ముత్తైదువలు అభినందించారు. -
కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి
అహ్మదాబాద్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి ఝలక్ ఇచ్చాడు. గుజరాత్‌లోని ఆమ్రేలీలో నిర్వహించిన ఓ ఫంక్షన్లో ఆమె మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరేశాడు. వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమ్రేలీలో వేడుక నిర్వహిస్తుండగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడికి అతిథిగా వచ్చారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాస్వాలా అనే వ్యక్తి లేచి రెండు మూడు గాజులు అనూహ్యంగా ఆమెపైకి విసిరాడు. అనంతరం వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అయితే, ఆ వ్యక్తికి స్మృతి ఇరానీకి మధ్య కాస్త దూరం ఉండటంతో ఆమెను తాకలేదు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తికి భండారియా అనే గ్రామంగా గుర్తించారు. అయితే, రైతులపై రుణమాఫీ, అప్పుల విషయాన్ని కేంద్రమంత్రి చెప్పే ప్రయత్నంలో భాగంగా అతడు అలా చేశాడని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు.