
బెంగళూరు: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే జేబులో వేసుకునేవారు కొందరైతే, ఎవరో పడేసుకున్నారని వెతికి సొంతదారుకు ఇచ్చేవారు మరికొందరు. వజ్రాలు పొదిగిన చేతి గాజు దొరికితే ఒక కార్మికుడు ఎంతో నిజాయతీగా యజమానికి ఇచ్చేసిన సంఘటన మంగళూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విమానంలో మంగళూరుకు బంధువుల ఇంటికి వచ్చిన మహిళ ఒక చేతికున్న వజ్రాల గాజును పోగొట్టుకుంది.
అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీకి దొరకడంతో దానిని అధికారులకు ఇచ్చాడు. కొంతసేపటికి బాధిత మహిళ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి గాజు పోయిన విషయం చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించి అష్రఫ్ చేతనే గాజును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment