dimand
-
రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి!
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మృతి తర్వాత బ్రిటన్ రాజ కుంటుంబం అధీనంలో ఉన్న వజ్రాలను తమ దేశాలకు ఇచ్చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది. బ్రిటన్ రాణి కిరీటంలో అనేక వజ్రాలు పొదగబడి ఉంటాయి. అవన్ని బ్రిటీష్ పాలిత దేశాల నుంచి దురాక్రమణంగా తెచ్చిన వజ్రాలే. ఐతే ప్రస్తుతం రాణీ మరణించింది కాబట్టి 'మా వ్రజాలు మాకిచ్చేయండి' అంటూ పలు దేశాలు డిమాండ్ చేయడం మొదలు పెట్టాయి. ఆయ దేశాల సరసన దక్షిణాఫ్రికా కూడా చేరింది. ఆప్రికాలో ప్రసిద్ధిగాంచిని కల్లినన్ I అనే వజ్రాన్ని వలస పాలకులు బ్రిటీష్ రాజకుటుంబానికి అప్పగించాయి. ఆ వజ్రం ప్రస్తుతం రాణి రాజదండంపై అమర్చబడి ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్ లబ్ధి చేకూర్చుకుందంటూ ఎత్తిపొడుస్తూ...తమ దేశ వజ్రాన్ని ఇచ్చేయమంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్లైన్లో.. change.org అనే వెబ్సైట్లో పిటిషన్ కూడా వేసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా బ్రిటన్ చేసిన నిర్వాకానికి పరిహారం ఇవ్వాల్సిందేనని, పైగా దొంగలించిన మొత్తం సొత్తును కూడా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ వజ్రం ఒక బిందువు ఆకారంలో ఉంటుందని, 1600 ఏళ్ల నాటి పట్టాభిషేక వేడుకలో రాజ దండంలోని క్రాస్ గుర్తులో పొదగబడి ఉందని దక్షిణాఫ్రికా పేర్కొంది. ఈ వజ్రం అత్యంత విలువైనదే కాకుండా చారిత్రత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినదని చెబుతోంది. దీన్ని లండన్ టవర్లోని జ్యువెల్ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొంది. (చదవండి: వెస్ట్‌మినిస్టర్ హాల్: రాణి శవపేటికను అక్కడే ఎందుకు ఉంచారంటే..) -
వజ్రాల గాజు మిస్సింగ్.. వెలకట్టలేని నిజాయతీ
బెంగళూరు: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే జేబులో వేసుకునేవారు కొందరైతే, ఎవరో పడేసుకున్నారని వెతికి సొంతదారుకు ఇచ్చేవారు మరికొందరు. వజ్రాలు పొదిగిన చేతి గాజు దొరికితే ఒక కార్మికుడు ఎంతో నిజాయతీగా యజమానికి ఇచ్చేసిన సంఘటన మంగళూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విమానంలో మంగళూరుకు బంధువుల ఇంటికి వచ్చిన మహిళ ఒక చేతికున్న వజ్రాల గాజును పోగొట్టుకుంది. అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీకి దొరకడంతో దానిని అధికారులకు ఇచ్చాడు. కొంతసేపటికి బాధిత మహిళ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి గాజు పోయిన విషయం చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించి అష్రఫ్ చేతనే గాజును అందజేశారు. -
రాజకీయం చేయకుండా పరిష్కరించండి
సాక్షి, ముంబై: రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు మంత్రి గిరీశ్ మహాజన్ రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి మహాజన్‌కు వివరించారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటిని రాజకీయం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. -
వజ్రాలు, బంగారు నిక్షేపాల కోసం...
సాక్షి, తుగ్గలి : గుప్త నిధుల కోసం అన్వేషణలో ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. తన పని తాను చేసుకుపోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గత ఏడాది డిసెంబర్ 13న గుప్త నిధుల కోసం వేట ప్రారంభించిన విషయం విదితమే. శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో వజ్రాలు, బంగారం పెద్దఎత్తున ఉందంటూ ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా తవ్వకాలు జరగ్గా ఏనుగు దంతాలు, జంతు కళేబరాల అవశేషాలు లభ్యమయ్యాయి. కోటలోని బండరాళ్ల కింద, బురుజులో తవ్వకాలు చేశారు. నిధి ఆచూకీ కోసం ఎన్నెన్నో పూజలు, మంత్రాలు, స్కానర్లు, జియాలజిస్టులతో సర్వేలు.. ఇలా అన్నీ చేశారు. కోటలో అనుమానం వచ్చిన చోట, స్వామీజీలు గానీ, ఇంకా ఎవరైనా గానీ చెప్పిన చోటల్లా తవ్వకాలు చేస్తూ పోతున్నారు. మొదట్లో బండరాయి కింద 18 రోజుల పాటు తవ్వకాలు చేపట్టిన తరువాత కోట బురుజులోకి మార్చారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు తవ్వకాలు చేశారు. బండ రాళ్లు పడడంతో వాటిని కూలీలతో పగులగొట్టి తొలగిస్తున్నారు. అలాగే రెండు రోజులుగా కోట ప్రధాన ద్వారం ఊరు వాకిలి పక్కనున్న పాతాళ గంగ బావిలోనూ తవ్వకాలు చేపట్టారు. ఇందులో భాగంగా బావిలోని నీటిని మోటారు సాయంతో బయటకు తోడేశారు. బావిలో మూడు తలల నాగపడగ, ప్రాచీన కాలంనాటి వస్తువులు బయటపడ్డాయి. తహసీల్దార్ గోపాలరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి, పత్తికొండ సీఐ విక్రమసింహ, జొన్నగిరి ఎస్ఐ నజీర్అహ్మద్ తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. -
కర్నూలు జిల్లాలో బంగారం, వజ్రాలు
సాక్షి, కర్నూలు: శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులు పోసి అమ్మారని ప్రతీతి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయుల కాలంలో కోటలో వాటిని దాచిఉంచారని పలువురు నమ్ముతున్నారు. చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నాయన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినిచ్చింది. వారం రోజులక్రితం తవ్వకాలు ప్రారంభమయ్యయి. ఈ నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినివ్వడంతో గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కోటలో పెద్దపెద్ద బండరాళ్లు ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు. తవ్వకాల వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటుచేశారు. అంతేగాక కోట పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. -
రేగోడ్ ను సంగారెడ్డిలోనే ఉంచాలని ధర్నా
రేగోడ్: మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని.. పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రేగోడ్ మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని, చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
నిధులు లెక్కలు తక్షణమే ప్రకటించాలి