సాక్షి, కర్నూలు: శ్రీకృష‍్ణదేవరాయల పరిపాలనా కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులు పోసి అమ‍్మారని ప్రతీతి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని, శ్రీకృష‍్ణదేవరాయుల కాలంలో కోటలో వాటిని దాచిఉంచారని పలువురు నమ‍్ముతున్నారు. చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నాయన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినిచ్చింది. వారం రోజులక్రితం తవ‍్వకాలు ప్రారంభమయ్యయి. ఈ నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తవ్వకాలకు అనుమతినివ్వడంతో గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కోటలో పెద్దపెద్ద బండరాళ్లు ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు. తవ్వకాల వద్ద పెద్దఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటుచేశారు. అంతేగాక కోట పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment