సాక్షి, ముంబై: రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు మంత్రి గిరీశ్ మహాజన్ రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి మహాజన్‌కు వివరించారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటిని రాజకీయం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే.
మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు.
రాజకీయం చేయకుండా పరిష్కరించండి
Published Sun, Mar 11 2018 5:59 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment