
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.యాదగిరిగుట్టలో ఆదివారం(ఫిబ్రవరి16) ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.‘బీసీ గణనను చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసేంబ్లీలో చట్ట బద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.
కులగణనను పార్లమెంట్‌లో ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నాం. 70ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు, భూ దందాలు,లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నాడు.
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. బీఆర్‌ఎస్ గతంలో టీచర్లను మోసం చేసి పోటీ చేసే అర్హత కోల్పోయింది’అని ఈటల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment