meating
-
మోదీతో అభిజిత్ బెనర్జీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సెవెన్, లోక్‌కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో ఈ భేటీ జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు వారు పలు అంశాలు చర్చించినట్టు సమాచారం. ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇండో అమెరికన్ అభిజిత్‌కు అంతర్జాతీయ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక వైఖరితో కూడిన పరిష్కారాలను అన్వేషిస్తున్నందుకు ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రిమర్‌లతో కలిపి నోబెల్ ఎకనమిక్స్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నోబెల్ దక్కిన అనంతరం అభిజిత్ తొలిసారిగా భారత్‌ను సందర్శించారు. మంగళవారం సాయంత్రం ఆయన కోల్‌కతాలో తన తల్లిని పరామర్శించి రెండు రోజులు నగరంలో గడుపుతారు. మరోవైపు అభిజిత్‌కు నోబెల్ అవార్డు దక్కిన నేపథ్యంలో బీజేపీ, విపక్ష నేతల మధ్య ఆయన నేపథ్యంపై మాటల దాడి సాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల హామీ అయిన న్యాయ్ పథకం అభిజిత్ ఆలోచనేనని, ఆయన వామపక్ష భావజాలం కలిగిన వారని బీజేపీ చెబుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో అభిజిత్ సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. -
ప్రణబ్‌తో మోదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ నినాదమైన సబ్కా సాథ్..సబ్ కా వికాస్..సబ్కా విశ్వాస్ సాకారం కావాలని ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్‌తో భేటీ సందర్భంగా మాజీ రాష్ట్రపతిని రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు. ప్రణబ్ దాదాతో ఎప్పుడు కలిసినా అది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని, అపార విజ్ఞానం సొంతమైన ఆయన అసలైన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీతో భేటీ ఆహ్లాదంగా సాగిందని, ఆయన రెండవ పర్యాయం ప్రధానిగా సేవలందించేందుకు సిద్ధమతున్న క్రమంలో శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. కాగా మాజీ రాష్ట్రపతిని కలుసుకునేందుకు ప్రణబ్ నివాసానికి వచ్చినందుకు ప్రధాని మోదీకి ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా ధన్యవాదాలు తెలిపారు. -
రేపే ప్రచార శంఖారావం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : శాసనసభ ముంద స్తు ఎన్నికల ప్రచార పర్వానికి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు ఇందూరు నుంచే శంఖారావం పూరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ల వారీగా నిర్వహించతలపెట్టిన బహిరంగసభల షెడ్యుల్‌ను ఇప్పటికే ప్రకటించిన అధినేత, మిగిలిన సభలకు ఊపు తెచ్చే విధంగా నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోనే తొలి సభ కావడంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్వహణ, ఏర్పాట్ల బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు అప్పగించింది. వారం రోజులుగా జిల్లాలోనే ఉంటున్న ఇద్దరు నేతలు సభ నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై అధినేత కేసీఆర్ పలుమార్లు ఎంపీ కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. నియోజకవర్గం నుంచి .. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది చొప్పున ఈ బహిరంగసభకు తరలించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌అర్బన్‌తో పాటు సమీపంలోని నిజామాబాద్ రూర ల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నుంచి వీలై నంత ఎక్కువ మంది తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశా రు. ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకు వచ్చే బాధ్యతలను ఆ పార్టీ అభ్యర్థులకు అప్పగించారు. దీంతో తమ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జనాలను తరలించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సమాయత్తం చేసిన ఎంపీ.. వారం రోజులుగా జిల్లాలోనే ఉన్న ఎంపీ కవిత సభకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా అర్బన్ పరిధిలోని కార్పొరేటర్లు, నగర పార్టీ నాయకత్వంతో ఇటీవల ఓ ప్రైవేటు హోటర్‌లో సమావేశమైన ఎంపీ.. వారి పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. సుమారు ఆరు గంటల పాటు అర్బన్‌పైనే ఫోకస్ చేశారు. ఆయా డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాల్లో కూడా ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. తాజాగా సోమవారం నగరంలోని ప్రధాన కుల సంఘాలతో సమావేశమయ్యారు. జిల్లాలో అత్యధిక సంఖ్య కలిగిన ఈ ప్రధాన నాలుగు కుల సంఘాల పెద్దలతో భేటీ అయ్యారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. సిద్ధమైన వేదిక, హెలీపాడ్ నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ విస్తీర్ణంలో సభా వేదిక సిద్ధమైంది. సభకు హాజరైన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మైదానాన్ని చదును చేశారు. బైపాస్‌రోడ్డుకు అవతల వైపు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం కేసీఆర్ నేరుగా సభాస్థలానికి చేరుకునేలా అక్కడే హెలిప్యాడ్‌ను నిర్మించారు. నిర్వహణకు ప్రత్యేక కమిటీలు.. సభ నిర్వహణ ఏర్పాట్లను వివిధ కమిటీలకు అప్పగించారు. వేదిక నిర్మాణ కమిటీ, మైదానం సిద్ధం చేసేందుకు మరో కమిటీని నియమించారు. సభకు వచ్చే వారి సౌకర్యం కోసం తాగునీటి వసతి వంటి ఏర్పాట్లను చేపట్టారు. అలాగే ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు తరలివచ్చేలా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఇతర జిల్లాల వాహనాలు, బస్సులు.. సభకు జనాలను తరలించేందుకు సుమారు మూడు వందల బస్సులను వినియోగించే అవకాశాలున్నాయి. వీటితో పాటు, డీసీఎంలు, ఐచర్లలో జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్, జగిత్యాల, మెదక్, సిద్దిపేట్ డిపోల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను తరలించనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, వర్ని, బోధన్ రూట్ల వైపు నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై దృష్టి సారించింది. -
జనసభ
సాక్షి వనపర్తి : ముందస్తు ఎన్నికల్లో భాగంగా అందరి కంటే ముందుగా టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి బరిలోకి అభ్యర్థులను జాబితా ప్రకటించింది. అదే దూకుడును ప్రచారంలోనూ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు సంబంధించి వనపర్తిలో తొలి సభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 5వ తేదీన జరగనున్న ఈ సభకు స్వయంగా సీఎం కేసీఆర్ హాజరుకానుండడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణపై దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం 40వేలకు తగ్గకుండా ప్రజలను సభకు తరలించాలని కార్యాచరణ రూపొందించారు. జన ఆశీర్వాద సభ వచ్చే నెల 5వ తేదీన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగరవంలో జరిగే జన ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న తొలి భారీ సభ కావడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, మక్తల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వాల, అలంపూర్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. సభను విజయవంతం చేసే బాధ్యతలను రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కేసీఆర్ అప్పగించారు. అయితే, వనపర్తిలో బహిరంగ సభ ఏర్పాటుచేసినట్లు గత మంగళవారం సాయంత్రం వెల్లడించగానే సభాస్థలి ఎంపికపై నిరంజన్ రెడ్డి తన అనుచరులతో చర్చించి నాగవరంలోని స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పటికీ కేవలం ఎనిమిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో బుధవారం నాటి నుండే పనులను ప్రారంభించి శరవేగంగా చేపడుతున్నారు. ఈ మేరకు నిరంజన్ రెడ్డి ఎక్కువగా సభ ఏర్పాట్లపైనే దృష్టి సారించి పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నాడు. మండల, గ్రామ కమిటీలకు జన సమీకరణ బాధ్యత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 40 వేలకు తగ్గకుండా జనాన్ని కేసీఆర్ సభకు సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు సభను విజయవంతం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు. జనాన్ని సమకరించేందుకు అన్ని మండల, గ్రామ కమిటీలకు బాధ్యతలను అప్పగించారు. భారీగా జనాన్ని తరలించి సభను విజయవంతం చేయడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసరాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. అటు ప్రచారం.. ఇటు సభ ఈనెల 6వ తేదీన ప్రభుత్వాన్ని రద్దు చేసి అదే రోజు 105 మందితో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. తొలి విడతలో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. దీంతో ఆయా అభ్యర్థులు ఇన్ని రోజుల పాటు ప్రచారంలో మునిగిపోయారు. అయితే, వారం రోజుల్లో ముఖ్యమంత్రి సభ ఉండడంతో ఎక్కువ సమయం జన సమీకరణ, ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. పక్కాగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న సభ కావడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు జనం పెద్దసంఖ్యలో రానున్నారని భావిస్తున్నారు. అయితే, ఎంత మంది వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నాగవరంలోని ఎంపిక చేసిన స్థలంలో చదును చేసే పనులు పూర్తి కావొచ్చాయి. ఒకటి, రెండు రోజుల్లో వేదిక నిర్మాణం, ఇతరత్రా పనులను ప్రారంభించనున్నారు. సభాస్థలాన్ని పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి క్రైం: కేసీఆర్ పాల్గొననున్న సభ నిర్వహణ కోసం వనపర్తి మండలం నాగవరం శివారులో స్థలాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలపై నాయకులతో ఆరా తీశారు. భారీగా హాజరయ్యే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, గట్టు యాదవ్, మాజీ జెడ్పీటీసీ వెంకట్రావు, సుధాకర్, రవి, విష్ణుసాగర్, కురుమూర్తినాయుడు, మురళీసాగర్, చిన్నారెడ్డి ఉన్నారు. ఆరుచోట్ల పార్కింగ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అటు పార్టీ శ్రేణులు, ఇటు ప్రజలు సీఎం కేసీఆర్ సభకు తరలివచ్చే అవకాశం ఉండడంతో వాహనాల పార్కింగ్‌కు ఆరు స్థలాలు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి 44పై నుంచి ముఖ్యంగా మహబూబ్‌నగర్, మక్తల్, జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను అనూస్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేయించాలని నిర్ణయించారు. కొల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు వనపర్తిలోని హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో, గద్వాల, అలంపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త కలెక్టరేట్, అక్షర స్కూల్ వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తిలోని గోపాల్పేట, రేవల్లి మండలాల నుంచి వచ్చే వాహనాల కోసం అయ్యప్ప గుడి నుంచి భగీరధ ఫంక్షన్ హాల్ వైపు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
మళ్లీ బ్యాలెట్‌కే వెళ్దాం!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)ల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలతోపాటు వాటికి అనుసంధానించే వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రాల)ల్లో లోపాలపై అభ్యంతరాలు తెలిపాయి. అలాగే ఓటరు జాబితాలో నకిలీల్ని నివారించేందుకు ఓటర్లను ఆధార్‌తో అనుసంధానించాలని ఈసీకి సూచించాయి. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో సోమవారం ఈసీ సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్ష భేటీలో బీజేపీ మినహా మిగతా ఆరు జాతీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు మళ్లీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానంతోనే దేశంలో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నొక్కిచెప్పాయి. ఈవీఎంలపై లేవనెత్తిన సందేహాలకు ప్రతిపక్ష పార్టీలు సంతృప్తి చెందేలా సమాధానం ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. బ్యాలెట్ పద్ధతికి మళ్లడమంటే పోలింగ్ బూత్‌ల ఆక్రమణల్ని స్వాగతించినట్లేనని సీఈసీ ఓపీ రావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కొన్ని పార్టీలు మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కోరడం మంచిది కాదు. అదే సమయంలో ఈవీఎంలతో కొన్ని సమస్యలున్నాయని, వీవీపాట్ల స్లిప్‌ల లెక్క విషయంలో లోపాలున్నాయని మా దృష్టికి తీసుకొచ్చాయి. మేం వాటిపై దృష్టిపెడతాం’ అని ఆయన చెప్పారు. 70% పార్టీలది బ్యాలెట్ బాటే: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాల్ని వినడం సంప్రదాయంగా వస్తోంది. ఆ నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో నిజానికి ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్‌ల్లో సాంకేతిక లోపాలు అజెండా కాకపోయినా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటినే ప్రధానంగా ప్రస్తావించాయి. ఈవీఎంల్ని ట్యాంప రింగ్ చేస్తున్నారని, పేపర్ బ్యాలెట్లకు మళ్లాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ఆద్మీ, జనతాదళ్(ఎస్), సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు తమ వాణిని గట్టిగా వినిపించాయి. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘నాల్గింట మూడొంతు పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్, సాంకేతిక లోపాల్ని ప్రస్తావించాయి. ఈ విషయంలో బీజేపీ ఒంటరైంది. 70 శాతం రాజకీయ పార్టీలు పాత విధానంలోనే ఎన్నికలు జరపాలని ఈసీని కోరాయి’ అని చెప్పారు. ‘ఒకవేళ పేపర్ బ్యాలెట్‌కు ఈసీ మొగ్గు చూపనిపక్షంలో.. ఓటింగ్ విశ్వసనీయత కోసం కనీసం 30 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాల్ని ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. మొత్తం 41 పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులకు పరిమితి విధించడాన్ని భేటీలో బీజేపీ వ్యతిరేకించింది. దానికి బదులు మరింత పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై తాము సానుకూలంగా ఉన్నామని తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించాలి ఎన్నికల్లో అక్రమాల్ని నిరోధించేందుకు జాబితాలోని ఓటర్లను వారి ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని బీజేపీ సహా పలు పార్టీలు ఈసీని కోరాయి. ‘ఓటర్లతో ఆధార్‌ను అనుసంధానించాలని రాజకీయ పార్టీలు ఈసీకి సూచించాయి. 10 పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి’ అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్షరక్రమంలో ఓటర్ల జాబితాను రూపొందిస్తే.. నకిలీల్ని తొలగించేందుకు అవకాశముంటుందని సమావేశంలో బీజేపీ సూచించింది. కాగా ఆగస్టు 2015లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను బ్రేక్ పడింది. 1982లో తొలి ఈవీఎం ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈవీఎంల్ని హ్యాక్ చేయాలంటూ గతేడాది జూన్‌లో పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. కేవలం రెండు పార్టీలు మాత్రమే ఆ సవాలు స్వీకరించాయి. చివరికి ఆ రెండూ కూడా ఈవీఎంల హ్యాకింగ్ సవాలుకు గైర్హాజరయ్యాయి. 1982లో కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంల్ని ఉపయోగించారు. వాటి వాడకంపై అప్పటికి ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈవీఎంల్ని వినియోగించేందుకు వీలుగా 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించినా.. 1998 వరకూ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్య రేటు 0.7 శాతంగా ఉంటోంది. -
బ్యాలెట్ పేపర్లపై ఓటింగ్‌కు విపక్షాల పట్టు
-
రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ఏడు జాతీయ పార్టీలు, 51 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు హాజరయ్యాయి. సవరించిన ఓటర్ల జాబితా, ఎన్నికల వ్యయంపై పరిమితులు, వార్షిక నివేదికల దాఖలు వంటి పలు అంశాలపై ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల స్ధానంలో బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని పలు విపక్ష పార్టీలు ఈసీని డిమాండ్ చేయనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన సహా 17 పార్టీలు బ్యాలెట్ పేపర్లపై ఎన్నికలు నిర్వహించాలని పట్టుపట్టనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, జనతాదళ్-సెక్యులర్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, కేరళ కాంగ్రెస్ (ఎం), ఆల్ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్లు ఈ డిమాండ్‌ను ముందుకుతెస్తున్నాయి. ఈ భేటీలో జమిలి ఎన్నికల అంశం అజెండాలో లేకపోయినా రాజకీయ పార్టీలు ఈ అంశం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే లా కమిషన్‌కు వివిధ రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలను నివేదించాయి. -
పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
వరంగల్ క్రైం: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా పోలీసుల విధులు నిర్వహించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సీపీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో కిందిస్థాయి అధికారులను భాగస్వాములను చేయాలన్నారు. దీని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై రశీదు ఇవ్వడంతో ఆస్తి నేరాలకు సంబంధించి కేసులను వెంటనే నమోదు చేయాలని సూచించారు. నమోదు చేసిన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ప్రతులను ఫిర్యాదుదారులకు ఉచితంగా అందజేయాలన్నారు. కేసుల్లో సాక్షులుగా ఉండే వ్యక్తులను పోలీసుస్టేషన్‌కు పిలువకుండా వారిని ఇంటివద్దే పెద్ద మనుషుల సమక్షంలో విచారించాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో› మహిళలు, వృద్ధులు, పిల్లలు, మద్యం సేవించిన వారిని పోలీసుస్టేషన్లల్లో ఉంచవద్దని ఆదేశించారు. భూకబ్జాదారుల వివరాలు సేకరించాలి.. కమిషనరేట్ పరిధిలోని భూకబ్జాదారుల వివరాలను సేకరించాలని సీపీ పోలీసులను ఆదేశించారు. దీంతో పాటు ఆస్తి నేరాలు, మోసాలకు పాల్పడుతున్న వారి పూర్తి సమాచారం, ఫోటోలు, వేలి ముద్రాలు సేకరించాలన్నారు.అవసరమైతే పీడీ యాక్ట్ నమోదుకు పూర్తి స్థాయి సమాచారం కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖం గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలన్నారు. అనంతరం వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కరాలు, అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు.సమావేశంలో డీసీపీలు వెంకట్‌రెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్‌తో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో జేడీఎస్, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీనియర్ జేడీఎస్ నేత ధనిష్ అలీ, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జేడీఎస్ పట్టుబడుతుండగా, కాంగ్రెస్ మాత్రం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడితే సరిపోతుందని వాదిస్తోంది. కొత్త ప్రభుత్వ దశదిశను వెల్లడించేందుకు పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జేడీఎస్ స్పష్టం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలుస్తానని సీఎం కుమారస్వామి సైతం గతంలో పేర్కొన్నారు. అయితే కొద్దినెలల కిందట సీఎంగా తాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన క్రమంలో ప్రస్తుతం నూతన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం నిర్ధిష్ట ప్రాజెక్టులు, పథకాలు చేపట్టదలిస్తే అనుబంధ బడ్జెట్లో వాటిని పొందుపరచవచ్చని ఆయన కుమారస్వామికి సూచించారు. -
దుష్ప్రచారం చేసినా.. గెలుపు ఖాయం
ఇల్లెందు: ఇల్లెందు సమీపంలోని కోటమైసమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించకుండా కేవలం ఫొటోలకే పరిమితం చేశారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే పని తీరుపట్ల నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో చర్చించిన విషయాలు ఇలా ఉన్నాయి... ఇప్పటి వరకు 8 దఫాలుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి ఎన్డీ, టీడీపీ, సీపీఐ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, కోరం కనకయ్య మధ్య వ్యత్యాసాన్ని చర్చించారు. కనకయ్య హయాంలో నిధుల వరద పారుతున్నా ఆయనపై వ్యతిరేక ప్రచారం పట్ల కలత చెందారు. ప్రతిపక్షాలు సాగిస్తున్న ప్రచారాన్ని కూడా ప్రధానంగా చర్చించారు. దీనికి తోడు మెజార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అధికారులు సక్రమంగా పనులు చేయకపోవటంతో కూడా చెడు పేరు వస్తుందని సభ దృష్టికి తెచ్చారు. ఇక అధికార టీఆర్ఎస్లో ఉద్యమకాలం నాటి టీఆర్ఎస్ నేతలు ఒకవైపు, కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు మరొక వైపు ఎవరికి వారే అన్నచందంగా ఉంటున్నారని, వీరిని ఐక్యం చేసేందుకు పార్టీ కమిటీలు లేకపోవడంతో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు మరికొంత మంది మనసులోని మాట చెప్పకుండా.. పైకి మాత్రం అంతా బాగానే ఉందని చెప్పినట్టు తెలిసింది. కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నా వ్యతిరేక ప్రచారం సాగుతుండడం, దీనికి అడ్డుకట్ట వేయలేక పోవడానికి గల కారణాలను సమావేశంలో విశ్లేషించారు. ఇదంతా మీడియా ప్రచారమే.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కనకయ్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా, ఇతర ప్రచార సాధనాల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రోజు ఐదారు గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు పర్యవేక్షిస్తున్నారని, మునుపెన్నడూ జరగని అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో సాధించారని గుర్తు చేశారు. అయినా ఎమ్మెల్యే అంటే గిట్టని వ్యక్తుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీడియా ప్రచారం చేయటం సరైంది కాదన్నారు. పార్టీని పటిష్టపరిచే చర్యలు వేగవంతం చేయాలని, రానున్న కాలంలో ఆయా మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకురావాలని, ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా నేతలు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీటీసీలు లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబు యాదవ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మడత రమ, బయ్యారం మండల వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి, టేకులపల్లి ఎంపీపీ భూక్య లక్ష్మి, ఆత్మ చైర్మన్ ముక్తి కృష్ణ, మార్కెట్ చైర్మన్ నాగేశ్వరరావు, తాటి భిక్షం, కనగాల పేరయ్య, పులిగళ్ల మాదవరావు, సుదిమళ్ల సర్పంచ్ నాగరత్నమ్మ, అక్కిరాజు గణేష్, సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం తదితరులు పాల్గొన్నారు. -
బదిలీలు ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ బదిలీలు ఇక ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. ఈ వేసవి సెలవుల్లోనే అందుకు శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆన్లైన్ బదిలీల వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపింది. అందుకు ఉపాధ్యాయ సంఘాలు సైతం అంగీకరించాయి. ఈ భేటీలో టీచర్లకు సంబంధించిన 36 రకాల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. గతంలో జరిగిన బదిలీల్లో అవకతవకల కారణంగా ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని, దాంతో ప్రభుత్వం అభాసుపాలైందని మంత్రుల కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్ అంశంపై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు కమిటీ స్పష్టమైన హామీ ఇచ్చిందని సంఘాలు తెలిపాయి. ఈలోగా సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారం కాకపోతే పాత రూల్స్ ప్రకారం ఎవరి మేనేజ్మెంట్లో వారికి పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించిందని వివరించాయి. వీటితోపాటు ఇతర సమస్యల పరిష్కారం పట్ల మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసిందని సంఘాల నేతలు వెల్లడించారు. ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రోటీన్‌గా చేయాల్సిన అంశాల్లో పీఆర్సీ ఉందని, ఇందుకు సంబంధించి కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రుల కమిటీ తెలిపింఇ. ఒకవేళ నివేదిక, అమలు ఆలస్యమైతే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని పేర్కొన్నట్లు సంఘాల నేతలు చెప్పారు. అలాగే ప్రతి మండలంలో ఐదెకరాల స్థలం కలిగిన పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా అభివృద్ధి చేసి, క్లస్టర్ హాస్టళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నారు. సర్వీసు రూల్స్, బదిలీలు, పీఆర్సీ ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నింటనీ క్రోడీకరించి సీఎంకు నివేదిక అందజేస్తామని పేర్కొంది. ఈ సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, జేసీటీయూ నాయకులు రఘనందన్, అంజిరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, మల్లయ్య, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సదానంద్ గౌడ్, చావ రవి, మైస శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే పరిష్కారిస్తాం: మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను ఐదు రకాలుగా విభజించాం. అందులో ఒకటి రొటీన్‌గా చేయాల్సినవి. బదిలీలు, పదోన్నతులు, విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లను పంపించడం. వీటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రెండోది న్యాయ వివాదాలతో ముడిపడిన అంశాలు. ముఖ్యంగా సర్వీసు రూల్స్ అంశం కోర్టులో ఉంది. ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే రాష్ట్రపతి ఆమోదం తీసుకువచ్చాం. సీఎం దృష్టికి తీసుకువెళ్లి కేసుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమిస్తాం. మూడోది పాఠశాలల్లో సదుపాయాల కల్పన. ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకా> చేస్తాం. నాలుగోది ఆర్థిక భారంతో కూడిన అంశాలు. ఎన్టీఆర్ హయాంలో రూ.398 వేతనంతో నియమించిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే అంశంపై సానుకూలంగా ఉన్నాం. పీఆర్సీ నియామకం చేయాల్సిందే. దానిపై సానుకూలంగా ఉన్నాం. ఐదో అంశం సీపీఎస్. దీనిపై ముఖ్యమంత్రికి అవగాహన ఉంది. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి. ఇప్పుడు అలా లేదు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచాం. పండిట్, పీఈటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. రాబోయే కాలంలో ఈ సంబంధం మరింత బలోపేతమై కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సానుకూలంగా స్పందించారు: సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు సీపీఎస్ రద్దుపై సీఎంతో చర్చిద్దామని చెప్పారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం హైకోర్టులో ఉంది. సుప్రీం న్యాయవాదిని నియమించి జూన్ 6న వాదనలు వినిపించాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించారు. బదిలీలు, పదోన్నతులు పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే చేపట్టాలని, అందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ఆయా అంశాలపై దృష్టి సారించాలన్నాం. 2003 డీఎస్సీ టీచర్ల సమస్యపై చర్చించాం. వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన టీచర్లకు 24 రోజుల ఈఎల్స్పై చర్చించాం. కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేలా సానుకూలంగా స్పందించింది. 34 డిమాండ్లలో ఒకటే పరిష్కారం అయింది. మిగతా వాటిని పరిష్కరించాలని విన్నవించాం. ఎయిడెడ్, కేజీబీవీ మోడల్ గిరిజన టీచర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం. పాత జిల్లాల ప్రకారం బదిలీలకు ఒకే: భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు త్వరలో సీఎంతో సమావేశం నిర్వహించేందుకు ఓకే చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలపైనా సీఎంతో చర్చిద్దామన్నారు. కచ్చితంగా బదిలీలను పాత జిల్లాల ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్క స్కూల్ ఉండేలా చూడమని కోరాం. ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ఉన్నత చదువులకు వెళ్లే ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. మేనేజ్మెంట్ వారీగా పదోన్నతులను హెడ్ మాస్టర్లకే పరిమితం చేయకుండా కిందిస్థాయి టీచర్ల వరకు వర్తింపజేయాలని కోరాం. పీఆర్సీ ఏర్పాటుకు ఓకే: నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు వీటిని ప్రాథమిక చర్చలుగా భావిస్తున్నాం. సానుకూల దృక్ఫథంతో ఉన్నాం. పాఠశాలల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నాం. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రమే సీఎం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. పీఆర్సీ, ఐఆర్ ఇస్తామన్నారు. స్వాగతిస్తున్నాం. -
మోదీ, జిన్‌పింగ్ భేటీకి ముందు..
బీజింగ్ : డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న భారత్, చైనాలు సామరస్య ధోరణి దిశగా పయనిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న భేటీ నేపథ్యంలో భారత్ పట్ల డ్రాగన్ సానుకూలంగా వ్యవహరిస్తోంది. చైనా అధికార యంత్రాంగం, మీడియా మోదీ, జిన్‌పింగ్‌ల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగేలా చొరవ తీసుకుంటోంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇరు దేశాలు కీలకంగా వ్యవహరించాలని దీనిపై ఇరువురు నేతలు దృష్టిసారిస్తారని పేర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న రక్షణాత్మక ధోరణులు, అమెరికా ఫస్ట్ విధానానికి వ్యతిరేకంగా భారత్ కోరుతున్న సరళీకృత ప్రపంచ ఆవిష్కరణకు బాసటగా నిలుస్తామనే సంకేతాలను చైనా పంపుతోంది. మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ ఇరువురు నేతల మధ్య కీలక అవగాహనకు దారితీస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు ఉమ్మడి అంశాలపై ఇరువురు నేతల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమవుతుందని చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషన్ విశ్వాసం వెలిబుచ్చారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య త్వరలో జరగనున్న భేటీ భారత్-చైనా సంబంధాల్లో నూతన ఒరవడికి నాంది పలుకుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. -
గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, జాతీయస్థాయి పరీక్షలు జేఈఈ, నీట్‌లలో గురుకుల విద్యార్థులకే ఎక్కువ సీట్లు రావాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం గురుకుల సొసైటీల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. గురుకులాలన్నింటిలో ఉమ్మడి పరీక్షావిధానం, కామన్ మెను, మంచి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లోని గురుకులాల్లో స్థానికులకు కొంత ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ప్లాన్ చెయ్యాలని, వేసవి సెలవుల్లో ప్రతి విద్యాలయంలో వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. కిరాయి భవనాలకు మరమ్మత్తులు చేయించి తగిన వసతులు కల్పించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న అమ్మాయిలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని, విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలన్నారు. ప్రతి గురుకులంలో ఏఎన్ఎం, పీఈటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. -
ఆహ్వానించలేదా లేక..వీరే దూరంగా ఉన్నారా...
టీఆర్ఎస్లో ప్రాధాన్యత సమస్య సాక్షి ప్రతినిధి, వరంగల్ : తండాలకు పంచాయతీ హోదా కల్పించడంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ వర్గం వారు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు లంబాడీ వర్గం ప్రజాప్రతినిధులు, ముఖ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు సైతం తెలిపారు. అధికార పార్టీకి చెందిన లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి చందులాల్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధిష్టానమే వీరిద్దరికీ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు కార్యక్రమానికి ఆహ్వానించలేదా... వీరే దూరంగా ఉన్నారా.. అనే అంశంపై అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉంది. ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయిన అన్ని నియోజక వర్గాల్లో లంబాడీ వర్గం వారే గెలిచారు. మహబూబాబాద్ ఎంపీగా అజ్మీరా సీతారాంనాయక్, ములుగు ఎమ్మెల్యేగా ఎ.చందులాల్, డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా బి.శంకర్‌నాయక్ గత ఎన్నికల్లో గెలిచారు. తండాలను పంచాయతీలుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ వర్గం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికార పార్టీ ముఖ్యులు వెళ్లారు. స్వయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజ్మీరా చందులాల్ ఈ కార్యక్రమంలో లేకపోవడం ములుగు నియోజకవర్గంలో పెద్ద అంశంగా మారింది. అనారోగ్య సమస్యల వల్ల కొంత కాలంగా చందూలాల్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల పరిస్థితిలో మార్పు రాగా.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో తండాలను పంచాయతీలుగా గుర్తిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న వేళ గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ బయటకు రాకపోవడం చర్చకు దారితీసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దూరంగా ఉండడం... ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత హాజరుకావడం ఆసక్తి కలిగిస్తోంది. వర్గ పోరు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్టీ కేటగిరి అసెంబ్లీ నియోజవర్గాలలో వర్గపోరు కొనసాగుతోంది. ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్‌కు, ఎంపీ సీతారాంనాయక్ వర్గాల మధ్య పొసగడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సీతారాంనాయక్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఇక్కడ చందూలాల్ వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. వీరి మధ్య వర్గపోరు కొన్నిసార్లు బహిరంగంగానే సాగి.. ఫ్లెక్సీల చించివేతల వరకు వెళ్లింది. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు, ఎంపీ సీతారాంనాయక్‌కు ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎంపీ సీతారాంనాయక్ సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలతో శంకర్‌నాయక్ వర్గంలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ సెగ్మెంట్లో సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. మరోవైపు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత వర్గానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వర్గానికి మధ్య ఇదే పరిస్థితి ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్‌కు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్‌కు మధ్య రాజకీయంగా పొసగడంలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దగ్గర జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు లేకపోవడం ఆసక్తిని పెంచుతోంది. టీఆర్ఎస్ అధిష్టానమే వీరిద్దరి ప్రాధాన్యత తగ్గించిందా.. లేక వీరిద్దరే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ రెండు అంశాలలో ఏది జరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంపై ఇప్పుటి నుంచే ఆసక్తికర అంచనాలు మొదలయ్యాయి. -
రాజకీయం చేయకుండా పరిష్కరించండి
సాక్షి, ముంబై: రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు మంత్రి గిరీశ్ మహాజన్ రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి మహాజన్‌కు వివరించారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటిని రాజకీయం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. -
ఈ సారైనా.. చర్చిస్తారా?
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చ జరిగలేదు. ఈసారి జరిగే సమావేశం ఏదైనా ప్రతిఫలం ఇస్తుందా.. లేక ఎప్పటిలాగే రచ్చ చేసి ఎవరిదారిన వారు పోతారా.. అనేది వేచి చూడాల్సిందే. జెడ్పీ పాలక మండలి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు 13 సమావేశాలు జరిగాయి. ఏ సమావేశంలో కూడా రాజకీయ రచ్చ తప్పి స్తే ప్రజా అవసరాలు, సమస్యలపై చర్చ ఏ మాత్రం జరగకపోవడం గమనార్హం. 6 జిల్లాలో 182 అంశాలు మొత్తం ఆరు జిల్లాలకు చెందిన 182 అంశాలపై అధికారులు ఎజెండా తయారు చేశా రు. ఇందులో 38 శాఖలకు చెందిన ఎజెం డా కాపీలు జిల్లా పరిషత్‌కు పంపలేదు. గత సమావేశంలో చర్చించిన అంశాలు పరి ష్కారం కావనే అభిప్రాయం సభ్యుల్లో ఉం డగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కావడం లే దు. దీంతో జెడ్పీటీసీ సభ్యులు స మావేశాని కి హాజరయ్యేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ క్రమం లో సమావేశాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చర్చకు రాని ఎజెండాలు... పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి ఎజెండాలోని అంశాలు ఎన్నడూ చర్చకు రాలేదు. ఒక వేళ జరిగినా రెండు, మూడు ఎజెండాలపై మాత్రమే ఎవరైనా మాట్లాడతారు. ఎప్పటికీ తాగునీటి సమస్య (ఆర్డ బ్ల్యూఎస్), వ్యవసాయం, ఉపాధి హామీ (డీఆర్డీఓ) తప్పితే మరో శాఖ మీద చర్చే జరగలేదు. ఈ సారి 182 అంశాల ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 38 శాఖల ప్రగతి నివేదికలను జెడ్పీ అధికారుల కు ఆయా శా ఖ అధికారులు ఇంకా సమర్పించనేలేదు. ఉ మ్మడి జిల్లా ఉన్నప్పుడు 68 ఎజెండాలు ఉం టేవి. అప్పుడే మూడుకు మించి అంశాలపై చర్చ జరుగలేదు. కొత్త జిల్లాల ఏర్పడిన నేపథ్యంలో 182 అంశాల ఎజెండా జిల్లా పరిషత్ ముందు ఉంది. ఇందులో ఎన్ని అం శాలు చర్చకు వస్తాయో చూడాల్సి ఉంది. మొదటి ఎజెండాగా ఆర్‌డబ్లు్యఎస్ శాఖను పెట్టగా.. వ్యవసాయం, ఇరిగేషన్, డీఆర్డీ, ఎస్సీ సంక్షేమ శాఖలు ఆ తర్వాత ఉన్నాయి. కొత్త పంచాయతీలపై ప్రశ్నిస్తారా? ప్రభుత్వం ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామపంచాయతీలను ఏ ర్పాటు చేసే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. 500 జనాభా ఉన్న గ్రామపంచాయతీల ప్రతిపాదనలను అధికారులు సి ద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తమ గ్రా మాన్ని పంచాయతీగా మార్చాలని, లేక వద్ద ట సభ్యులు పట్టు బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీతో సహా అందరు సభ్యులు నిధుల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇదే కారణంతో శనివారం జరగనున్న సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనవసర చర్చలు జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇప్పటిదాక 13 జెడ్పీ సర్వసభ్య సమావేశాలు కొనసాగాయి. గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన జరిగిన జెడ్పీ సమావేశం మొత్తం రచ్చరచ్చగా జరిగింది. జెడ్పీటీసీ సభ్యులకు తెలియకుండా నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సభ్యుల ఆందోళన చేపట్టారు. అది కాస్తా ఎమ్మెల్యేల ప్రొటోకాల్ రగడకు దారి తీసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య కూడా వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే సభను ముగించారు. ఇలాగే ప్రతి సభలో ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ప్రతి పక్ష పార్టీ, అధికార పక్ష పార్టీలకు మధ్య వాదోపవాదాలు సర్వసాధారణమయ్యాయి. ఉన్నది మూడే సమావేశాలు జెడ్పీ సమావేశాలు ఇక మూడే ఉన్నాయి.. ఇన్నిరోజులు జరిగిన సమావేశాల్లో ఏ సమస్యా పరిష్కారం కాలేదు. నిధులు లేక జెడ్పీకి వెళ్లలేక పోతున్నాం. ప్రతి మూన్నెళ్లకోసారి సభ నిర్వహించాలని కోరినా నిర్వహించలేని పరిస్థితి నెలకుంది. సభ నిర్వహణ కూడా గందరగోళంగా మారుతోంది. – శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, మక్తల్ నిధులు కేటాయించాలి జిల్లా పరిషత్‌కు పూర్వ వైభవం రావాలంటే అధిక నిధులను కేటాయించాలి. తాము ఎన్నికైన మండలంలో అభివృద్ధి పనులు చేపడతామం. నిధులు లేక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాం. – రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు, ఖిల్లాఘనపూర్ జెడ్పీని బలోపేతం చేస్తాం... జిల్లా పరిషత్‌ను బలోపేతం చేస్తాం. త్వరలో ప్రభుత్వం జెడ్పీకి అధిక నిధులను కేటాయించనుంది. జెడ్పీటీసీల గౌరవం పెంచే విధంగా కృషి చేస్తాం. జిల్లా పరిషత్ సమావేశాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. పక్షపాత వైఖరి లేకుండా అందరికి సమాన అవకాశం కల్పిస్తాం. – బండారి భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ -
బ్యాంకుల దుస్థితి యూపీఏ నిర్వాకమే
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రాని బాకీలు పేరుకుపోవడానికి యూపీఏ సర్కారే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 2జీ, బొగ్గు, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణాల కంటే మించి ఎన్పీఏ స్కామ్‌కు యూపీఏ తెగబడిందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణాలు ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తెచ్చిందన్నారు. పరిశ్రమ సంస్థ ఫిక్కీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ గత యూపీఏ హయాంలో ‘ఆర్థికవేత్తలు’ మనకు ఎన్పీఏల సమస్యను అప్పగించారని పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంలను ఉదహరించారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతాలు, యువతకు రుణాలు, అందుబాటు గృహాల వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పరిశ్రమ సంస్థలు ఎప్పటినుంచో కోరుతున్న జీఎస్టీని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటి లాభాలను ప్రజలకు మళ్లించేలా యాంటీ-ప్రాఫిటీరింగ్ వంటి చర్యలు చేపట్టిందని చెప్పారు. రక్షణ, ఆర్థిక సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా కీలక రంగాల్లో సమూల సంస్కరణలను ప్రవేశపెట్టామన్నారు. ప్రజల ఆకాంక్షలు,అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందిస్తున్నదన్నారు. -
పార్టీ పనితీరుపై అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ: రెండు రోజులపాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పలు రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, కీలక నేతలతో భేటీ నిర్వహించారు. పార్టీ పనితీరుపై సమీక్షించారు. గత ఏడాది కాలంలో పార్టీ విస్తరణ, కార్యవర్గ సమావేశాల్లో సోమవారం చర్చించాల్సిన అంశాలపై వారితో షా మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడం కోసం మొత్తం 4 లక్షల మంది కార్యకర్తలు 4,100 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టారని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు 25 నుంచి జరుగుతున్న బీజేపీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను...ఆయన జయంతి అయిన సోమవారమే కార్యవర్గ సమావేశాల్లో ముగించనున్నారు. ఉపాధ్యాయ శతజయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ ఏడాది కాలాన్ని పేదల సంక్షేమానికి అంకితమిచ్చిందని భూపేంద్ర అన్నారు. అమిత్ షా ఇటీవలి దేశవ్యాప్త పర్యటన అంశాలు కూడా ఆదివారం నాటి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. స్వచ్ఛ భారత్, నవ భారతం తదితర కార్యక్రమాలను కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించారు. సోమవారం జరగనున్న విస్తృత కార్యవర్గ సమావేశానికి 337 మంది ఎంపీలు, 1,400 మంది ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు మొత్తం కలిపి 2 వేల మందికి పైగానే హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పడిపోవడం, నల్లధనంపై యుద్ధం అంటూ తీసుకొచ్చిన నోట్లరద్దు ప్రభావం చూపకపోవడం సహా పలు ప్రభుత్వ వైఫల్యాలపై ఇటీవలి కాలంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విమర్శలకు సమాధానమిస్తూ, తమ ప్రభుత్వ విజయాలను చాటు తూ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. త్వరలో రెండో దశ శిక్షణ బీజేపీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు వివిధ అంశాల్లో శిక్షణనిచ్చే రెండో దశ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరళీధర్ రావు తెలిపారు. పంచాయతీ, పురపాలక సంఘాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు పార్టీ శిక్షణనివ్వనుందని చెప్పారు. -
నేటి నుంచి బీజేపీ కార్యవర్గ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటుసాగే ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ తమ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు ఎజెండాను ప్రకటించే వీలుంది. ఇవి విస్తృత కార్యవర్గ సమావేశాలనీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పలు రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, 337 మంది ఎంపీలు, 1,400 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 2,000 మందికి పైగా నాయకులు పాల్గొంటారని బీజేపీ శ్రేణులు చెప్పాయి. చివరిరోజైన సోమవారం మోదీ ప్రసంగిస్తారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2 శాతం పడిపోవడంతో ప్రతిపక్షాలు మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రోహింగ్యాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. -
30లక్షల మందితో మహాసభ
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : ఎస్సీ వర్గీకరణ కోసం 23ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు గాలి యాదయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాదిగ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. యాద య్య మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టాలని నవంబర్ 20న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్లో 30లక్ష ల మంది మాదిగలతో ధర్మయుద్ధ మహా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభ నిర్వహణలో భాగంగా ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు అంబేద్కర్ కళాభవన్‌లో సమాయత్త సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ రానున్నారని అన్నారు. సమావేశంలో వెంకటేష్ మాస్టర్, సువార్తమ్మ, ఎ.రాములు, పి.చెన్నయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు టీయూడబ్ల్యూజే సమావేశం
న్యూశాయంపేట : ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఏర్పాటుచేసినట్లు జిల్లా కన్వీనర్ తుమ్మ శ్రీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ప్రారం¿ý మయ్యే ఈ సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ హాజరవుతారని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు జిల్లా నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులు హాజరుకావాలని కోరారు. -
గవర్నర్ తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఆయుత చండీయాగంపై ఆయన గవర్నర్ తో చర్చించారు. డిసెంబర్ లో జరిగే చండీయాగానికి రావాలని ముఖ్యమంత్రి గవర్నర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.