గురుకుల సొసైటీ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, జాతీయస్థాయి పరీక్షలు జేఈఈ, నీట్‌లలో గురుకుల విద్యార్థులకే ఎక్కువ సీట్లు రావాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం గురుకుల సొసైటీల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. గురుకులాలన్నింటిలో ఉమ్మడి పరీక్షావిధానం, కామన్ మెను, మంచి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గాల్లోని గురుకులాల్లో స్థానికులకు కొంత ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ప్లాన్ చెయ్యాలని, వేసవి సెలవుల్లో ప్రతి విద్యాలయంలో వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. కిరాయి భవనాలకు మరమ్మత్తులు చేయించి తగిన వసతులు కల్పించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న అమ్మాయిలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని, విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలన్నారు. ప్రతి గురుకులంలో ఏఎన్ఎం, పీఈటీ తప్పనిసరిగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment