హైదరాబాద్ : ఈ నెల 13న ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ కారణంగా ఇంటర్ విద్యార్థులు నష్టపోతారని, కాబట్టి బంద్‌ను వాయిదా వేసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో బంద్ నిర్వహించడం సరికాదని, దీనివల్ల ఇంటర్ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ 13న జరగాల్సిన ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షడు మందా కృష్ణ మాదిగ ఈ నెల 13న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ వల్ల ఇంటర్ పరీక్షలకు ఆటంకం కలుగవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment