bundh call
-
టీడీపీ లీడర్లకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వార్నింగ్
-
5న విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలి
ఖమ్మంసహకారనగర్ : పాఠశాలల్లో, ఇంటర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 5న నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌కు అన్ని వర్గాలవారు సహకరించి జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం అని చెప్పిన ప్రభుత్వం వాటిని మూసి వేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. సరైన తరగతి గదులు లేకపోవడంతో పాటు కనీసం మరుగుదొడ్లు కూడా అనేక పాఠశాలల్లో లేవన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఇటికాల రామకృష్ణ, నాయకులు లక్ష్మణ్, గోపి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ మృతి
సాక్షి, సుక్మా : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జేగురుకోండ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్పి మీనా తెలిపిన వివరాల ప్రకారం.. తమేలవాడ అటవీ ప్రాతంలో పోలీస్ కోబ్ర బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులే లక్ష్యంగా ఈఈడీ మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్‌ను జగదల్పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. రాజనంద్‌గావ్ జిల్లాలోని మాన్ పూరహల్ ప్రాంతంలో వెదురు డిపోను కూడా మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో సూమారు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. బీజాపూర్ జిల్లా కోహకి-కొర్‌కట్టా రహదారులపై చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా చేపట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని పోస్టర్లను రోడ్డుపై ప్రదర్శించారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఆరు రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు నేడు పిలుపునిచ్చారు. -
హై అలర్ట్...
మక్కువ : మావోయిస్టులు ఆరు రాష్ట్రాల్లో శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో పది మంది మావోయిస్టులు మృతి చెందడంతో నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌యంత్రాంగం ఏజెన్సీ పోలీస్స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మార్చిలో ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్ గుమండి పంచాయతీ (ఏఓబీ) సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే గత నెల 22న మహారాష్ట్ర రాష్ట్రం గచ్చిరోలి సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు కన్నుమూశారు. అయితే రెండు ఎన్కౌంటర్లలో పదిమంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రతీకార చర్యగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలాంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టులు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో విధ్వంసక చర్యలు జరిగే అవకాశం ఉంటుందని పోలీస్‌వర్గాలు భావిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నందున వారు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పోలీసులు సరిహద్దులో నిఘా పెంచారు. అప్రమత్తం బంద్ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఓఎస్డీ విక్రాంత్ పాటిల్ ఏజెన్సీ పోలీస్స్టేషన్లను సందర్శిస్తూ పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అధి కారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
‘కావేరి’పోరు ఉధృతం; 5న రాష్ట్ర బంద్
చెన్నై: కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు(సీఎంబీ) ఏర్పాటును డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఏప్రిల్ 5న రాష్ట్ర బంద్‌కు పిలుపినిచ్చాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం జరిగిన విపక్షపార్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరిన స్టాలిన్.. పోరాటంలో కలిసిరావాల్సిందిగా అధికార పక్షం ఏఐఏడీఎంకేను కూడా కోరారు. భేటీ అనంతరం మెరుపు ధర్నాకు దిగిన స్టాలిన్, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీకి నల్లజెండాలతో..: ‘‘సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరి బోర్డును ఏర్పాటుచేయడంలో కేంద్ర సర్కార్ విఫలమైంది. ఏప్రిల్ 15న ప్రధాని మోదీ తమిళనాడుకు రానున్నవేళ నిరసనలను ఇంకా ఉధృతం చేస్తాం. మోదీకి, ఇక్కడి ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపి నిరసన తెలుపుతాం’’ అని స్టాలిన్ చెప్పారు. -
ఇంటర్ విద్యార్థులు నష్టపోతారు
హైదరాబాద్ : ఈ నెల 13న ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ కారణంగా ఇంటర్ విద్యార్థులు నష్టపోతారని, కాబట్టి బంద్‌ను వాయిదా వేసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో బంద్ నిర్వహించడం సరికాదని, దీనివల్ల ఇంటర్ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ 13న జరగాల్సిన ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షడు మందా కృష్ణ మాదిగ ఈ నెల 13న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ వల్ల ఇంటర్ పరీక్షలకు ఆటంకం కలుగవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
మంత్రి గంటా శ్రీనివాస్ రావును బర్త్ రఫ్ చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్ధుల ఆత్మహత్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఈ నెల 16న కార్పోరెట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రటనను విడుదల చేసింది. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలోని కార్పోరేట్ విద్యాసంస్థల్లో అనేక మంది విద్యార్ధినీ, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మండిపడ్డారు. గడిచిన రెండేళ్లలో కేవలం శ్రీచైతన్య, నారయణ వంటి కార్పొరేట్ కాలేజీల్లోనే అధికారిక లెక్కల ప్రకారం 38 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం తూతూ మంత్రంగా హడావుడి చేయటం తప్ప నివారణ చర్యలు చేపట్టలేదని ఆయన ధ్వజమెత్తారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ విద్యాసంస్థలైనందుకు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన వియ్యకుండైనందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న సంఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనుమతి లేని 158 కాలేజీ హాస్టల్లను గుర్తించమన్నారని, అనుమతి లేకుండా కాలేజీలు నడుస్తుంటే, ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వం ఏం చేస్తుందని సలాంబాబు ప్రశ్నించారు. వెంటనే మంత్రి గంటాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చక్రపాణి కమిటీ సూచనలను సత్వరమే అమలు చేసి, మరిన్ని విద్యా కుసుమాలు నేలరాలకుండా కాపాడాలని కోరారు. -
నేడు యాదాద్రి బంద్..
యాదాద్రి: ఆటో డ్రైవర్లకు మద్దతుగా యాదాద్రి బంద్ కొనసాగుతుంది. యాదగిరి గుట్టపైకి ఆర్టీసీ బస్సులు నడపవద్దని రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్లు రాస్తారోక జరిపారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు కూడా. ఈ సందర్భంగా పోలీసులు ఆటో కార్మికులను చెదరగొట్టి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు యాదగిరి గుట్ట బంద్‌కు పిలుపునిచ్చారు. దుకాణదారులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.