నేడు యాదాద్రి బంద్‌.. | Today Yadadri bundh | Sakshi
Sakshi News home page

నేడు యాదాద్రి బంద్‌..

Published Tue, Aug 1 2017 8:51 AM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM

Today Yadadri bundh

యాదాద్రి: ఆటో డ్రైవర్లకు మద్దతుగా యాదాద్రి బంద్‌ కొనసాగుతుంది. యాదగిరి గుట్టపైకి ఆర్టీసీ బస్సులు నడపవద్దని రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్లు రాస్తారోక జరిపారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు కూడా. ఈ సందర్భంగా పోలీసులు ఆటో కార్మికులను చెదరగొట్టి వారిపై కేసులు నమోదు చేశారు.
 
ఈ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో డ్రైవర్లు యాదగిరి గుట్ట బంద్‌కు పిలుపునిచ్చారు. దుకాణదారులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement