చెన్నై: కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు(సీఎంబీ) ఏర్పాటును డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఏప్రిల్ 5న రాష్ట్ర బంద్‌కు పిలుపినిచ్చాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం జరిగిన విపక్షపార్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరిన స్టాలిన్.. పోరాటంలో కలిసిరావాల్సిందిగా అధికార పక్షం ఏఐఏడీఎంకేను కూడా కోరారు. భేటీ అనంతరం మెరుపు ధర్నాకు దిగిన స్టాలిన్, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మోదీకి నల్లజెండాలతో..: ‘‘సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరి బోర్డును ఏర్పాటుచేయడంలో కేంద్ర సర్కార్ విఫలమైంది. ఏప్రిల్ 15న ప్రధాని మోదీ తమిళనాడుకు రానున్నవేళ నిరసనలను ఇంకా ఉధృతం చేస్తాం. మోదీకి, ఇక్కడి ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపి నిరసన తెలుపుతాం’’ అని స్టాలిన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment