చెన్నై: డీఎంకే నేత సాధైయ్ సాధిక్ బీజేపీ నేతలుగా మారిన నటిమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నటి ఖుష్బు సుందర్ చాలా సీరియస్ అయ్యారు. ఇంతా దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. స్టాలిన్ తనకు ఈ విషయంలో అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు.
అలాంటి నాయకుడిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. ఆ నాయకుడుపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని, తన పరువు, గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతానని గట్టిగా నొక్కి చెప్పారు. ఖుష్బు మహారాష్ట్ర చీఫ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రీయ సూలేను రాజకీయాలు విడిచిపెట్టి వంటగదిలో పని చేయమంటూ విమర్శించిన సందర్భం గురించి ప్రస్తావిస్తూ...తాను ఆ సమయంలో సుప్రీయకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
మా పార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సీఎం స్టాలిన్ ఇలానే మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఆ నాయకుడు వ్యాఖ్యలను చాలా వ్యక్తిగతం తీసుకున్నానిన చెప్పారు. ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఆ నాయకుడు చాలా దిగజారిపోయాడన్నారు. తాను తన ఇద్దరూ కూతుళ్లకు రోల మోడల్ ఉండాలనుకున్నాను. ఇప్పుడూ నాకూతుళ్లు ఈ విషయమై నన్ను కచ్చితంగా ప్రశ్నిస్తారు అని ఆవేదనగా చెప్పారు. ఐతే ఈ విషయమై ఖుష్బుకి డీఎంకే నేత కనిమొళి క్షమాపణలు చెప్పిన ఒక రోజు తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment