Kaveri River Water Dispute
-
ఐదు రోజులు సెలవులు.. అర్ధరాత్రైనా ఇంటికి చేరుకోని ధైన్యం
బెంగళూరు: వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తపబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు. ఐదు రోజులు.. ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు ఉంటుంది. కర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదీ చదవండి: అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు -
రెండు రాష్ట్రాల మధ్య నీటి మంటలు సార్!.. ముదురుతున్న కావేరి వివాదం!
రెండు రాష్ట్రాల మధ్య నీటి మంటలు సార్!.. ముదురుతున్న కావేరి వివాదం! -
ఢిల్లీ చేరనున్న ‘డ్యాం’ పంచాయితీ..!
సాక్షి, చెన్నై: కావేరి తీరంలోని మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన డ్యాం వ్యవహారం ఢిల్లీకి చేరనుంది. అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దురై మురుగన్ ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్యాం నిర్మాణ ప్రయత్నాలను వీడాలని కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం లేఖ రాశారు. డ్యాం నిర్మాణానికి అడ్డుచొప్పొద్దని కోరుతూ సీఎం స్టాలిన్‌కు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. డ్యాం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు కర్ణాటకలోని తమ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించబోతున్న సంకేతాలతో ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసి డ్యాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వ కూడదని ఒత్తిడి తెచ్చేందుకు నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. మంగళవారం ఈ బృందం కేంద్ర మంత్రితో భేటీ కానుంది. కావేరి జల వివాదం, డ్యాం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పట్టుబట్టడమే కాకుండా, మార్కండేయ నదిలో కర్ణాటక నిర్మించిన ఆనకట్ట తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే సీఎం స్టాలిన్ తరఫున కేంద్ర మంత్రికి లేఖ సమరి్పంచనున్నారు. యడ్డీకి లేఖాస్త్రం తనకు యడ్యూరప్ప రాసిన లేఖకు సమాధానంగా సీఎం స్టాలిన్ ఆదివారం లేఖాస్త్రం సంధించారు. అందులో కావేరి జల వివాదం, కోర్టు తీర్పు, నీటి పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో సాగుతున్న కావేరి పథకాలను గుర్తు చేస్తూ, ఈ పథకాల కారణంగా తమ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని మేఘదాతులో నిర్మించతలపెట్టిన డ్యాం కారణంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్ప మేరకు సరిహద్దులోకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరాల్సి ఉందన్నారు. తమిళ రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేయ వద్దని కోరారు. బెంగళూరుకు నీటి అవసరాల పేరిట ఈ డ్యాం నిర్మాణాలు సాగడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మెరుగు, కొనసాగింపు లక్ష్యంగా ఈ డ్యాం నిర్మాణ ప్రయత్నాన్ని వీడాలని కోరారు. ఇదిలా ఉండగా మార్కండేయ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కృష్ణగిరిలో రైతులు నిరసన తెలపనున్నారు. -
రానున్నవి జలయుద్ధాలే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశం మున్నెన్నడు లేని విధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. కోట్లాది మంది ప్రజల జీవితాలకు, వారి జీవనాధారాలకు ముప్పు పొంచి ఉంది’ అంటూ కేంద్ర ప్రభుత్వ మేధావుల సంఘం ‘నీతి ఆయోగ్’ వారం రోజుల క్రితం ఓ నివేదికను విడుదల చేసింది. భారత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నీతి ఆయోగ్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న నీటి సంక్షోభం గురించి అనేక దేశాలు గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోని నీతి ఆయోగ్ ఇప్పుడు మొదటి సారిగా తన గళం విప్పింది. 2020 నాటికి దేశంలో పచ్చదనం పరుచుకున్న బెంగళూరు సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు అంతరించి పోతాయని, దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు నీటి కోసం కటకటలాడుతారని నీతి ఆయోగ్ ఆ నివేదికలో హెచ్చరించింది. కేవలం నీటి కొరత కారణంగా దేశంలో ఏటా రెండు లక్షల మంది ప్రజలు మరణిస్తారని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరో రెండు, మూడేళ్లలో దేశంలోని 75 శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీళ్లు అందవని, గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుందని కూడా హెచ్చరించింది. అందుబాటులో ఉండే 70 శాతం నీళ్లు కూడా కలుషతమవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే మన భారత స్వచ్ఛమైన నీరు కలిగిన 122 దేశాల్లో 120వ స్థానంలో ఉంది. నీటి సంక్షోభం కారణంగా ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నలుగుతున్న కావేరీ జలాల వివాదం లాంటి వివాదాలు వివిధ రాష్ట్రాల మధ్య కనీసం ఏడు ఏర్పడతాయని, రాష్ట్రాల మధ్య జల యుద్ధాలే జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నీటి సంక్షోభమే ప్రధాన అంశం కావచ్చని కూడా వారు భావిస్తున్నారు. భారత్‌కు ఇంతటి నీటి సంక్షోభం ఎందుకు వచ్చింది? ఇందుకు కారణాలేమిటీ? గత ప్రభుత్వాలుగానీ, నేటి ప్రభుత్వంగానీ నివారణ చర్యలు తీసుకోలేదా? దేశంలో వ్యవసాయం కోసం 70 శాతం జల వనరులను యధేశ్చగా వినియోగించడం, అందుకోసం లెక్కలేనన్ని డ్యామ్‌లు నిర్మించడం, భూగర్భ జలాలను దుర్వినియోగం చేయడం, నీరు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోక పోవడం, కలుషితమైన నీటిని శుద్ధి చేయడం పట్ల శ్రద్ధ చూపకపోవడం నీటి సంక్షోభానికి ప్రత్యక్ష కారణాలుగా నిపుణులు తెలియజేస్తున్నారు. చెట్లను నరికివేయడం, పర్యావరణ పరిస్థితులను పట్టించుకోకపోవడం పరోక్ష కారణాలని వారు చెబుతున్నారు. దేశంలో జల వన రుల అభివద్ధి కోసం వేసిన వివిధ కమిటీలు చేసిన సిఫార్సులను ఏ ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోలేదని ఆ కమిటీలకు సారధ్యం వíß ంచిన నిపుణులు మిహిర్ షా తెలిపారు. నిర్మించిన డ్యామ్లకన్నా నిర్మాణంలో ఆగిపోయిన డ్యామ్‌ల వల్ల జల వనరులకు ఎక్కువ నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు. 2018–2019 ఆర్థిక సంవత్సరం వ్యవసాయ బడ్జెట్‌కన్నా ఏడింతలు ఎక్కువ అంటే, నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఇదే ఆర్థిక సంవత్సరంలో డ్యామ్‌ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నారని అన్నారు. నేడు దేశంలో అవసరంకన్నా ఆర్థిక అవినీతి కోసమే ఎక్కువ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆయన విమర్శించారు. అమెరికా, చైనా ప్రజలకన్నా భారతీయులు రెట్టింపు భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నారు. 2030 నాటికి భూగర్భ జలాల లభ్యతకన్నా డిమాండ్ రెట్టింపు ఉంటుందన్నది నిపుణుల అంచనా. దేశంలోని వివిధ నగరాల్లో రోడ్ల విస్తరణకు, ఇతర అభివద్ధి ప్రాజెక్టుల కోసం కోటానుకోట్ల చెట్లను నరికి వేశారు. ఇటీవలనే ఢిల్లీలో పర్యావరణవేత్తలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం క్వాటర్ల పునర్నిర్మాణం కోసం 14వేల పైచిలుకు చెట్లను నరికివేశారు. దేశంలో చార్ ధామ్‌గా ప్రసిద్ధి చెందిన భద్రీనాథ్, ద్వారక, పూరి, రామేళ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ నిర్మిస్తున్న జాతీయ రహదారి ‘చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన’కు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెల్సిందే. ఈ రోడ్డు నిర్మాణం వల్ల పర్యావరణానికి అంతులోని నష్టం జరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనికోసం అటవి ప్రాంతాల్లో కొన్ని శతకోట్ల చెట్లను నరికి వేయడంతోపాటు కోట్ల టన్నుల శకలాలను తీసుకొచ్చి అడవుల్లో, నదుల్లో పారబోస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. -
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
-
కావేరీ ఇష్యూ: కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
మధురై, తమిళనాడు : కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మధురైలోని శ్రీ మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవుడి దయతో ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు కురిస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ వ్యాఖ్యానించారు. కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని కుమారస్వామి తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కర్ణాటక డ్యామ్‌లలో ఇన్‌ఫ్లో పెరిగిందని పేర్కొన్నారు. ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వరుణుడు కరుణిస్తే.. కావేరీ జలాల యాజమాన్య సంస్థ, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ చివరి నాటికి తమిళనాడుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కాగా కాబినీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలన్న కుమారస్వామి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ‘మక్కల్ నీది మయ్యం పార్టీ’ వ్యవస్థాపకుడు కమల్ హసన్ తెలిపారు. ఈ మేరకు.. ‘ కాబినీ నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉంది. కావేరీ జలాల యాజమాన్య సంస్థ తన పనిని మొదలు పెట్టింది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి అంటూ కమల్ ట్వీట్ చేశారు. -
నేను ఏ తప్పూ చేయలేదు
న్యూఢిల్లీ/చెన్నై: కర్ణాటకలో ‘కాలా’ సినిమా విడుదలకు సహకరించాలనీ కన్నడిగులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. సినిమా చూడాలనుకునే వారిని దయచేసి అడ్డుకోవద్దు. మీ సహకారం కోరుతున్నా’ అని చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో కన్నడలో అర్థించారు. ‘నా సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే నేను కర్ణాటక ప్రభుత్వాన్ని కోరా. అందులో తప్పేమిటో నాకు తెలియదు. కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కానేకాదు. కాలా గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుండగా ఒక్క కర్ణాటకలోనే ఆపివేయటం మంచిదికాదు. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా విడుదల ప్రశాంతంగా జరిగేలా సీఎం కుమారస్వామి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’అని అన్నారు. రజనీకాంత్ హీరో, ఆయన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉన్న ‘కాలా’ గురువారం విడుదలకానున్న విషయం తెలిసిందే. కొనసాగుతున్న అనిశ్చితి సుప్రీంకోర్టుతోపాటు కర్ణాటక, మద్రాస్ హైకోర్టులు కాలా విడుదలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు ఇందుకు ముందే ప్రకటించాయి. కాలా సినిమా పోస్టర్లను చించి వేయడంతోపాటు రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. బెంగళూరులోని టౌన్‌హాల్ నుంచి ‘కాలా’ సినిమా ప్రదర్శించే థియేటర్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు కన్నడ సంఘాల కన్వీనర్ వాటాల్ నాగరాజ్ తెలిపారు. -
‘కాలా’కు ఊరట
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో, రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. పలు వాయిదాల తరువాత ఈ గురువారం విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కావేరి వివాదంలో రజనీ వ్యాఖ్యల కారణంగా వివాదం మొదలైంది. పలు కన్నడ సంస్థలు కాలా రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ ప్రకటలు చేశాయి. ఈ విషయంపై చిత్ర నిర్మాత ధనుష్.. కర్ణాటక హైకోర్డును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమా ప్రదర్శించేందుకు ముందుకు రాని థియేటర్ల యజమానులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. కానీ కాలా సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధమైన థియేటర్ల లిస్ట్ ప్రభుత్వానికి అందిస్తే వారు ఆ థియేటర్లకు రక్షణ కల్పిస్తారని కోర్టు వ్యాఖ్యనించింది. కోర్టు వ్యాఖ్యాలతో కర్ణాటకలో కాలా రిలీజ్‌కు మార్గం సుగమమైనట్టుగా భావిస్తున్నారు రజనీ ఫ్యాన్స్. జూన్ 7న కాలా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. -
సీఎం కుమారస్వామితో కమల్ భేటీ
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం భేటీ అయ్యారు. కావేరీ నదీజలాల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు కమల్ హాసన్ తెలిపారు. కావేరీ నదిజలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రితో కమల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ ‘కాలా’ సినిమాపై.. తాజాగా తూత్తుకుడిని సందర్శించిన రజనీకాంత్ కావేరీ నదీజలాలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారం రేపాయి. ఆయన కొత్త చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రజనీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కొంతమంది నిరసనకారులు ప్రకటించారు. కాగా కాలా విడుదలపై ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చ జరగలేదని కమల్ హాసన్ తెలిపారు. -
రజనీ వ్యాఖ్యలపై మండిపడ్డ కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాలతో పాటు కావేరీ జల వివాదంపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. కావేరీ జల వివాదంపై రజనీ చేసిన వ్యాఖ్యలను తాను స్వీకరించలేనన్నారు. కుమారస్వామి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రజనీకాంత్, తాను ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులం కాదన్నారు. సాధారణ పౌరుడిగా నేను రజనీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓసారి ఇక్కడికి వచ్చి రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిశీలించండి. మా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో గమనిస్తే రజనీకాంత్ తన మనసు మార్చుకుంటారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి మంత్రి మండలిపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుమారస్వామి చర్చించనున్నారు. రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం భేటీలో రజనీ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. బలపరీక్షకు 15 రోజులు గడువు ఇవ్వడం జోక్ అన్న రజనీ.. కావేరీ జలాల బోర్డును కర్ణాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ పర్యవేక్షణలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో రజనీ కర్ణాటకలో తమ పరిస్థితులు అర్థం చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. -
‘కావేరి’ ప్రణాళికను ఆపలేం
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళిక ఆమోదాన్ని వాయిదా వేయాలన్న కర్ణాటక అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రణాళికను తయారుచేయాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఆదేశించామనీ, రాష్ట్రాలకు ఈ విషయంతో సంబంధం లేదని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశానుసారం కావేరి జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై కర్ణాటక తరఫు న్యాయవాది దివాన్ తన వాదనలు వినిపిస్తూ ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. రాబోయే 15 ఏళ్ల వరకు ఈ నీటి పంపకాలు అమల్లో ఉంటాయి. కాబట్టి కొత్త ప్రభుత్వ సూచనలను నివేదించేందుకు జూలై తొలివారం వరకు సమయం అవసరం. అప్పటివరకు ముసాయిదాను ఆమోదించకండి’ అని ధర్మాసనాన్ని కోరారు. తమిళనాడు న్యాయవాది శేఖర్ కర్ణాటక అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై వరకు ఆగితే జూన్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల సంగతేమిటని ప్రశ్నించారు. కోర్టు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాలకు ఈ అంశంలో పాత్ర లేదనీ, ఫిబ్రవరి 16 నాటి తీర్పు ప్రకారం ప్రణాళికను కేంద్రం రూపొందిస్తే తాము ఆమోదిస్తామంది. కేంద్రానికి ఆ అధికారం వద్దు: భవిష్యత్తులో అవసరమైనప్పుడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వాటాను మార్చే అధికారాన్ని తనవద్దే పెట్టుకుంటూ కేంద్రం ఈ ముసాయిదాను తయారుచేసింది. దీనిపై తమిళనాడు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ నిబంధనను మార్చాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
అది కోర్టు ధిక్కారమే
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపకం ప్రణాళికను కేంద్రం ఇప్పటికీ రూపొందించకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 16న తాము తీర్పు ఇస్తే ఇప్పటివరకు నీటి పంపకాల ప్రణాళిక సిద్ధం కాలేదని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా గల ధర్మాసనం మండిపడింది. కోర్టు తీర్పును అనుసరించి నీటి పంపకాలపై ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ నెల 14న తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శిని న్యాయమూర్తులు ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు 2007లో చేసిన కావేరి నీటి కేటాయింపులను మారుస్తూ సుప్రీం ఫిబ్రవరి 16న తీర్పునివ్వడం తెలిసిందే. కేంద్రం వ్యవ హారం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందనీ, ఎవరో ఒకరిని జైలుకు పంపాలని తమిళనాడు తరఫున మంగళవారం వాదనలు వినిపించిన న్యాయవాది శేఖర్ నఫాడే కోర్టును కోరారు. తదుపరి విచారణ మే 14కు వాయిదా పడింది. -
సుప్రీంకు, కేంద్రానికిది అప్రతిష్టే!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేసే పరిస్థితిలో లేమని కర్ణాటక ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టు ముందు చేతులెత్తేసింది. కేంద్ర జల కమిషన్ ఆదేశాల మేరకు ఇదివరకే తమిళనాడుకు నీటిని విడుదల చేశామని, ఇప్పుడు అదనంగా నీటిని విడుదల చేయలేమని తేల్చింది. తమకు నాలుగు టీఎంసీల నీటిని కావేరి నుంచి విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కర్ణాటక సమాధానం ఇచ్చిన తీరు ఇది. తమిళనాడుకు కావేరి జలాల విడుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాని జలాల పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం వాటిని కేంద్రం ఖాతరు చేయక పోవడం తెల్సిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయలేక పోయామని కేంద్రం సమాధానం చెప్పుకుంది. అది వాస్తవం కాదని, ఇటీవలనే మోదీ ఆధ్వర్యంలో ఓ కేబినెట్ సమావేశం జరిగిన విషయం ఇటు కేంద్రానికి, అటు సుప్రీం కోర్టుకు తెలుసు. జలాల పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయడం కర్ణాటక రాష్ట్రానికి ఇష్టం లేదు. ఇష్టంలేని పనిచేయడం ద్వారా అక్కడి ఎన్నికల్లో విజయావకాశాలను ఎందుకు దెబ్బతీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిన్నకుండింది. ఈ విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరించే సుప్రీం కోర్టు కూడా కేంద్రం సమాధానంతో సంతప్తి పడినట్లు కనిపించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది సుప్రీం కోర్టు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఈ విషయంలో కేంద్రాన్ని మందలించకుండా, నాలుగు టీఎంసీలు కుదరకపోతే రెండు టీఎంసీలనైనా విడుదల చేయడంటూ కర్ణాటకను సుప్రీం కోర్టు కోరణం శోచనీయం. ఓ రాష్ట్రంలో సానుకూల ఫలితాల కోసం పాలనా వ్యవహరాలను పక్కన పెట్టడం, చట్టాన్ని అమలు చేయకపోవడం కేంద్రంపరంగా దారుణమైన పరిణామమే. -
కావేరి జల వివాదం: కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
కావేరి బోర్డు ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలు వివరిస్తూ మే 8 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కావేరి బోర్డును నియమించే బాధ్యత కేంద్రానిదేనని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. తమ ఆదేశాల మేరకు కావేరి జలాశయాల నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కార కేసుగా భావించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కోరుతామని హెచ్చరించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, విచారణను పోలింగ్ ముగిసే దాకా వాయిదా వేయాలని వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం పక్షపాత ధోరణితో సమాఖ్య విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపించింది. -
కావేరీ ఇష్యూ: సుప్రీం కోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కావేరీ జలాల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పిటిషన్‌పై విచారణ జరిపింది. ‘మే నెలకుగానూ కర్ణాటక ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ కేంద్రాన్ని కోర్టు నిలదీసింది. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సమాధానమిస్తూ.. ‘ డ్రాఫ్ట్‌కు కేబినెట్ ఆమోదం లభించలేదు. ప్రస్తుతం ప్రధాని, మంత్రులు కర్ణాటకలో ఉన్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్నారు. పైగా ఈ విషయంలో నిపుణుల నుంచి కాకుండా కర్ణాటక నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని కేంద్రం భావిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రుల నుంచి సలహాలు తీసుకోవాలని కేంద్రం యత్నిస్తోంది’ అని బదులిచ్చారు. మరో పది రోజుల గడువు ఇవ్వాలని కేంద్రం తరపున ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అంగీకరించలేదు. ‘ఎన్నికలతో మాకు సంబంధం లేదు. తక్షణమే విధివిధానాలపై స్పష్టత ఇవ్వండి. రాష్ట్రాలకు ఈ వ్యవహారంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణలో డ్రాఫ్ట్ వివరాలను సమర్పించండి’ అని సీజే.. అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం కావేరీ జలాలను రాజకీయం చేస్తోందని తమిళనాడు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం
సాక్షి, చెన్నై: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం తమిళనాడు పర్యటన సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి జరిగింది. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్ర అలసత్వానికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఆమె రాక విషయం తెలిసిన డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్ జంక్షన్ వద్ద కాన్వాయ్‌ను అడ్డగించి రచ్చ రచ్చ చేశారు. ఊహించని ఈ పరిణామంతో కేంద్ర మంత్రి ఖంగుతిన్నారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమె తన పర్యటనను కొనసాగించారు. ఇక దాడి విషయం తెలుసుకున్న కొందరు బీజేపీ కార్యకర్తలు.. డీఎంకే కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కావేరీ మేనేజ్మెంట్ బోర్డును కోరుతూ తమిళనాడు అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలను కూడా అడ్డుకున్నాయి. ఇక ఆందోళనలో భాగంగా ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లగా.. డీఎంకే తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. -
‘వివేకం’ హీరో అజిత్‌పై విశాల్ అసహనం..
సాక్షి, చెన్నై: తమిళ సినిమా స్టార్ అజిత్‌పై హీరో, తమిళ నిర్మాతల మండలి చైర్మన్ విశాల్ అసహనం వ్యక్తం చేశారు. గత నెలలో కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటుపై తమిళ సినిమా రంగం కేంద్రంపై మౌన పోరాట దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనల్లో అజిత్ పాల్గొనక పోవడంపై విశాల్ స్పందించారు. విశాల్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘అజిత్ ఎప్పుడూ అందుబాటులో ఉండడు’ అంటూ వ్యాఖ్యానించారు. అజిత్ వ్యవహారం ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. ‘ఒక అంశంపై నేను అజిత్‌ను కలవాల్సి ఉండగా, ఆయన పీఆర్ఓ సురేష్ చంద్రను సంప్రదించాను. కానీ అజిత్‌ని మాత్రం కలవలేపోయాన’ని విశాల్ వాపోయారు. ‘స్కూలు హెడ్ మాస్టారిలా సమావేశానికి అందరూ హాజరు కావాలని హుకుం జారీ చేయలేన’ని అన్నారు. కొన్ని వ్యవహరాలలో ఎవరికి వారు నైతికంగా జోక్యం చేసుకొని పాల్గొనాలని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా కొత్త కొత్త పోకడలతో నటీనటులంతా ప్రజలకు చేరువవుతున్న నేటి తరుణంలో.. అజిత్ అలాంటి వాటికి దూరంగా ఉండడం గమనార్హం. కాగా, గతంలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ సినిమా తారలపై ప్రభుత్వ ఒత్తిడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరి జల వివాదంపై పోరాడాలని సినిమా రంగంపై అనుచిత ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అజిత్ వ్యాఖ్యల్నిసూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సమర్థించారు. -
ఆయనే బతికుంటే..తోకాడించేవారా!
టీనగర్: తన భర్త వీరప్పన్ బతికి ఉండి ఉంటే కావేరి జలాల విషయంలో కర్ణాటక తోక తిప్పి ఉండేదా అని ముత్తులక్ష్మి వీరప్పన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. తంజావూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మన్‌కాకుం వీరతమిళర్ పేరమైప్పు ఆధ్వర్యంలో తంజావూరు జిల్లా కల్లనైలో ఈ నెల 30న భారీ ర్యాలీ జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ సంఘాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ధీరన్, ప్రస్తుత ఎమ్మెల్యేలు తనియరసు, కరుణాస్, తమీమున్ అన్సారీ పాల్గొననున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు విద్యుత్ సరఫరా చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ ఎన్నెల్సీ సంస్థ చైర్మన్ శరత్‌కుమార్‌ను కలువనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా రాష్ట్రానికి కావేరి జలాలను ఇవ్వకుండా కర్ణాటక వంచిస్తోందని ఆరోపించారు. కర్ణాటకకు విద్యుత్‌ను అందజేయకుండా ఆయనపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన భర్త బతికి ఉంటే ఒక్క క్యాసెట్ చాలని వ్యాఖ్యానించారు. గతంలో కర్ణాటక తమిళనాడుకు నీళ్లివ్వకుండా మారాం చేసిన సందర్భాల్లో తన భర్త వినూత్న పంథాను అనుసరించడం జరిగిందని, ఈ విషయం కొందరికే తెలుసని వివరించారు. రూ. 30 పెట్టి ఒక ఆడియో కేసెట్ కొనుగోలు చేసి, అందులో తన భర్త వీరప్పన్ కర్ణాటకకు హెచ్చరిక పంపేవారని, మరుక్షణమే నీళ్లు తమిళనాడుకు వచ్చిన సందర్భాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తన భర్త బతికి ఉంటే కర్ణాటక చర్యలను ఎండగట్టి తమిళనాడులోకి నీళ్లు రప్పించి ఉండేవారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక స్పందించకుండా ఉండి ఉంటే కేఆర్ఎస్ డ్యాంను బాంబులతో పేల్చి ఉండేవారని హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పును అమలుపరచాల్సిన బాధ్యత కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాలపై ఉందని అన్నారు. -
మరింత ఉధృతం
సాక్షి, చెన్నై : కావేరి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి డీఎంకే నిర్ణయించింది. ఈ విషయంగా చర్చించేందుకు ప్రతిపక్షాలను ఆహ్వానిస్తూ మళ్లీ అఖిల పక్షం సమావేశానికి స్టాలిన్ నిర్ణయించారు. ఈనెల 16న జరిగే సమావేశం మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక, కావేరి కోసం ఆత్మాహుతియత్నం చేసిన ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణ సురేష్ మరణించాడు.కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో పలు రూపాల్లో ఆందోళనలు సాగినా కేంద్రం నుంచి స్పందన కరువే. రాష్ట్ర ప్రభుత్వం సైతం మమా అనిపించే చర్యలతో ముందుకు సాగుతోంది. దీంతో తమ పోరును మరింత ఉధృతం చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం మరోమారు అఖిల పక్షం సమావేశానికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం పిలుపునిచ్చారు. 16వ తేదీ సాయంత్రం అన్నా అరివాలయం వేదికగా ఈ సమావేశం సాగనుంది. ఈ విషయంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, అఖిల పక్షం సమావేశంలో పోరు మరింత ఉధృతం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. అలాగే, 16వ తేదీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వ్యవహారంలో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వళ్లువర్‌కోట్టంలో ప్రతిపక్షాల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమానికి నిర్ణయించామన్నారు. కావేరి వ్యవహారంలో కేంద్రం చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోరు ఎంత ఉధృతం చేయడానికైనా తాను సిద్ధమేనని హెచ్చరించారు. అన్నింటా కాషాయం రంగును పులిమే రీతిలో కేంద్రం అడుగులు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. కాగా, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ చిత్తిరై ఒకటో తేదీన తమిళ కొత్త సంవత్సరం అని ప్రకటించడం శోచనీయమని విమర్శించారు. తై ఒకటో తేదీ తమిళ కొత్త సంవత్సరంగా అసెంబ్లీలో సైతం కరుణానిధి తీర్మానం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక, 16వ తేదీ తమిళ మానిల కాంగ్రెస్ సైతం కావేరి సాధన నినాదంతో భారీ ఆందోళన కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక, కావేరి వ్యవహారంలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగేందుకు డీఎంకే, కాంగ్రెస్‌లే కారణం అని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పట్లో ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన నాటకాల కారణంగా, ఇప్పుడు రైతన్నలు కావేరి కోసం అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉందని, తీర్పు అనుకూలంగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. శర్వణ సురేష్ మృతి కావేరి సాధన నినాదంతో ఎండీఎంకే నేత వైగో బంధువు శర్వణసురేష్(55) శుక్రవారం విరుదునగర్‌లో ఆత్మాహుతి యత్నం చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ సురేష్‌ను తొలుత విరుదునగర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మదురైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సురేష్ మరణించాడు. ఈ సమాచారంతో వైగో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సురేష్ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఇక, మీదట ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వేడుకున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం పేర్కొంటూ, కావేరి కోసం ఆత్మహత్యలు, ఆత్మాహుతుల జోలికి దయ చేసి వెళ్ల వద్దని వేడుకున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని, త్వరలో మంచి ప్రకటన చేస్తామన్నారు. -
మోదీ చెన్నై పర్యటన..యువకుడి ఆత్మాహుతి
-
మోదీ పర్యటన..చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది. చెన్నైలోని ఈరోడ్ కి చెందిన ధర్మలింగం... కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరాశకు లోనయ్యాడు. కావేరి బోర్డు ఏర్పాటుపై ప్రధాని స్పందికపోవడంతో మోదీ పర్యటన నిరసిస్తూ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇంటి గోడపై రాసి అనంతరం ధర్మలింగం ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతున్న యువకుడిని ఇరుగు పొరుగువారు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ సంఘటనతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసనకారులు ఆందోళనలకు దిగారు. -
నరేంద్ర మోదీకి కావేరీ సెగ
-
ప్రధాని మోదీకి కావేరీ సెగ
సాక్షి, చెన్నై : కావేరీ జలాలపై ఆందోళనకారుల నిరసనల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం చెన్నై చేరుకున్నారు. డిఫెన్స్ ఎక్స్పో 10వ ఎడిషన్‌ను ప్రారంభించేందుకు నగరానికి మోదీ రానుండటంతో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. విమానాశ్రయానికి సమీపంలోని అలందూర్ ప్రాంతంలో కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటును కోరుతూ నిరసనలు మిన్నంటాయి. కావేరీ జలాలపై ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు నిరసనల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎంకే, ఎండీఎంకే, ఇతర తమిళ సంఘాల నిరసనలతో ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. డిఫెన్స్ ఎక్స్పోను ప్రారంభించే తిరువదాంతి, అడయార్‌లో జరిగే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతుండగా ప్రత్యేక రూట్లో ప్రధాని కాన్వాయ్‌ను మళ్లిస్తారు. ఎస్పీజీకి అదనంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. -
రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. కడలూర్, ధర్మపురి, మెట్టూరు, విల్లుపురం ప్రాంతాల్లోనైతే ఆందోళనలు హోరెత్తాయి. బోర్డు ఏర్పాటుచేయమని సుప్రీంకోర్టు చెప్పినా వినిపించుకోకుండా మోదీ సర్కార్ ఒంటెత్తుపోకడ పోతున్నదని తమిళపార్టీలు ఆరోపించాయి. కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ రైల్‌రోకోకు పిలుపివ్వగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్దతు తెలిపింది. ఈ రెండు పార్టీలకుతోడు వందలాది సంఘాలు, వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. ఊహించని షాక్: రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, ఊహించని కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి. విల్లుపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. షాక్‌కు గురైన వ్యక్తి పేరు రంజిత్(32)గా గుర్తించారు. హైవోల్టేజ్ ధాటికి అతను మాడి మసైపోయాడని తొలుత వార్తలు వచ్చినా, అది నిజం కాదని వైద్యులు పేర్కొన్నారు. ‘‘హైటెన్షన్ వైర్లను అతను ముట్టుకోలేదు. కానీ అత్యంత సమీపానికి వెళ్లడంతో ఒక్కసారే షాక్ కొట్టి, మంటలు చెలరేగాయి. ఒక మోస్తారుకు మించి బాధితుడు గాయపడ్డాడని, ప్రాణాపాయం లేనప్పటికీ, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. -
తమిళనాడు రైల్‌రోకో ఆందోళనలో ఊహించని ఘటన
-
చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు తరలింపు
-
ఐపీఎల్-2018; చెన్నైకి భారీ షాక్
ముంబై/చెన్నై: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తమ జట్టు ఆటను సొంత గడ్డపై ఆస్వాదించే అవకాశాన్ని చైన్నై అభిమానులు కోల్పోయారు. అవును. కావేరీ నదీ జలాల వివాదం నానాటికీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2018 లో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో చోట నిర్వహించాలని సీఎస్కే యాజమాన్యం, బీసీసీఐలు నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన వెలువడింది. చైన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లు హైదరాబాద్ లేదా వైజాగ్‌కు తరలించే అవకాశం ఉంది. ఆటగాళ్లపైకి చెప్పులు.. రైలింజన్‌పై కరెట్ షాక్: కావేరీ మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడులోని అన్ని పార్టీలూ గడిచిన రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ ఆందోళనలు జరుగుతున్న క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమైంది. మంగళవారం నాటి చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌కు కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ మ్యాచ్‌ను నిర్వహించారు. అయినా కూడా చెన్నై ఆటగాళ్లపై ఆందోళనకారులు చెప్పులు, షూ విసిరి నిరసన తెలిపారు. ఇక బుధవారం తమిళ పార్టీలు చేపట్టిన రైల్‌రోకోలో ఓ ఉద్యమకారుడు అనూహ్యరీతిలో గాయపడ్డాడు. రైలింజన్ పైకెక్కి నిరసన తెలుపుతున్న యువకుడు.. హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. చేతులెత్తేసిన పోలీసులు.. వెనక్కి తగ్గిన బోర్డు: కావేరీ నిరసనలను పట్టించుకోకుండా పోలీసుల సాయంతో తొలి మ్యాచ్ నిర్వహించిన క్రికెట్ బోర్డుకు బుధవారం నాటికి మద్దతు కరువైంది. ఉద్యమం తీవ్రతరం కావడంతో మున్ముందు జరగబోయే మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని పోలీసు శాఖ చేతులెత్తేసింది. దీంతో పునరాలోచనలోపడ్డ సీఎస్కే యాజమాన్యం, బీసీసీఐలు చివరికి మ్యాచ్‌లను చెన్నై నుంచి తరలించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదా వైజాగ్‌లలో నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నా, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
ఐపీఎల్: దూసుకొచ్చిన చెప్పులు, నినాదాల హోరు
సాక్షి, చెన్నై: నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు కావేరి సెగ తగిలింది. కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు కోసం ఉధృతంగా ఆందోళనలు జరగుతున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించరాదంటూ ఆందోళనకారులు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు మైదానంలోకి చెప్పులు విసిరారు. కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పర్ టయర్ నుంచి మెయిన్ పెవిలియన్‌లోకి కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో మ్యాచ్‌లో ఆడని డు ప్లెసిస్, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడ్డేజా మైదానంలో పడిన చెప్పులకు బయటకు విసిరేశారు. స్టాండ్స్ నుంచి కూడా చెప్పులు దూసుకొచ్చాయి. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మరికొంతమంది ప్రేక్షకులు ఎర్రజెండాలను ప్రదర్శించారు. దీంతో వారిని కూడా పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. రెండేళ్ల తర్వాత చెన్నైలో సీఎస్కే మ్యాచ్ జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఒకవైపు కావేరి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దుచేయాలని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌చేశాయి. కనీసం మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఒకింత ఉత్కంఠ మధ్య చెన్నై-కోల్‌కతా మ్యాచ్ జరిగింది. ఎంపైర్లు ఆలస్యంగా రావడంతో టాస్ 15 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానం వద్ద ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలిపారు. వందలాది మంది నల్ల టీషర్టులు ధరించి.. కావేరీ బోర్డు కోసం నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు గాలిలోకి ఎగరవేశారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆందోళనకారుల్ని ఈడ్చుకెళ్లి బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. కావేరి ఆందోళనల నేపథ్యంలో మైదానానికి వెళ్లే రోడ్లన్నింటిలోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మైదానంలో కావేరి నిరసనలు చోటుచేసుకున్నాయి. పలువురు ప్రేక్షకులు మైదానంలో కావేరి నినాదాలతో హోరెత్తించారు. మైదానంలో చెప్పులు పడటం కొంత కలకలం రేపింది. -
ఐపీఎల్ మ్యాచ్‌లో పాములు వదులుతాం
సాక్షి, చైన్నై: ఐపీఎల్-11 సీజన్‌కు కావేరీ జలాల వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టబోతోంది. చెపాక్ స్టేడియంలో ఈరోజు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పలు రాజకీయ, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ మ్యాచ్‌లను నిర్వహిస్తే తమ నిరసన తెలియజేస్తామని కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దాదాపు 4 వేల మంది పోలీసులతో స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా పీఎంకే నేత వేల్మురుగన్ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమ మాట కాదని మ్యాచ్ నిర్వహించాలని చూస్తే స్టేడియంలోకి పాములను వదులుతామని ఆయన హెచ్చరించడం సంచలంగా మారింది. ఇప్పటికే ఆందోళనకారులు నల్లటి వస్త్రాలతో మ్యాచ్‌లకు హాజరై తమ నిరసన తెలియజేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే మ్యాచ్ నిర్వాహకులు మాత్రం నల్లటి వస్త్రాలు, రిస్ట్ బ్యాండ్స్, బ్యాడ్జెస్‌లతో వచ్చే అభిమానులను స్టేడియంలోకి అనుమతించబోమని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అభిమానులు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, హెల్మెట్స్, కెమెరాలు, గొడుగులు, బయటి ఫుడ్, మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏవస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు మీడియాకు తెలిపారు. భద్రతకు భరోసా: శుక్లా ఈరోజు జరిగే మ్యాచ్‌కు భద్రత కల్పిస్తామని తమిళనాడు ప్రభుత్వం, చెన్నై పోలీసులు హామీయిచ్చారని ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని కలిశానని ఆయన వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులకు ఆటగాళ్లకు గట్టి భద్రత కల్పిస్తామని వారు భరోసాయిచ్చినట్టు చెప్పారు. -
ఐపీఎల్ : నల్ల వస్త్రాలను అనుమతించేది లేదు.!
సాక్షి, చెన్నై : కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పలు రాజకీయ, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ మ్యాచ్‌లను నిర్వహిస్తే అడ్డుకోని తమ నిరసనను తెలియజేస్తామని కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య చెపాక్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహించి తీరుతామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆందోళనకారులు నల్లటి వస్త్రాలతో మ్యాచ్‌లకు హాజరై తమ నిరసన తెలియజేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే మ్యాచ్ నిర్వాహకులు మాత్రం నల్లటి వస్త్రాలు, రిస్ట్ బ్యాండ్స్, బ్యాడ్జెస్‌లతో వచ్చే అభిమానులను స్టేడియంలోకి అనుమతించబోమని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అభిమానులు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, హెల్మెట్స్, కెమెరాలు, గొడుగులు, బయటి ఫుడ్, మైదానంలోకి విసరడానికి అనువుగా ఉండే ఏవస్తువును అనుమతించేది లేదని చెన్నై పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రతిస్టాండ్‌లో ప్రయివేట్ సెక్కూరిటీతో పాటు పోలీసులు ఉంటారని, ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండా చూస్తారన్నారు. ప్రతిస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. దాదాపు 4వేల మంది పోలీసులో ఈ బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. -
ఐపీఎల్‌కు కావేరి సెగ
సాక్షి, చెన్నై : తమిళనాట కావేరి నది జలాల వివాదం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు తాకనుంది. చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డగిస్తామని పలు రాజకీయ కూటమిల ప్రకటనలతో చెపాక్ స్టేడియంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 వేల మంది పోలీసులు మంగళవారం చెన్నై-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌కు భద్రత కల్పిస్తున్నారు. కావేరి నదీ జలాల బోర్డును మళ్లీ ఏర్పాటు చేయాలని తమిళ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో భాగంగా చెన్నైలో జరుగుతున్న ఏడు మ్యాచ్‌లను రద్దు చేయాలని కూడా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సూపర్‌స్టార రజనీకాంత్ ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడే ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. మరోవైపు మ్యాచ్‌కు వెళ్లకుండా అభిమానులు తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని కూడా పిలుపునిచ్చారు. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించిన కావేరి నది సింహభాగం తమిళనాడులో ప్రవహిస్తుంది. అంతేకాకుండా సాగు కోసం కావేరి నదీ జలాలపైనే కర్ణాటక, తమిళనాడు ప్రజలు ఆధారపడుతున్నారు. కావేరి నదీ జలాల బోర్డు కావేరి నుంచి లభ్యమయ్యే 700లకు పైచిలుకు టీఎంసీల నీటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో 15 ఏళ్ల పాటు అమలయ్యేలా కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలకు కేటాయింపులు చేసింది. గత కేటాయింపుల కంటే 14 టీఎంసీల నీటిని కర్ణాటకకు సుప్రీం ఎక్కువగా ఇవ్వడంతో ఈ వివాదం రాజుకుంది. -
ఆ మ్యాచ్‌లు అక్కడే జరుగుతాయి!
-
రాజకీయాలొద్దు.. చెన్నైలోనే మ్యాచ్‌లు
సాక్షి, ముంబై : కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహారంలో కేంద్రంపై తమిళనాడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై సంగ్ధిగ్ధం నెలకొంది. మ్యాచ్‌లను అడ్డుకుని తీరతామని ఆందోళనకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు స్పందించారు. చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహించి తీరతామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సోమవారం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ‘షెడ్యూల్ ప్రకారం చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తాం. అవసరమైతే కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తాం. రాజకీయ కారణాలతో ఆట ప్రభావితం కావటానికి వీల్లేదు’ అని రాజీవ్ తెలిపారు. (ధోనీకి రజనీ విజ్ఞప్తి) మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కూడా మ్యాచ్‌ల నిర్వహణపై స్పందించింది. మ్యాచ్‌లను మరో చోట నిర్వహించబోతున్నట్లు(కేరళలో నిర్వహించబోతున్నట్లు...) వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సీఎస్కే ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ‘మ్యాచ్‌ల తరలింపు విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం. కావేరీ అంశంపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందుతోంది. చెన్నై పోలీసుల దగ్గరి నుంచి ఇప్పటికే మ్యాచ్ నిర్వహణల కోసం అనుమతి తీసుకున్నాం. అన్ని విషయాలను పరిగణనలోకే తీసుకునే మేం ముందుకు వెళ్తున్నాం అని కాశీ విశ్వనాథ్ తెలిపారు. -
కావేరి కోసం.. కోలీవుడ్ దీక్ష
కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధన లక్ష్యంగా తమిళనాట ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. పాలకపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, రైతులు, యువత, విద్యార్థులు రాస్తారోకోలు, రైలురోకోలు, బంద్‌ల రూపంలో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా కోలీవుడ్ ఆదివారం మౌన దీక్ష చేపట్టింది. చెన్నై నగరం నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం సమీపంలో దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ దీక్ష సాగింది. సినీపరిశ్రమకు చెందిన నిర్మాతల మండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, సినీ దర్శకుల సంఘం అంటూ అన్నీ సంఘాల నాయకులు, ప్రముఖ నటులు రజనీకాంత్, కమలహాసన్, విజయ్, సూర్య, విశాల్, ధనుష్‌లతో సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవించి కావేరి బోర్డు ఏర్పాటు చేసి, స్టెరిలైట్ పరిశ్రమను మూసివేయాలని తీర్మానించారు. సినీ పరిశ్రమకు చెందిన 30 వేల మంది సంతకాలతో కూడిన తీర్మాన పత్రాన్ని గవర్నర్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళ సినిమా : కావేరి బోర్డు ఏర్పాటు, స్టెర్లైట్ పరిశ్రమ మూసివేతపై తమిళనాడులో ఆందోళన హోరెత్తుతోంది. అన్ని పార్టీల నాయకులు రోడ్డురోకో, రైలు రోకో, బంద్‌లు అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ తాము సైతం అంటూ ఆందోళనలకు సంఘీభావం తెలిపింది. ఆదివారం నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం సమీపంలో కోలీవుడ్ మౌనదీక్ష చేపట్టింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మౌనదీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగింది. నిర్మాతల మండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, సినీ దర్శకుల సంఘాలు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నాయి. రజనీకాంత్, కమలహాసన్ సంఘీభావం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్, సంఘం అధ్యక్షుడు నాజర్, ఉపాధ్యక్షుడు పోన్వన్నన్, కోశాధికారి కార్తి తదితర కార్యవర్గ సభ్యులు మౌనదీక్షకు ఏర్పాట్లు చేశారు. రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు కమలహాసన్, 11.30 గంటలకు రజనీకాంత్ దీక్షాస్థలికి చేరుకున్నారు. నటులు విజయ్, విక్రమ్, సూర్య, కార్తి, జయంరవి, విజయ్‌సేతుపతి, శివకుమార్, సత్యరాజ్, ధనుష్, శివకార్తికేయన్, పార్థిబన్, విజయ్‌ఆంటోని, ప్రశాంత్, సిబిరాజ్, శాంతను, వివేక్, సశుపతి, ఐసరిగణేశ్, రమేశ్‌ఖన్నా, తంబిరామయ్య, మన్సూర్‌అలీఖాన్, ఉదయ, ఆర్కే.సురేశ్, దర్శకుడు శంకర్, ఆర్కే.సెల్వమణి, సంగీత దర్శకుడు ఇళయరాజా, తంగర్‌బచ్చన్, ఆర్వీ.ఉదయకుమార్, ఎస్జే.సూర్య, నిర్మాత కలైపులి ఎస్.థాను, కేఈ.జ్ఞానవేల్‌రాజా, గీత రచయిత వైరముత్తు, ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్, నటి వరలక్ష్మి, కస్తూరి, శ్రీప్రియ, లత, పూర్ణిమ, రేఖ, లలితకుమారి, రోహిణి, సీఆర్.సరస్వతి, ఆర్తిగణేశ్ మొదలగు ప్రముఖులు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. నాజర్ మాట్లాడుతూ మౌనదీక్ష కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. రజనీ, కమల్ మాట్లాడతారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. తమిళులనే భావన లేని వారు పారిపోండి ఇది మౌన దీక్ష అని ప్రకటించినా చివర్లో నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ తమిళుల వైపే నిలబడతానన్నారు. తమిళుల కోసం ఉండాలనుకునే వారు ఉండండి, తమిళులనే భావన లేని వారు పారిపోండి అని ఆవేశంగా మాట్లాడారు. కానరాని నాయికలు మౌనదీక్షకు నయనతార, త్రిష, స్నేహ, కుష్బూ, హన్సిక, కాజల్‌అగర్వాల్ వంటి ప్రముఖ నాయికలు డమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నటుడు అజిత్, ఉదయనిధి స్టాలిన్, శింబు దీక్షకు గైర్హాజరయ్యారు. ఆహ్వానం అందనందువల్లే దీక్షకు రాలేదని శింబు మీడియాకు తెలిపారు. ఆమోదించిన తీర్మానాలు దీక్ష ముగించిన అనంతరం 4 తీర్మానాలు చేశారు. అందులో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ పథకమైనా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు అమలు పరచకూడదు. కావేరి జలాల పంపకంలో తమిళ రైతుల హక్కులను పరిరక్షించాలి. కావేరి మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. స్టెర్లైట్ పరిశ్రమను మూసివేయాలి లాంటి తీర్మానాలను చేశారు. ఈ తీర్మాన పత్రంతో పాటు సినీపరిశ్రమకు చెందిన 30వేల మంది సంతకాలతో గవర్నర్‌కు అందించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. -
తమిళుల ఆగ్రహం చవిచూస్తారు!
తమిళసినిమా (చెన్నై): కేంద్ర ప్రభుత్వం తక్షణం కావేరీ బోర్డును ఏర్పాటు చేయకుంటే తమిళనాడు ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని సూపర్‌స్టార్ రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాడు మొత్తం ముక్త కంఠంతో కావేరీ బోర్డు ఏర్పాటును కోరుతోందన్నారు. కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్షాల పోరాటానికి మద్దతుగా ఆదివారం కోలీవుడ్ పరిశ్రమ నిర్వహించిన మౌన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబు కాదన్నారు. ‘రాష్ట్రం మొత్తం కావేరీ అంశంపై ఆందోళన చేస్తుంటే ఐపీఎల్‌ను నిర్వహించడం అవమానకరమే అవుతుంది. ఐపీఎల్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణను నిర్వాహకులు రద్దు చేసుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించి మ్యాచ్‌లు ఆడాలి’ అని రజనీకాంత్ సూచించారు. కావేరీ అంశంపై తమిళనాడు, కర్ణాటకల్లో ఆందోళన కొనసాగుతున్న వేళ.. కన్నడ సంతతికి చెందిన ఎంకే సూరప్పను అన్నా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా గవర్నర్ నియమించడం సరికాదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నై నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద జరిగిన ఈ మౌనదీక్షలో రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్, విజయ్, సూర్య, విశాల్, శింబు, ధనుష్‌లు సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ కార్మికులు పాల్గొన్నారు. -
ఐపీఎల్‌కు ఇది సరైన సమయం కాదు: రజనీకాంత్
చెన్నై : కావేరీ జలమండలి ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఆ రాష్ట్ర అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ డిమాండ్‌కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం మద్దతు తెలిపారు. ప్రజల ఇబ్బందులను, మనోభావాలను, బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. కావేరి జలమండి ఏర్పాటు చేయాలని తమిళ సినీ ప్రదర్శన చేపట్టిన నిరసన కార్యక్రమంలో రజనీకాంత్, కమలహాసన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదు. ఓ వైపు రైతులు నీటి కష్టాలతో అల్లాడిపోతున్నారు. వారి బాధను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒకవేళ మ్యాచ్‌లను రద్దుచేయడం సాధ్యం కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించైనా రైతుల నిరసనకు మద్దతు తెలపాలి’ అని రజనీకాంత్ సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రజనీకాంత్ ఈ సందర్భంగా కోరారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, తక్షణమే బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరో తమిళ నటుడు కమలహాసన్ సైతం ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణను వ్యతిరేకించారు. ఈ నిరసన కార్యక్రమానికి తమిళ నటులు విశాల్, విజయ్, ధనుష్, కాంగ్రెస్ నేత కుష్బూ, సంగీత దర్శకుడు ఇళయరాజాలు హాజరయ్యారు. -
చెన్నై మ్యాచ్‌లపై నీలి నీడలు!
సాక్షి, చెన్నై : చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కావేరీ జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని, వెంటనే కావేరీ జలమండలి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇప్పటికే పార్లమెంట్లో ఆ రాష్ట్ర ఎంపీలు సభ సజావుగా జరగకుండా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. అంతేకాకుండా చెన్నైలో ఐపీఎల్‌ను నిషేదించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే) పార్టీ నేతలు ఏకంగా చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిలిపివేయాలని ఆ నగర పోలీస్ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కావేరి జలమండలి ఏర్పాటు చేసే వరకు మ్యాచ్‌లను నిలిపివేయాలని కోరామని, ఒక వేళ మ్యాచ్‌లు నిర్వహిస్తే అడ్డుకొని తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.దర్శకుడు భారతీరాజా అయితే ఐపీఎల్ ఓ పిచ్చి గేమ్ అని, ఐపీఎల్ మ్యాచ్‌లు తమిళులు ఏకం కావాల్సిన సమయంలో వారి ఐకమత్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు. క్రీడా మైదానంలో సీట్లు నిండటం ముఖ్యం కాదని, ఆందోళనలో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై నిషేదం విధించడంతో గత రెండు సీజన్ల మ్యాచ్‌లకు చెన్నై అభిమానులు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొనడం అభిమానులను కలవర పెడుతోంది. -
8న కోలీవుడ్ ఆందోళన
కావేరి బోర్డుకు మద్దతుగా, స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా పోరుబాటకు కోలీవుడ్ కదిలింది. ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వేదికగా దక్షిణ భారత నటీనటుల సంఘంతో పాటు చిత్ర పరిశ్రమ మొత్తం ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 9గంటల నుంచి, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సాగుతుంది. దీని గురించి దక్షిణ భారత నటీనటుల సంఘం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ తూత్తుక్కుడిలోని స్టెర్లైట్ కర్మాగారాన్ని మూసివేయాలని, అదే విధంగా కావేరి నది జలాల వ్యవహారంలో బోర్డును నియమించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన జరపనుందని పేర్కొన్నారు. ఈ ఆందో ళనలో చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు ఈ నెల 4న స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా, కావేరి బోర్డు ఏర్పాటుకు మద్దతుగా, అదే విధంగా చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నడిగర్‌సంఘం ప్రకటించింది. అయితే అందుకు ప్రభుత్వంనుంచి అనుమతి లభించలేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కావేరి బోర్డు నియామకం కోసం ఆందోళన కార్యక్రమాలు జరుగుతుండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ప్రభుత్వం కోలీవుడ్ దీక్షకు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళన కార్యక్రమాన్ని ఈనెల 8న చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. -
ఓట్ల కోసం ఏ నాటకమైనా ఓకేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల పంపిణీపై తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ఎండ వేడికి ఇవి మరింత మంటెక్కనున్నాయి. కావేరి బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంట్లో ప్రతిరోజు అన్నాడిఎంకే సభ్యులు ఆందోళన చేస్తున్నా, తమిళనాడు వీధుల్లో కేంద్రం వైఖరికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఉలుకూ లేదు. పలుకూ లేదు. ఏప్రిల్ ఐదవ తేదీన తమిళనాడు బంద్‌కు డీఎంకే పిలుపు కూడా ఇచ్చింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎలా కావేరి జలాలను పంపిణీ చేయాలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి వీలుగా ఓ ‘స్కీమ్’ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29వ తేదీన ఈ స్కీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, జాప్యానికి ఎలాంటి సాకును చూపించడానికి వీల్లేదని, గడువులోగా కచ్చితంగా స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 29వ తేదీ వచ్చిందీ, వెళ్లింది. స్కీమ్ ఏర్పాటుకు పార్లమెంట్ లోపల, వెలుపలా ప్రతి రోజు ప్రజాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా స్కీమ్ ఏర్పాటు దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీరిగ్గా ఈరోజు కోర్టు ముందుకు వచ్చి అసలు ‘స్కీమ్’ అంటే ఏమిటీ? ఎలాంటి స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఎంతో అమాయకంగా సుప్రీం కోర్టు ముందకు వచ్చి వివరణ కోరింది. నదీ జలాల పంపిణీకి స్కీమ్ అంటే నిపుణులతో కూడిన ఓ బోర్డును ఏర్పాటు చేయడం అన్నది అటు కేంద్రానికి, ఇటు సుప్రీం కోర్టుకు తెలుసు. మరి మధ్యలో ఈ మాయా నాటకం ఎందుకు? కావేరీ జలాల పంపిణీ బోర్డును ఏర్పాటు చేయడం కర్ణాటకకు ఇష్టం లేదు. మిగులు జలాలను ఎలాగు వదిలేస్తామని, వాటిని వినియోగించుకోవాలన్నది కర్ణాటక ప్రభుత్వం వాదన. ఈ నెల 11వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈలోగా బోర్డును ఏర్పాటు చేస్తే కర్ణాటక ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయరన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానం భయం. కావేరీ, జలాల విషయంలో గతంలో రక్తపాతం జరిగినందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ‘స్కీమ్’ అంటే అది ఎలా ఉండాలో చెబితే అమలు చేస్తామని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. తమిళనాడు బంద్ జరిగినా, పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేలోగా కేంద్రం స్పందించే అవకాశం లేదు. -
అకస్మాత్తుగా సీఎం, డిప్యూటీ సీఎం నిరాహార దీక్ష
సాక్షి, చెన్నై: కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిరాహార దీక్ష దిగారు. వెంటనే కావేరీ జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటారని మొదట తెలిపారు. దీక్షలో కూర్చునే నేతల జాబితాలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్ పేరు లేదు. కానీ, కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్ ఇద్దరూ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నాయి. -
కేంద్రంపై తమిళనాడు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కావేరీ నదీజలాల మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు తమిళనాడులో వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రధాని దిష్టిబొమ్మల దహనంతో తమిళనాడు ప్రజలు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని చూపించారు. అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 30న ముగిసినా కేంద్రం స్పందించకపోవడంతో అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నై, తిరువయ్యూరు, మదురై సహా తమిళనాడువ్యాప్తంగా 600 చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, పడుకొట్టాయ్సహా చాలాచోట్ల రైల్‌రోకో చేపట్టారు. కోయంబత్తూరులో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. తమిళనాడు విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 1,000 మందిని అదుపులోకి తీసుకుని గొడవలు సద్దుమణిగాక వదిలేశారు. మంగళవారం రాష్ట్రబంద్‌కు రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, డీఎంకే నేతృత్వంలోని విపక్షపార్టీలు ఏప్రిల్ 5న బంద్ నిర్వహించనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తేకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ఆరోపించింది. అన్నాడీఎంకే ఎంపీ రాజీనామా, ఉససంహరణ కావేరీ అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ముత్తుకరుప్పన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం పళనిస్వామి ఆదేశాలతో తన రాజీనామాను ముత్తుకరుప్పన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు, కావేరీ వాటర్ బోర్డు త్వరగా ఏర్పాటుచేయాలని కోరుతూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి అంశంపై మంగళవారం అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహారదీక్షలు చేపట్టనుంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు. కోర్టు ధిక్కార కేసు వింటాం: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కేంద్రంపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 9న ఈ కేసు విచారణకు రానుంది. నిరసనల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ ఢిల్లీకి వెళ్లారు. -
మీకు న్యాయం చేస్తాం : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పట్టించుకోవట్లేదని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సోమవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘తమిళనాడుకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని భరోసా ఇచ్చింది. ‘తమిళనాడు సమస్య మాకు అర్థమైంది. కావేరీ జలాల విషయంలో సత్వర న్యాయం జరిగేలా చూస్తాం’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తెలిపారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటును కోరుతూ గతకొన్ని రోజులుగా తమిళనాడుకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం ఈ అంశంపై కేంద్రం స్పందిస్తూ... ‘ఇది చాలా సున్నితమైన అంశమని.. పైగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నామని’ సుప్రీంకోర్టుకు నివేదించింది. కాగా, ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కావేరీ జల వివాదంపై తీర్పునిస్తూ.. తమిళనాడు వాటాను తగ్గించి, కర్ణాటక రాష్ట్రానికి అధిక వాటాను కేటాయించింది. బెంగుళూరు సిటీ అవసరాల దృష్ట్యా ఈ తీర్పునిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆ సమయంలో పేర్కొన్నారు. -
‘కావేరి’పోరు ఉధృతం; 5న రాష్ట్ర బంద్
చెన్నై: కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు(సీఎంబీ) ఏర్పాటును డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఏప్రిల్ 5న రాష్ట్ర బంద్‌కు పిలుపినిచ్చాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం జరిగిన విపక్షపార్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరిన స్టాలిన్.. పోరాటంలో కలిసిరావాల్సిందిగా అధికార పక్షం ఏఐఏడీఎంకేను కూడా కోరారు. భేటీ అనంతరం మెరుపు ధర్నాకు దిగిన స్టాలిన్, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీకి నల్లజెండాలతో..: ‘‘సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరి బోర్డును ఏర్పాటుచేయడంలో కేంద్ర సర్కార్ విఫలమైంది. ఏప్రిల్ 15న ప్రధాని మోదీ తమిళనాడుకు రానున్నవేళ నిరసనలను ఇంకా ఉధృతం చేస్తాం. మోదీకి, ఇక్కడి ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపి నిరసన తెలుపుతాం’’ అని స్టాలిన్ చెప్పారు. -
కేంద్రంపై కోర్టు ధిక్కార కేసు
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వంపై శనివారం తమిళనాడు ప్రభుత్వం కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలుచేసింది. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల్ని ఏర్పాటుచేయాలన్న సుప్రీం తీర్పును కేంద్రం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 6 వారాల్లో అభివృద్ధి మండలి, కమిటీల్ని ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన గడువు మార్చి 29తో ముగిసిపోవడంతో తమిళసర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుచేయడానికి గల కారణాలను తమిళనాడు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో వీటి ఏర్పాటులో వెనక్కు తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ కేంద్రం మరో పిటిషన్ దాఖలుచేసింది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కర్ణాటకలో అల్లర్లు చెలరేగి అసెంబ్లీ ఎన్నికలు నిలిచిపోయే ప్రమాదముందని కోర్టుకు విన్నవించింది. కేంద్రం వ్యవహారశైలిపై తమిళనాడులో ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. చెన్నైలోని మెరీనాబీచ్‌లో జల్లికట్టు తరహా ఉద్యమానికి ప్రయత్నం జరగ్గా.. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై తదుపరి కార్యాచరణను రూపొందించేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. -
ఎంపీ గారు.. ఉరితాడా, విషం తాగుతారా?
చెన్నై: ‘‘రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మన ఎంపీగారు చెప్పారు. గడువు ముగిసినా కేంద్రం స్పందిచలేదు కాబట్టి ఆయన మాటమీద నిలబడాలి. ఇదిగో ఉరితాడు.. విషం నింపిన సీసా.. రెండిట్లో మీకు నచ్చింది తీసుకోండి..’అంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన ఈ వ్యక్తిపేరు పుహళేంది. అన్నాడీఎంకే నుంచి బయటికొచ్చేసిన టీవీవీ దినకరన్ వర్గంలో కీలక నేత. శనివారం చెన్నైలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది?: కేంద్ర ప్రభుత్వం తక్షణమే కావేరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు(సీఎంబీ)ని ఏర్పాటు చేయాలంటూ ఏఐఏడీఎంకే ఎంపీలు గత కొద్ది రోజులుగా పార్లమెంట్లో ఆందోళనలను చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సూచన మేరకు మార్చి 29 లోగా సీఎంబీ ఏర్పాటు చేయకుంటే పార్లమెంట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటానని ఎంపీ నవనీత కృష్ణన్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఇప్పుడా గడువు ముగిసిన నేపథ్యంలో ఎంపీగారి చాలెంజ్‌పై దినకరన్ వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు. రాజీనామాలు చెయ్యండి లేదా చావండి..: కావేరీ బోర్డు ఏర్పాటు కావాలంటే ఏఐఏడీఎంకే ఎంపీలందరూ తక్షణమే రాజీనామాలు చేయాలని, లేదంటే తాము సూచించిన విధంగా ఉరితాడు, విషాన్ని స్వీకరించాలని పుహళేంది అన్నారు. కావేరీ నదీ జలాల పంపిణీపై కొద్ది నెలల కిందట తుది తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ నిర్వహణ సజావుగాసాగేలా రివర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. బోర్డు ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడంతో తమిళ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దినకరన్ వర్గీయుల సవాలుపై ఏఐఏడీఎంకే ఎంపీ నవనీత కృష్ణ స్పందించాల్సిఉంది. -
అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చిన సీఎం
సాక్షి, చెన్నై: బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తమ వైఖరి ఏంటన్నది సీఎం పళనిస్వామి వివరించారు. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో కేంద్రంపై అన్నాడీఎంకే ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తుందంటూ ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. కావేరీ జలాల పంపకాలపై గత ఫిబ్రవరి 16న కావేరీ నిర్వహణ బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. ఆరు వారాల్లోగా కమిటీ నియమించి వివరాలు వెల్లడించాలని కోర్టు సూచించింది. కావేరీ నీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయాలంటూ మార్చి 15న తమిళనాడు ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్‌ను కోరిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చెప్పిన ఆ బోర్డు ఏర్పాటు చేస్తే కావేరీ జలాల్లో తమిళనాడు వాటా తగ్గుతుంది. దీంతో కేంద్రంతో కుమ్మక్కయి అన్నాడీఎంకే నేతలు కావేరీ బోర్డు ఏర్పాటు కోరుకుంటున్నారని ప్రతిపక్ష డీఎంకే విమర్శించింది. డీఎంకే ఆరోపణలపై సభలో బుధవారం పళనిస్వామి స్పందిస్తూ.. బీజేపీకి తాము మద్దతు తెలపడం గానీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం గానీ అన్నాడీఎంకేకు లేదని వెల్లడించారు. కావేరీ జలాల్లో తమిళనాడు వాటాను తగ్గించకూడదని అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ నిరసన తెలుపుతున్నారని పళనిస్వామి శాసనసభలో వివరించారు. -
రజనీపై కమల్ విమర్శలు..??
సాక్షి, చెన్నై : సినిమాల్లో స్నేహితులు.. రాజకీయాల్లో ప్రత్యర్థులు.. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రజనీకాంత్, కమల్ హాసన్ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. భవిష్యత్తులో వీరు చేతులు కలుపుతారో లేదో తెలియదుకానీ.. ప్రస్తుతానికైతే రాజకీయాల్లో తలోదారిలో సాగుతున్నారు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయమార్గం పడితే.. కమల్ ద్రవిడ రాజకీయాలను భుజానెత్తుకున్నారు. మొత్తానికి వీరిద్దరి దారులు వేరుకావడంతో రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడం అనివార్యంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొదట కమల్ హాసన్ రజనీపై పరోక్ష విమర్శలను మొదలుపెట్టారు. చాలా అంశాలపై రజనీకాంత్ స్పందించడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ పేర్కొన్నారు. కావేరీ జలాల వివాదంపై రజనీ ఎందుకు మౌనంగా ఉన్నారని విలేకరులు ప్రశ్నించగా.. కావేరీ జలాల అంశమే కాదు... చాలా అంశాలపై రజనీ స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని తీసుకొని.. మనం మాట్లాడలేమని ఆయన సోమవారం చెన్నైలో పేర్కొన్నారు. దివంగత ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ శిష్యులుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రజనీకాంత్, కమల్ హాసన్ కోలీవుడ్‌లో సూపర్స్టార్లుగా ఎదిగారు. ఇటీవలి తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ రాజకీయాల్లో రాణించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రకటించగా.. త్వరలోనే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారు. -
తమిళనాట కాక రేపుతున్న కావేరీ జల వివాదం
-
‘కావేరీ’ తీర్పుపై కమల్ రియాక్షన్
సాక్షి, చెన్నై: కావేరీ నదీ జలాల కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని నటుడు కమల్ హాసన్ అన్నారు. రాష్ట్ర వాటాలో 15 టీఎంసీలు కోత పెట్టడం వల్ల తమిళ రైతులకు నష్టం జరుగుందన్నారు. అయితే కోర్టు తీర్పుపై తాను రాజకీయాలు చేయబోనని, ఎవరు చేసినా సహించబోనని అంటూనే తమిళనాడు వాటాను కచ్చితంగా విడుదల చేయాలని కమల్ డిమాండ్ చేశారు. దశాబద్ధాల వివాదానికి పరిష్కారం చూపుతూ కావేరీ జలాల పంపిణీపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కావేరీ జలాల్లో తమిళనాడుకు 177.25 టీఎంసీలు, కర్ణాటకకు 284.75 టీఎంసీలు కేటాయిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని ప్రకారం ప్రకారం తమిళనాడు వాటాలో దాదాపు 15 టీఎంసీలు కోతపడింది. ఆ నీటిని ఏకమొత్తంగా కర్ణాటకకు కేటాయించారు. కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల వాటాలో ఎలాంటి మార్పు లేదు. -
కావేరీ జలవివాద తీర్పు.. తమిళనాడుకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జల వివాదంలో తమిళనాడుకు షాక్ తగిలింది. నీటి పంపిణీలో కర్ణాటకకు ఊరటనిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యున్నత న్యాయస్థానం తమిళనాడుకు విడుదల చేయాల్సిన నీటిలో కోతను విధించింది. 120 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించింది. ‘కావేరీ నదీజలాలపై ఏ రాష్ట్రానికి పూర్తి అధికారం కాని, హక్కులు గానీ లేవు’ అని బెంచ్ వ్యాఖ్యలు చేసింది. కావేరీ జలాల్లో 177.25 టీఎంసీల(అంతకు ముందు 192 టీఎంసీలుగా ఉండేది) నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక కర్ణాటకకు యథాతథంగా నీటి కేటాయింపులు కొనసాగుతాయన్న కోర్టు.. 14.75 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించింది. దీంతోపాటు బెంగళూరు త్రాగు నీటి అవసరాల కోసం 4.75టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇక చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు ధర్మాసనం సభ్యులుగా ఉన్నారు. సరిహద్దులో ఉద్రిక్తత... తీర్పు నేపథ్యంలో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు.. చెక్ పోస్టుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు కర్ణాటకలో సంబరాలు జరుపుకుంటుండగా.. తమిళనాడులో నిరసనలు మొదలయ్యాయి. కావేరీ జలాల తీర్పుపై తమిళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారమంటూ తమిళనాడులో విపక్షాలు ధర్నాకు దిగాయి. కర్నాటకలో ఎన్నికలు జరగనుండటంతో వారికి సానుకూలంగా తీర్పు వెలువరించేలా కేంద్రం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చిందన్న విమర్శలు మొదలయ్యాయి. రాష్ర్టంలో శాంతి భద్రతలపై డీజీపీతో ముఖ్యమంత్రి పళని సామి సమీక్ష నిర్వహించారు. తమిళనాడులోని కన్నడ పాఠశాలలు, బ్యాంకులు, హోటళ్లకు భారీ భద్రత కల్పించారు. కావేరీ జల వివాద నేపథ్యం... కావేరీ నదికి దక్షిణ గంగా పేరుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కావేరీ నీరే ప్రధానం. దక్షిణ కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇది పుట్టి, తమిళనాడు, కేరళ, పుదుచెర్రీల మీదుగా ప్రవహిస్తుంది. వంద సంవత్సరాలకు పైగా ఇరు రాష్ట్రాలకు మధ్య జల వివాదం నెలకొంది. నీటికొరత, సమస్యలపై పరిష్కారం చూపాలంటూ 1990లో కేంద్రం ప్రభుత్వం ఓ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసింది కావేరీ జల వివాద ట్రిబ్యునల్ సీడబ్ల్యూడీటీ గతంలో(2007) ఉత్తర్వులు నీటి లభ్యత ఆధారంగా జలాలు ఎలా పంచుకోవాలో పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. కావేరీ జలాలను 740 టీఎంసీలుగా లెక్కగట్టిన ట్రిబ్యునల్ అందులో తమిళనాడుకు 192 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళ 30, పుదుచెర్రీలకు 7టీఎంసీలను కేటాయించింది. అయితే టిబ్యునల్ కేటాయింపుల కంటే కేరళ అదనంగా తీసుకుంటుందని తమిళనాడు మొదటి నుంచి ఆరోపిస్తుండగా.. వర్షాభావ పరిస్థితులతో తమిళనాడుకు నీటిని విడుదల చేయటం కుదిరే పని కాదని కర్ణాటక స్పష్టం చేసింది. 2016 సెప్టెంబర్ 5న అత్యున్నత న్యాయస్థానం పదిరోజులపాటు 15,000 క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ఆదేశించిటంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉత్తర్వులను సవరించాలంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. అంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ 12,000 క్యూసెక్కుల నీల్లు(సెప్టెంబర్ 20వ తేదీ వరకు) ఇవ్వాలని ఆదేశం. నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పటంతో 2 వేల క్యూసెక్కులు ఇవ్వాలని మరోసారి ఆదేశాలు. ఆ ఆదేశాలను సైతం ఉల్లంఘించటంతో రూ. 2,480 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ గతేడాది జనవరి 9న తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. చివరకు సీడబ్ల్యూడీటీ ఇచ్చిన జల పంపిణీ తీర్పును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. కొరత ఉన్న నేపథ్యంలో తమిళనాడుకు నీటిని ఎలా విడుదల చేయాలని.. దేవుడే వర్షాలను కర్ణాటకు పంపుతాడన్న రీతిలో ట్రిబ్యునల్ పంపిణీలు చేపట్టిందని కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్ వాదనలు వినిపించారు. నీటి పంపిణీలో మార్పులు చేపట్టాలంటూ తమిళనాడు విజ్ఞప్తి చేసింది. పూర్తి వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం 2017 సెప్టెంబర్ 20న తీర్పును రిజర్వ్ చేసింది. తమిళనాడుకు విడుదల చేయాల్సిన నీటిలో కోత విధిస్తూ మిగతా ప్రాంతాలకు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగానే కేటాయింపులు కొనసాగాలని ఫిబ్రవరి 16, 2018న తుది తీర్పు వెలువరించింది. -
ధన్యవాదాలు మిత్రమా
1980ల నాటి మాట. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్. కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే. రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం. అప్పటికే వందేళ్ల వివాదం అది! కావేరీ కర్ణాటకలో పుట్టింది. ఆ నీళ్లను దిగువన ఉన్న తమిళనాడు వాడుకుంటుండటంతో వివాదం పుట్టింది. రామచంద్రన్, రామకృష్ణ.. ఇద్దరు రాముళ్లు. రెండూ రామరాజ్యాలు. ప్రజలు కోరింది కాదనలేనివారే ఇద్దరూ. ప్రజలకు ఇష్టం లేనిది చేయలేనివారే ఇద్దరూ. ‘నీళ్లు కావాలి’ అంటోంది తమిళనాడు. ‘ఇచ్చేది లేదు’ అంటోంది కర్ణాటక. నీళ్లు తెమ్మని రామచంద్రన్ మీద, నీళ్లివ్వొద్దని రామకృష్ణ హెగ్డే మీద ఒత్తిడి పెరుగుతోంది. ఎన్ని ఒత్తిళ్లున్నా ప్రజల్ని పొత్తిళ్లలో పెట్టుకుని చూడడం నాయకుల లక్షణం. ఓ ఉదయం రామచంద్రన్ అకస్మాత్తుగా బెంగళూరులోని రామకృష్ణ హెగ్డే ఇంటి ముందు దిగారు. రామచంద్రన్ వస్తున్నట్లు హెగ్డేకు కనీసం కబురు కూడా లేదు! హెగ్డే ఆశ్చర్యపోయారు. ‘‘రండి.. మిత్రమా’’ అని నవ్వుతూ రామచంద్రన్‌ను ఆహ్వానించారు. అల్పాహారం సిద్ధం అయింది. నాయకులిద్దరూ ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటున్నారు. ‘‘పదార్థాలు రుచిగా ఉన్నాయి మిత్రమా’’ అన్నారు రామచంద్రన్. అలా అంటుండగానే ఆయనకు వెక్కిళ్లు మొదలయ్యాయి. వెంటనే హెగ్డే మంచినీళ్ల గ్లాసు అందించారు. ‘‘ధన్యవాదాలు మిత్రమా.. నా ప్రజలకు కూడా వెక్కిళ్లు వస్తున్నాయి. వాళ్లక్కూడా నీళ్లు అందివ్వగలవా?’’.. అడిగారు రామచంద్రన్. పెద్దగా నవ్వి, రామచంద్రన్ భుజం తట్టారు హెగ్డే. రామచంద్రన్ చెన్నై వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నం బ్రేకింగ్ న్యూస్! ‘కర్ణాటక రిలీజెస్ కావేరీ వాటర్ టు తమిళనాడు’. మీడియా కార్యాలయాలలో టెలీప్రింటర్లు ఆ రోజంతా టపటపమని ఊపిరి సలపకుండా కొట్టుకుంటూనే ఉన్నాయి. రౌండ్ టేబుళ్లే కాదు, కొన్నిసార్లు డైనింగ్ టేబుళ్లు కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాయి. ‘తగ్గే’ చొరవ ఆ లీడర్లో ఉండాలంతే. (నిన్న.. జనవరి 17 ఎం.జి.రామచంద్రన్ జయంతి). – మాధవ్ శింగరాజు -
'మేమేం వానలు పుట్టించలేం.. వాళ్లకివ్వడానికి..'
బెంగళూరు: సర్దుమణిగిన కావేరి వివాదం మరోసారి తెరపైకి వచ్చేలాగా కర్ణాటక మంత్రి ఒకరు వ్యాఖ్యలు చేశారు. 'వర్షాలను మేం పుట్టించడం లేదు మీకు నీళ్లు ఇవ్వడానికి' అంటూ చాలా ఆగ్రహంగా సమాధానం చెప్పారు. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని ఎందుకు తగ్గించారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కర్ణాటక జల వనరులశాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ తన రెండు చేతులను గాల్లోకి విసురుతూ.. 'చాలా రోజులుగా వర్షాలు రావడం లేదు. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. మేం వర్షాలను పుట్టించడం లేదు. నీటిని ఉత్పత్తి చేయడం లేదు. జూన్ 1 నుంచి తమిళనాడుకు విడుదల చేయాల్సిన మొత్తం 44 టీఎంసీ అడుగులు. కానీ, మేం 2.2 టీఎంసీల అడుగల నీటిని విడుదల చేయగలిగాం. కానీ, వాస్తవానికి విడుదల చేయడానికి ఇంకా నీరు లేదు. తమిళనాడు మాత్రం మాపై ఒత్తిడి చేస్తోంది. కానీ, మాకు వర్షాలే రావడం లేదు, క్యాచిమెంట్ వాటర్ తక్కువగా ఉంది. వర్షాలు అనేది ప్రకృతితో ముడిపడిన అంశం. మా చేతుల్లో ఏం లేదు. మేం వానలు పుట్టించడం లేదు' అని చెప్పారు. -
బంద్ సంపూర్ణం
► స్తంభించిన తమిళనాడు ► మూతపడ్డ వ్యాపార సంస్థలు ► స్టాలిన్ సహా వేలాది మంది అరెస్ట్ అన్నదాతల సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్ జనజీవనాన్ని స్తంభింపజేసింది. కరువు సహాయక చర్యలు, ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలకు నష్టపరిహారం తదితర డిమాండ్ల సాధనకు మంగళవారం విపక్షాల బంద్ సక్సెస్ అయింది. బంద్‌లో పాల్గొన్న డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు అగ్రనేతలు సహా వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం కర్నాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడం లేదు. రుతుపవనాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర చరిత్రలో కనీవినీఎరుగని కరువు తాండవిస్తోంది. ఎండిపోయిన పంటలతో దిక్కుతోచని అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలను ఆదుకోలేదనే ఆవేదనతో రైతు నేత అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీలో 41 రోజులపాటూ ఆందో ళనలు నిర్వహించారు. ఢిల్లీ పోరాటాన్ని ఈనెల 23వ తేదీన తాత్కాలికంగా నిలిపివేసి రైతన్నలంతా రాష్ట్రం చేరుకున్నారు. తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఈనెల 16వ తేదీన సమావేశమై 25వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని తీర్మానించారు. బంద్‌లో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. స్టాలిన్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం బంద్ జరిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియన్ ముస్లీంలీగ్, ద్రావిడర్ కళగం, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి తదితర పార్టీల నేతలు ఉదయాన్నే తమ పార్టీ పతాకాలను చేతబట్టి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణలన్నీ మూతపడ్డాయి. ప్రయివేటు వాహనాలు తిరిగినా ప్రభుత్వ బస్సులు బస్‌స్టేషన్‌కు పరిమితమైనాయి. పోలీసు బందోబస్తుతో స్వల్ప సంఖ్యలో బస్సులు తిరిగాయి. కోయంబేడు సీఎంబీటీ బస్‌స్టేషన్ నుండి పొరుగురాష్ట్రాలకు వెళ్లే బస్సులు పరిమిత సంఖ్యలో బయలుదేరాయి. కోయంబేడు కూరగాయల మార్కెట్లో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. అనేక చోట్ల ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లోకి జొరబడి మూసివేయించారు. ఒకవైపు ఎండ, మరోవైపు బంద్ కారణంగా జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అలాగే ఎగ్మూరులో టీఎన్‌సీసీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, రైతు నాయకుడు అయ్యాకన్ను, సైదాపేట జాంబజార్ రోడ్డులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ తదితర రెండు వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువారూరులో తమిళనాడు కావేరీ వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి పీఆర్ పాండియన్ తదితరులు రాసారోకో నిర్వహించి అరెస్టయ్యారు. కాంచీపురం, తిరువళ్లూరులో బస్సులపై రాళ్లు రువ్వి, అద్దాలను పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశారు. చెన్నైతోపాటూ సేలం, తిరుచ్చి, మధురై, నెల్లై, కోవై, వేలూరు తదితర జిల్లాల్లో సైతం దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా రాస్తారోకులు జరిగాయి. డీఎంకే అగ్రనేత స్టాలిన్ తదితర నేతలు తిరువారూరులో మూడు కిలోమీటర్లు నడిచి రాస్తారోకోకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నదాతల అక్రందనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుంటే మరోసారి ఉద్యమిస్తామని స్టాలిన్ హెచ్చరించారు. కాగా, పుదుచ్చేరీలో సైతం బంద్ సక్సెస్ అయింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను, పారిశ్రామిక వాడలను మూసివేసి మద్దతు తెలిపారు. వాహనాలు సైతం తిరగలేదు. ప్రధాని మోదీపై పోలీసుకు ఫిర్యాదు: తమిళనాడులోని రైతన్నలను ఆత్మహత్యకు పురిగొల్పారని పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోదీపై తమిళనాడు కావేరీ వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి పీఆర్ పాండియన్ మన్నార్‌కుడి కోరడాచ్చేరీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కావేరీ సమస్యను కేంద్రం నిర్లక్ష్యం చేయడం వల్లనే రాష్ట్రంలో 400 మందికి పైగా అన్నదాతలు ప్రాణాలు విడిచారని ఆయన తెలిపారు. కావేరీ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయక పోవడం కోర్టు దిక్కారం కిందకు వస్తుందని ఆయన అన్నారు. ప్రధానిపై కోర్టు దిక్కారం కేసును, పరోక్షంగా రైతులను ఆత్మహత్యకు పురిగొల్పిన నేరంపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. -
సత్యరాజ్ క్షమాపణపై కమల్ స్పందన
చెన్నై:తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాలపై కట్టప్ప వ్యాఖ్యలు-బాహుబలి వివాదం నేపథ్యంలో సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెప్పడంపై నటుడు, దర్శకుడు కమల్‌హాసన్ స్పందించారు. కమల్ సత్యరాజ్‌కు శనివారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సత్యరాజ్ గొప్ప మానవుడని కొనియాడారు. "సంక్లిష్ట వాతావరణంలో హేతుబద్ధతను కాపాడిన సత్యరాజ్‌కు అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సినిమా విరుమాందిలోని క్షమాపణ కోరినవాడే గొప్పమానవుడు అన్న మాటలను ఉటంకించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ నాయకుడు, మాజీ ఎంఎల్ఏ రాజా సత్యరాజ్, కమల్ హాసన్‌లపై మండిపడ్డారు. వారికి డబ్బుమీద ధ్యాస తప్ప తమిళుల మీద ప్రేమ లేదని ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. వారు డబ్బు గురించి మాత్రమే బాధపడతారు , తమిళనాడు, తమిళ సెంటిమెంట్‌పై వారికి పైపైన ప్రేమ మాత్రమేనేని విమర్శించారు. డబ్బు కోసం ఆత్మగౌరవంలేని చర్య గా ఆయన అభివర్ణించారు. కాగా తొమ్మిదేళ్ళ క్రితం సినీ నటుడు సత్యరాజ్, కావేరీ జలాల వివాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ వివాదం 'బాహుబలి' (ది కన్‌క్లూజన్) సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి సత్యరాజ్ తరపున క్షమాపణలు చెప్పారు. అయినా సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందే అని కన్నడిగులు పట్టుబట్టడంతో కర్నాటక ప్రజలపై తనకెప్పుడూ చిన్న చూపు లేదనీ, తనవ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి వుంటే క్షమించమంటూ సత్యరాజ్ కోరిన సంగతి తెలిసిందే. Congrats Mr. Sathyaraj for maintaining rationality in a troubled environement. Quoting VirumaaNdi மன்னிப்புக் கேக்கறவன் பெரியமனுசன். Bravo — Kamal Haasan (@ikamalhaasan) April 22, 2017 Whether it is Kamal or Sathyaraj they are bothered only about money. Their love for Tamil and their Tamil sentiment is only skin deep — H Raja (@HRajaBJP) April 21, 2017 -
అసెంబ్లీకి కసరత్తు!
► ఒక్క రోజే ► దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళితో సరి సాక్షి, చెన్నై : అసెంబ్లీని సమావేశ పరిచేందుకు తగ్గ కసరత్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. కొత్త ఏడాదిలో అయితే, గవర్నర్ ప్రసంగంతో సభను ప్రారంభించాల్సిన అవశ్యం ఉన్న దృష్ట్యా, ఈ నెలాఖరులో ఓ రోజు సమావేశం నిర్వహించేందుకు తగ్గ పరిశీలన సాగుతోంది. అమ్మ జయలలితకు నివాళులతో సరి పెట్టే విధంగా చర్యల్ని వేగవంతం చేశారు. సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే రాష్ట్రంలో పాలన కుంటు పడి ఉందని చెప్పవచ్చు. అమ్మ మరణం తదుపరి పగ్గాలు చేపట్టిన పన్నీరు సెల్వంకు వచ్చి రాగానే, వర్దా దెబ్బ తగిలింది. దాన్ని ధీటుగానే ఎదుర్కొన్నా, పార్టీలో సాగుతున్న వ్యవహారాలు ఎక్కడ పదవికి ఎసరు పెడుతుందోనన్న బెంగ తప్పడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలని పదే పదే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కావేరి జలాలు అందక ఎండుతున్న పంట, మొలకెత్తని విత్తనాలను చూసి అన్నదాతల గుండెలు పగులుతుండడం, బలవన్మరణాల పర్వం సాగుతుండడంతో అసెంబ్లీని సమావేశ పరచాల్సిందేనన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పడింది. శనివారం కూడా ఇద్దరు రైతుల గుండెలు పగలడంతో గమనార్హం. ఇందులో ఒకరు నాగపట్నం జిల్లాకీలవేలూరుకు చెందిన త్యాగరాజన్(60), తిరువారూర్ సేతగ మంగళంకు చెందిన అళగు స్వామి(58) ఉన్నారు. రైతుమరణాల పర్వంతో అసెంబ్లీని సమావేశ పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? అన్న ఎదురు చూపులు సర్వత్రా బయలు దేరింది. ఈ పరిస్థితుల్లో ప్రతి పక్షాల డిమాండ్ ఓ వైపు, అమ్మకు సంతాపం లక్ష్యంగా మరో వైపు ఓ రోజు పాటు సభను మమా అనిపించేందుకు ప్రభుత్వంలో చర్యల్లో పడింది. కొత్త సంవత్సరంలో అసెంబ్లీ సమావేశం సాగాలంటే, గవర్నర్ ప్రసంగంతో మొదలు పెట్టక తప్పదు. ఈ దృష్ట్యా, ఈనెలఖరులో ఏదో ఒక రోజు అసెంబ్లీని సమావేశ పరిచి కేవలం దివంగత సీఎం జయలలిత మృతికి సంతాప తీర్మానం , ప్రతి పక్ష నేత ప్రసంగంతో ఈ ఏడాదిలో చివరి సమావేశాన్ని ముగించేందుకు తగ్గ పరిశీలనలో పన్నీరు ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
వాటికోసం జయ పట్టువిడవని పోరాటం
కర్ణాటక, తమిళనాడులకు రావణకాష్టలా ఉన్న కావేరి నీళ్ల వివాదంపై జయలలిత అలుపెరగని పోరాటం చేశారు. ఆమె అధికారంలో ఉన్నా, లేకపోయినా ఈ సమస్యపై పోరాడుతూనే ఉన్నారు. కావేరీ నది నుంచి కర్ణాటక నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జయలలిత రెండు సార్లు నిరాహార దీక్షకు దిగారు. గత 35 ఏళ్లుగా కావేరీ నదీ జలాలపై ఆమె ఏన్నాడూ తన పట్టువిడవలేదు. వందేళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై తమిళనాడుకు దక్కాల్సిన వాటా రాష్ట్రానికి దక్కాల్సిందేనని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 1993లో అయితే హఠాత్తుగా ఆమె నాలుగురోజులు నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా 1998లో కావేరీ రివర్ అథారిటీ కూడా ఏర్పాటైంది. ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా, కావేరీ బేసిన స్టేట్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ అథారిటీ 2002 ఆగస్టులో ఏర్పాటుచేసిన మీటింగ్‌లో తమిళనాడుకు అన్యాయంగా నిర్ణయం వస్తుందని తెలిసి ఆమె ఆ మీటింగ్ నుంచే వాకౌట్ చేశారు. 1991 కాలంలో కూడా ఈ వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు యుద్ధానికే దిగే ఛాయలు నెలకొన్నాయి. ఆ సమయంలో తమిళనాడు సీఎంగా జయలలిత పదవిలో ఉన్నారు. కర్ణాటక ఏటా 205 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదలచేయాలని ట్రైబ్యూనల్ ఆదేశించింది, కానీ ట్రైబ్యునల్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఫలితంగా హింసాత్మక ఘటనలే చోటుచేసుకున్నాయి. పదవిలో ఉన్న జయలలిత ప్రభుత్వం ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కర్ణాటక నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం ఆ ఆర్డినెన్స్‌ను రద్దుచేసింది. కోర్టు నిర్ణయాన్ని పాటించాలని ఆదేశించింది. కానీ ఆ నిర్ణయాన్ని కూడా కర్ణాటక బేఖారతు చేసింది. ఇటు కేంద్రం, అటు కర్ణాటక ప్రభుత్వాలు నదీ జలాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జయలలిత ఇరు ప్రభుత్వాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో హోంమంత్రి హాజరుకాబోయే పలు కార్యక్రమాల నుంచి తన పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేయాలని ఆదేశించారు. కేంద్రం తమకు సపోర్టు ఇచ్చే వరకు తాము తగ్గేది లేదని పేర్కొన్నారు. 1993లో ఆమె చేసిన దీక్షకు దిగొచ్చిన కేంద్రం 1998లో కావేరి వాటర్ అథారిటీని నియమించనున్నట్టు హామీ ఇచ్చింది. దీంతో ఆమె దీక్ష విరమించారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో ట్రైబ్యునల్ మళ్లీ తుది తీర్పును వెలువరించింది. అయితే ఈ ఉత్తర్వుల్ని గెజిట్ లో పొందుపరచలేదు. దీంతో గెజిట్‌లో ఈ ఆర్డర్‌ను పబ్లిష్ చేసేలా చూడటమే తనకు ముఖ్యమైన విషయమని 2011 ఎన్నికల్లో గెలిచిన జయలలిత రైతులకు వాగ్దానం చేశారు. చివరకు 2013లో కేంద్రం ట్రైబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేసింది. జయ జన్మదినానికినాలుగు రోజుల ముందే ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేస్తున్నట్టు సుప్రీం ప్రకటించడంతో తన బర్త్‌డే గిప్ట్గా దీన్ని ప్రకటించారు. అయినా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొలిక్కిరాలేదు. ట్రైబ్యునల్ ఉత్తర్వుల మేరకు కర్ణాటక తమిళనాడుకు నీటిని విడుదల చేయకపోవడం, కర్ణాటక విడుదల చేసిన నీరు చాలవని తమిళనాడు కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది. -
మరో ముగ్గురు బలి
రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. మరో మగ్గురు రైతులు బలి కావడం బుధవారం వెలుగు చూసింది. అన్నదాతల ఆత్మహత్యలు, గుండె పగిలి మరణిస్తుండడంతో రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. తమను ఆదుకునే విధంగా భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తంజావూరులో రైతు సంఘాలు ఆందోళనతో పాటుగా భిక్షాటన చేశాయి. సాక్షి, చెన్నై: డెల్టా జిల్లాల్లో కావేరి జలాల కరువుతో అన్నదాతలు కన్నీటి మడుగులో మునిగిన విషయం తెలిసిందే. మొలకెత్తని విత్తనాలు, మొలకెత్తినా నీళ్లు లేక ఎండుతున్న పంటల్ని చూసి రైతుల గుండెలు పగులుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా రైతులు గుండె పగిలి, బలవన్మరణాలతో మత్యువాత పడ్డారు. ఈ పరిణామాలతో రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. బలవర్మరణాలు వద్దు అని వేడుకుంటున్నారుు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భరోసా ప్రకటన చేయాలని విన్నవిస్తున్నా స్పందన కరువే. అందుకే కాబోలు రైతు మరణాల సంఖ్య పెరుగుతున్నట్టుంది. మరో ముగ్గురు రైతులు విగత జీవులుగా మారడం బుధవారం వెలుగు చూసింది. మరో ముగ్గురి బలి: నాగపట్నం జిల్లా కీలయూరుకు చెందిన మారిముత్తు మూడు ఎకరాల్లో వేసిన పంట ఎండుతుండడాన్ని చూసి తీవ్ర మనో వేదనకు గురి అయ్యాడు. పంట పొలంలోనే మంగళవారం రాత్రి గుండె ఆగి కుప్పకూలాడు. విగత జీవిగా పడి ఉన్న అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తిరువారూర్ జిల్లా కొరట్టచ్చేరి సమీపంలోని ముసిరి గ్రామానికి చెందిన శేఖర్ ఎండుతున్న పంట, అప్పుల బాధలతో కలత చెంది పరుగుల మందు తాగి బుధవారం ఉదయం పంట పొలంలోనే సృ్పహ తప్పాడు. దీనిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, మరణించాడు. తూత్తుకుడి జిల్లా కై త్తారుకు చెందిన మురుగన్ సైతం పది ఎకరాల పంట ఎండుతుండడాన్ని చూసి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఆ సంఘాల నాయకుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా, అధికారుల్ని నిలదీసేందుకు ఆందోళనలు చేపట్టారు. తంజావూరులో ఆందోళనలతో పాటుగా, ఆ జిల్లా కలెక్టర్ అన్నాదురై వద్ద ముట్టడించి భిక్షాటనకు దిగారు. ఎండిన పంటను తీసుకొచ్చి కలెక్టరేట్ ఆవరణలో ఉంచి, చేతిలో మట్టి పాత్రతో భిక్షాటన సాగించారు. అయితే రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నట్టుగా కంటి తుడుపు చర్యగా కలెక్టర్ భరోసా ఇచ్చి పంపించారు. -
అసెంబ్లీకి పట్టు
♦ అఖిలపక్షంలో తీర్మానం ♦ డీఎండీకే, పీఎంకే దూరం ♦ తిరుమా మద్దతు..అయితే దూరంగా ♦ ఏకమవుదాం : స్టాలిన్ పిలుపు డీ ఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం చెన్నైలో మంగళవారం జరిగింది. కావేరీ వివాదం నేపథ్యంలో కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడికి ఇందులో నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, చెన్నై : కావేరి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. డెల్టా అన్నదాతల జీవన్మరణ సమస్య కావేరి జల వివాదం అని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురాని దృష్ట్యా, ఈ సమావేశానికి తాను పిలుపునిచ్చానని, ఎవరు పిలుపునిచ్చినా, నేతృత్వం వహించినా, ఆ సమావేశానికి డీఎంకే తరఫున తానొస్తానంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన అఖిల పక్ష భేటీకి డీఎండీకే, పీఎంకేలు దూరంగా ఉన్నాయి. వీసీకే నేత తిరుమావళవన్ చివరి క్షణంలో మనసు మార్చుకున్నా, తన మద్దతును మాత్రం అఖిలపక్షం భేటీకి ప్రకటించడం గమనార్హం. జఠిలం అవుతున్న కావేరి జల వివాదంపై చర్చించి, తదుపరి అడుగులతో పాటు, కేంద్రంతో ఢీకొట్టేందుకు అఖిల పక్ష సమావేశానికి డీఎంకే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వం వహరించారు. డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత దురై మురుగన్ పర్యవేక్షించారు. ఇందులో కాంగ్రెస్ తరఫున టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత కేఆర్.రామస్వామి, తమిళ మానిల కాంగ్రె స్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్, మనిదనేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మోహిద్దీన్, ఎమ్మెల్యే అబూబక్కర్, కొంగు మండల కట్చి నేత ఈశ్వరన్, ద్రావిడ కళగం నేత వీరమణి, ద్రవిడ కళగం పేరవై నేత సుభా వీర పాండియన్, ఇండియ దేశియ లీగ్ నేత బషీర్ అహ్మద్, తమిళనాడు దేశియ లీగ్ నేత అల్తాఫ్, రైతు సంఘాల నేత టీఆర్ పాండియన్, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేత కదిరవన్ తదితర చిన్న పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఇందులో ఆయా పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా నినదించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వంపై ముందుగా ఒత్తిడికి సిద్ధమయ్యారు. కావేరి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు లక్ష్యంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. కేంద్రం తీరును తప్పుబడుతూ, ప్రత్యేక తీర్మానంతో పాటు, డెల్టా అన్నదాతలకు ఎకరాకు రూ. ముఫ్పై వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐదు రకాల తీర్మానాలను ఈ సమావేశంలో చేశారు. ఏకం అవుదాం : కావేరి జల వివాదం జఠిలం అవుతోందని, అందరం ఏకం కావాల్సిన అవసరం ఏర్పడి ఉన్నట్టు తన ప్రసంగంలో స్టాలిన్ రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని దృష్ట్యా, అఖిల పక్ష సమావేశానికి పిలుపు నిచ్చానేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. డెల్టా అన్నదాతల జీవన్మరణ సమస్యగా వివాదం తలెత్తిందని, విమర్శలను కట్టి బెట్టి అందరం ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి పిలుపునిచ్చి ఉన్నా, మరో పార్టీ పిలుపునిచ్చి నేతృత్వం వహించి ఉన్నా, ఆ సమావేశానికి డీఎంకే తప్పకుండా వచ్చి ఉండేదని, స్వయంగా తానే ఆ సమావేశానికి హాజరయ్యే వాడినన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న పార్టీలను ఉద్దేశించి చురకలు అంటించారు. దూరంగా...ఆది నుంచి ఈ భేటీని బీజేపీ, ఎండీఎంకేలు వ్యతిరేకిస్తూ , విమర్శలు గుప్పిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజా భేటీ గురించి కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశం డీఎంకే కూటమి పార్టీల మంతనాలుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, డీఎండీకే, పీఎంకేలు మౌనంగా తప్పుకోవడం గమనార్హం. ఆ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నా, మక్కల్ఇయక్కంలో కీలక నేతగా ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ వస్తారా..? రారా..? అన్న ఉత్కంఠకు తెర పడింది. ఆ సమావేశానికి ఆయన హాజరవుతారని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, మక్కల్ ఇయక్కంలో చీలికలు వస్తాయన్న ఆందోళనతో చివరి క్షణంలో తిరుమా తప్పుకోవడం గమనార్హం. తప్పుకున్నా, తన మద్దతును మాత్రం ప్రకటించడం విశేషం. అఖిలపక్ష సమావేశానికి తాను రావాలని భావించినా, ఉప ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి ఇరకాటంలో పడాల్సి వస్తుందన్న భావనతో తాను దూరం కావాల్సి వచ్చిందని, అయితే, అఖిలపక్షం సమావేశానికి తీర్మానాలకు తన మద్దతును ప్రకటిస్తున్నట్టు తిరుమావళవన్ ప్రకటించారు. అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు లేఖ సైతం రాయడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో అఖిలపక్షం భేటీ సాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. కావేరి జల పర్యవేక్షణకు రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ పరిశీలన, నివేదిక తమకు సంతృప్తికరంగా లేదని, మళ్లీ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.తమిళనాట అఖిలపక్షం భేటీకావడం, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన నేపథ్యంలో నీటి విడుదలపై కర్ణాటక దృష్టి పెట్టడం గమనార్హం. -
జయలలితకు బదులు స్టాలిన్ అధ్యక్షత!
కావేరీ అంశంపై చర్చించడానికి తమిళనాడులో మంగళవారం ఓ అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతతో నెలరోజులకు పైగా ఆస్పత్రిలో ఉండటంతో.. ఆ సమావేశానికి ప్రతిపక్షానికి చెందిన ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించారు. తన బలాన్ని నిరూపించుకోడానికి, కరుణానిధి తర్వాత కూడా పార్టీని సమర్థంగా నడిపించగలనని చూపించడానికే స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు ఇలా సమావేశాలు పెట్టడం ఎందుకని దీనిపై ఎండీఎంకే నాయకుడు వైగో ప్రశ్నించారు. సీనియర్ నాయకుడు జీకే వాసన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్‌లో చాలా కాలం పాటు ఉన్న వాసన్.. తర్వాత 2014లో బయటకు వచ్చి తమిళ మానిల కాంగ్రెస్ పెట్టిన విషయం తెలిసిందే. కావేరి అంశంపై తమిళనాడు పార్టీలన్నింటిదీ ఒకటే మాట అని నిరూపించుకోడానికే ఈ సమావేశాన్ని పెట్టినట్లు స్టాలిన్ చెప్పారు. మరే ఇతర పార్టీ సమావేశం ఏర్పాటుచేసినా డీఎంకే కూడా పాల్గొనేదని తెలిపారు. డెల్టా రైతులకు ఎకరాకు రూ. 30వేల చొప్పున పరిహారం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. అన్ని పార్టీల నుంచి సభ్యుల బృందం ఒకటి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు. ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యాయి. ఇది రాజకీయ డ్రామా అని మండిపడ్డాయి. కానీ ఈ విమర్శే చేసిన వైగో దాదాపు 18 ఏళ్ల పాటు డీఎంకే ఎంపీగా ఉండేవారని.. దీని ప్రాముఖ్యం ఏంటో ఆయనకు తెలుసని స్టాలిన్ అన్నారు. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావేరీ జలాల ట్రిబ్యూన్‌ను ఏర్పాటుచేయడంలో కరుణానిధి పోషించిన పాత్రను బీజేపీ నాయకులు తెలుసుకోవాలని పొన్ రాధాకృష్ణన్ విమర్శలపై స్పందిస్తూ చెప్పారు. పలువురు రైతుసంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలు ఏకం
• నేడు సమావేశం వేదికగా అన్నా అరివాలయం • మద్దతుగా వాసన్ నిర్ణయం తేల్చని డీఎండీకే, పీఎంకే • మిత్రులతో తిరుమా మంతనాలు ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు డీఎంకే సిద్ధమైంది. మంగళవారం ఉదయం అన్నా అరివాలయం వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇందుకు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, ఎంఎంకేలతో పాటుగా పలు చిన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. మక్కల్ ఇయక్కంలో ఉన్న వీసీకే నేత తిరుమావళవన్ మిత్రులతో తీవ్ర మంతనాల్లో ఉన్నారు. మిత్రులు కలిసి వస్తే సమష్టిగా, లేకుంటే తానొక్కడే హాజరయ్యే అవ కాశాలు ఉన్నాయి. సాక్షి, చెన్నై: కావేరి జల వివాదం జఠిలం అవుతోన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అఖిలపక్షంతో ముందుకు సాగుదామని ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేసినా స్పందన శూన్యం. దీంతో ఇక తన నేతృత్వం అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం ముందుకు కదిలింది. ప్రతిపక్షాలంతా ఏకమై ముందుకు సాగుదామని, వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో కొందరు స్పందిస్తే, మరి కొందరు విమర్శలు గుప్పించారు. ఇంకొందరు మౌనం వహించే పనిలో పడ్డారు. విమర్శలు గుప్పించే వారిలో ప్రధానంగా బీజేపీ, ఎండీఎంకే, అన్నాడీఎంకే ఉన్నాయి. పీఎంకే, డీఎండీకే మౌనం వహించే పనిలో పడ్డాయి. అయితే మంగళవారం అన్నా అరివాలయం వేదికగా జరగనున్న ఈ అఖిల పక్షం బేటీకి ఎన్ని ప్రతి పక్ష పార్టీలకు చెందిన వారు తరలి వస్తారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే కాంగ్రెస్, మనిదనేయమక్కల్ కట్చితో పాటుగా మరికొన్ని చిన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. తాజాగా తమిళ మానిల కాంగ్రెస్ తాము సైతం అంటూ ముందుకు వచ్చింది. సోమవారం మీడియాతో ఆ పార్టీ నేత జీకే వాసన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ఈ సమాలోచనకు తాను స్వయంగా వెళ్తున్నట్టు ప్రకటించారు. ఇది అన్ని వర్గాల సమస్య అని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. పెరుందలైవర్ మక్కల్ కట్చి నేత ఎన్ఆర్ ధనపాలన్ సైతం డీఎంకే పిలుపునకు మద్దతు ప్రకటించారు. కొన్ని రైతు సంఘాలు, మరికొన్ని ప్రజా సంఘాలు కదిలేందుకు సిద్ధం కాగా, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కావేరి బోర్డు సాధన లక్ష్యంగా దీక్షకు నిర్ణయించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించని దృష్ట్యా, ప్రధాన ప్రతిపక్షం ముందుకు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇష్టం ఉంటే, సమావేశానికి హాజరు కావాలని, ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎండీఎంకే నేత వైగో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షకు మక్కల్ ఇయక్కంలోని వీసీకే పట్టుబట్టే పనిలో నిమగ్నమైంది. వీసీకే హాజరయ్యేనా: రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో, ప్రధాన ప్రతిపక్షం అయినా, ముందుకు వచ్చి అఖిల పక్షానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేసిన వారిలో వీసీకే నేత తిరుమావళవన్ ఉన్నారు. మక్కల్ ఇయక్కంలో కీలక పాత్ర పోషిస్తున్న తిరుమావళవన్‌ను ఆ డిమాండ్ సందిగ్ధంలో పడేసింది. మక్కల్ ఇయక్కం డీఎంకే సమావేశాన్ని బహిష్కరించింది. ఇందుకు తగ్గట్టుగా ఆ ఇయక్కం కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో ప్రకటన చేశారు. అయితే వైగో తన నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని తిరుమావళవన్ ఒత్తిడి చేసేందుకు సిద్ధం అయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన వీసీకే కార్యవర్గంలో ఇందుకు తగ్గ నిర్ణయం తీసుకున్నారు. ఇయక్కంలోని సీపీఎం, సీపీఐలతో సమీక్షించే పనిలో తిరుమావళవన్ నిమగ్నం కావడం గమనార్హం. ఎండీఎంకే కరాఖండిగా తాము దూరం అని తేల్చిన దృష్ట్యా, ఇక, సీపీఎం, సీపీఐలు ఏ మేరకు స్పందిస్తాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. కలిసి వస్తే మిత్రులతో పాటుగా తిరుమా డీఎంకే కార్యాలయం మెట్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. లేని పక్షంలో తానొక్కడిని వెళ్తే మాత్రం, ఇక మక్కల్ ఇయక్కంలో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు బయట పడ్డట్టే. -
అఖిలపక్షం!
సాక్షి, చెన్నై: రాష్ర్ట ప్రభుత్వంలో స్పందనలేని దృష్ట్యా, ఇక తాను సిద్ధం అన్నట్టుగా అఖిలపక్షం ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కదిలారు. ప్రతి పక్ష పార్టీల నాయకులు అందరికీ ఆయన శనివారం లేఖ రాశారు. కావేరి హక్కుల పరిరక్షణలో అఖిల పక్షంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 25న డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలో భాగస్వాములం అవుదామని విన్నవించారు. డీఎంకే పిలుపునకు కాంగ్రెస్ తక్షణం స్పందించింది. బీజేపీ విమర్శలు గుప్పించే పనిలోపడగా, మిగిలిన పార్టీలు ఏ మేరకు స్పందిస్తాయో! కావేరి జలాల మీద ఉన్న హక్కుల్ని కాలరాసే విధంగా కేంద్రం కొత్త కుట్రలకు సిద్ధం కావడం తమిళనాట ఆగ్రహాన్ని రేపి ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో రాజకీయ మనుగడను చాటుకునేందుకుగాను, తమిళులకు ద్రోహం తలబెట్టే పనిలో కేంద్రం నిమగ్నమైనట్టు సంకేతాలు వచ్చాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరు ఏమిటో తేటతెల్లమైంది. ఆ బోర్డు, కమిటీ ఏర్పాటును అడ్డుకునే విధంగా కేంద్రం వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో జ్వాల రగిలింది. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు వేర్వేరుగా కేంద్రం తీరును దుయ్యబడుతూ నిరసనల్ని సాగిస్తూ వస్తున్నారు. ప్రధాన ప్రతి పక్షం డీఎంకే సైతం అన్నదాతలకు మద్దతుగా ముందుకు దూసుకెళుతున్నది. అఖిల పక్షంతో అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే డీఎంకే విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. ఏకంగా ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ ఆర్థిక మంత్రి ఓ పన్నీరుసెల్వంతో భేటీ సాగించినా అందుకు తగ్గ చర్యల మీద ప్రభుత్వ వర్గాలు దృష్టి పెట్టలేదని చెప్పవచ్చు. ప్రభుత్వంలో చలనం లేని దృష్ట్యా, ఇక అఖిల పక్షానికి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధం అని ప్రకటిస్తూ, అందుకు తగ్గ చర్యల్లో ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. అఖిలపక్షం: అన్నదాతలతో కలిసి ఓ వైపు పోరాడుతూ అఖిల పక్షానికి పట్టుబడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఇన్నాళ్లు ముందుకు సాగినా ఫలితం శూన్యం. ఇక, గత వారం డీఎంకే ఎంపీలు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీతో సైతం భేటీ అయ్యారు. అలాగే, ఎవరికి వారు అన్నట్టుగా ఆయా పార్టీలు ముందుకు సాగుతుండడంతో, ఇకనైనా అందరం ఒకే వేదికగా ప్రజల పక్షాన పోరాడుదామని పిలుపునిస్తూ అఖిలపక్షం ఏర్పాటుకు స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టు ఆయా పార్టీల నాయకులకు శనివారం లేఖాస్త్రం సంధించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ముందుకు సాగుదామని, కావేరి హక్కుల్ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తూ ఆయా లేఖల్లో నేతలకు వివరించారు. ప్రతి పక్ష పార్టీల నాయకులందరికీ ఈ లేఖల్ని పంపించారు. ఈనెల 25వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నాఅరివాలయం వేదికగా జరగనున్న ఈ సమావేశంలో భాగస్వాములు కావాలని, వారి వారి అభిప్రాయాల్ని ముందు ఉంచాలని విన్నవించారు. ఇక, స్టాలిన్ పిలుపుకు కాంగ్రెస్ స్పందించింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశానికి తాను స్వయంగా హాజరు కానున్నట్టు ప్రకటించారు. మిగిలిన పార్టీల నుంచి స్పందన ఏ మాత్రం అన్నది ఆదివారం నాటికి తేలే అవకాశాలు ఉన్నాయి. కాగా, బీజేపీ మాత్రం విమర్శల్ని ఎక్కుబెట్టే పనిలో పడ్డాయి. ఏ అర్హతతో ప్రధాన ప్రతి పక్షం ఈ సమావేశానికి పిలుపునిచ్చిందో అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ మండిపడ్డారు. కావేరి విషయంలో పరిస్థితి జఠిలం అయ్యేందుకు ప్రధాన కారకులు డీఎంకే, కాంగ్రెస్ వర్గాలేననని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే పిలుపునకు స్పందించేవాళ్లెవ్వరూ రాష్ట్రంలో ఉండరని ఎద్దేవా చేశారు. బీజేపీ విమర్శలు గుప్పించే పనిలో పడడంతో, ఇక, తాము సైతం అంటూ మక్కల్ ఇయక్కం డీఎంకేపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డాయి. మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలు అభిప్రాయంగా పేర్కొంటూ కన్వీనర్ వైగో చేసిన ప్రకటన డీఎంకేకు షాక్కే. డీఎంకే అఖిల పక్షం పిలుపునకు తాము స్పందించబోమని, ఆ సమావేశానికి దూరం అని వైగో ప్రకటించేశారు. -
తమిళనాడులో కేబినెట్ సమావేశం
-
సీఎం లేకుండా కేబినెట్ తొలి భేటీ
చెన్నై: కావేరి జలాల వివాదంపై ప్రతిపక్షాల భారీ ఆందోళనలను.. కర్ణాటక పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి.. ఈ అంశాల నడుమ అమ్మ లేకుండానే తమిళనాడు కేబినెట్ సోమవారం భేటీ అయింది. సీఎం జయలలిత శాఖలను మంత్రి పన్నీర్ సెల్వం చేపట్టిన తర్వాత ఆయన అధ్యక్షత వహిస్తోన్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇదే. కావేరి జలాల విడుదల కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నిర్వహించిన (అక్టోబర్ 17, 18న) 48 గంటల రైల్ రోకో వందలాది మంది అరెస్టులకు దారితీసిన సంగతి తెలిసిందే. (తమిళనాడులో 48గంటల పాటు రైలురోకో) మరోవైపు నీళ్లు విడుదల చేయలేమంటూ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారించనుంది. వీటి నేపథ్యంలో తమిళనాడు ప్రయోజనాలు దెబ్బతినకుండా, అదే సమయంలో ప్రతిపక్షాలను సైతం నిలువరించేలా ఏం చేస్తే బాగుంటుంది? అనేదానిపై పన్నీర్ సెల్వం ఇతర మంత్రులతో చర్చించనున్నారు. అనారోగ్యానికి గురై సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం జయలలిత ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిఉంటుందని వైద్యులు ప్రకటించిన దరిమిలా జయ నిర్వహిస్తోన్న శాఖలన్నింటినీ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. (అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం) అమ్మ లేకుండా ఆమె కేబినెట్ తీసుకునే నిర్ణయాలు ఎలాం ఉంటాయో వేచిచూడాలి. -
2 వేల క్యూసెక్కులు వదలండి
కావేరి జలాలపై కర్ణాటకకు మళ్లీ సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్రానికి సుప్రీంకోర్టు మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది. విచారణ బుధవారమూ కొనసాగనుంది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మసనం మంగళవారం ఈ అంశంపై తీర్పునిస్తూ.. రెండు ప్రభుత్వాలు శాంతి, సామరస్యం నెలకొనేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా కోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ కావేరి జలాల వాస్తవ స్థితిగతులను పరిశీలించి, తయారుచేసిన నివేదికను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. కావేరి వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వేసిన అప్పీళ్లపై విచారణ అనంతరం పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. అయితే రాజ్యాంగంలోని 131, 262 అధికరణలు, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 మార్గదర్శకాల ప్రకారం కావేరి జలాలపై రాష్ట్రాలు వేసిన అప్పీళ్లు విచారణార్హం కావని అటార్నీ జనరల్ వాదించారు. -
కావేఢీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అఖిలపక్ష ఆందోళనతో తమిళనాడు దద్దరిల్లింది. కావేరీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అనేక పార్టీల నేతలు కదం తొక్కారు. రైల్‌రోకోలు నిర్వహిం చడం ద్వారా కేంద్రానికి తమ నిరసన గళం వినిపించా రు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, వైగో సహా సుమారు వేలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాల తరబడి కావేరీ జలాల సమస్య నెలకొని ఉంది. సుప్రీంకోర్టులో జరిపిన న్యాయపరమైన పోరాటం ద్వారా కావేరీ జలాల వాటాను తమిళనాడు సాధించుకుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కావేరీ పర్యవేక్షణ కమిటీ, కావేరీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన నెలకొంది. కమిటీ, బోర్డు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పుతో స్పష్టం చేసినా కేంద్రం అడ్డుకుందని అని ఆరోపిస్తూ ఇటీవల అఖిలపక్షం సమావేశమైంది. కావేరీ సమస్యల సాధనకు రైతు సంఘాలతో కలిసి ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించేందుకు సమావేశంలో నిర్ణయించారు. ఉత్తరాది నుంచి తమిళనాడుకు చేరుకునే రైళ్లు 48 గంటల పాటూ పట్టాలపైనే ఉండిపోయేలా రైల్‌రోకోలు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కావేరీ సమస్యపై కేంద్రంపై వత్తిడి తెచ్చేలా భారీఎత్తున ఆందోళనకు అందరూ సన్నద్ధం కావాలని ఆందోళనకు నాయకత్వం వహించిన డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ పిలుపునిచ్చారు.ఈ పిలుపు మేరకు అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీల నేతలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకోకు దిగారు. చెన్నై పెరంబూరు రైల్వేస్టేషన్లో స్టాలిన్ నేతృత్వంలో రైల్‌రోకో పోరాటం సాగింది. పెరంబూరు తిరువళ్లూరు రోడ్డులోని రైల్వే క్రీడా మైదానం నుంచి 1500 మందితో కిలోమీటరు దూరంలోని రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కావేరీ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగి పెరంబూరు రైల్వేస్టేషన్‌ను ముట్టడించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. స్టాలిన్ సహా పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు వేలాది మంది కార్యకర్తలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని రైల్వేస్టేషన్‌లోకి చొరపడ్డారు. చెన్నైబీచ్-ఆవడి లోకల్రైలును కదలనీయకుండా పట్టాలపై కూర్చుండిపోయారు. దీంతో స్టాలిన్ సహా వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. చెన్నై తూర్పు జిల్లా డీఎంకే తరఫున టీ నగర్ బస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి మాంబళం రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు వెళుతుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సైదాపేట రైల్వేస్టేషన్ వద్ద సైతం డీఎంకే కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా, తమిళ మానిల కాంగ్రెస్ తరపున చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్ వద్ద, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వామపక్ష పార్టీల నేతలు జీ రామకృష్ణన్, త పాండియన్, ముత్తరసన్ సెంట్రల్ రైల్వేస్టేషన్ వద్ద, విరుదునగర్‌లో ఆర్ నల్లకన్ను, బేసిన్ బ్రిడ్జి వద్ద వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు రైల్‌రోకో నిర్వహించారు. తిరుచ్చిరాపల్లి కుడమురుట్టి వంతెనపై కొందరు ఆందోళనకారులు పశువులను అడ్డంగా నిలబట్టి, అలాగే రైలుపట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. అలాగే తంజావూరులో రైలు పట్టాలపై వంటావార్పు, వేలూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, నాగపట్టినం, తిరువారూరు, మధురై, కడలూరు, కోయంబత్తూరు, సేలం, కృష్ణగిరి, తిరునెల్వేలి, విళుపురం జిల్లాల్లో రైల్‌రోకో ఆందోళన భారీ ఎత్తున సాగింది. ఆయా జిల్లాల్లో ఆందోళనలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఇవే డిమాండ్లపై పుదుచ్చేరీలో సైతం రైల్‌రోకోలు నిర్వహించారు. రైల్‌రోకోలు పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు, రైతులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. రైల్‌రోకో పిలుపును అందుకున్న లక్షలాది మంది కార్యకర్తలు సోమవారం ఉదయం నుంచే రైల్వేస్టేషన్ల్కు రావడం ప్రారంభించగా భారీ సంఖ్యలో పోలీసులు బారికేడ్లను సిద్ధం చేసుకుని అడ్డుకున్నారు. రైల్‌రోకో కారణంగా అనేక చోట్ల రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
కావేడి
• కావేరి బోర్డు కోసం స్టాలిన్ నిరాహారదీక్ష • కేంద్రంపై విమర్శలు • వైగో ఆందోళన సాక్షి ప్రతినిధి, చెన్నై :కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం తంజావూరులో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. తమిళనాడు, కర్ణాటక మధ్య ప్రవహిస్తున్న కావేరీ జలాల వినియోగంపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు కావేరీ పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ప్రకటించడంతో బోర్డు ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని అనేక పార్టీలు, రైతు సంఘాలు కొన్ని రోజులుగా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావేరీ పర్యవేక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో బీజేపీ కాలు మోపలేని పరిస్థితి, కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసం కేంద్రం పాకులాడుతోందని విమర్శించారు. బోర్డు ఏర్పాటుకు మోకాలొడ్డడం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమిళనాడుకు చేసిన పెద్ద ద్రోహమని ఆయన అన్నారు. కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుపై ప్రధాని సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జయలలితపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి లేదా ఆ తరువాత ప్రాధాన్యత కలిగిన మంత్రిని ప్రశ్నించాలని చెప్పారు. ప్రతిపక్ష నేతలుగా తమ అభిపాయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని, ఇందులో భాగంగానే నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలనేది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అధికార పార్టీ జోక్యం ఉండకూడదని మాత్రమే తాము కోరుకున్నామని చెప్పారు. స్టాలిన్ దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండీఎంకే ఆందోళన : ఇలా ఉండగా, కావేరీ అంశంపై ఎండీఎంకే అధినేత వైగో నేతృత్వంలో శుక్రవారం తిరువారూరులో భారీ ఆందోళన చేపట్టారు. కర్నాటకకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రైతులను బాధిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మేమే ప్రధానిని కలుస్తాం..
తమిళనాడుః కావేరీజల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్యే కాక, పార్టీల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను తెచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలకు తోడు రాజకీయ నాయకుల రంగప్రవేశంతో పరిస్థితి మరింత ఉధ్రుతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు డీఎంకే నాయకుడు, విపక్ష నేత ఎం కే స్టాలిన్ పావులు కదుపుతున్నారు. కావేరీ సమస్యపై పాలక పార్టీ విఫలమైన పక్షంలో తామే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు. కావేరీ సమస్య పై డీఎంకే పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష నేత స్టాలిన్ వెల్లడించారు. సమస్యపై చర్చించేందుకు అన్ని పార్టీల ప్రతినిధి బృందం తో కలసి ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుస్తామన్నారు. అయితే అధికార, ప్రతిపక్షాలతోపాటు రాజకీయ పార్టీలన్నీ కలసి సమస్యను పరిష్కరించాలన్న చర్యకు ఏఐడీఎంకే ప్రభుత్వం ఏమాత్రం ఇష్టపడలేదని, పైగా చట్టపరంగానే సాధించాలని యోచించినట్లు ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కలసి మాత్రమే సమస్యను పరిష్కరించగలవన్న ఆలోచనను పాలక పార్టీకి ఎన్నోసార్లు తెలియజేశామన్నారు. వారి స్పందనకోసం ఎంతో ఓపిగ్గా నిరీక్షించినా.. ఏఐడీఎంకే అటు దిశగా ఏమాత్రం అడుగు వేయడం లేదని పార్టీ సభ్యులు ఆరోపించారు. పార్టీ నిర్వహించిన నిరాహార దీక్ష ప్రదర్శనలో కావేరీ సమస్యపై స్టాలిన్ ప్రసంగించారు. నేటి నిరాహార దీక్షను చూసైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని, అందుకు తమ మద్దతు, సహకారం పూర్తిశాతం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని స్పష్టం చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నపుడు ప్రధాన సమస్యలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించేదని స్టాలిన్ ఈ సందర్భంలోగుర్తు చేశారు. -
కావేరి వివాదం.. కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశాలు
-
ఉపశమనం
► కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు ప్రక్రియపై స్టే ► క్షేత్రస్థాయి పర్యటనకు నిపుణుల బృందం ► కర్ణాటక సర్కార్‌కు స్వల్ప ఊరట ►రోజుకు 2 వేల క్యూసెక్కులు చొప్పున ఈ నెల 7 నుంచి 18 వరకు నీరు విడుదల నీరు చేయాలి ► తదుపరి విచారణ 18కి వాయిదా ►ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు రోజుకు 2వేల క్యూసెక్కులు... కర్ణాటక, తమిళనాడుతో పాటు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగీ వాదనలు విన్న ఉదయ్‌లలిత్, దీపక్‌మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 7 నుంచి 18 వరకూ తమిళనాడుకు కావేరి నదీ జలాలలను కర్ణాటక విడుదల చేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఈనెల 17న అందజేయాలంది. అంతేకాకుండా కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధిస్తూ తీర్పు చెబుతూ తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేసింది. బెంగళూరు : కావేరి నీటి విడుదలపై సుప్రీంకోర్టులో పలు పర్యాయాలు ఎదురుదెబ్బ తగిలిన కర్ణాటక సర్కార్‌కు మంగళవారం అత్యన్నత న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నట్లుగానే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు ప్రక్రియపై స్టే విధించింది. అదే విధంగా నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేయాలని సూచించింది. రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 7 నుంచి 18 వరకూ తమిళనాడుకు కావేరి నదీ జలాలను కర్ణాటక విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మూడు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనమనే అని చెప్పాలి. వివరాలు... కావేరి నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేసే విషయమై సుప్రీంకోర్టులో గత నెల 5 నుంచి పలు దఫాలుగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కాగానే కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఫాలీ నారిమన్ వాదన ప్రారంభిస్తూ... గత నెల 30న సుప్రీం కోర్టు చెప్పినట్లు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని ఈనెల ఒకటి నుంచి ఆరు వ రకూ మొత్తం 36 వేల క్యూసెక్కుల విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందులో ఇప్పటి వరకూ కేవలం 12 వేల క్యూసెక్కుల నీటిని వదిలామని, మిగిలిన నీటిని ఆక్టోబర్ 6 లోపు విడుదల చేస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈనెల 18న సుప్రీంకోర్టు త్రిసభ్య పీఠం ముందుకు రానుందని ఈ సందర్భంగా ధర్మాసనానికి గుర్తుచేశారు. అందువల్ల కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని ఈ సమయంలో చెప్పడం సమంజసం కాదన్నారు. ఇదే సందర్భంలో ‘గతంలో మీరు ఒక సారి 15 వేల క్యూసెక్కులు, మరోసారి 12 వేల క్యూసెక్కులు అటుపై 6 వేల క్యూసెక్కుల కావేరి జలాలలను తమిళనాడుకు విడుదల చేయాలని చెప్పారు. మీరు ఏ ప్రతిపాదికన తీర్పు చెప్పారో అర్థం కావడం లేదు.’ అన్నారు. ఈ సమయంలో కలుగజేసుకున్న న్యాయమూర్తులు ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పుతో పాటు గణాంకాలను అనుసరించి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందుకు ప్రతిస్పందించిన నారిమన్ ‘ఆదేశాలు జారీ చేయడానికి గణాంకాల కంటే వాస్తవ పరిస్థితులు ప్రమాణికం’ అన్నది తమ అభిప్రాయమని కోర్టుకు తెలియజేశారు. ఈ సమయంలో ద్విసభ్య ధర్మాసనం ఈనెల 7 నుంచి 18 వరకూ రోజుకు ఎంత నీటిని విడుదల చేస్తారో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కోర్టుకు తెలియజేయాలని సూచిస్తూ వాదనను 3:15 గంటలకు వాయిదా వేసింది. కోర్టు బయట రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్‌తో పాటు న్యాయ, నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించిన అనంతరం రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని వదలగలమని కోర్టుకు నారిమన్ తెలియజేశారు. ఇదిలా ఉండగా కోర్టులో విచారణ సందర్భంగా కావేరి న దీ పరివాహక రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పర్యటించడానికి వీలుగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ జీ.ఎస్ ఝ నేతృత్వంలో నిపుణుల కమిటీ అవకాశం కల్పించాలని అటర్నీ జనరల్ ముకుల్ రస్తోగి విన్నవించారు. ఇందులో నాలుగు రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లతో నీటి పారుదల రంగానికి చెందిన పలువురు నిపుణులు ఉంటారని తెలిపారు. అంతేకాకుండా కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు సుప్రీం కోర్టు పరిధిలోకి రాదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక తమిళనాడు తరఫున వాదలను వినిపించిన శేఖర్నాబ్డే ఎప్పటిలాగానే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుకు పట్టుబట్టారు. సుప్రీం తీర్పుపై ఎవరు ఏమన్నారంటే... ఒకే మాటపై నిలబడినందుకే కావేరి విషయంలో అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడినందుకే మనకు ఊరట లభించింది. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో పాటు కేంద్ర మంత్రులందరికీ ధన్యవాదాలు చెబుతున్నా. నదిలో రోజుకు 2వేల ఔట్‌ఫ్లో ఉండటం సాధారణం అందువల్ల మనం ఎక్కువ విడుదల చేసే అవసరమే రాదనుకుంటున్నా. - ట్విట్టర్లో సీఎం సిద్ధు అంత నీరు ఉందోలేదో? సుప్రీం కోర్టు తీర్పు కొంత ఊరట లభించింది. అయితే రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి మన వద్ద ఆమేరకు నీటి లభ్యత ఉందోలేదో. - కావేరి హిత రక్షణ సమితి అధ్యక్షుడు మాదేగౌడ అనివార్యం కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఈనెల 18న సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. అందువల్ల ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా పాటించాల్సిందే. అయితే మండలి ఏర్పాటుపై స్టే, రోజుకు 2వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వాదలాలన్నది ఊరట ఇచ్చే విషయం. - జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ -
తమిళనాడుకు నీళ్లివ్వండి
కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున అక్టోబర్ 7 నుంచి 18 వరకూ కావేరి జలాల్ని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటకను ఆదేశించింది. సెప్టెంబర్ 5 నుంచి 30 వరకూ 17.5 టీఎంసీల నీటిని విడుదల చేశామని,ఈ నెల 6 నుంచి మరో 3.1 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్న క ర్ణాటక లిఖిత పూర్వక సమాచారం మేరకు సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. కావేరి నీటి నిర్వహణ మండలి సుప్రీం పరిధిలోకి రాదని, సరైన అవగాహన లేక గతంలో మండలి ఏర్పాటుకు సమ్మతించామని కేంద్రం తెలిపింది. తమిళనాడు మాత్రం మండలి ఏర్పాటుకు పట్టుబట్టింది. తమిళనాడుకు నీటి విడుదలతో పాటు కేంద్ర జలసంఘం చైర్మన్ జీఎస్ ఝా నేతృత్వంలోని నిపుణుల కమిటీ కావేరి నదీ పరివాహక రాష్ట్రాల్లో పర్యటించి ఈ నెల 17న నివేదిక అందజేయాలని సుప్రీం సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది. నీటి మట్టాలు పరిశీలించనున్న కమిటీ కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝా నేతృత్వంలోని నిపుణుల బృందం అక్టోబర్ 7 నుంచి 15 వరకూ కావేరీ పరీవాహ క ప్రాంతంలో పర్యటించి డ్యామ్‌ల నీటిమట్టాలు, పంటలు వంటి క్షేత్ర స్థాయి వివరాల్ని సేకరించనుంది. -
కావేరిపై బెట్టువీడిన కర్ణాటక.. నీటి విడుదల
న్యూఢిల్లీ: ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం తన బెట్టు వీడింది. తమిళనాడుకు కావేరి జలాలను విడిచిపెట్టింది. అయితే, ఎంతమొత్తంలో విడిచిపెడుతున్నదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సోమవారం రాత్రి ఈ నీటిని విడుదల చేసినట్లు సమాచారం. మరోపక్క, ఈ జలాల విడుదల విషయంపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం రెండుసార్లు భేఖాతరు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం కుదరదని, ఒక వేళ ఇవ్వాల్సి వచ్చినా డిసెంబర్లో మాత్రమే ఇస్తామని కర్ణాటక సుప్రీంలో పిటిషన్ వేయగా దానిని కోర్టు నిరాకరించింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని చెప్పడంతోపాటు కేంద్రాన్ని కావేరి జలాలపై ప్రత్యేక నిర్వహణ బోర్డును ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం సుదీర్ఘంగా భేటీ అయిన కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసేందుకు తీర్మానం చేసింది. అయితే, తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు, తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేస్తామని ఎంత నీటిని విడుదల చేస్తారో చెప్పకుండానే తన నిర్ణయాన్ని వెలువరించింది. ఆ ప్రకారమే రాత్రి నీళ్లను విడిచిపెట్టింది. -
సాగునీటికీ కావేరి జలాలు
-
రేపు 2 గంటల వరకు డెడ్‌లైన్!
తమినాడుకు నీళ్లు వదిలారా? లేదా? చెప్పాల్సిందే కర్ణాటకకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: కావేరి జలాల విడుదల విషయంలో తన ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం మానుకోవాలని ఘాటుగా సూచించింది. పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేశారా? లేదా? అన్నది మంగళవారం మధ్యాహ్నం 2 గంటలలోపు తనకు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం డెడ్‌లైన్ విధించింది. కావేరి జలాల పంపిణీ విషయంలో తమిళనాడు-కర్ణాటక మధ్య రాజీ కుదిర్చేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం ఆదేశాల మేరకు నీటి విడుదలకు కర్ణాటక ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం ముదిరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కావేరి రిజర్వాయర్లలోని నీటిని పరిశీలించేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటుచేయాలని కర్ణాటక కోరుతున్నా.. కమిటీ ఏర్పాటుచేయడం వీలుకాదని, పరిశీలక కమిటీ ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ రైతుల కోసం కావేరి నీళ్లను అధికంగా విడుదల చేయాలని తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అందుకు న్యాయస్థానం ఒప్పుకోవడంతో కర్ణాటక ఆందోళన బాటపట్టింది. కావేరి నీళ్ల విషయమై బెంగళూరు సహా కర్ణాటక అంతటా ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని నగరాలు నీటికొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో నవంబర్ వరకు తమిళనాడుకు నీళ్లు వదిలే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటున్నారు. -
మరో కుట్ర!
కావేరి బోర్డు అనుమానమే! సుప్రీంలో కేంద్రం అడ్డు మోదీ సర్కారుపై రాష్ట్రంలో ఆక్రోశం కమలనాథుల్లో భిన్న స్వరాలు కోర్టు కన్నెర్రతో కంటితుడుపు చర్యగా నీళ్లు కావేరిజలాలపై తమిళులకు ఉన్న హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం నడుం బిగించింది. కర్ణాటక కుట్రల్ని తలదన్నే రీతిలో కొత్త కుట్రకు కేంద్రం వ్యూహ రచన చేయడం తమిళనాట ఆక్రోశాన్ని రగిలిస్తోంది. కావేరి అభివృద్ధి మండలి ఏర్పాటు కష్టమే అంటూ కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పష్టం చేయడంతో బీజేపీపై ఇక్కడి రాజకీయ పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. ఎక్కడ కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందేమోనని కర్ణాటక నీరు విడుదలకు పూనుకుంది. సాక్షి, చెన్నై: తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరి జల వివాదం జఠిలం అవుతోంది. కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీదున్నా, కర్ణాటకలో రాజకీయ లబ్ధికోసం పాలకులు కాలయాపన చేసే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లోకి ఆ తీర్పు ఎక్కినా, ఆచరణలో పెట్టడంలో జరుగుతున్న జాప్యం కావేరి జలాల కోసం పెద్ద సమరమే చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి నీటిని విడుదల చేయించుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు స్పందిస్తున్నా, కర్ణాటక పాలకులు, కేంద్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. మరో కుట్ర: గత నెల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వుల హెచ్చరిక మేరకు ట్రిబ్యునల్ తీర్పు అమలుకు తగ్గ ప్రయత్నాల్లో కేంద్రం నిమగ్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ బోర్డుకు ప్రతినిధిగా సుబ్రమణ్యం పేరును సిఫారసు చేశారు. నిన్నటి వరకు అన్ని సజావుగానే సాగినా, సోమవారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్ తమిళనాట ఆక్రోశాన్ని రగిల్చింది. అందులో కావేరి అభివృద్ధి మండలి తక్షణ ఏర్పాటు కష్టం అని, ఈ ఉత్తర్వుల్ని కేంద్రానికి ఇచ్చే అధికారం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు లేదన్నట్టుగా కేంద్రం స్పష్టం చేయడంతో తమ హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం కొత్త కుట్రతో బయలు దేరిందన్న ఆందోళనను డెల్టా అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పులో అభివృద్ధి మండలి ఏర్పాటుపై సిఫారసు చేయబడిందే గానీ, తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందే అన్న స్పష్టత లేదని, ఈ దృష్ట్యా, తక్షణం బోర్డును ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చడం గమనార్హం. అలాగే, ఈ బోర్డు ఏర్పాటు అన్నది పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశంగా పేర్కొనడం తమిళనాడులోని రాజకీయ పక్షాల నాయకులు అగ్గి మీద బుగ్గిలా మండి పడుతున్నారు. గత వారం రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో బోర్డు ఏర్పాటుకు తగ్గ ప్రాథమిక కసరత్తులు చేపట్టామని నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానిస్తే, ఇప్పుడు కేంద్రం తన మాట మార్చడాన్ని తప్పబడుతున్నారు. నిర్ణయంలో మార్పు ఏమిటో అంటూ సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రుల ఒత్తిళ్లకు మోదీ సర్కారు తలొగ్గినట్టు స్పష్టం అవుతోంది. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది మంగళవారం తేలనున్నది. ఆక్రోశం: తమకు కావేరి మీదున్న హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం కొత్త కుట్రతో ముందుకు సాగుతుండడం తమిళనాట ఆక్రోశాన్ని రగిల్చి ఉన్నది. డెల్టా అన్నదాతలు, రైతు సంఘాలు తీవ్రంగా కేంద్రం తీరును దుయ్యబట్టే పనిలో పడ్డారు. రైతు సంఘం నాయకులు టీఆర్ పాండియన్ పేర్కొంటూ తమ హక్కుల్ని కాలరాయడానికి కేంద్రం సైతం సిద్ధంగా ఉందని, ట్రిబ్యునల్ ఆదేశాల అమల్లో ఇన్నాళ్లు సాగిన జాప్యం వెనుక కేంద్రం తీరు ఏమిటో అన్నది తాజాగా స్పష్టమైనట్టు మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచే విధంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి , పోరాటాలకు అన్ని పార్టీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి పేర్కొంటూ, కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ లబ్ధి కోసం కేంద్రం నాటకం రచించినట్టుందని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి కోసం తమిళుల హక్కులకు అడ్డు పడితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలని, అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరచడంతో పాటుగా అఖిల పక్షానికి పిలుపు నివ్వాలని డిమాండ్ చేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించే విధంగా ముందుకు సాగుతుండడం బట్టి చూస్తే, భవిష్యత్తుల్లో కావేరి జలాలు తమిళులకు దక్కేనా అన్న ఆందోళన ఉందన్నారు. సీపీఎం నేత జి.రామకృష్ణన్ పేర్కొంటూ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన కేంద్రం, తాజాగా ఆ చిచ్చుకు మరింత ఆజ్యం పోయడానికి సిద్ధమైనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నం అయిందని, అందరూ ఏకం అవుదామని ఆయా పార్టీలకు పిలుపు నిచ్చారు. డీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ పేర్కొంటూ కర్ణాటకకు కేంద్రం వత్తాసు పలుకుతున్నదన్న విషయం తాజాగా స్పష్టమైందని మండి పడ్డారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొంటూ నిన్నటి వరకు బోర్డు ఏర్పాటు ప్రయత్నాల్లో ఉండి, ఇప్పుడు మాట మార్చడం కేంద్రానికి తగదు అని మండి పడ్డారు. తమిళులకు ద్రోహం లక్ష్యంగా కేంద్రం సైతం కుట్రలకు పాల్పడుతున్నట్టుందని, దీనిని ప్రతి ఘటించి తీరుతామన్నారు. బీజేపీ నేతలు అయితే, భిన్న స్వరాలు పలకడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాల్ని పట్టించుకోని కర్ణాటక సరా్కారు, బోర్డు ఏర్పాటు చేసినంత మాత్రన నీటిని విడుదల చేస్తుందా? అని బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ తమిళులకు వ్యతిరేకంగా ఎవరు కుట్రలు చేసినా సహించబోమని, కేంద్ర మంత్రులు మధ్యవర్తులుగా ఉండాలే గానీ, ఒక రాష్ట్రానికి అనుకూలంగా స్పందించకూడదని వ్యాఖ్యానించడం ఆలోచించదగ్గ విషయమే. మంగళవారం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ ఉంది. ఇక, ఎక్కడ కోర్టు ఆగ్రహానికిగురికావాల్సి ఉంటుందో అన్న బెంగతో తమిళనాడుకు కంటితుడుపు చర్యగా నీటి విడుదలకు కర్ణాటక సర్కారు నిర్ణయించడం కొసమెరుపు. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రత పెంచి ఉన్నారు. ఆదివారం కర్ణాటక పోలీసులు తమిళ వాహనాల మీద దాడి చేసిన సమాచారం ఇక్కడి వర్గాల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. -
సాగునీటికీ కావేరి జలాలు
బెంగళూరు/న్యూఢిల్లీ: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసే క్రమంలో కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్ర సాగునీటి అవసరాలకు నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి అన్ని అధికారాలు కట్టబెడుతూ తీర్మానం చేశారు. మంగళవారం మధ్యాహ్నంలోగా తమిళనాడుకు నీటి విడుదలపై సమాచారమివ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో తీర్మానం తెచ్చారు. 4 కావేరి రిజర్వాయర్ల నుంచి తాగునీటికే నీటిని విడుదల చేయాలన్న గత తీర్మానంలో మార్పులు చేస్తూ... సాగునీటి అసవరాలకూ నీరివ్వొచ్చని తాజా తీర్మానంలో పేర్కొన్నారు. తమిళనాడుకు నీటి విడుదలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తామంటూ పరోక్ష సంకేతాలిచ్చిన సీఎం సిద్ధరామయ్య... తాగునీటి అవసరాలతో పాటు, పంటల్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కర్ణాటక ఎప్పుడూ కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించలేదని పేర్కొన్నారు. కావేరీ పరివాహకంలో రైతులు నీటి విడుదల చేయాలని కోరుతున్నారని, నీటిని విడుదల చేస్తే కొంత సహజంగా తమిళనాడుకు వెళ్తుందన్నారు. బోర్డు ఏర్పాటుపై ఆదేశించలేరు: కేంద్రం ఈ వివాదంపై కేంద్రం తొలిసారి స్పందించింది. కావేరి నీటి నిర్వహణ బోర్డును(సీడబ్ల్యూఎంబీ) ఏర్పాటు చేయాలని తమను ఆదేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలిపింది. కావేరి పరివాహకంలో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ కోసం సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామంది. వివాదం చట్టసభల పరిధిలో ఉందని, సీడబ్యూఎంబీ ఏర్పాటు ఆదేశాల్ని సమీక్షించడం, వెనక్కి తీసుకోవడమో చేయాలని కోరింది. -
రేపటిదాకా తమిళనాడుకు నీళ్లివ్వం
- చట్టసభల్లో నిర్ణయం తీసుకుంటాం: కర్ణాటక - సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ - బెంగళూరులో దేవెగౌడ దీక్ష సాక్షి, బెంగళూరు: కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం వరకు తమిళనాడుకు వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం మీడియాకు వెల్లడించారు. ‘గత నెల 23 నాటికి నాలుగు జలాశయాల్లో 27.2 టీఎంసీల నీరుండేది. దాంతో తాగునీటి అవసరాలకే వాడాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం 32.7 టీఎంసీల నీరుంది. నీటిని మా సాగునీటి అవసరాలకు వదలాలో, వద్దో సోమవారం ఉభయసభల భేటీలో నిర్ణయం తీసుకుంటాం’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. కాగా, తమిళనాడుకు కావేరి నీరివ్వాలన్న ఆదేశాలను పునఃసమీక్షించాలంటూ కర్ణాటక సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే, ఈనెల 4 నాటికల్లా కావేరి జల నిర్వహణ బోర్డును నియమించాలంటూ కేంద్రానికి జారీ చేసిన ఆదేశాలనూ సమీక్షించాలని కోరింది. మోదీ మధ్యవర్తిత్వం వహించాలి..: ప్రధాని మోదీ మధ్యవ ర్తిత్వం వహించి కావేరి సమస్యను పరిష్కరించాలని, కర్ణాటక లకు న్యాయం చేయాలనే డిమాండ్లతో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడబెంగళూరులో శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ నేత ఖర్గే భేటీ అయిన సందర్భంలో దేవెగౌడ భావోగ్వేగంతో కన్నీరు కార్చారు. మధ్యవర్తిత్వం వహించే విషయమై మోదీని ఒప్పిస్తామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హామీ ఇవ్వడంతో రాత్రి ఆయన దీక్ష విరమించారు. -
ప్రస్తుతం నీటి విడుదల కష్టం: సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం వరకూ వదిలేది లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ‘కావేరి జలాల’ కేసు విచారణలో భాగంగా తమిళనాడుకు శనివారం నుంచి రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పన ఈనెల ఆరు వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం అఖిల పక్షం నిర్వహించి ఆయన అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మంత్రి మండలి సమావేశం నిర్వహించి అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘ఈనెల 3న (సోమవారం) ఉభయసభల సమావేశం నిర్వహించనున్నాం. అటుపై మాత్రమే నీటి విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకోనున్నాం. అంతేకాకుండా ఈనెల 23న జరిగిన ఉభయసభల సమావేశంలో కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు జలాశయాల్లో 27.2 టీఎంసీల నీరు మాత్రం ఉండేది. అందువల్ల అప్పుడు ఆ నీటిని తాగునీటికి మాత్రమే వాడాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం నీటి లభ్యత 32.7 టీఎంసీలకు పెరిగింది. అందువల్ల పెరిగిన నీటిని కర్ణాటకలోని రైతులకు సాగుకోసం వదలాలా లేదా అన్న విషయంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నాం. కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పునఃపరిశీలన అర్జీ వేయనున్నాం.’ అని పేర్కొన్నారు. అఖిల పక్షంలో కూడా అదే మాట... అఖిల పక్షలో ఒక్కరూ కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడుకు వదలకూడదని తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. కాగా, సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కావేరి నీటి నిర్వహణ మండలి విషయంలో బీజేపీ నాయకులు కర్ణాటకలో ఒక రకంగా, ఢిల్లీలో మరోరకంగా వాదనలు చేయడమే కాకుండా ప్రధానిపై ఒత్తిడి తేవడానికి వెనుకాడుతున్నారని చిక్కోడి పార్లమెంటు సభ్యుడు ప్రకాశ్ హుక్కెరి పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్‌కు చెందిన దాదాపు అందరు నాయకులతో పాటు పలువురు జేడీఎస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున జగదీష్‌శెట్టర్, శోభకరంద్లాజే తదితరులు పాల్గొనగా జేడీఎస్ తరఫున కుమారస్వామి, వై.ఎస్.వీ దత్త తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సుప్రీం కోర్టు సెప్టెంబర్ 30న కావేరి నీటి విడుదలతో పాటు కావేరి నీటి నిర్వహణమండలి బోర్డు విషయమై ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ పునఃపరిశీలన అర్జీ కూడా వేయనున్నామన్నా ప్రభుత్వ ప్రతిపాదనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించనట్లు సమాచారం. నిర్వహణ మండలి వద్దేవద్దు... శనివారం జరిగిన అఖిల పక్షం సమావేశంలో కావేరి నీటి నిర్వహణ మండలిపైనే ఎక్కువ సేపు చర్చ జరిగింది. ఈ మండలిని ఏర్పాటు చేస్తే ప్రతి నీటి చుక్కకోసం కేంద్రం వైపు చూడాల్సి వస్తుందన్న విషయాన్ని అందరు నాయకులు ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ విషయమై సమావేశం అనంతరం మీడియాతో జగదీష్‌శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ...‘కావేరి నీటి నిర్వహణ మండలి’ ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకువస్తాం. అంతేకాకుండా కావేరి నదీ జలాల పంపకం విషయంలో మధ్యవ్యర్తిత్వం వహించాల్సిందిగా కోరుతాం.’ అని పేర్కొన్నారు. ఇక వై.వీఎస్ దత్త కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కావేరి నీటిని తమిళనాడుకు వదలకూడదని తాము ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. అంతేకాకుండా నీటిని వదలకూడదనే విషయానికి సంబంధించి రాష్ట్రంలోని అందరు ప్రజాప్రతినిధులు సుప్రీం కోర్టులో వ్యక్తిగత అఫిడవిట్లు దాఖలు చేయాలనే సలహాకూడా ఇచ్చామన్నారు. కావేరి నిర్వహణ మండలికి కర్ణాటక తరఫున సభ్యుల పేర్లు సూచించకూడదని తెలిపారు. నారిమన్ పై విరుచుకపడిన విపక్షాలు... కర్ణాటక తరఫున వాదనలు వినిపిస్తున్న ఫాలీ నారిమన్ వ్యవహార శైలిపై అఖిల పక్ష సమావేశంలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో శుక్రవారం ఆయన వాదనలు వినిపించకపోవడం సరికాదన్నారు. అందువల్లే కావేరి నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు చెప్పడంతో పాటు పదేపదే కర్ణాటకకు తీర్పు వ్యతిరేకంగా వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఆయన్ను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం సిద్ధు కలుగజేసుకుని ఈ సమయంలో ఫాలీనారిమన్ను తప్పించడం సరికాదన్నారు. -
దేవెగౌడ నిరాహార దీక్ష
సాక్షి, బెంగళూరు: కావేరి జలాల వివాదంపై ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌తో మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ నేత దేవెగౌడ శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అనూహ్యంగా నిరాహార దీక్షకు దిగారు. కురువృద్ధుడు, 84 ఏళ్ల దేవెగౌడ మండుటెండలో విధానసౌధ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షలో కూర్చున్నారు. కావేరి క్షేత్రస్థాయి పరిశీలనకు తమిళనాడుతో పాటు కర్ణాటకకు కూడా కేంద్రం నిపుణులను పంపించాలనేది ఆయన డిమాండ్. దీక్ష సమాచారం అందుకున్న కేంద్రమంత్రి అనంత్ కుమార్ రాత్రి 8 గంటల ప్రాంత ంలో శిబిరం వద్దకు చేరుకుని ప్రధాని మెదీని మధ్యవర్తిత్వం వహించే విషయంలో ఒప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆయన రాత్రి 8.45 నిముషాలకు దీక్ష విరమించారు. అంతకు ముందు ఉదయం దీక్ష విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన పోరాటానికి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే భేటీ సమయంలో దేవెగౌడ భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించే విషయంపై స్పష్టత వచ్చేవరకు తాను నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కనీసం నా చావు తరువాతైనా నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వం వహిస్తారేమోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకు ముందు దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ...ఇప్పటి వరకూ కావేరి నదీ జలాల పంపకం విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు కర్ణాటకకు మరణశాసనం లాంటివని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉత్పన్నమవుతుంటే తమిళనాడుకు వ్యవసాయానికి కావేరి నదీ జలాలను వదలాలని చెప్పడం ఎంతవరకూ సమంజసమని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార్లు ఆయన్ను కలిసి దీక్షను విరమింపజేయాలని కోరారు. ఈ విషయంలో తాము ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన తన దీక్షను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా దీక్షకు ముందు ఆయన బెంగళూరులోని బసవన గుడిలోని కారంజి ఆంజనేయ దేవస్థానంలో, కే.ఆర్ రోడ్డులోని కోటే వెంకటరమణ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా 84 ఏళ్ల వయస్సున్న దేవెగౌడ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం పట్ల పార్టీలకు అతీతంగా అందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు. జేడీఎస్ కార్యకర్తలు తమ నాయకుడికి ఏమవుతుందోనని ఆందోళన చెందారు. -
గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రధాని దీక్ష
బెంగళూరు: కావేరి జలాల వివాదం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతోంది. ఈ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ శనివారం ఆందోళనకు దిగారు. కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దీక్షవేదిక వద్ద దేవెగౌడను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ’కావేరి జలాల విషయంలో ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ భేటీ నిర్వహిస్తారని నాకు తెలియవచ్చింది. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మేమేమీ నేరగాళ్లం కాదు. రెండురాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో ఉన్న నీటిని పరిశీలించేందుకు నిపుణులను ఏర్పాటు చేయాలి’అని దేవెగౌడ పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో ప్రధాని మోదీ కర్ణాటకకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరోతేదీ వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున నీటిని తమిళనాడుకు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటకలో మళ్లీ ఆందోళనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా దేవేగౌడ దీక్ష
-
కర్ణాటకకు మళ్లీ ఎదురుదెబ్బ
♦ కావేరి నీళ్లు వదలాల్సిందేనని ♦ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు సాక్షి, బెంగళూరు: కావేరి జలాల విషయంలో కర్ణాటకకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శనివారం నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఆరు రోజుల పాటు మొత్తం 36 వేల క్యూసెక్కుల నీటిని వదలాలని ఆదేశించింది. ఈ నెల 4 లోపు కావేరి నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. మండలిలో ప్రతినిధులుగా ఆయా రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉంటారనే వివరాలను శనివారంలోపు అందజేయాలని కావేరి నదీ పరివాహక రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను ఆదేశించింది. నీటి పారుదల, వ్యవసాయ రంగాల నిపుణులతో కూడిన కమిటీ ఈ నెల 5ప ఇరు రాష్ట్రాల్లో పర్యటించాలనీ, వాస్తవ పరిస్థితులను తమకు తెలియజేయాలని పేర్కొంటూ విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. మీ వల్ల సుప్రీంకోర్టు గౌరవానికి భంగం ‘మీ వల్ల దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవానికి భంగం వాటిల్లింది’ అని కర్ణాటక సర్కారుపై కోర్టు మండిపడింది. మా ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలు పాటించాల్సిందేనంది. ప్రధాని సమావేశం : కావేరి వివాదంపై ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. కొంతమంది మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి ఉన్న వివిధ మార్గాలేంటో వారు చర్చించారు. -
కర్ణాటక తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
-
సరిహద్దుల్లో నేను నిరాహార దీక్ష చేస్తా!
-
సయోధ్య... ససేమిరా !
= కేంద్రమంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వం విఫలం = నిపుణుల పరిశీలనకు ఒప్పుకోని తమిళనాడు = ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో నడుచుకోవాలి = విరుద్ధంగా ప్రవర్తిస్తే సరిహద్దులో నిరాహార దీక్ష కు దిగుతా : ఉమాభారతి హెచ్చరిక = మాకు తాగడానికే నీళ్లు లేవంటే వారికి వ్యవసాయానికి ఇవ్వాలంటారు.. ఇదెక్కడి న్యాయం : సీఎం సిద్ధు = నేడు సుప్రీం కోర్టులో విచారణ సాక్షి, బెంగళూరు : విడవమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా తయారైంది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి. కావేరి నీరు విడుదల చేయలేమని కర్ణాటక చట్టసభల్లో తీసుకున్న నిర్ణయం... విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. కేంద్రం మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమా భారతి రంగంలోకి దిగారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక తరఫున సీఎం సిద్ధరామయ్యతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎంపీ పాటిల్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అరవింద్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి ఎడప్పాడి.ఎస్.పళని స్వామి, ముఖ్య కార్యదర్శి రామ్మోహన్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నాలుగు జలాశ యాల్లో ప్రస్తుత నీటి మట్టం, తాగునీటి అవసరాలకు కావాల్సిన నీరు తదితర విషయాలన్నింటినీ కేంద్రమంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా కర్ణాటకతో పాటు తమిళనాడులో కావేరి విషయమై క్షేత్రస్థాయి పరిశీలనకు నిపుణుల కమిటీని పంపించాలని విన్నవించింది. అయితే ఇందుకు తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో పాటు సుప్రీంకోర్టు సూచనల మేరకు నీటిని విడుదల చేయాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఉమాభారతి యత్నించి విఫలమయ్యారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి, సీఎం సిద్ధు వేర్వేరుగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించి నేడు (శుక్రవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కాగా కావేరి నీటి విడుదల విషయమై 2013లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసు శుక్రవారం విచారణకు రానుంది. సరిహద్దులో స్వయంగా నిరసనకు దిగుతా : కేంద్ర ఉమాభారతి సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కావేరి విషయంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహించిందని, అయితే దురదృష్టవశాత్తు ఈ సయోధ్యలో ఎటువంటి పురోగతి కనిపించలేదని కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న కర్ణాటక విన్నపాన్ని తమిళనాడు వ్యతిరేకించిందన్నారు. ఇంతకంటే తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని, సమావేశంలో జరిగిన విషయాలను అటార్నీ జన రల్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియజేస్తామన్నారు. కావేరి విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఇందుకు వ్యతిరేకంగా జరిగితే తానే స్వయంగా రెండు రాష్ట్రాల సరిహద్దులో నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. ‘ఇది బెదిరించడానికి చెబుతున్న విషయం కాదు. పరిస్థితి అర్థమయ్యేలా వివరిస్తూ చేస్తున్న అభ్యర్థన మాత్రమే.’ అన్నారు. ‘తాను సన్యాసం స్వీకరించింది కర్ణాటకలోని పెజావరస్వామిజీ సమక్షంలో’ తన గురువుకు తమిళనాడులో కూడా భక్తులు ఉన్నారు. పూర్వం యద్ధం ఉదయం మాత్రమే ఇరువైపులా కత్తులు దూసుకునేవారు. సూర్యాస్తమయం అలసిన సైనికులకు అటువైపు వారు ఇటువైపు వారు తాగునీరు ఇచ్చేవారు. అందువల్ల తాగునీటి విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలన్నారు. వారికి వ్యవసాయ అవసరాలు... మాకు తాగునీటి అవసరాలు : సీఎం సిద్ధు కర్ణాటకలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందు వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను సమావేశంలో వివరించామని, కర్ణాటకలో 18,75,000 హెక్టార్లను సాగు చేయడానికి తమకు ట్రిబ్యునల్ అనుమతి ఉండగా సరైన వర్షాలు లేకపోవడం వల్ల కేవలం 6,15,000 హెక్టార్లను మాత్రమే సాగులో ఉందన్నారు. అయితే తమిళనాడు కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 17 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ ముగిసిందని, ఇక మెట్టూరు డ్యాంలో ఉన్న 43 టీఎంసీల నీరు ప్రస్తుత సాంబా పంటకు సరిపోతుందన్నారు. అంతేకాకుండా వారికి ఇప్పటికే మంచి వర్షాలు పడ్డాయని, ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కూడా సాధారణ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ కూడా చెప్పిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినా తమకు రావాల్సిన కావేరి నీరు ఇవ్వాల్సిందనని తమిళనాడు డి మాండ్ చేయడం సరికాదన్నారు. ఆ నీటిని కూడా సాగుకు వినియోగిస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము తాగునీటి కోసమే కావేరి అని వివరిస్తున్నామని వాపోయారు. ఇక సమావేశంలో ఇరు రాష్ట్రాలో క్షేత్రస్థాయి పర్యటనకు నిపుణుల కమిటీ పంపించాలన్న తమ ప్రతిపాదనను వారు ఎందుకు వ్యతిరేకించారో అర్థం కావడం లేదన్నారు. తమకు సుప్రీంకోర్టుపై అపార గౌరవం ఉందని అయితే తమిళనాడుకు వదలడానికి తమ వద్ద కావేరి జలాలు లేవని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా తమిళనాడు ఉమాభారతి సమక్షంలో తమినాడు ప్రతినిధులు రోజుకు 5 వేల క్యూసెక్కులు చొప్పున పది రోజులు నీటిని విడుదల చేయాలని మొదట కోరింది. లేదంటే 3,400 క్యూసెక్కులను పది రోజుల పాటు ఇవ్వాలని కర్ణాటకను కోరింది. అయితే ఈ రెండు విషయాలకు కర్ణాటక ఒప్పుకోలేదని సమాచారం. -
ఇక సుప్రీం దిక్కు
సాక్షి, చెన్నై: కావేరి జలాల పంపిణీ వివాదం మళ్లీ సుప్రీంకోర్టులో పడింది. తమిళనాడు - కర్ణాటకల మధ్య ఢిల్లీ వేదికగా సాగిన చర్చలు విఫలం అయ్యాయి. నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్న పాత పాటనే కర్ణాటక కొనసాగించడం, నీళ్లు ఇవ్వాల్సిందేనని తమిళనాడు పట్టుబట్టడం వెరసి కేంద్ర మంత్రి ఉమాభారతి నేతత్వంలో సాగిన చర్చలు అసంతృప్తికరంగా ముగిశాయి. ఈ చర్చల నివేదికను సుప్రీంకోర్టుకు పంపనున్నట్టు ఉమాభారతి ప్రకటించారు. ఇక, సుప్రీం కోర్టు తమకు దిక్కు కావడం, ఎలాంటి ఉత్తర్వులు వెలువడుతుందో అన్న ఉత్కంఠ తమిళనాట బయలు దేరింది. తమిళనాడు - కర్ణాటకల మధ్య సాగుతూ వచ్చిన కావేరి జల వివాదం ఇరు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ ను రేపుతూ వస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వంలో కర్ణాటకతో చర్చల సంపద్రింపులకు అమ్మ జయలలిత ప్రభుత్వం సిద్ధం అయింది. కొన్నేళ్ల అనంతరం ఇరు రాష్ర్ట ప్రభుత్వాల మధ్య సంప్రదింపుల చర్చ సాగనున్నడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది సీఎం జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, తన దూతగా ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామిని ఢిల్లీకి గురువారం పంపించారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, ప్రజా పనుల శాఖ కార్యదర్శి ప్రభాకర్, కావేరి టెక్నికల్ సెల్ చైర్మన్ ఆర్ సుబ్రమణియన్ చర్చలకు వెళ్లారు. ఈ సంప్రదింపులు ఫలితాన్ని ఇస్తుందా అన్న ప్రశ్న బయలు దేరినా, ముందుగా ప్రకటించిన మేరకు ఈ సమావేశంలో కర్ణాటక పాత పాటనే కొనసాగించడం గమనార్హం. స్నేహ హస్తంతో : ఢిల్లీలో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమా భారతి మధ్యవర్తిగా ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ప్రారంభం అయింది. సంప్రదింపులకు ముందు ఆసక్తికర సంఘటనలు ఆ సమావేశ మందిరంలో చోటు చేసుకున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉమాభారతికి పుష్ప గుచ్చం అందించడం, అదే సమయంలో తమిళ మంత్రి ఎడపాడి పళని స్వామిని ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించారు. కర్ణాటక-తమిళనాడుల మధ్య సాగుతున్న నీటి యుద్ధాన్ని తాను కొలిక్కి తీసుకొస్తా..! అన్నట్టుగా .. అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు మంత్రి ఎడపాడిల చేతుల్ని కలుపుతూ స్నేహ పూర్వక పలకరింపుకు ఉమాభారతి చర్యలు తీసుకున్నారు. స్నేహ హస్తంతో , తమిళ మంత్రికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉమాభారతి చర్యలు తొలుత ఉన్నా, చివరకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రతినిధులు వ్యతిరేకించడం విశేషం. నీళ్లు ఇవ్వబోమంటూ పదే పదే పాత పాటను కర్ణాటక సీఎం సాగించడం, నీటి కోసం తమిళనాడు పట్టుబడటం వంటి అంశాలతో గంటల కొద్ది చర్చ సాగినా, చివరకు అసంతృప్తికరంగా ముగియడం గమనార్హం. ఇక, నీటి నిల్వల పరిస్థితిపై పరిశీలనకు ఉమాభారతి ఓ కమిటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. సుప్రీమే దిక్కు : కావేరి జలాల విషయంలో ఆది నుంచి సుప్రీం కోర్టు తమిళనాడుకు అండగా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ బంతి సుప్రీం కోర్టులో పడింది. చర్చలు అసంతృప్తికరంగా ముగియడంతో, ఈ చర్చల నివేదికను సుప్రీం కోర్టుకు పంపించనున్నట్టు ఉమాభారతి ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, కోర్టు ఉత్తర్వుల్ని పదే పదే దిక్కరిస్తూ ముందుకు సాగుతున్న కర్ణాటక సర్కారుపై ఈ సారి సుప్రీం కోర్టు చర్యలు తీసుకుంటుందా...? తమకు న్యాయం చేకూరే విధంగా నీటిని విడుదల చేయిస్తుందా..? అన్న ఎదురు చూపులు రాష్ట్రంలో పెరిగాయి. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు ఢిల్లీ వేదికగా చేసిన ప్రసంగంలో పదే పదే సుప్రీం కోర్టు తమకు అండగా నిలిచిందని వ్యాఖ్యానించడం విశేషం. కర్ణాటక నిరాకరించినా, కేంద్రం చేతులు ఎత్తేసినా, తమను సుప్రీం కోర్టు ఆదుకుందని, పదే పదే ఆ కోర్టు ఆదేశాలు , ఉత్తర్వుల్ని బేఖాతరు చేయడమే కాకుండా, రాజకీయ శాసనాల ఉల్లంఘనకు పాల్పడటం మంచి పద్దతి కాదని కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నారు. రాష్ట్రల మధ్య ప్రవహించే నదులపై ఆయా రాష్ట్రాలకు హక్కులు ఉంటాయన్న విషయాన్ని మరచి, సర్వాధికారం తమదే అన్నట్టుగా కర్ణాటక వ్యవహరించడటాన్ని తప్పుబడుతూ, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను వివరించడం గమనార్హం. ఈ సారి కూడా తమకు సుప్రీం కోర్టు అండగా నిలుస్తుందన్న నమ్మకం ఉన్నా, ఆ ఉత్తర్వుల్ని ఉల్లంఘించడమే పరిపాటిగా కర్ణాటక ముందుకు సాగుతుండ డాన్ని తమిళులు జీర్ణించుకోలేకున్నారు.కాగా, ఈ జల వివాదం తమిళనాట అన్ని రంగాల మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. వస్త్రాల ఎగుమతి ఆగి ఉండటం, లారీలు ఎక్కడిక్కడ ఆగడం, రోజా పువ్వుల ఎగుమతి తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో, పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో అని వర్తకులు ఎదురు చూపుల్లో ఉన్నారు. -
సరిహద్దుల్లో నేను నిరాహార దీక్ష చేస్తా!
న్యూఢిల్లీ: సంచలన వ్యాఖ్యలు చేసే ఫ్రైర్‌బ్రాండ్ నాయకురాలు, కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి కావేరి నదీ జలాల వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావేరి జలాల విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే.. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో తాను నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్న కావేరి జలాల ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆమె గురువారం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కావేరి జలాల సమస్య పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. తమిళనాడుకు తాజాగా కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం.. ఆ తీర్పును ధిక్కరిస్తూ కర్ణాటక జలాలు విడుదల చేయకపోవడం తెలిసిందే. కావేరి నదీ జలాల లభ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కర్ణాటకను తమ మంత్రిత్వశాఖను కోరిందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చొరవ చూపుతున్నాయని, ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఆమె తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి కూచొని కోర్టు బయటే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని తాను కోరానని ఆమె చెప్పారు. -
‘కావేరి’పై ఢిల్లీలో కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఎడప్పడి కే పళని సామి గురువారం భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఈ భేటీకి హాజరు కాలేకపోయారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమాభారతి అధ్యక్షతన కర్ణాటక, తమిళనాడు ప్రతినిధులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
-
‘కావేరి’పై ఢిల్లీలో రేపు కీలక భేటీ
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు. రేపు 11.30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు సీఎం జయలలిత, తనకు ఉమాభారతి వర్తమానం పంపారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ భేటీ నేపథ్యంలో తమిళనాడుకు కావేరి నది జలాల విడుదలను వాయిదా వేసినట్టు చెప్పారు. కేంద్ర మంత్రిలో సమావేశం తర్వాత నీటి విడుదల విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు సీఎంలతో ఉమాభారతి సమావేశమవుతున్నారు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తన తరపున ఆమె ప్రతినిధుల బృందాన్ని పంపనున్నారని సమాచారం. -
సుప్రీం చెప్పినా సరే.. వదలొద్దు
బెంగళూరు: కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం తీవ్రమవుతోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని కర్ణాటకలో అన్ని పార్టీలు నిర్ణయించాయి. బుధవారం బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నాయకులు తమ అభిప్రాయలను తెలియజేశారు. కావేరి జలాలను కర్ణాటకలో తాగు నీటి అవసరాలకు వాడాలని, తమిళనాడుకు విడుదల చేయరాదని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని అన్ని పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
నీళ్లు వచ్చేనా?
సాక్షి, చెన్నై: కావేరి మళ్లీ పరవళ్లు తొక్కేది అనుమానంగా మారింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని కర్ణాటక సర్కారు అమలు చేసేనా అన్న ఎదురు చూపులు తమిళనాట పెరిగాయి. రగిలిన జ్వాలను అడ్డం పెట్టుకుని ఆరు రోజుల నీటి విడుదల ఉత్తర్వుల్నే ధిక్కరించిన వాళ్లకు మూడు రోజుల ఉత్తర్వుల్ని పెడచెవిన పెట్టడం ఏమాత్రం అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. కాగా, సమస్య జఠిలం అవుతుండడంతో కర్ణాటకతో సంప్రదింపులకు తగ్గట్టు ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సంప్రదింపుల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎం జయలలిత మంగళవారం ఆసుపత్రి నుంచే సమీక్షించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి మరీ కర్ణాటక పాలకులు వ్యవహరిస్తుండడం తమిళనాట ఆక్రోశాన్ని రగుల్చుతోంది. ఈ పరిస్థితుల్లో తమకే నీళ్లు లేవన్నట్టు కర్టాటక, నీళ్లు ఇప్పించాల్సిందేనంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లు మం గళవారం సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చా యి. ఈ విచారణలో కర్ణాటకకు కోర్టు అక్షింతలు వే యడం, అసెంబ్లీ తీర్మానాలు కోర్టుల్ని కట్టడి చేయలేవన్నట్టు చురకలు అంటిస్తూ బెంచ్ స్పందించడాన్ని తమిళనాడు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు ఆహ్వానించాయి. అలాగే, మూడు రోజుల పాటుగా సెకనుకు ఆరు వేల గణపటడుగుల మేర కు నీటిని విడుదల చేయాలని ఆదేశించడంపై హ ర్షం వ్యక్తం చేశాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ ఉత్తర్వుల్ని కర్ణాటక ఆచరించేనా అన్న ప్రశ్న బయలు దేరింది. అదే సమయంలో కర్ణాటకలో మళ్లీ నిరసనలు బయలు దేరిన నేపథ్యంలో కావేరి తమిళనాడు వైపుగా పరవళ్లు తొక్కేనా అన్న ప్రశ్న తో పాటుగా ఎదురు చూపులు పెరిగాయి. కావేరి వచ్చేనా: కావేరి జలాల్ని నమ్ముకుని డెల్టా జి ల్లాల్లోని అన్నదాతలు పన్నెండు లక్షల ఎకరాల సం బాసాగుకు సిద్ధమయ్యారు. మెట్టూరు డ్యాంలో ప్రస్తుతానికి ఉన్న నీటి ఆధారంగా మరో రెండు, మూడు వారాలు లాగించేందుకు అవకాశం ఉంది. అయితే, తదుపరి తమ పరిస్థితి ఏమిటో అన్న ఆం దోళనను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు నీళ్లు విడుదల చేసినా, కొంత మేరకు ఊరట కల్గుతుం దని, అయితే, నీళ్లు విడుదల చేస్తారా..? అన్నది అనుమానమేనని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో నిరసనలు బ యలుదేరి ఉండడం, అఖిల పక్షంతో చర్చించి ని ర్ణయం అని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించి ఉండడంతో, ఆ మూడు రోజుల్ని ప్రకటనలో నెట్టుకొచ్చేస్తారేమోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తాము సైతం ఇక, కఠిన నిర్ణయాలతో ఉద్యమించాల్సిన అవశ్యాన్ని కల్పిస్తున్నారని హెచ్చరిం చే పనిలో పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం స్పందించాల ని, తక్షణం కర్ణాటకతో సంప్రదింపులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, కర్ణాటక తీరు పై కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ తామే సర్వాధికారులం అన్నట్టుగా కర్ణాటక వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆ ప్రభుత్వానికి పై హోదాలో కేంద్రం, సుప్రీంకోర్టు, చట్టాలు, రాజకీయ శాసనాలు ఉన్నాయన్న విషయాన్ని మరచి అక్కడి పా లకులు వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. చ ట్టం తన తని తాను చేసుకుంటూ వెళ్తుందని, తమ ప్రభుత్వం నీటి విడుదల విషయంలో తన పని తా ను చేస్తుందంటూ ఓప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఆలోచించాల్సిందే. అమ్మ సమాలోచన : కావేరి జల వివాదం మరింత జఠిలం అవుతున్న దృష్ట్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. తాను ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నా, ఆగమేఘాలపై అధికారుల్ని పిలిపించుకుని సమాలోచించారు. అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు గంట పాటు అధికారులతో కావేరి వి వాదం పరిష్కారానికి తగ్గ సమీక్షలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, అడ్వకేట్ జనరల్ ఆర్ ముత్తుకుమారస్వామి, ప్రభు త్వ సలహాదారు షీలా బాలకృష్ణన్, సీఎం కార్యదర్శులు కేఎన్ వెంకటరమణన్, ఎ.రామలింగం తది తరులు ఈ సమీక్షకు హాజరు అయ్యారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకం గా కోర్టు స్పందన గురించి చర్చించారు. ఈ వివా దం మరింత జఠిలం కాకుండా, తగు చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా కోర్టు ఇచ్చిన సూచన మేరకు కర్ణాటకతో సంప్రదింపులకు తగ్గ కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీ గురువారం కర్ణాటక అధికారులతో సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిటీలో రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళనిస్వామి, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి పి.రామ్మోహన్రావు, ప్రజా పనుల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కావేరి టెక్నికల్ సెల్ చైర్మన్ ఆర్ సుబ్రమణియన్ ఉన్నారు. ఈ సంప్రదింపులు సత్ఫలితాల్ని ఇవ్వాలని అన్నదాతలు కాంక్షిస్తున్నారు. అవస్థలు: కర్ణాటకలో నిరసనలు మళ్లీ బయలు దేరి ఉన్న నేపథ్యంలో సరిహద్దు వాసులకు మళ్లీ అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య 22 రోజులుగా రవాణా ఆగింది. సరిహద్దులకు బస్సులు పరిమితం అవుతున్నారు. తమిళనాడు లారీలు అయితే, సరిహద్దుల్లో ఆపి ఉండడంతో డ్రైవర్లు నానా తంటాలు పడుతున్నారు. వాహనాల్లో ఉన్న సరకులు ఎక్కడ దెబ్బతింటాయో అన్న ఆందోళన బయలు దేరింది. కనీసం స్నానం కూడా చేయలేని పరిస్థితి తమకు ఉందని సత్యమంగళం మార్గంలో తమ లారీలను ఆపి, రవాణా పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరిస్థితి ఇలాగే కొనసాగిన పక్షంలో, రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల బంద్‌కు పిలుపు నిచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని లారీ యజమానులు హెచ్చరించే పనిలో పడ్డారు. -
సుప్రీంకోర్టులో కర్ణాటకకు చుక్కెదురు
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నేటి నుంచి రోజుకు 6 క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడుకు కావేరి నది నుంచి నీరు విడుదల చేయాలన్న తమ ఆదేశాలను పాటించని కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కావేరి నీళ్లు ఇవ్వడం కుదరదని కర్ణాటక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సర్వోన్నత న్యాయస్థానం పట్టించుకోలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశం ఏర్పాటు చేయాలని అటార్ని జనరల్ కు సుప్రీంకోర్టు సూచించింది. డిసెంబర్ తర్వాతే తమిళనాడుకు నీళ్లు ఇస్తామని, గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాల్సిందిగా కర్ణాటక చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదంపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. -
సుప్రీంకోర్టులో కర్ణాటకకు చుక్కెదురు
-
'కావేరి నీళ్లు ఇప్పట్లో వదలం'
కర్ణాటక: ఇప్పట్లో కావేరి నీళ్లు ఇవ్వడం కుదరదని కర్ణాటక స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ వరకు తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానానికి చెప్పింది. 42 వేల క్యూసెక్కుల నీటిని వదులుతామని అయితే, అది కూడా డిసెంబర్ తర్వాత మాత్రమే చేస్తామని తెలిపింది. తమ రాష్ట్రంలో పలు నగరాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని, అవి ఆ సమస్యనుంచి బయటపడిన తర్వాత చూస్తామని చెప్పింది. తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల(సెప్టెంబర్) 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. కావేరి పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి నాలుగు వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. ఆ సమయంలో తమిళనాడులో తీవ్ర నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది నఫ్రే న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాము నీళ్లు ఇప్పట్లో ఇవ్వబోమని కర్ణాటక మరోసారి చెప్పినందున రేపు జరగబోయే విచారణ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కోర్టు ధిక్కారం!
సాక్షి, చెన్నై: కర్ణాటక ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు తగ్గ కసరత్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. సోమవారం ఇందుకు తగ్గ పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా కోర్టు ధిక్కారం అంటూ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు అత్యవసర లేఖ రాశారు. కావేరి జలాల కోసం కర్ణాటకతో పెద్ద సమరమే సాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తమిళులకు అండగా నిలబడడంతో కావేరి జలాలు మెట్టూరు డ్యాంలోకి వచ్చి చేరుతాయన్న ఆనందం తాండవం చేసింది. అయితే, కోర్టు ఆదేశాలు ఇచ్చినా, కర్ణాటక ఖాతరు చేయక పోవడం గమనార్హం. అదే సమయంలో తమిళనాడుకు చుక్క నీళ్లు కూడా ఇవ్వబోమని స్పందిస్తున్న కన్నడీగులకు కోర్టు ద్వారా చెంప పెట్టు వేయించేందుకు తగ్గ కసరత్తుల్లో రాష్ర్ట ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్టు సమాచారం. ఈనెల 19న కావేరి మధ్య వర్తిత్వ కమిటీ తమిళనాడుకు పది రోజుల పాటు సెకనకు మూడు వేల గణపుటడుగుల మేరకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఆ మరుసటి రోజు సుప్రీంకోర్టు ఈనెల 27 వరకు తమిళనాడుకు సెకనుకు ఆరు వేల గణపుటడుగుల మేరకు నీళ్లు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా కర్ణాటక పాలకులు వ్యవహరించే పనిలో పడ్డారు. కోర్టు ఆదేశించి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు నీటిని విడుదల చేయలేదు. దీంతో కావేరిలో నీటి రాక తగ్గింది. మెట్టూరు జలాశయంలోకి నీటి రాక క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆందోళన రేకెత్తిస్తున్నది. తమిళనాడుకు చుక్కనీళ్లు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చుతూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కన్నడీగులు తీర్మానం చేశారు. ఈ పరిణామాలు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తమిళనాడుకు కోర్టు ఆదేశాలతో నీళ్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న కర్ణాటక ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు తగ్గ కసరత్తులు వేగవంతమయ్యాయి. ఇప్పటి వరకు కోర్టు ఆదేశాల మేరకు నీళ్లను కర్ణాటక విడుదల చేయక పోవడాన్ని పరిగణలోకి తీసుకుని సోమవారం కోర్టు ధిక్కార కేసు సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు లేఖ రాసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందులో కోర్టు ధిక్కారం తగదు అని, కోర్టు ఆదేశాల మేరకు నీళ్లు విడుదల చేయక పోవడాన్ని ఖండించడం గమనార్హం. కాగా ఇన్నాళ్లు హొగ్నెకల్ వద్ద పరవళ్లు తొక్కిన కావేరి నదిలో ప్రస్తుతం నీటి రాక తగ్గింది. దీంతో సందర్శకులకు నిరుత్సాహం తప్పడం లేదు. -
కావేరి విడుదలకు కర్ణాటక నో
తీర్మానానికి ఉభయ సభల్లో ఏకగ్రీవ ఆమోదం సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి నదీ జలాలను వదలకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నీళ్లు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు కర్ణాటక శాసనసభ, మండళ్లు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. జలాలను వదలకూడద ని ఏకగ్రీవంగా తీర్మానించాయి. దీంతో తమిళనాడుకు కావేరి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోనుంది. 2016-17 జల ఏడాదిలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున తమ రాష్ట్రంలోనూ తాగునీటి అవసరాలకు మాత్రమే కావేరి నదీ జలాలను వాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని కబిని, కేఆర్ఎస్, హారంగి, హేమావతి జలాశయాల్లో కలిపి 27.6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. తమిళనాడుకు నీటిని విడుదల చేయడం వల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి పరిహారం అందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని శాసనసభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు, మండ్య, మైసూరుల్లో శుక్రవారం కూడా చిన్నపాటి నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
కావేరి వివాదం; కర్ణాటక సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదంటూ శుక్రవారం కర్ణాటక శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ రోజు ఆ రాష్ట్ర శాసనమండలి ప్రత్యేకంగా సమావేశమై సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించింది. ఈ నెల 27 వరకు కావేరి నది నుంచి రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కావేరి జలాలు కర్ణాటక ప్రజల తాగునీటి అవసరాలకు చాలా అవసరమని ఆ రాష్ట్ర శాసనమండలిలో అన్ని పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. కావేరి జలాశయాల్లో నీటిమట్టం పడిపోయినందున తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని, పూర్తిగా కర్ణాటక ప్రజల తాగునీటి అవసరాలకు వాడాలని నిర్ణయించారు. చర్చ అనంతరం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కర్ణాటక శాసనమండలి బేఖాతరు చేయడంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయన్నది న్యాయ నిపుణుల్లో ఉత్కంఠగా మారింది. కాగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. కావేరి జలాల విడుదలపై కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పార్టీలకతీతంగా సుప్రీం తీర్పును వ్యతిరేకించారు. -
కావేరి వివాదంలో మరో మలుపు
బెంగళూరు: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం మరో మలుపు తిరిగింది. కావేరి జలాశయాల్లో నీటిమట్టం బాగా పడిపోవడంతో తమిళనాడుకు ఇక నీటిని విడుదల చేయలేమని శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తద్వారా సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం సాధ్యంకాదని ఆయన చేతులేత్తేశారు.ఈ నెల 27 వరకు కావేరి నది నుంచి తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కావేరి నదిలో తగినంత నీటివనరులు లేకపోవడంతో తమిళనాడుకు నీటిని వదలబోమని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాల వల్ల రాజ్యంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కావేరి జలాలను విడుదల చేయడం సాధ్యంకాదని ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేయవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నోవివాదాలు ఏర్పడుతాయని న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నదీజలాల పంపకాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని, అంతేగాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. కాగా కావేరి జలాల విడుదలపై కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. -
కర్ణాటకపై ఫైర్
సాక్షి ప్రతినిధి, చెన్నై:కావేరీ నదీ జలాల విడుదలపై సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించిన కర్ణాటక ప్రభుత్వ వైఖరి తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేయాల్సిందిగా జయలలిత ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు, కావేరీ డెల్టా రైతులు ఒత్తిడి తెస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజల ఆందోళనకు తలొగ్గి నీటి విడుదలను నిలిపి వేసింది. దీంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 3400 ఘనపుటడుగులకు పడిపోయింది. కావేరీ నీటి విడుదలను నిలిపివేయాలని శుక్రవారం నాటి కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయబోతోందని ప్రతిపక్షాలు అంచనావేస్తున్నాయి. కావేరీ జలాలపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 27వ తేదీన విచారణకు వచ్చినపుడు అసెంబ్లీ తీర్మానాన్ని అనుసరించి నీటిని విడుదల చేశామని కర్నాటక ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ అనుమానిస్తున్నారు. కర్నాటక కుట్రను ఎదుర్కోవాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి సైతం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎండీఎంకే అధినేత వైగో డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీల బలాన్ని కేంద్రానికి తెలిపేలా అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటు చేయాలని తమాకా అధ్యక్షులు జీకే వాసన్ కోరుతున్నారు. కావేరీ నదీజలాల హక్కును కాపాడుకునేందుకు త్వరలో ఇతర పార్టీలతో కలిసి సంయుక్త పోరాటానికి దిగుతున్నట్లు వీసీకే అధినేత తిరుమావళవన్ గురువారం ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పును అవమానించిన కర్నాటక ప్రభుత్వంపై అత్యవసర కేసును దాఖలు చేయాలని తమిళనాడు వ్యవసాయదారుల సంఘం సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు పీఆర్ పాండియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుచ్చిరాపల్లిలోని రైతులు కావేరీ నది నడుములోతు నీళ్లలోకి దిగి గురువారం నిరసన పోరాటం సాగించారు. -
'కావేరిపై కర్ణాటక చెప్పేదంతా అబద్ధం'
చెన్నై: కర్ణాటక రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోందని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అన్నారు. శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థ మధ్య తగాదాను పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కావేరీ జలాల సమస్య అంశం ద్వారా గట్టి పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తన వద్ద నీళ్లు లేవని కర్ణాటక చెప్పేదంతా కూడా ఓ అబద్ధం అని ఆయన మండిపడ్డారు. ఆదేశాల ప్రకారం 23 వరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు నీళ్లు తమిళనాడుకు ఇవ్వకుండా కర్ణాటక ఆపేయడం సుప్రీంకోర్టును అవమానించడమే అని అన్నారు. ఇదొక్కటే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీళ్లు ఇవ్వడం కుదరదని తీర్మానం చేసేందుకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తోందని అన్నారు. ఆయన ఆలోచన ప్రకారం కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదొక రాజకీయ-చట్టపరమైన సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. సెప్టెంబర్ 27న కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రోజు తమ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించిన తీర్మానం సుప్రీంకోర్టులో ఉంచాలని చూస్తోందన్నారు. దానిని కోర్టు వ్యతిరేకిస్తే అది కాస్త న్యాయ వ్యవస్థకు, శాసన సభకు మధ్య ఘర్షణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, రేపు కావేరి జలాల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చర్చించే విషయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే గవర్నర్ ను కలిసి అనుమతి కలిశారు. -
'మళ్లీ కావేరి చిచ్చు రగులుకుంటోంది'
బెంగళూరు: మరోసారి కావేరి వివాదం రాజుకుంటోంది. రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 27వరకు ప్రతి రోజు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిన్న మరోసారి ఆదేశించిన మాండ్యా ప్రాంత రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీయడమే కాకుండా జలాలు వదులుతూ తమకు ఉరి శిక్ష వేస్తున్నారని ఉరి వేసుకున్నట్లుగా రోడ్డుపై ప్రదర్శనలు ఇస్తున్నారు. మాండ్యా ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. జనతాదల్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయత్, తాలుకా పంచాయతీ నాయకులంతా రాజీనామా చేశారు. మాండ్యా ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా నోటికి గుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొనే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడా బలగాలను మోహరించడంతో ప్రస్తుతానికి శాంతియుత పరిస్థితులతోనే కనిపిస్తోంది. మరోపక్క, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కర్ణాటక హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కావేరి జలాలు పారే కర్ణాటక అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. నీటి విడుల చేసే చోట కూడా కట్టు దిట్టమైన భద్రతకు హోంమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. కావేరీ జలాలను వదలాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడం కష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులైతే ఇచ్చింది గానీ, తమ దగ్గరే నీళ్లు లేనందున ఆ తీర్పు అమలు కష్టమేనని విలేకరులతో చెప్పారు. వాస్తవానికి పర్యవేక్షక కమిటీ సూచన ప్రకారం అయితే 3వేల క్యూసెక్కులు మాత్రమే వదలాలి. కానీ సుప్రీం మాత్రం తన ఉత్తర్వుల్లో 6వేల క్యూసెక్కుల నీరు పంపాలని తెలిపింది. దీంతో అసలు వివాదం రాజుకుంది. -
సుప్రీం తీర్పు అమలు కష్టమే: సీఎం
రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 27వ తేదీ వరకు ప్రతిరోజూ తమిళనాడుకు కావేరీ జలాలను వదలాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడం కష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులైతే ఇచ్చింది గానీ, మన దగ్గరే నీళ్లు లేవు కాబట్టి దాన్ని అమలుచేయడం చాలా కష్టమని ఆయన విలేకరులతో చెప్పారు. వాస్తవానికి పర్యవేక్షక కమిటీ సూచన ప్రకారం అయితే 3వేల క్యూసెక్కులు మాత్రమే వదలాలి. కానీ సుప్రీం మాత్రం తన ఉత్తర్వుల్లో 6వేల క్యూసెక్కుల నీరు పంపాలని తెలిపింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాలని, ప్రశాంతంగా ఉండాలని ప్రజలను సీఎం సిద్దు కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బుధవారం ఉదయం ఈ అంశంపై కేబినెట్ సమీక్ష ఉంటుందని, అందులో తాము చర్చిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందాల్సి ఉందని, ఈలోపు న్యాయసలహా కూడా తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష సమావేశం కూడా బుధవారమే నిర్వహిస్తామని అందులోనూ ఉత్తర్వుల గురించి చర్చిస్తామని అన్నారు. మేమే కష్టాల్లో మునిగిపోయాం సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాండ్యా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే తమ పొలాలకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీళ్లన్నీ తమిళనాడుకు ఇచ్చేస్తే ఇక తమ పొలాలు ఎడారులుగా మారిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘పదేపదే అన్యాయం జరుగుతోంది’
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడుతో కావేరి జలాల పంపకం విషయంలో పదేపదే తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం నిర్వహించారని చెప్పారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్నారు. కావేరి నది నుంచి ఈ నెల 27 వరకు రోజుకు 6 వేల క్యుసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు మండ్య ప్రాంతంలో ఆందోళనకారులు, రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. -
'కావేరి' బోర్డు ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : తమిళనాడు రాష్ట్రానికి రేపటి నుంచి ఈనెల 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. కావేరి పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అలాగే నాలుగు వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. తమిళనాడుకు రేపటి నుంచి సెప్టెంబరు 30 వరకు రోజుకు 3వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చేయాలని కావేరీ పర్యవేక్షక కమిటీ ఇచ్చిన నిర్ణయంపై తమిళనాడు, కర్ణాటక అభ్యంతరం తెలపగా.. అభ్యంతరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తమిళనాడు సాగునీటి కోసం కర్ణాటక తాగునీటిని త్యాగం చేస్తోందని ఆ రాష్ట్ర తరపు న్యాయవాది నారిమన్ వాదించారు. తమిళనాడులో తీవ్ర నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది నఫ్రే న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ దీనిపై తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా పడింది. -
బిరియాని కోసం 42 బస్సులకు నిప్పు!
-
తమిళనాడుకు 3వేల క్యూసెక్కులు
విడుదల చేయాలని కర్ణాటకకు కావేరి కమిటీ ఆదేశం సాక్షి, బెంగళూరు: కావేరి నదీజలాల వివాద పరిష్కారం దిశగా.. ఈనెల 21 నుంచి 30 వరకు రోజుకు 3000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను కావేరీ పర్యవేక్షక కమిటీ ఆదేశించింది. కేంద్ర జలవనరుల కార్యదర్శి శశిశేఖర్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన కావేరీ పర్యవేక్షణ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమనుకుంటే ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టులో సవాలు చేసుకొనే స్వేచ్ఛ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉందని శశిశేఖర్ అన్నారు. కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగు నీటి అవసరాలు, 4 జలాశయాల్లో సగటు ఇన్‌ఫ్లో, తమిళనాడులో వేసవి పంటలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అక్టోబరులో కమిటీ మరోసారి మావేశమవుతుందన్నారు. కావేరి సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కావేరి పరివాహక ప్రాంతంలో వర్షపాతం, జలాశయాల్లో నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను గణించడానికి ‘రియల్ టైం ఆన్లైన్ డేటా నమోదు’ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడుకు చుక్క నీరు వదలడానికి వీలుకాదని కర్ణాటక ప్రధాన కార్యదర్శి జాదవ్ వాదించారు. కావేరి ట్రైబ్యునల్ గత ఆదేశాలను అనుసరించి తమకు నీరివ్వాల్సిందేనని తమిళనాడు వాదించింది. కమిటీ నిర్ణయంపై మంగళవారం సుప్రీంకోర్టులో సవాలుచేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. -
బిరియాని కోసం 42 బస్సులకు నిప్పు!
బెంగళూరు: కావేరి జలాల గొడవ సందర్భంగా నగరంలో సెప్టెంబర్ 12న తమిళనాడుకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ బస్సుల్ని తగులబెట్టిన ఘటనలో భాగ్య(22) అనే యువతితోపాటు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సులకు నిప్పుపెట్టేలా భాగ్య తనతోపాటు ఉన్న వారిని ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనలో 42 బస్సులు కాలి బూడిదయ్యాయి. మటన్ బిరియాని, రూ.100 ఇస్తామని చెప్పి భాగ్యను నిరసనకారులు ఆందోళనకు పిలుచుకెళ్లారని ఆమె తల్లి చెప్పారు. అల్లరిమూక కేపీఎన్ సిబ్బందిపైనా డీజిల్ పోసి చంపేస్తామని బెదిరించడంతో వారేమీ చేయలేక, విధ్వంసం మొత్తాన్ని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియోల్ని పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. -
బిర్యానీ కోసం... 42 బస్సులు తగలబెట్టింది
కేవలం ఒక ప్లేటు బిర్యానీ, వంద రూపాయల డబ్బులు ఇస్తే చాలు.. ఎంతటి ఘాతుకానికైనా పాల్పడతారు. అయితే ఈసారి ఇలా చేసింది మాత్రం ఒక యువతి కావడం విశేషం. కావేరీ జలాల కోసం ఆందోళన జరిగినప్పుడు.. కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన 42 వోల్వో బస్సులను ఒకేసారి తగలబెట్టారు. ఆ పని చేసినది 22 ఏళ్ల యువతి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వారిలో సి. భాగ్య కూడా ఒకరు. ఈనెల 12వ తేదీన జరిగిన ఈ దాడి తాలూకు సీసీటీవీ ఫుటేజిని సంపాదించిన పోలీసులు.. అందులోని దృశ్యాల ఆధారంగా అనుమానితులను అరెస్టు చేశారు. వీళ్లు కేపీఎన్ సిబ్బందిపై కూడా డీజిల్ పోసి, వాళ్లను కూడా తగలబెట్టేస్తామని బెదిరించారు. దాంతో అప్పటికి ఏమీ చేయలేక ఊరుకున్న సిబ్బంది.. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లతో అక్కడ జరిగిన ఘాతుకాన్ని వీడియో తీశారు. అందులో కూడా భాగ్య తనతో పాటు వచ్చినవాళ్లను రెచ్చగొట్టి బస్సులను తగలబెట్టించినట్లు కనిపిస్తోంది. తన కూతురికి కొంతమంది స్నేహితులు బిర్యానీ పెట్టించి, వంద రూపాయలు ఇచ్చి నిరసనలలో పాల్గొనేందుకు రావాల్సిందిగా తీసుకెళ్లారని భాగ్య తల్లి ఎల్లమ్మ చెబుతున్నారు. కేపీఎన్ గ్యారేజికి సమీపంలోని గిరినగర్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి భాగ్య నివసిస్తుంటుంది. వాళ్లు రోజుకూలీలుగా పనిచేస్తూ పొట్ట నింపుకొంటున్నారు. ఆరోజు ఆమె అప్పుడే పని నుంచి ఇంటికి వచ్చిందని, మధ్యాహ్నం సమయంలో కొంతమంది వచ్చి నిరసనల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారని ఎల్లమ్మ చెప్పారు. అక్కడ మరికొందరు మహిళలు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది గానీ, వాళ్లు కూడా ఈ విధ్వంస కాండలో ఉన్నారో లేదో మాత్రం తెలియలేదు. బెంగళూరులో సెప్టెంబర్ 12 నాటి విధ్వంసాలకు సంబంధించి మొత్తం 400 మందికి పైగా ఇప్పటివరకు అరెస్టు కాగా, వాళ్లలో భాగ్య ఒక్కరే మహిళ. -
బలిదానం!
విఘ్నేష్ ఆత్మాహతితో పరిస్థితి ఉద్రిక్తం శోకసంద్రంలో కుటుంబం నేడు అంత్యక్రియలు తిరువారూర్‌లో భద్రత కట్టుదిట్టం సాక్షి, చెన్నై: కావేరి జలాల వివాదం నేపథ్యంలో విఘ్నేష్ ఆత్మాహుతికి పా ల్పడడం తమిళనాడులో ఉద్రిక్తతకు కారమవుతోంది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేపింది. తమిళులకు భాషాభిమానం ఎక్కువే. ప్రపంచ దే శాల్లో ఎక్కడైనా తమిళుడికి చిన్న హాని జరిగినా, తమిళనాట నిరసనలు భగ్గుమంటాయి. శ్రీలంకలో యుద్ధం సమయంలో తమిళులపై సాగిన నరమేథం ఇక్కడి హృదయాల్ని పిండేశాయి. నిరసనల హోరు ఓ వైపు అప్పట్లో సాగితే, ముత్తుకుమార్ ఆత్మాహుతి బలిదానం కలకలాన్ని రేపాయి. తదుపరి పదుల సంఖ్యలో ఆ బాటను అనుసరించిన తమిళాభిమానులు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో జల వివాదం రేపిన చిచ్చు తమిళులపై ప్రతాపానికి దారి తీయడం, ఇక్కడి వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. కర్ణాటక చర్యల్ని ఎండగడుతూ తమిళాభిమానులు, రాజ కీయ పక్షాలు కదిలాయి. ఈ నిరసనల్లో ఎవరైనా ఆత్మాహుతి, ఆత్మహత్యాయత్నాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడుతారేమోనన్న బెంగ సర్వత్రా వెంటాడుతూ వచ్చింది. ఆ ప్రయత్నాల జోళికి ఎవ్వరూ వెళ్లకూడదని ప్రార్థించారు. , అది పునరావృతం అయినట్టుగా గురువారం నామ్ తమిళర్ కట్చి ర్యాలీలో ఘటన చోటు చేసుకుంది. అమరుడు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సీని దర్శకులు అమీర్, చేరన్ల నేతృత్వంలో గురువారం సాయంత్రం చెన్నైలో కావేరి జలాల కోసం గళం విప్పుతూ సాగిన భారీ ర్యాలీలో విఘ్నేష్ అనే యువకుడు కావేరి కోసం తనను తాను ఆర్పించుకుని ఆహుతి కావడం కలకలాన్ని రేపింది. తీవ్రగాయాలతో చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విఘ్నేష్ శుక్రవారం ఉదయం పద కొండున్నర సమయంలో విగత జీవిగా మారడం నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని, అతడి కుటుంబీకుల్ని శోక సంద్రంలో ముంచింది. విఘ్నేష్ ఇక లేడన్న సమాచారంతో, ఇలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయవద్దంటూ రాజకీయ పక్షాలు తమిళాభిమానులకు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి. అలాగే, రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేయవద్దని నాయకులకు ప్రజా సంఘాలు విన్నవించే పనిలో పడ్డాయి. విఘ్నేష్ తనకు సోదరుడు లాంటి వాడు అని, అతడు బతికి ఉంటే, కుటుంబానికి ఏమి చేసి ఉంటా డో అదే తాను చేస్తానని ఈసందర్భంగా సీమాన్ వ్యాఖ్యానించారు. విఘ్నేష్ భౌతిక కాయం వద్ద సీమాన్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. వీసీకే నేత తిరుమావళవన్ అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ప్రజా సంఘాలు, తమిళాభిమాన సంఘాల నాయకులు తరలి రా వడంతో కీల్పాకం ఆసుపత్రి ఆవరణలో ఉత్కంఠ నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున బలగాల్ని అక్కడ మోహరింప చేశారు. నేడు అంత్యక్రియలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని గోపాల సముద్రం గ్రామానికి చెందిన పాండియన్, షెన్బగలక్ష్మి దంపతుల కుమారుడు విఘ్నేష్. అతడి జనని సోదరి ఉన్నారు. నామ్ తమిళర్ కట్చి తిరువారూర్ ఉత్తరం జిల్లా విద్యార్ధి విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తూ, చెన్నై అంబత్తూరులోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. సీమాన్ మీద గౌరవం, తమిళాభిమానం నాలుగు రాళ్లు తనకు ఎక్కువే అన్నట్టుగా వ్యవహరించే విఘే్న ష బుధవారం తన ఫెస్‌బుక్‌లో ఈ ఆత్మాహుతి గురించి ముందుగానే ప్రకటించి ఉన్నా డు. గురువారం జరిగే ర్యాలీలో కావేరి కోసం ఆత్మాహుతులతో ముందుకు సాగుదామన్న అతడు పిలుపు ఇచ్చి ఉండటం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు పిలుపు నిస్తూ ఓ లేఖను సందించి ఉండటంతో , ఇక , మరో బలిదానం అన్నది రాష్ట్రంలో జరగకూడదన్న అప్రమత్తత పెరిగి ఉన్నది. కాగా, విఘ్నేష్ భౌతిక కాయానికి శని వారం గోపాల సముద్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని చెన్నై నుంచి స్వగ్రామానికి తరలించారు. పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు తమిళాభిమానులు తరలివచ్చే అవకాశంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరువారూర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
కావేరి సెగతో ఎగిసిన కాలుష్యం
బెంగళూరు : కావేరి నదీ జలాల వివాదంతో చెలరేగిన హింసాత్మక ఘటనలతో ఓ వైపు రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లడంతో పాటు, మరోవైపు పర్యావరణానికి భారీగానే ముప్పు తెచ్చిందట. వాహనాలకు, ఇతర ప్రజల ఆస్తులకు నిప్పులంటించడంతో గాలి కాలుష్యం దాదాపు 28 శాతం ఎగిసింది. పశ్చిమ బెంగళూరులో నిరసనకారులు బస్సులకు, టైర్లకు నిప్పులంటించి కావేరి నదీ జలాల వివాదాన్ని హింసాత్మకంగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో సాధారణ రోజుల కంటే వివాద సమయంలో గాలి కాలుష్యం 28.8 శాతం పెరిగిందని కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ లక్ష్మణ్ తెలిపారు. మెటల్, పేయింట్, రబ్బర్‌తో తయారయ్యే వాహనాలను దగ్ధం చేయడంతో, వివిధ రకాల 100 కెమెకిల్స్ బయటికి పొక్కినట్టు ఆయన చెప్పారు. నేషనల్ లిమిట్ స్థాయిలకు లోబడి సాధారణ రోజుల్లో గాలి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కానీ నిరసనకారులు రెచ్చిపోవడంతో, రోడ్డుపై దుమ్ము, ధూళి,మసి శాతాలు పెరిగినట్టు వివరించారు. రబ్బర్ టైర్లను కాల్చడం వల్ల గాలి నాణ్యతకు ముప్పు వాటిల్లిందని కేఎస్‌పీసీబీ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్. బి.నాగప్ప తెలిపారు. రబ్బర్ టైర్లను కాల్చడం వల్ల వచ్చే గ్యాస్‌లు అత్యంత ప్రమాదకరమైనవిగా బీజీఎస్ హాస్పిటల్ పల్మోనాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ వెల్లడించారు. ఇవి మానవ శరీర రక్తంలోని ఆక్సీజన్ కెపాసిటీలపై ప్రభావం చూపుతాయన్నారు. ఆస్తమాతో బాధపడే వారికి ఈ బస్సుల దగ్ధం మరింత అనారోగ్యానికి పాలుచేస్తుందని చెప్పారు. కావేరీ నదీ జల పంపకంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఈ వివాదం మరింత ఉధృతంగా మారి హింసాత్మకంగా మారింది. రెచ్చిపోయిన నిరసనకారులు బస్సులకు, ఆస్తులకు నిప్పు పెట్టారు. బెంగళూరు నిప్పుల కొలిమిగా మారిన సంగతి తెలిసిందే. -
కనిమొళి, స్టాలిన్ అరెస్ట్
చెన్నై: కర్ణాటకలో తమిళులపై దాడులకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొందరు ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ డీఎంకే కార్యకర్తలతో ఆందోళనకు దిగిన ఎంపీ కనిమొళిని పోలీసులు అన్నా సలైలో అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరిన డీఎంకే నేత స్టాలిన్, నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ సైదాపేట్ రైల్వే స్టేషన్లో రైతు నాయకుడు ఆర్పీ పాండ్యన్, డీఎంకే కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. ⇒ వీసీరే నేత తిరుమవల్వన్, కార్యకర్తలను బేసిన్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ తిరుచ్చి రైల్ జంక్షన్లో పార్టీ కార్యకర్తలతో రైల్ రోకోలో పాల్గొనడానికి వెళ్తున్న ఎండీఎంకే నేత, రాజ్యసభ సభ్యులు వైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలతో ఏఎంయూ ట్రైన్ సర్వీసులు నిలిపివేశారు ⇒ తంజావూరులో సీపీఐ నేత సీ. మహేంద్రన్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ డీఎంకే ఎమ్మెల్యే కార్తీక్, కార్యకర్తలతో కలిసి సింగనల్లూరులో రైల్ రోకో నిర్వహించారు. ⇒ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు ⇒ ఐటీ కంపెనీలు, ప్రైవేటు కాలేజీలకు పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు. కర్ణాటకలోని తమిళులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీబంద్‌కు మద్దతు పలికాయి. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేసిన విషయం తెలిసిందే. -
హింస అదుపులో విఫలం
-
హింస అదుపులో విఫలం
కర్ణాటక, తమిళనాడుపై సుప్రీం న్యూఢిల్లీ: కావే రీ వివాదంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల తీరుపై గురువారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకు అడ్డుకట్ట వేయడంలో ఇరు రాష్ట్రాలు విఫలమయ్యాయంది. కోర్టు తీర్పును పాటించాల్సిందేనని, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని తేల్చిచెప్పింది. ఎలాంటి హింస, ఆందోళనలు, విధ్వంసం, ఆస్తి నష్టం లేకుండా చూడడం ఇరు రాష్ట్రాల బాధ్యతని నొక్కిచెపుతూ, శాంతి, నెమ్మది నెలకొనేలా చూడడంతో పాటు చట్టం పట్ల గౌరవం చూపాలని సూచించింది. సంబంధిత అధికారులు విజ్ఞతతో వ్యవహరించాలంటూ జస్టిస్ దీపక్ మిశ్రా, లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది. శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20 కు వాయిదా వేసింది. తమిళనాడు బంద్‌కు ప్రతిపక్షాల మద్దతు నేడు తమిళనాట బంద్ నేపథ్యంలో కన్నడ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించాలంటూ ఆ రాష్ట్ర సీఎం జయలలితకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. కొన్ని సంస్థలు తమిళనాడు బంద్‌కు పిలుపునివ్వడంపై తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. మరోవైపు చెన్నై నిరసనల్లో గురువారం విగ్నేశ్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 93 శాతం కాలిన గాయాలతో చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను బతికే అవకాశాలు తక్కువని వైద్యులు ప్రకటించారు.బంద్ నేపథ్యంలో చెన్నై, ఇతర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో పాటు వేల మంది పోలీసుల్ని మెహరించారు. బెంగళూరులో సాధారణ పరిస్థితులు నెలకొన్నా నిషేధ ఉత్తర్వుల్ని కొనసాగిస్తున్నారు. 25 అర్థరాత్రి వరకూ 144 సెక్షన్‌ను పొడిగించారు. -
సిగ్గుపడాల్సి వస్తోంది : కమలహాసన్
తమిళసినిమా: కర్ణాటకలోని కొన్ని సంఘాలు, అసాంఘిక శక్తులు పాల్పడుతున్న హింసాత్మక చర్యలను ఖండిస్తూ శుక్రవారం తమిళనాడులో బంద్ నిర్వహిస్తున్నారు. కాగా కావేరి జలాల వివాదంపై ప్రముఖ నటుడు కమలహాసన్ గురువారం స్పందిస్తూ మనం భాష తెలియని వానరంలా జీవించినప్పటి నుంచి కావేరి నది ప్రవహిస్తోంది. ఈ జలాలపై వివాదం ఏర్పడడం బాధాకరమని పేర్కొన్నారు. చరిత్ర అనే అద్దంలో మనం ముఖం చూసుకుని సిగ్గు పడాల్సి వస్తోంది అని కమల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. బంద్‌కు కోలీవుడ్ మద్దతు : నేడు షూటింగ్‌లు రద్దు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు శుక్రవారం జరగనున్న బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అన్ని సంఘాల వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొంటూ తమిళ రైతుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి అమ్మ సుప్రీంకోర్టులో పోరాడి కావేరి నీటిని తీసుకొస్తున్నారన్నారు. ధర్మాసనం ఆదేశాలను గౌరవించకుండా కర్ణాటక సంఘాలు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ అక్కడి తమిళులపై దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామన్నారు. రైతుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి జయలలితకు అభినందనలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు మద్దతుగా షూటింగ్‌లను, ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర ప్రదర్శనలు కూడా ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
నీళ్ల కోసం.. యువకుడి ఆత్మాహుతియత్నం
కావేరీ జలాల కోసం తమిళనాడులో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మన్నర్‌కుడి ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు ఆత్మాహుతియత్నం చేశాడు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నామ్ తమిళర్ కచ్చి అనే సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు వెంటనే మంటలు ఆర్పేసి.. అతడిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ చెన్నై రాజరత్నం స్టేడియం నుంచి ర్యాలీ బయల్దేరింది. నామ్ తమిళర్ కచ్చి డైరెక్టర్లు చేరన్, అమీర్ సహా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగుతుండగానే.. సురేష్ ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తమిళులు ఇలా ప్రాణత్యాగాలు చేయడం సరికాదని, మనం ప్రాణాలు నిలబెట్టుకుని మరీ జలాల కోసం పోరాడాలని ఈ సందర్భంగా నామ్ తమిళర్ కచ్చి నేత సీమన్ అన్నారు. -
బర్త్ డే వేడుకలకు నటి దూరం
బొమ్మనహళ్లి (బెంగళూరు): కన్నడ గోల్డెన్ క్వీన్‌గా పేరు పొందిన కన్నడ నటి, చెలువిన చిత్తార హిరోయిన్ అమూల్య బుధవారం 22 సంవత్సరాలు పూర్తి చేసుకోని 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కానీ రాష్ట్రంలో కావేరి నీటి కోసం జరుగుతున్న పోరాటాలు, బెంగళూరులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో బుధవారం నిర్వహించాల్సిన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా అమూల్య మీడియాతో మాట్లాడుతూ ఏటా తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య జరిగేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కావేరి నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడంతో కన్నడిగులు ఉద్యమిస్తున్నారన్నారు. ఈ దశలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకోవడం సబబుగా ఉండదన్నారు. అందుకోసమే జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. -
కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక
తమిళనాడుకు తరలిన పెళ్లి బృందం హోసూరు: కావేరి జల వివాదం నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న అల్లర్లతో అక్కడ జరగాల్సిన పెళ్లి తమిళనాడుకు మారింది. తిరువణ్ణామలైకు చెందిన రంజిత్(25) బెంగళూరులో భవన నిర్మాణకార్మికుడుగా పని చేస్తున్నాడు. రంజిత్‌కు తిరువణ్ణామలైకే చెందిన సౌమ్యతో బుధవారం బెంగళూరులో పెళ్లి జరిపేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఆహ్వాన పత్రికలూ ముద్రించారు. పెళ్లి పీటలు సిద్ధమయ్యాయి. కానీ బెంగళూరులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం మొత్తం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లారు. వీరు బెంగళూరు నుండి అత్తిపల్లి వరకు కర్ణాటక బస్సులో అక్కడి నుండి కిలోమీటర్ దూరం పెళ్లి దుస్తులతోనే నడచి వచ్చి జూజువాడి వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సులలో తిరువణ్ణామలైకు వెళ్లారు. -
బెంగళూరు ప్రశాంతం
కర్ఫ్యూ తొలగింపు - 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్న ప్రభుత్వం - పోలీసుల అదుపులో 350 మంది.. రేపు తమిళనాడు బంద్ సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై హింస చెలరేగిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన కర్ఫ్యూను బుధవారం ఉదయం 9 గంటలకు ఎత్తివేశారు. అంతకుముందు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ సున్నిత ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినట్లు అంచనా వేసి కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే.. ముందుజాగ్రత్తగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పరమేశ్వర చెప్పారు. హింసకు సంబంధించి 350 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బీఎంటీసీ బస్సులు, ట్యాక్సీలు, మెట్రో సర్వీసులు పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కావడంతో పాటు వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలను తెరవడంతో బెంగళూరులో జనజీవనం మామూలు స్థితికి చేరుకుంది. అన్ని ఐటీ, బీపీఓ కంపెనీల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయటంపై కర్ణాటకలో కొనసాగుతున్న ఆందోళనలు.. ఈ నెల 12న హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మండ్యాలో తమిళుల నిరసన... కావేరి జలాల విడుదలపై ఆందోళనలకు కేంద్ర బిందువైన మండ్య నగరంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలను నిరసిస్తూ తమిళులు ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను నిరసిస్తూ గురువారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రైలోరోకోలకు కన్నడచళువళి వాటాల్ పార్టీతో పాటు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. మరోపక్క.. తమిళనాడులోని పలు వాణిజ్య, రైతు సంఘాలు ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు.. డీఎంకే ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. సుప్రీంను ఒప్పించేందుకు యత్నిస్తాం కావేరి జలాల విషయంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై, కావేరి బేసిన్లో ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలపై సుప్రీంకోర్టును ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడుకు నీటి విడుదలకు సంబంధించిన కేసు ఈ నెల 20న విచారణకు వచ్చినపుడు.. కావేరి బేసిన్లో నీటి సమస్య ఎదుర్కొంటున్నామని, తాగు అవసరాలకు మాత్రమే నీరు మిగిలివుందని వివరిస్తామని జలవనరుల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ చెప్పారు. తమిళనాడు, కర్ణాటకల్లో శాంతిభద్రతలను నెలకొల్పేలా ఆ రెండు రాష్ట్రాలకు, కేంద్రానికి నిర్దేశించాలంటూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
కావేరి వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ కావేరీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర జలాల వివాదాల నదీ ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్విట్టర్ లో తన ఫీలింగ్స్ ను షేర్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. కావేరీ జలాల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య ఆదిమానవుల కాలంనుంచి కొనసాగుతోందనీ, ఇది మన తరం తర్వాత కూడా కొనసాగుతుందన్నారు. మానవుడు వానరాలుగా.. భాష నేర్వక సంచరిస్తున్న కాలంలో పుట్టిందనీ.. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందంటూ ట్వీట్ చేశారు. చరిత్ర అద్దంలో మన ముఖాలను ఇలా చూసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాగా సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చెలరేగిన వివాదం హింసాత్మకం రూపం దాల్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనాలను కన్నడిగులు తగులబెట్టారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. ఐటీ సహా, పలు వ్యాపార సంస్థలు మూతపడడంతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా జరిగిన పోలీసులు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..!
-
కావేరి జల గండంతో రూ.25 వేల కోట్ల నష్టం
-
కావేరి చిచ్చుకు కారకులెవరు ?
-
చల్లారుతున్న కా‘వేడి’...
-
చల్లారుతున్న కా‘వేడి’...
బెంగళూరులో పలుచోట్ల సాధారణ స్థితి - సుప్రీం తీర్పు అమలు చేస్తామన్న సీఎం సిద్దరామయ్య - ఆందోళనకారులపై ఉక్కుపాదం తప్పదని వ్యాఖ్య - గాయపడిన ఓ యువకుడి మృతి కర్ణాటకకు అదనపు బలగాలు సాక్షి, బెంగళూరు/చెన్నై/న్యూఢిల్లీ: కావేరి జలవివాదంపై అట్టుడికిన కర్ణాటకలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యం గా రాజధాని బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఈ నెల 20 వరకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. ఈ అల్లర్ల ద్వారా రాష్ట్రంతోపాటు బెంగళూరు ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతోందని, ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.మంగళవారం కేబినెట్ అత్యవసర భేటీలో పరిస్థితిని సమీక్షించిన సీఎం.. కోర్టు నిర్ణయం అమలుచేయటం రాజ్యాంగబద్ధమని, కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేశారు. వివాదంపై కర్ణాటక సర్కారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కావేరి ట్రిబ్యునల్ సెప్టెంబరు 18న(ఆదివారం) తుదితీర్పు వెలువరించనుంది. కాగా, సోమవారం నాటి ఘటనలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మూడంతస్తుల భవనం నుంచి దూకి గాయపడిన కుమార్ (30)అనే యువకుడు మంగళవారం చనిపోయాడు. దీంతో ఈ వివాద మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం పోలీసుల కాల్పుల్లో పాతికేళ్ల యువకుడు మరణించడం తెలిసిందే. ఈ ఇద్దరి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాలకు సిటీ బస్సులు, మెట్రోసేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సు సర్వీసులు మొదలయ్యాయి. చెదురుమదురు ఘటనలు.. బెంగళూరులో నిషేధాజ్ఞలు బుధవారం వరకు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. పలుచోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చినా.. సున్నితమైన 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. తిగలారపాల్యలో నిన్న సగం కాలిన తమిళనాడు బస్సును ఆందోళనకారులు మంగళవారం పూర్తిగా తగలబెట్టారు. రెండ్రోజుల్లో 300 మందిని అరెస్టు చేశారు. హెగ్గనహల్లి, పట్టెగారపాల్య ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపై టైర్లు తగటబెట్టడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మండ్య, చిత్రదుర్గ, రమణగార, మైసూరు ప్రాంతాల్లోనూ అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. బుధవారం మండ్య లేదా మైసూరులో కావేరి హితరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు సమావేశమై.. తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిఘా సమాచారం. సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి.పరమేశ్వర వేర్వేరు వీడియో ప్రకటనల్లో ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, బక్రీద్ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావటంతోపాటు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించటంతో రోడ్లు నిర్మానుష్యంగానే ఉన్నాయి. తమిళులు నివసించే ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలతో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. బక్రీద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో.. ముస్లిం ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో శాంతిభద్రతలపై సిద్ధరామయ్య మాట్లాడారు. కర్ణాటకకు అదనంగా 700 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. అటు కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని చొరవతీసుకోవాలని కోరారు. కోర్టు నిర్ణయమే శిరోధార్యం..‘కోర్టు నిర్ణయాన్ని అమలుచేయటం చాలా కష్టం. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందుకే సుప్రీం చెప్పినట్లుగానే కావేరి నీటిని విడుదల చేస్తాం. రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించేందుకు చొరవతీసుకోవాలని ప్రధానిని కోరాం’ అని తెలిపారు. తమిళనాట ఆందోళన బాట కావేరి జల వివాదంపై కర్ణాటకలో తమిళనాడు ప్రజల ఆస్తులపై జరిగిన విధ్వంసంతో.. తమిళ తంబిలు కన్నడ సంస్థల ముందు.. ఆందోళన నిర్వహించారు. నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) సంస్థ కార్యకర్తలు కోయంబత్తూరుతోపాటు పలు ప్రాంతాల్లో ధర్నాలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చెన్నైలోని కర్ణాటక బ్యాంకుపైకి ఓ అగంతకుడు రాయి విసరటంతో బ్యాంకు అద్దాలు పగిలాయి. పలుచోట్ల కర్ణాటక బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కన్నడనాట ఆందోళనల ద్వారా రూ. 2వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తమిళనాడు వ్యాపారస్తుల సంఘం వెల్లడించింది. పెళ్లికీ అడ్డంకి..ఆందోళనల నేపథ్యంలో బెంగళూరులో జరగాల్సిన ఓ పెళ్లి వేదిక మారింది. తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన రంజిత్ బుధవారం బెంగళూరులో తమిళమ్మాయి సౌమ్యతో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బెంగళూరులో కర్ఫ్యూ నేపథ్యంతో అక్కడ పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లింది. కర్ణాటకకు 25వేల కోట్ల నష్టం తాజా వివాదంతో కర్ణాటకకు రూ. 25వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అసోచామ్ వెల్లడించింది. హింసాత్మక ఘటనల వల్ల భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు ప్రతిష్టకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలిపింది. నష్టం కూడా ఎక్కువగా, ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలకే వాటిల్లిందని ఓ ప్రకటనలో చెప్పింది. నగరంలో మౌలిక వసతులతోపాటు, రవాణా రంగం పెద్దమొత్తంలో కోల్పోయిందని వెల్లడించింది. ప్రముఖ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు ఈ-కామర్స్ దిగ్గజాలైన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ కార్యాలయాలు వరుసగా రెండోరోజూ మూతబడ్డాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు మంగళవారం సెలవు ప్రకటించి.. శనివారం (సెప్టెంబర్ 17)న ఆఫీసులు తెరిచి ఉంచనున్నట్లు తెలిపాయి. కాగా, కావేరి వివాదం ముదిరేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. శాంతించండి న్యూఢిల్లీ: కావేరి వివాదంలో కర్ణాటక, తమిళనాడు ప్రజలు శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకునేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. ఆందోళనకారులపై కఠినంగా వ్యవహరించాలని ఇరు ప్రభుత్వాలకు సూచించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక వివాదం సరికాదు. ఆందోళనల వల్ల సామాన్య ప్రజానీకానికి సమస్యలు తప్పవు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించొచ్చు. కన్నడనాట తమిళులపై, తమిళనాడులో కన్నడిగులపై దాడులు తప్పు’ అని కేంద్ర సమాచార ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కావేరి వివాదంలో అవాస్తవాలను ప్రసారం చేసి పరిస్థితి రెచ్చగొట్టవద్దని, కాస్త సంయమనం పాటించాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆదేశాలు జారీ చేసింది. చాలా బాధగా ఉంది: మోదీ కర్ణాటక, తమిళనాడు ఘటనలు బాధ కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ‘హింసతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు. న్యాయపరిధిలో చర్చించటం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో సంయమనం, పరస్పర సహకారం ద్వారానే ఏదైనా సాధించవచ్చు. పౌరులుగా మన బాధ్యతను గుర్తుపెట్టుకుందాం’ అని మోదీ తెలిపారు. -
రేపు రాష్ట్ర బంద్
నేడు కావేరీ హక్కుల ర్యాలీ వివిధ పార్టీల పోరుబాట సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరీ జల వివాదాన్ని మరింత జఠిలంగా మార్చిన కర్ణాటక ప్రభుత్వాన్ని నిరసిస్తూ, తమిళులపై దాడులను ఖండిస్తూ ఈనెల 15వ తేదీన బంద్ పాటించాలని తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు ధనపాలన్ మంగళవారం ప్రకటించారు. బెంగళూరులో తమిళనాడు బస్సులను దహనం చే సినందుకు ప్రతీకారంగా మంగళవారం రాష్ట్రంలో పలు ఆందోళనలు, విధ్వంసాలు సాగాయి. కర్ణాటక వాహనదారులు తమిళనాడు నంబరు ప్లేట్లను తగిలించుకుని తిరుగుతున్నారు. కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు బందోబస్తు చేసినా అనేక చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయారు. చెన్నైలో 171 కర్ణాటక కార్యాలయాలకు 68 హోటళ్లకు, 66 ఎంటీఎంలకు పోలీసు బందోబస్తు పెట్టారు. కోయంబత్తూరు జిల్లా గాంధీపురం నుంచి గరుడాలయా సంస్థకు చెందిన ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ బస్సు 21 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి చెన్నైకి బయలుదేరింది. అర్ధరాత్రి బస్సును అడ్డగించిన ఇద్దరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో బస్సు ముందు భాగంలోని రెండు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిలో నిలిచి ఉన్న ఒక జీపును ధ్వంసం చేశారు. కావేరీ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని ఆందోళనకారులు కర్ణాటక బ్యాంకులపై గురిపెట్టారు. విరుగంబాక్కంలోని కర్ణాటక బ్యాంకు ముందు తమిళగ వాళ్వురిమై కట్చి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై తంగశాలైలో మణిగుండు సమీపంలోని కర్ణాటక బ్యాంకు ఏటీఎం ఉంది. మంగళవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో బైక్‌లో హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఏటీఎంపై రాళ్లు వేసి అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే ఏళుకిన్రులోని కర్ణాటక బ్యాంకు ఏటీఎంను పూర్తిగా ధ్వంసం చేశారు. కోయంబేడులో కర్ణాటక బస్సు అద్దాలు పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశారు. మైలాపూర్‌లోని సంగీత హోటల్లోకి 12 మంది నామ్‌తమిళర్ కట్చి కార్యకర్తలు జొరబడి ఫర్చిచర్ ధ్వంసం చేశారు. శ్రీపెరంబుదూరు చెక్‌పోస్టు సమీపంలో కర్ణాటక లారీకి దుండగులు నిప్పుపెట్టారు. వాహనాలకు బ్రేక్: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగని దృష్ట్యా తమిళనాడు సరిహద్దుల్లో మంగళవారం సైతం వాహనాలను నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు మాత్రమేగాక కార్లను సైతం కార్లను సైతం అనుమతించలేదు. ఈ రోడ్డు జిల్లా సత్యమంగళం మీదుగా కర్ణాటకకు వెళ్లే వాహనాలను మాపన్నారీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. బెంగళూరు బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తమ రిజర్వేషన్ చార్జీలను తిరిగి చెల్లించాలని అనేక చోట్ల డిమాండ్ చేశారు. అయితే బస్సు యాజమాన్యాలు ఇందుకు నిరాకరించడంతో గొడవలు ఏర్పడ్డాయి. పార్టీల పోరుబాట: కావేరీ వివాదంపై ఈనెల 18వ తేదీన డీఎంకే అధ్యక్షులు కరుణానిధి పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశం అవుతున్నారు. పరిష్కారానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరపాలని డీఎంకే కోశాధికారి, ప్రతిపక్షనేత స్టాలిన్ సూచించారు. కర్ణాటకలో తమిళులపై దాడులు ఆగలాంటే సీఎం జయలలిత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ ఈనెల 16వ తేదీన నిరాహారదీక్ష చేపడుతున్నట్లు డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ మంగళవారం ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయం ముందు దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కావేరీ మేనేజిమెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన ఆరు జిల్లాల్లో రోడ్డు రోకో, రైల్‌రోకో నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కర్ణాటకలో తమిళుల ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16వ తేదీన రైల్‌రోకో నిర్వహిస్తున్నట్లు వీసీకే అధ్యక్షులు తిరుమా ప్రకటించారు. కావేరీ హక్కుల సాధన ర్యాలీని బుధవారం నిర్వహిస్తున్నట్లు నామ్ తమిళర్ క ట్చి అధ్యక్షులు సీమాన్ మంగళవారం ప్రకటించారు. కావేరీ వివాదాన్ని అక్కడి ప్రభుత్వం రాజకీయం చేసి చోద్యం చూస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. -
కావేరి మంటలను రెచ్చగొట్టిన టీవీ మీడియా
తమిళనాడు రాష్ట్రానికి కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శాంతియుతంగా బంద్ నిర్వహించిన కర్ణాటకలో హఠాత్తుగా విధ్వంసక సంఘటనలు ఎలా ప్రజ్వరిల్లాయి? అందుకు కారకులెవరు? మీడియానే అందుకు కారణమని, ముఖ్యంగా టీఆర్పీ రేట్ల కోసం పోటీపడే ఇరు రాష్ట్రాల్లోని టీవీ చానళ్లు ప్రసారం చేసిన రెచ్చగొట్టే సంఘటనలే హింసను రగిలించాయని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని ప్రాంతీయ భాషా టీవీ చానళ్లు వారి రాష్ట్రం పక్షాన, కర్ణాటకలోని ప్రాంతీయ భాషా టీవీ చానళ్లు కర్ణాటక పక్షం వహించగా, తమిళనాడు నుంచి ప్రసారం అవుతున్న ఒకే యజమానికి చెందిన తమిళ, కన్నడ భాషా ఛానళ్లు ఒకోవైపు ఒకోలా ఉండి.. ద్వంద్వనీతిని చాటుకున్నాయి. ఫేస్బుక్లో కర్ణాటక కావేరి నిరసనకారులను విమర్శించారన్న కారణంగా ఓ తమిళ కుర్రవాడిని కన్నడిగులు చితకబాదిన వీడియో క్లిప్పింగ్‌ను ఓ తమిళ చానల్ ఆదివారం అంతా ప్రసారం చేసింది. దీంతో రెచ్చిపోయిన కొంతమంది తమళ యువకులు సోమవారం ఉదయం మైలాపూర్‌లోని 'న్యూ ఉడ్‌ల్యాండ్' హోటల్‌పై పెట్రోలు బాంబులను విసిరారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ హోటల్ తమిళనాడులో స్థిరపడిన నాలుగో తరం కన్నడ కుటుంబానికి చెందినది. టీవీ మీడియా సంఘటనా స్థలానికి వచ్చి లైవ్ కవరేజ్ పేరుతో హంగామా చేయడంతో బెంగుళూరు, మైసూర్ నగరాల్లో ప్రతీకార దాడులు ప్రారంభమయ్యాయి. తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకొని వాహనాలను తగులబెట్టారు. చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే రాధాకృష్ణన్, జస్ట్ కన్నడ డాటా కామ్ ఎడిటర్ మహేశ్ కొల్లీగల్ తదితరులు మీడియా తీరును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించాల్సిన మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించిందని, లైవ్ కవరేజ్ పేరిట టీఆర్పీ రేటింగ్ కోసం చానళ్లు పాకులాడాయని వారు విమర్శించారు. ఈసారి సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ కురుస్తుందని భావించినా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువగా కురవడం, కావేరి బెల్ట్‌లోని రిజర్వాయర్లు పూర్తిగా నిండకపోవడం కావేరి జలాల జగడానికి దారితీసింది. కర్ణాటకలో రిజర్వాయర్లు 70 శాతం నిండగా, తమిళనాడులోని రిజర్వాయర్లు 51 శాతం మాత్రమే నిండాయి. ఈ నేపథ్యంలో జలాల విడుదలకు కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది. -
కావేరి గొడవతో సిటీ ఇమేజి.. డ్యామేజి!
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న కావేరీ జలాల వివాదం వల్ల కలిగిన నష్టం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారుల దాడులు, ఆందోళన, విధ్వంసానికి తోడు.. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా మార్గాలు కూడా స్తంభించాయి. సోమవారం చెలరేగిన ఈ అల్లర్ల మూలంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచామ్ ప్రకటించింది. ఐటీ సహా అనేక ప్రధాన కార్యాలయాలు, ఫ్యాక్టరీలు మూతపడ్డ నేపథ్యంలో కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు నగరంలో చెలరేగిన హింస కారణంగా రూ. 22వేల కోట్లనుంచి రూ. 25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ హింసాత్మక పరిణామాలు ముఖ్యంగా బెంగళూరులోని వ్యాపార, పరిశ్రమ వర్గాలను నిరుత్సాహపరిచేదిగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్చూన్ 500 కంపెనీలలో దాదాపు అన్నీ ఇక్కడే ఉన్నాయని.. అలాంటి బెంగళూరు నగర ఇమేజి దారుణంగా దెబ్బతిందని ఆయన అన్నారు. హింసాత్మక ఘటనలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయని, దానివల్ల వ్యాపారాలు, పారిశ్రామిక వర్గం నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయని తెలిపారు. భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు పరువు ఘోరంగా దెబ్బతిందని రావత్ చెప్పారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని కేంద్రానికి అసోచామ్ విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించాలని కోరింది. కనీస ప్రాథమిక అవసరం నీరు అని, ఇది భావోద్వేగ సమస్య అని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు తావులేకుండా పరిష్కరించాలని కోరింది. ప్రశాంతంగా పనిచేసుకునే ఉద్యోగుల్లో ఈ గొడవల వల్ల తీవ్ర భయాందోళనలు కలిగాయని, విదేశాల్లో కూడా ఆందోళన పుడుతోందని అసోచామ్ వ్యాఖ్యానించింది. ఐటీ ఎగుమతుల విషయంలో మంచి స్థానాల్లో ఉన్న బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని తెలిపింది. ఈ రెండురాష్ట్రాల వివాదంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరింది. -
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
-
మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
బెంగళూరు: కావేరి జలాల విషయంలో తమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు ఆరు రోజుల పాటు కావేరి జలాలను విడుదల చేశామని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించడం ఇబ్బందికరమైనా, తాము ఇప్పటికీ తీర్పుకు కట్టుబడిఉన్నామని తెలిపారు. కర్ణాటకలో తాగునీటికి సమస్య ఏర్పడినా, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేశామని చెప్పారు. కావేరి జలాల వివాదంతో కర్ణాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సిద్ధరామయ్య మంగళవారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సిద్ధరామయ్య చెప్పారు. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. 'కావేరి వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ప్రధానిని కలిసేందుకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరాను. రేపు నేను ఆయనతో కలిసే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా పిలిచి చర్చించాల్సిందిగా మోదీనికి విజ్ఞప్తి చేశా. ఏ సమస్యకైనా హింసే పరిష్కారం కాదు. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది' అని సిద్ధరామయ్య అన్నారు. కావేరి వివాదం కారణంగా తమిళనాడులో కన్నడిగులపై, కర్ణాటకలో తమిళులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మైసూర్, మండ్యా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగళూరులో తమిళనాడుకు చెందిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆందోళనకారులు దహనం చేశారు. బస్సు డిపోలో ఆపిన 40 ఓల్వో బస్సులకు నిప్పంటించారు. సరిహద్దుల్లో తమిళనాడుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తమిళుల ఆస్తులపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసుల కాల్పుల్లో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించాడు. -
కావేరి చిచ్చుకు కారకులెవరు ?
న్యూఢిల్లీ: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి వివాదం మళ్లీ రాజుకుంది. ఒక రాష్ట్రానికి చెందిన వాహనాలను మరో రాష్ట్రానికి చెందిన ప్రజలు లేదా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు దగ్ధం చేస్తున్నారు. విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ వివాదం ఇప్పటిది కాదు. బ్రిటిష్ వలసపాలకుల నాటి నుంచి కొనసాగుతున్నదే. వ్యవసాయానికి జల వనరుల కొరత ఏర్పడినప్పుడల్లా వివాదం భగ్గుమంటూనే ఉంటోంది. వాస్తవానికి కావేరి జల వివాదం కర్ణాటక, తమిళనాడుతోపాటు పుదుచ్ఛేరి, కేరళ రాష్ట్రాలకు చెందినది. గొడవలు మాత్రం ఎప్పుడూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్యనే జరుగుతాయి. కావేరి ప్రాదేశిక ప్రాంతంలో తమిళనాడు రైతులు జల వనరులు ఎక్కువగా అవసరమయ్యే పంటలనే వేయడం, కర్ణాటక రాష్ట్రంలో పట్టణీకరణ పెరిగి జల వనరుల కొరత ఏర్పడడంతో ఇరు రాష్ట్రాల మధ్యనే ఎక్కువగా వివాదం కొనసాగుతోంది. ఈ సమస్యను మొదటిసారి పరిష్కరించేందుకు 1991లో కావేరి ట్రిబ్యునళ్ను ఏర్పాటు చేశారు. అది సమస్య పరిష్కారానికి ఓ ఫార్ములాను సూచించింది. ఎన్నికల ప్రయేజనమే పరమావధిగా భావించిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ ఫార్ములాతో సంతృప్తి చెందలేదు. 1997లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఏ ముఖ్యమంత్రి కూడా కొంతైన రాజీ ధోరణని కనబర్చకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2012లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమయ్యారు. కొంతమేరకు పురోగతి సాధించినప్పటికీ ముఖ్యమంత్రులు శాశ్వత పరిష్కారానికి రాలేకపోయారు. చివరకు 2013లో కావేరి ట్రిబ్యునల్ సమావేశమైన గతంలో తాము సూచించిన ఫార్ములాకు కాస్త మెరగులు దిద్ది అధికారికంగా ఆ ఫార్ములాను నోటిఫై చేసింది. ఈ మూడేళ్లకాలంలో సమస్య రాజుకోలేదు. ఇప్పుడు మళ్లీ రగులుకుంది. ట్రిబ్యునళ్లు, హైకోర్టులు, సుప్రీం కోర్టు కావేరి సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ అధికారంలోవున్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. ఇరు రాష్ట్రాల రాజకీయ మూలాలు కావేరి సమస్యతో ముడిపడి ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ కావేరి సమస్య ఓ ఆయుధం అవుతోంది. పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు అనవసరంగా ఆందోళనల పేరిట బలవుతున్నారు. -
'కావేరి' పై స్పందించిన ప్రకాష్ రాజ్
హైదరాబాద్ : 'కర్ణాటక - తమిళనాడులో విధ్వంసాలు చూస్తుంటే బాధగా ఉంది.. మనం మనుషులం శాంతియుతంగా పోరాడి సమస్యకు పరిష్కారం కనుగొందాం' అంటూ కావేరి నదీ జలాల వివాదంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ర్టాలలో కొనసాగుతున్న విధ్వంసం చూస్తుంటే బాధగా ఉంది. హక్కుల కోసం పోరాడటం తప్పుకాదు కానీ.. ఆస్తులు ధ్వంసం చేయడం.. ఒకరినొకరు కొట్టుకోవడం తప్పు అని ఆయన అన్నారు. 'మనమంతా మనుషులం శాంతియుతంగా పోరాడుదాం... ఉద్యమం ఎలా చేయాలో భావి తరాలకు నేర్పుదాం. మీ కోపాన్ని అర్ధం చేసుకోగలను.. కొంచెం శాంతిని పాటించి అల్లర్లకు స్వస్థి పలుకుదాం' అని ఆయన ఆందోళన కారులను కోరారు. ఎలాంటి పుకార్లు నమ్మొద్దు.. ఆవేశానికి గురికావద్దని ఆయన సూచించారు. -
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’
-
'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..!
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్న కావేరి జలాల వివాదం.. ఓ నవవధువును కష్టాల్లో ముంచెత్తింది. అల్లరిమూకల హింసాత్మక ఆందోళనలతో రాకపోకలు నిలిచిపోయి... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ నవవధువు పెళ్లిచీరలో సుదూర నడక ప్రారంభించింది. తన కుటుంబసభ్యులను తోడుగా తీసుకొని పెళ్లి వేదికకు బయలుదేరింది. బెంగళూరుకు చెందిన ప్రేమ అనే యువతికి తమిళనాడు యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం తమిళనాడులోని వనియాంబడిలో వీరి వివాహం జరగనుంది. ఇంతలోనే 'కావేరి' వివాదం రెండు రాష్ట్రాలను చుట్టుముట్టింది. ఉద్రిక్తతలు పెరిగాయి. రాకపోకలు ఆగిపోయాయి. ఎక్కడ చూసినా హింసాత్మక పరిస్థితులు. ఈ ఉద్రిక్తతల నడుమ వారి పెళ్లి ఉత్సాహమంతా నీరుగారిపోయింది. వచ్చే బంధుమిత్రులు వెనుకంజ వేశారు. ఆఖరికీ ఎలాగోలా ముహూర్తం సమయానికి పెళ్లి వేదికకు చేరుకుంటే చాలనే నిశ్చయంతో తన కుటుంబసభ్యులు 20మందితో కలిసి.. పెళ్లిచీరలో ప్రేమ బయలుదేరింది. బస్సులు, ఆటోలు ఏవి దొరికినా వారు ఎక్కారు. ఆఖరికీ తమిళనాడు సరిహద్దులకు చేరుకునేసరికి రోడ్లు నిర్మానుష్యమైపోయాయి. మనుష్యుల సంచారం లేదు. ఇక వాహనాలు దొరికే పరిస్థితి లేదని నడక ప్రారంభించారు. ఇలా నాలుగు కిలోమీటర్లు నడిచి పెళ్లిచీరలో ముందుకు సాగుతున్న నవవధువు ప్రేమను 'ఎన్డీటీవీ' పలుకరించింది. 'పెళ్లి అంటే ఎంతో సంతోషం, సంబరం ఉంటుంది. కానీ మేం సంతోషాలన్నింటినీ మేం కోల్పోయాం. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా పరిస్థితులు మాకు ఎదురయ్యాయి' అని వధువు ప్రేమ ఆవేదన వ్యక్తం చేసింది. 'మేం ఎన్నో కష్టాలు పడుతున్నాం. బంధుమిత్రులకు 600 వరకు శుభలేఖలు పంపాం. కానీ, కేవలం 20మంది కుటుంబసభ్యులు మాత్రమే పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాం' అని తెలిపింది. 'మనమంతా భారతీయులం. ఇలాంటి విషయాల కోసం కొట్లాడుకోవడం సరికాదు' అని ఆమె ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది. కానీ, ఆమె ఆవేదన వారి కరుకు చెవులకు చేరుతుందా..! -
కావేరి వివాదంపై స్పందించిన మోదీ
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం స్పందించారు. ఇరురాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని, సామాజిక బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతగానో బాధించినట్లు మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడతాయని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు హింసను వదిలిపెట్టి జాతీయ అవసరాల కోసం నిలబడతారని తాను నమ్ముతున్నట్లు మోదీ పేర్కొన్నారు. దేశాన్ని నిర్మించుకోవడమే అన్నింటికన్నా పెద్ద విషయమని, అందుకు తమిళ, కన్నడ ప్రజలు తోడుగా నిలబడతారని భావిస్తున్నట్లు చెప్పారు. సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆందోళనకారులు బస్సులకు నిప్పు అంటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు బెంగుళూరులోని కొన్ని ప్రాంతాల్లో కర్య్ఫూని విధించారు. PM Modi appeals to people in Karnataka and TN, to display sensitivity, and also keep in mind their civic responsibilities. #CauveryIssue — ANI (@ANI_news) September 13, 2016 -
ప్రయాణికులకు ఎయిర్ఏసియా వెసులుబాటు
కావేరీ నదీ జల వివాద ప్రభావం అటు ఐటీ కంపెనీలపైనే కాదు ఇటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన ధరలకు ఎయిర్‌లైన్ సర్వీసులను ఆఫర్ చేసే ఎయిర్ఏసియా తమ ప్రయాణికులకు ట్రావెల్ సమయాన్ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 2016 సెప్టెంబర్ 13 ప్రయాణించే వారు ట్రావెల్ సమయాన్ని ఎలాంటి చార్జీ లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది. కావేరీ వివాదం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎయిర్‌పోర్టుకు రావడానికి ప్రయాణికులకు కష్టతరంగా మారుతున్నట్టు ఏయిర్ఏసియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రావెల్ సమయాన్ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించింది. బెంగళూరులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని ఎయిర్ఏసియా అర్థం చేసుకుందని, 2016 సెప్టెంబర్ 13 మంగళవారం బెంగళూరు నుంచి వెళ్లడానికి విమానాలు బుక్ చేసుకున్న వారు, ప్రయాణ సమయాన్ని ఎలాంటి చార్జీ లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చని ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా ఇబ్బందులతో కొంతమంది గెస్టులు ఎయిర్‌పోర్టుకు రాలేకపోతున్నారని గుర్తించినట్టు తెలిపింది. 72 గంటల వరకు ఏ సమయంలోనైనా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవచ్చని, దీనికోసం ఎయిర్ఏసియా అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది. తమ ప్రయాణ సమయాన్ని రీషెడ్యూల్ చేసుకోవడానికి ఎయిర్‌లైన్ స్టాప్‌కు లేదా కాల్ సెంటర్లకు కాంటాక్ట్ కావాల్సిందిగా సూచించింది. ఉత్తమమైన భద్రతను, సెక్యురిటీని, కంఫర్ట్‌ను ఎల్లప్పుడూ తమ గెస్టులకు, ప్రయాణికులకు అందిస్తున్నట్టు ఎయిర్ఏసియా గ్రూప్ విశ్వసిస్తూ ఉంటుందని పేర్కొంది. -
‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’
బెంగళూరు: కర్ణాటక ప్రజలు సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర విజ్ఞప్తి చేశారు. కొన్ని సంస్థల పేరుతో కొంత మంది వ్యక్తులు హింసకు పాల్పడ్డారని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హింసకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులను వెంటనే అదుపులోకి తెచ్చామని, లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేదని పరమేశ్వర అన్నారు. పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుతో కావేరి నీటి వివాదం నేపథ్యంలో బెంగళూరు సహా కర్ణాటకలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసకు దారి తీశాయి. -
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’
న్యూఢిల్లీ : కావేరి జలవివాదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారు. కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టరాని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కన్నడిగులు, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేశారన్నారు. అయితే ప్రతి ఒక్కరూ శాంతి, సమన్వయం పాటించాలని సదానంద సూచించారు. తమకే నీళ్లు లేవని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. హింసతో సమస్య పరిష్కారం కాదని, ఇరు రాష్ట్రాలు సమన్వయం పాటించాలన్నారు. కావేరిలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందుకే తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని సదానంద గౌడ అన్నారు. 40 శాతం తక్కువ వర్ష పాతంతో కేవలం రెండు, మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత వుందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎక్కువ వర్షాలు కురిసినపుడు ఈ పరిస్థితి లేదన్నారు. కేంద్రం ట్రిబ్యునల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని సదానంద అన్నారు. కాగా కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. -
సోషల్ మీడియాలో పుకార్లు నమ్మొద్దు
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే కర్ణాటకలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ వెల్లడైన క్రమంలో, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మవద్దని బెంగళూరు పోలీసులు పేర్కొంటున్నారు. ఏమైనా సందేహాలుంటే 100కి డయల్ చేసి నిర్థారించుకోవాలని సూచిస్తున్నారు. సిటీ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ @BlrCityPolice లేదా 9480801000 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. నగరంలోని 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. కావేరి నది జలాలను తమిళనాడుతో కర్ణాటక పంచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన క్రమంలో ఈ హింసాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో అట్టుడుకుతున్న కావేరి నది జల వివాద ప్రసారాలపై హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా బెంగళూరులో జరుగుతున్న ఈ వివాద ప్రసార ప్రోగ్రామ్‌ల వేటినీ కేబుల్ సర్వీసు ద్వారా ప్రసారం చేయకూడదని సూచిస్తూ అన్ని కేబుల్ టీవీ చానల్స్/ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్లకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఓ అడ్వయిజరీ నోట్‌ను పంపారు. హైదరాబాద్‌లో శాంతి నిర్వహణకు అందరూ కట్టుబడి ఉండాలని అన్ని టీవీ చానల్స్‌కు పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కేబుల్ టీవీ నెట్వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్ 1995 కింద పనిచేసే ఆథరైజ్డ్ ఆఫీసర్‌కు ఈ నోటీసులు పంపారు. ఈ చట్టంలోని సెక్షన్ 16 కింద జారీచేసిన ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన నిర్వహణ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసు అడ్వయిజరీ పేర్కొంది. బక్రీద్, గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో కావేరి జల వివాదాన్ని ప్రసారం చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని పేర్కొంటూ అన్ని కేబుల్ టీవీ చానల్స్/ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. -
కర్ణాటకకు వెళ్లొద్దు: అమెరికా
న్యూఢిల్లీ: కావేరి జలాలపై హింస చెలరేగిన కర్ణాటక రాష్ట్రానికి, బెంగళూరు నగరానికి ప్రయాణించవద్దని.. అమెరికా సోమవారం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. బెంగళూరులో పలు ఐటీ కంపెనీలు సహా పెద్ద సంఖ్యలో అమెరికా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ‘కావేరి నీటి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు సహా కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనలతో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని పలుచోట్ల మూసివేశారు. తమిళనాడు వాహనాలపై రాళ్లు రువ్వి, నిప్పు పెట్టారు. బెంగళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. ఫలితంగా బెంగళూరులోని పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక యంత్రాంగం ప్రకటించిందన’ని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు నగరంలో కర్ఫ్యూ విధించిన చోట్ల పోలీసులు, అదనపు భద్రతా బలగాలను మోహరించారు. రాజగోపాల నగర, కామాక్షిపాళ్య, విజయనగర, బ్యాటరాయణపుర, కెంగేరీ, మాగడి రోడ్డు, రాజాజీనగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. -
బెంగళూరులో కొనసాగుతున్న 144 సెక్షన్..
బెంగళూరు : కావేరి జల వివాదంపై అట్టుడుకుతున్న కర్ణాటకలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్‌లతో పాటు అదనంగా 15వేలమంది పోలీసులు, అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు. బెంగళూరుతో పాటు మండ్యా, మైసూరు నగరాలతో పాటు.. కర్ణాటకలో కావేరి నదిపై గల 4 జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ కింద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అలాగే మండ్యాలో ఈ నెల 17వరకూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు బెంగళూరులో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. కాగా ఆందోళనకారులు నిన్న 270 వాహనాలను తగులబెట్టారు. అల్లర్లలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఇక తాజా పరిణామాలపై చర్చించేందుకు కర్ణాటక మంత్రివర్గం మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. -
కావేరి మంటలు
-
కావేరి కార్చిచ్చు
-
తమిళనాడు వాహనాలపై దాడులు
బెంగళూరు(బనశంకరి) : తమిళనాడులో కన్నడిగులపై దాడులను నిరసిస్తూ నగరంలో వివిధ కన్నడ సంఘాల్లో ఆగ్రహం పెల్లుబికింది. సోమవారం కనకపుర ప్రధానరహదారిలోని సారక్కి వద్ద జయకర్ణాటక కార్యకర్తలు తమిళనాడుకు చెందిన రెండు లారీలను అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిసస్థితులు నెలకొనడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బనశంకరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన హోటళ్లు, విద్యాసంస్థలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. జయనగరలో తమిళనాడుకు చెందిన జ్యువెలరీ దుకాణాలను జయకర్ణాటక కార్యకర్తలు మూసివేయించారు. తుమకూరు : తమిళనాడు వాహనాలపై కన్నడ పోరాట సంఘాలకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేస్తుండంతో తుమకూరులో ముందు జాగ్రత్తగా పోలీసులు తమిళనాడు ప్రాంతాలకు చెందిన సుమారు 15 నుంచి 20 లాలీలను భారీ భద్రత మధ్య వాటిని పోలీస్ మైదానంలోకి తరలించారు. తమిళనాడులో కన్నడిగులపై దాడులను నిరసిస్తూ తుమకూరు సమీపంలోనిన కన్నడ పోరాట సంఘాలకు చెందిన కార్యకర్తలు జాతీయ రహదారి బాలాజీ రబ్బర్ ఫ్యాక్టరీ వద్ద నిలిపిన తమిళనాడుకు చెందిన లారీకి నిప్పు పెట్టి పలు వాహనాలను రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణరాజపుర: కావేరి నదీ జలాల పంపిణీలో మరోసారి సుప్రీంకోర్టులో రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో పాటు తమిళనాడులో కన్నడిగులపై తమిళులు దాడులకు పాల్పడటంతో ఆగ్రహం చెందిన కర్ణాటక రక్ష ణ వేదిక (కరవే) స్వాభిమాని కార్యకర్తలు తమిళనాడుకు చెందిన మూడు వాహనాలపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో కే.ఆర్.పురలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యలహంక: తమిళనాడులో నివాసముంటున్న కన్నడిగులపై తమిళులు దాడులకు పాల్పడుతుండటంతో పాటు మరోసారి కావేరి నదీ జలాల పంపిణీలో కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో ఆగ్రహం చెందిన సువర్ణ కర్ణాటక జనశక్తి వేదిక కార్యకర్తలు సోమవారం యలహంకలోని పుట్టెనహళ్లి వద్ద తమిళనాడుకు చెందిన వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. -
సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కావేరి నిరసనలు మిన్నంటాయి. కొన్ని రోజులుగా శాంతియుత వాతావరణంలో జరగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారి కోట్లాది రూపాయల ఆస్తినష్టాన్ని కలిగించడమే కాకుండా ఇద్దరు యువకులు పోలీసు తూటాలకు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు మృతి చెందాడు. నదీ జలాలను తమిళనాడుకు వదలడాన్ని నిరసిస్తూ సాగిస్తున్న ఈనెల 6 నుంచి ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పునఃపరిశీలన అర్జీపై సోమవారం తీర్పు వెలురించింది. రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 20 వరకూ తమిళనాడుకు నీటిని వదలాలన్నది తాజా తీర్పు సారాంశం అయితే ఈ తీర్పు కర్ణాటకకు అన్యాయం చేకూర్చిందని అటు ప్రభుత్వ, న్యాయ నిపుణులతో పాటు నిరసనకారులు భావించారు. అదే సమయంలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలను అక్కడి వారు ధ్వంసం చేయడం, తమిళనాడులో నివశిస్తున్న కన్నడిగులపై స్థానికులు భౌతిక దాడులు జేయడంతో పాటు కన్నడిగులు నిర్వహిస్తున్న హోటళ్లు, ఆర్థిక సంస్థలపై కొంతమంది తమిళులు దాడి చేసి ఆస్తినష్టం కలిగించారన్న వార్తలు, ఫొటోలు, వీడియోలు వివిధ సోషియల్ మీడియాల్లో, వైరల్ అయ్యి కర్ణాటకలోని ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారమయ్యాయి. దీంతో కర్ణాటక వ్యాప్తంగా నిరసనకారులు రెచ్చిపోయారు. ముఖ్యంగా బెంగళూరులోని ఆలహళ్లిలోని న్యూ టింబర్ యార్డ్ లేఔట్లో గోకుల్‌రాజ్ ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీలతో పాటు అక్కడే ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన దాదాపు 25 వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. కొన్ని వాహనాల్లో టపాసులు (మందుగుండు) ఉండటంతో పెద్ద శబ్ధంతో వాహనాలు తగలబడుతూ కనిపించాయి. అదే విధంగా కేఎపీఎస్ ట్రావెల్స్‌కు చెందిన 50 బస్సులను తగలబెట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా అనేక వాహనాలను ఆందోళకారులు దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే పోలీస్ కాల్పుల్లో తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా సింగేనేహళ్లికి చెందిన ఉమేశ్ (25) మృతి చెందాడు. నైస్ రోడ్డుపై తమిళనాడు రవాణాశాఖకు చెందిన బస్సులకు కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇక నందినీ లే అవుట్లో పోలీసు వాహనానికి కూడా నిరసన కారులు దగ్ధం చేశారు. మొత్తంగా ఒక్క బెంగళూరులోనూ దాదాపు వంద వాహనాలు నిరసన కారుల కోపానికి బస్మమయ్యాయి. ఇక మండ్య, మైసూరులో కూడా పరిస్థితి అదుపుతప్పి హింసాత్మకంగా మారాయి. దీంతో హోంశాఖ అధికారులు అత్యవసర సమావేశం జరిపి బెంగళూరు, మండ్యా, మైసూరుతో పాటు కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. అయినా కూడా పొద్దుపోయేంతవరకూ అక్కడక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా 50కి పైగా వాహనాలు తగలబెట్టారు. సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీలు నిరసనలు అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సాయంత్రం బీఎంటీసీ విభాగం పూర్తిగా బస్సు సర్వీసులు రద్దు చేసింది. ఇక తమిళనాడుకు వెళ్లే దాదాపు అన్ని బస్సులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక బెంగళూరులోని కన్వర్జీస్ సాప్ట్వేర్ సంస్థలోకి నిరసనకారులు చొచ్చుకువెళ్లి అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న మరికొన్ని ఐటీ కంపెనీలు ముందుజాగ్రత్త చర్యగా సంస్థ నైట్‌షిఫ్ట్‌కు ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఉద్విగ్న పరిస్థితులకు తమిళనాడుకు చెందిన సంతోష్ అనే విద్యార్థి ఈనెల 10న ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్టులు కారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి జీ.పరమేశ్వర్ వెల్లడించారు. జయకు లేఖ తమిళనాడులో కర్ణాటక రాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి కన్నడిగులకు రక్షణ కల్పించలాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాసామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రెండు రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుం టుండడం విచారకమరమని రెండు రాష్ట్రాలు శాంతిభద్రతలను కాపాడుకోవలసిన అవసరముందని తెలిపారు. తమిళనాడులు కన్నడిగులపై దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడారని అదేవిధంగా రాష్ట్ర డీజీపీ ఓంప్రకాశ్ తమిళనాడు డీజీపీతో చర్చించారని తెలిపారు. తమిళనాడులో ఉంటున్న కర్ణాటక రాష్ట్ర ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు రాసిన లేఖలో పేర్కొన్నానని తెలిపారు. బెంగళూరులో కర్ఫ్యూ కర్ఫ్యూ విధించిన చోట్ల పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. రాజగోపాల నగర, కామాక్షిపాళ్య, విజయనగర, బ్యాటరాయణపుర, కెంగేరీ, మాగడి రోడ్డు, రాజాజీనగర ప్రాంతాల్లో క ర్ఫ్యూ విధించారు. -
కావేరి మంటలు
జల వివాదంతో భగ్గుమన్న కర్ణాటక, తమిళనాడు - కర్ణాటకలో రెచ్చిపోయిన నిరసనకారులు..తమిళుల వాహనాలు, ఆస్తులు లక్ష్యంగా దాడులు - దహనాలు, లూటీలు... బెంగళూరులో ఒక్క రోజే 100 వాహనాలు దగ్ధం - బెంగళూరులో పోలీసు కాల్పుల్లో ఒకరి మృతి - తమిళనాడులోనూ పేట్రేగిన హింస.. - కర్ణాటకకు వ్యతిరేకంగా తమిళ సంఘాల నిరసన ప్రదర్శనలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు - కర్ణాటకకు 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు..అవసరమైతే తమిళనాడుకూ: కేంద్రం సాక్షి ప్రతినిధి, బెంగళూరు/చెన్నై: కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కర్ణాటకలో అయితే అల్లరిమూకలు రెచ్చిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశం ఇచ్చింది. ఆ వెనువెంటనే అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరు నిప్పుల కొలిమిగా మారింది. నగరంలో 100కు పైగా బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. తమిళనాడులోనూ కర్ణాటకకు చెందిన సంస్థలు, వాహనాలపై దాడులు జరిగాయి. నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు సహా వాహనాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ హింసకు మీరంటే మీరు కారణమంటూ రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, సంస్థల నాయకులు ఎదుటి రాష్ట్రంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. తమ రాష్ట్ర ప్రజలపై దాడులు చేస్తే సహించేది లేదని దుండగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘మీ రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించండి’ అంటూ పరస్పరం లేఖలు రాసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పూర్తి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న కర్ణాటకకు 10 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపించింది. అవసరమైతే తమిళనాడులోనూ ఈ బలగాలను మోహరిస్తామని చెప్పింది. పరిస్థితి ఇలావుంటే.. కావేరి పర్యవేక్షక కమిటీ నదీ జలాల విడుదల విషయంపై ఎటువంటి నిర్ణయం చేయకుండా సమావేశాన్ని 19వ తేదీకి వాయిదా వేసింది. ఒకవైపు తమిళనాడులో కర్ణాటక వాసులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు.. మరొకవైపు కావేరి నీటి విడుదల ఆదేశాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన వార్త వెలువడిన వెంటనే.. కర్ణాటకలో ఒక్కసారిగా హింస చెలరేగింది. వాహనాల దహనాలు, పలు సంస్థలు, దుకాణాలపై దాడులతో రాష్ట్రం అట్టుడికింది. రాజధాని బెంగళూరులో తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు కలిగివున్న బస్సులు, ట్రక్కులతో సహా దాదాపు 100 వాహనాలను అల్లరిమూకలు దగ్ధం చేశాయి. అందులో తమిళనాడుకు చెందిన కేపీఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు 40 వరకూ ఉన్నాయి. తమిళనాడు మూలాలు గల పలు దుకాణాలు, సంస్థలపై దాడులు, లూటీలతో బెంగళూరు వణికిపోయింది. నగరంలోని రాజగోపాల్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హగ్గేనహళ్లి వద్ద వాహనాలకు నిప్పంటిస్తున్న అల్లరిమూకలపై పోలీసులు కాల్పులు జరపగా.. ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మండ్య, మైసూరు, చిత్రదుర్గ, ధార్వాడ్ జిల్లాల్లో కూడా పరిస్థితి అదుపుతప్పింది. దీంతో.. బెంగళూరు, మండ్య, మైసూరు నగరాలతో పాటు.. కర్ణాటకలో కావేరి నదిపై గల 4 జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ కింద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రాష్ట్రానికి పంపింది. జయ, సిద్ధరామయ్యల లేఖలు... కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం రాత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జయలలిత, సిద్ధరామయ్యలతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతల వ్యవహారంలో కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తామన్నారు. అనంతరం.. కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొంది. కర్ణాటకలో హింస ఆందోళనకరంగా ఉందని, తమిళ ప్రజలు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని తమిళనాడు సీఎం జయలలిత కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం అంతకు కొన్ని గంటల ముందే అదే తరహా లేఖను జయలలితకు రాశారు. తమిళనాడులో కర్ణాటక ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని జయ తన లేఖలో హామీ ఇచ్చారు. ఇదిలావుంటే.. కావేరి జలాలపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చినట్లయితే రాష్ట్రంలో కొన్ని నిరసనలు జరుగుతాయని భావించామని.. కానీ ఇంత దూరం వెళతాయని తమ ప్రభుత్వం ఊహించలేదని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర పేర్కొన్నారు. బెంగళూరు భగభగ బెంగళూరులోని డిసౌజా నగర్లో కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన డిపోలో 50 బస్సులు నిలిపి ఉంచగా.. నిరసనకారులు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డిపో వద్దకు చేరుకుని రెండు బస్సులకు నిప్పు పెట్టి పరారయ్యారు. బస్సుల ట్యాంకర్లలో డీజిల్ ఎక్కువగా ఉండటంతో మంటలు అన్ని బస్సులకూ వ్యాపించాయి. అక్కడి మార్గంలో దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా రోడ్లపై నిరసనకారులు టైర్లకు నిప్పు పెట్టడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేకపోయారు. గంటన్నర తర్వాత చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తం బస్సుల్లో 44 పూర్తిగా దగ్ధం కాగా, మిగిలినవి 60 శాతానికి పైగా తగలబడిపోయినట్లు సమాచారం. ఈ ట్రావెల్స్ తమిళనాడు వాస్తవ్యుడైన నటరాజన్‌కు చెందినదని చెప్తున్నారు. దుండగులు బెంగళూరులోని నైస్ రోడ్డుపై తమిళనాడు రవాణా శాఖకు చెందిన బస్సులకు కూడా నిప్పంటించారు. నందినీ లేఅవుట్లో పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారు. బెంగళూరులోని కన్వర్జీస్ సాఫ్ట్వేర్ సంస్థలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లి అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న మరికొన్ని ఐటీ కంపెనీలు నైట్‌షిఫ్ట్ ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. అడియార్ ఆనంద్భవన్, పూర్విక మొబైల్ దుకాణాలకు చెందిన పలు శాఖలపై దాడులు చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. యాదగిరిలో తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్‌ను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. నగరంలో నిరసనల ఉధృతి నేపథ్యంలో సాయంత్రం 4:30 నుంచి బీఎంటీసీ బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. తమిళనాడుకు వెళ్లే దాదాపు అన్ని బస్సులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నమ్మమెట్రో సేవలు కూడా సాయంత్రం ఆరుగంటల తర్వాత నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మండ్యలో ఈనెల 17 వరకూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ జియాఉల్లా సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కాల్పుల్లో ఒకరి మృతి బెంగళూరు రాజగోపాల్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హగ్గేనహళ్లి 50 మంది నిరసనకారులు రెచ్చిపోయారు. బందోబస్తులో భాగంగా అక్కడికి వచ్చిన పోలీసుల వాహనంపై దాడి చేసి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి, గాలిలో కాల్పులు జరిపారు. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై కాల్పులు జరపగా.. ఐదుగురు గాయపడ్డారు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా సింగేనహళ్లికి చెందిన ఉమేశ్(25) వెన్ను నుంచి ఛాతిలోకి తూటా దూసుకెళ్లడంతో మృతిచెందాడు. మరొకరు కోమాలోకి వెళ్లాడు. నగరంలోని హొసగుడ్డద హళ్లి వద్ద నిరసనకారులు తమిళనాడుకు చెందిన రెండు ప్రైవేటు బస్సులకు నిప్పుపెట్టారు. వారు లారీలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అయితే నిరసనకారులు రాళ్లతో దాడికి దిగడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మొత్తంగా 10 మంది పోలీసులు గాయపడ్డారు. గోపాలన్ మాల్ వద్ద హింసను టీవీ చానల్ కోసం చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై నిరసనకారులు దాడి చేశారు. -
కావేరీ విధ్వంసం
కర్ణాటకలో తమిళుల ఆస్తుల విధ్వంసంపై ప్రతీకారేచ్చ రగిలింది. రాష్ట్రంలో పలుచోట్ల కర్ణాటక వాహనాలను ధ్వంసం చేశారు. చెన్నైలో కన్నడిగుల ప్రముఖ హోటల్‌పై పెట్రోబాంబులు విసిరేసి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్రంలోని కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రానికి కావేరి జలాలు విడుదలయ్యా యి. సెకనుకు 15వేల ఘనపుటడుగుల చొప్పున పదిరోజులపాటూ విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటకలోని ఆందోళనకారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. సుప్రీం తీర్పు వెలువడిన నాటి నుంచి ఆందోళనలు, విధ్వంసకర చర్యలను ఆరంభించిన ఆందోళనకారులు సోమవారం తమ మోతాదును మరింతగా పెంచారు. తమిళనాడుకు మరో 3 టీఎంసీలను ఈ నెల 20వ తేదీ వరకు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆందోళనకారులు రెచ్చిపోయి కర్ణాటకలోని తమిళనాడు వాహనాలను తగులబెట్టడం ప్రారంభించారు. ప్రతీకార చర్య కర్ణాటక ఆగడాలను వివిధ మాధ్యమాల ద్వారా రాష్ట్రానికి చేరడంతో తమిళ ప్రజలు రెచ్చిపోయారు. కర్ణాటకకు చెందిన వాహనాలు, ఇతర వ్యాపార సంస్థలపై దాడులను ప్రారంభించారు. చెన్నై రాయపేటలోని కర్ణాటకవాసులకు చెందిన న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున పెట్రో బాంబులు విసిరి విధ్వంసానికి పాల్పడ్డారు. తెల్లవారుజాము 3.30 గంటలకు 12 మందితో కూడిన దుండగుల బృందం ఇనుపరాడ్లను చేతబూని మోటార్‌సైకిళ్లపై చేరుకుంది. లోనికి ప్రవేశించిన వారు హోటల్‌పై మూడు పెట్రోబాంబులను విసరడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. హోటల్ ముందుభాగంలో కొత్త ఏర్పాటు చేసిన ఐస్‌క్రీం పార్లర్‌లోకి జొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. ఈలోగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ అక్కడికి చేరుకోగా అతన్ని రాడ్‌తో కొట్టి గాయపరిచి, పారిపోయారు. కర్ణాటకలోని తమిళులపై దాడులు చేస్తే ఇక్కడి కన్నడిగులపై దాడికి పాల్పడుతామని నినాదాలు చేస్తూ అదే అంశంతో కూడిన కరపత్రాలను జారవిడిచి పారిపోయారు. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా వారంతా తందై పెరియార్ ద్రావిడ కళగానికి చెందిన వారిగా గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి చిదంబరానికి చేరుకున్న కర్ణాటక లారీని ఏడుగురు దుండగులు అనుసరించి పాక్షికంగా ధ్వంసం చేశారు. తాను తమిళనాడుకు చెందినవాడినని డ్రైవర్ శక్తి మొరపెట్టుకోవడంతో లారీని తగులబెట్టకుండా విడిచిపెట్టారు. శీర్కాళి వైదీశ్వరన్ కోవిల్ వద్ద నిలిచి ఉన్న కర్ణాటకకు చెందిన జీపు అద్దాలను పగులగొట్టారు. కర్ణాటకకు నుంచి రామేశ్వరానికి వచ్చిన రెండు వ్యాన్లపై దాడికి పాల్పడినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వేలూరు సమీపం రాణీ పేట నుంచి బెంగళూరుకు వెళుత్ను లారీని ధ్వంసం చేయగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు-వేలూరు కర్ణాటక బస్సును అంబూరు వద్ద అడ్డగించిన వీసీకేకు చెందిన 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామేశ్వరంలో సోమవారం తెల్లవారుజామున కర్ణాటకకు చెందిన రెండు టెంపోవ్యాన్లను ధ్వంసం చేశారు. ఈ కేసులో దేశీయ మున్నని పార్టీకి చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. తమిళనాడువాసులపై దాడులు కొనసాగిన పక్షంలో కర్ణాటక ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తామని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. పుదుచ్చేరిలోని కర్ణాటక బ్యాంకును వివిధ సంఘాలకు చెందిన వారు సోమవారం ముట్టడించారు. తమిళనాడుకు చెందిన సంపత్ (21) బెంగళూరులో బీఎస్సీ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఫేస్బుక్లో కావేరి వివాదంపై తన స్పందన తెలియజేశారు. దీంతో బెంగళూరులో అతనిని చుట్టుముట్టిన ఆందోళనకారులు రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పుదుచ్చేరివాసులు ఇక్కడి కర్ణాటక బ్యాంకును ముట్టడించి సీఎం సిద్ధరామయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్ణాటక ఆందోళనకారులను దుయ్యబడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 35 మందిని పుదుచ్చేరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ ఖండించారు. సీఎం అత్యవసర సమావేశం కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న దృష్ట్యా ముఖ్యమంత్రి జయలలిత సోమవారం డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర కమిషనర్ జార్జ్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తమిళనాడులోని కర్ణాటక కార్యాలయాలు, వాహనాలు ఇతర సంస్థలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్, నటుడు ప్రభుదేవా ఇళ్లకు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బెంగుళూరులో కాల్పులు : ఒకరి మృతి
బెంగుళూరు : కావేరి నది జల వివాదంతో బెంగుళూరు నగరం అట్టుడుకుతోంది. నగరంలో సోమవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు రాజ్గోపాల్నగర్, కామాక్షిపాలై, విజయనగర్, బయంత్రాయన్పురా, కెన్రెగి, మగాది రోడ్డు, రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. -
40 వోల్వో బస్సుల దహనం
కావేరీ జలాల వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ ఇండియా అనే సంస్థకు చెందిన బస్సు డిపో బెంగళూరు డిసౌజా నగర్లో ఉంది. అక్కడ పార్క్ చేసి ఉంచిన దాదాపు 40 వోల్వో బస్సులను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అది తమిళులకు చెందిన ట్రావెల్స్ సంస్థ అని గుర్తించిన కన్నడ ఉద్యమకారులు.. వాటి మీద పెట్రోలు చల్లి నిప్పంటించినట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కసారిగా మొత్తం 40 బస్సులూ తగలబడిపోయాయి. కర్ణాటకలో.. ముఖ్యంగా రాజధాని బెంగళూరు నగరంలో టీఎన్ అనే అక్షరాలు కనిపిస్తే చాలు.. ఆ వాహనాలను ఎలాగోలా ధ్వంసం చేసేస్తున్నారు. అందులో సాధారణ ప్రయాణికులు ఉన్నా కూడా లెక్క చేయడం లేదు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు, మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. అయ్యంగార్ వర్గం వాళ్లు చాలా కాలం క్రితమే తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చి స్థిరపడ్డారు.. వీళ్లంతా ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. తమిళులను సులభమైన టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట నిజమే గానీ, నిరసనను శాంతియుతంగా తెలియజేయాలి తప్ప ఇలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వొద్దని కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర కోరారు. ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దని కోరారు. మరోవైపు బెంగళూరులో శాంతి భద్రతల పరిస్థితి, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం అవుతోంది. చిక్కుకుపోయిన పిల్లలు పిల్లలు ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్కూలు బస్సులు నడవడం కూడా కష్టమైపోయింది. కన్నడిగులపై తమిళనాడులో దాడులు జరుగుతున్న సమాచారం అందిన మరుక్షణం నుంచి... అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాతి నుంచి బెంగళూరు, మైసూరు సహా కర్ణాటకలోని అన్ని ప్రధాన ప్రాంతాలో విధ్వంసాలు మరింత పెరిగాయి. తమిళనాడులో కన్నడ హోటల్‌పై దాడి జరిగిందన్న విషయం మీడియాలో బయటకు వచ్చిన కొద్ది సేపటికే కేపీఎన్ ట్రావెల్స్ డిపోలో ఉన్న 40 బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. మరోవైపు తమిళనాడు కూడా తగలబడుతోంది. అక్కడ ఉన్న కన్నడిగుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మైలాపూర్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్‌పై పెట్రోలు బాంబులతో దాడి జరిగింది. రామేశ్వరంలో కర్ణాటక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు జరిగాయి. -
40 వోల్వో బస్సులను.. తగలెట్టేశారు!