న్యూఢిల్లీ : తమిళనాడు రాష్ట్రానికి రేపటి నుంచి ఈనెల 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. కావేరి పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అలాగే నాలుగు వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది.
తమిళనాడుకు రేపటి నుంచి సెప్టెంబరు 30 వరకు రోజుకు 3వేల క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చేయాలని కావేరీ పర్యవేక్షక కమిటీ ఇచ్చిన నిర్ణయంపై తమిళనాడు, కర్ణాటక అభ్యంతరం తెలపగా.. అభ్యంతరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తమిళనాడు సాగునీటి కోసం కర్ణాటక తాగునీటిని త్యాగం చేస్తోందని ఆ రాష్ట్ర తరపు న్యాయవాది నారిమన్ వాదించారు. తమిళనాడులో తీవ్ర నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది నఫ్రే న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ దీనిపై తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా పడింది.
'కావేరి' బోర్డు ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
Published Tue, Sep 20 2016 6:49 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement