సాక్షి, చెన్నై: కావేరి మళ్లీ పరవళ్లు తొక్కేది అనుమానంగా మారింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని కర్ణాటక సర్కారు అమలు చేసేనా అన్న ఎదురు చూపులు తమిళనాట పెరిగాయి. రగిలిన జ్వాలను అడ్డం పెట్టుకుని ఆరు రోజుల నీటి విడుదల ఉత్తర్వుల్నే ధిక్కరించిన వాళ్లకు మూడు రోజుల ఉత్తర్వుల్ని పెడచెవిన పెట్టడం ఏమాత్రం అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. కాగా, సమస్య జఠిలం అవుతుండడంతో కర్ణాటకతో సంప్రదింపులకు తగ్గట్టు ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఈ సంప్రదింపుల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎం జయలలిత మంగళవారం ఆసుపత్రి నుంచే సమీక్షించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి మరీ కర్ణాటక పాలకులు వ్యవహరిస్తుండడం తమిళనాట ఆక్రోశాన్ని రగుల్చుతోంది. ఈ పరిస్థితుల్లో తమకే నీళ్లు లేవన్నట్టు కర్టాటక, నీళ్లు ఇప్పించాల్సిందేనంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లు మం గళవారం సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చా యి.
ఈ విచారణలో కర్ణాటకకు కోర్టు అక్షింతలు వే యడం, అసెంబ్లీ తీర్మానాలు కోర్టుల్ని కట్టడి చేయలేవన్నట్టు చురకలు అంటిస్తూ బెంచ్ స్పందించడాన్ని తమిళనాడు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు ఆహ్వానించాయి. అలాగే, మూడు రోజుల పాటుగా సెకనుకు ఆరు వేల గణపటడుగుల మేర కు నీటిని విడుదల చేయాలని ఆదేశించడంపై హ ర్షం వ్యక్తం చేశాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ ఉత్తర్వుల్ని కర్ణాటక ఆచరించేనా అన్న ప్రశ్న బయలు దేరింది. అదే సమయంలో కర్ణాటకలో మళ్లీ నిరసనలు బయలు దేరిన నేపథ్యంలో కావేరి తమిళనాడు వైపుగా పరవళ్లు తొక్కేనా అన్న ప్రశ్న తో పాటుగా ఎదురు చూపులు పెరిగాయి.
కావేరి వచ్చేనా: కావేరి జలాల్ని నమ్ముకుని డెల్టా జి ల్లాల్లోని అన్నదాతలు పన్నెండు లక్షల ఎకరాల సం బాసాగుకు సిద్ధమయ్యారు. మెట్టూరు డ్యాంలో ప్రస్తుతానికి ఉన్న నీటి ఆధారంగా మరో రెండు, మూడు వారాలు లాగించేందుకు అవకాశం ఉంది. అయితే, తదుపరి తమ పరిస్థితి ఏమిటో అన్న ఆం దోళనను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు నీళ్లు విడుదల చేసినా, కొంత మేరకు ఊరట కల్గుతుం దని, అయితే, నీళ్లు విడుదల చేస్తారా..? అన్నది అనుమానమేనని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో నిరసనలు బ యలుదేరి ఉండడం, అఖిల పక్షంతో చర్చించి ని ర్ణయం అని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించి ఉండడంతో, ఆ మూడు రోజుల్ని ప్రకటనలో నెట్టుకొచ్చేస్తారేమోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తాము సైతం ఇక, కఠిన నిర్ణయాలతో ఉద్యమించాల్సిన అవశ్యాన్ని కల్పిస్తున్నారని హెచ్చరిం చే పనిలో పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం స్పందించాల ని, తక్షణం కర్ణాటకతో సంప్రదింపులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, కర్ణాటక తీరు పై కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ తామే సర్వాధికారులం అన్నట్టుగా కర్ణాటక వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ఆ ప్రభుత్వానికి పై హోదాలో కేంద్రం, సుప్రీంకోర్టు, చట్టాలు, రాజకీయ శాసనాలు ఉన్నాయన్న విషయాన్ని మరచి అక్కడి పా లకులు వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. చ ట్టం తన తని తాను చేసుకుంటూ వెళ్తుందని, తమ ప్రభుత్వం నీటి విడుదల విషయంలో తన పని తా ను చేస్తుందంటూ ఓప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఆలోచించాల్సిందే. అమ్మ సమాలోచన : కావేరి జల వివాదం మరింత జఠిలం అవుతున్న దృష్ట్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు.
తాను ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నా, ఆగమేఘాలపై అధికారుల్ని పిలిపించుకుని సమాలోచించారు. అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు గంట పాటు అధికారులతో కావేరి వి వాదం పరిష్కారానికి తగ్గ సమీక్షలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, అడ్వకేట్ జనరల్ ఆర్ ముత్తుకుమారస్వామి, ప్రభు త్వ సలహాదారు షీలా బాలకృష్ణన్, సీఎం కార్యదర్శులు కేఎన్ వెంకటరమణన్, ఎ.రామలింగం తది తరులు ఈ సమీక్షకు హాజరు అయ్యారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకం గా కోర్టు స్పందన గురించి చర్చించారు. ఈ వివా దం మరింత జఠిలం కాకుండా, తగు చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా కోర్టు ఇచ్చిన సూచన మేరకు కర్ణాటకతో సంప్రదింపులకు తగ్గ కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీ గురువారం కర్ణాటక అధికారులతో సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిటీలో రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళనిస్వామి, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావు, ప్రజా పనుల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కావేరి టెక్నికల్ సెల్ చైర్మన్ ఆర్ సుబ్రమణియన్ ఉన్నారు.
ఈ సంప్రదింపులు సత్ఫలితాల్ని ఇవ్వాలని అన్నదాతలు కాంక్షిస్తున్నారు. అవస్థలు: కర్ణాటకలో నిరసనలు మళ్లీ బయలు దేరి ఉన్న నేపథ్యంలో సరిహద్దు వాసులకు మళ్లీ అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య 22 రోజులుగా రవాణా ఆగింది. సరిహద్దులకు బస్సులు పరిమితం అవుతున్నారు. తమిళనాడు లారీలు అయితే, సరిహద్దుల్లో ఆపి ఉండడంతో డ్రైవర్లు నానా తంటాలు పడుతున్నారు. వాహనాల్లో ఉన్న సరకులు ఎక్కడ దెబ్బతింటాయో అన్న ఆందోళన బయలు దేరింది.
కనీసం స్నానం కూడా చేయలేని పరిస్థితి తమకు ఉందని సత్యమంగళం మార్గంలో తమ లారీలను ఆపి, రవాణా పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరిస్థితి ఇలాగే కొనసాగిన పక్షంలో, రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల బంద్‌కు పిలుపు నిచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని లారీ యజమానులు హెచ్చరించే పనిలో పడ్డారు.
నీళ్లు వచ్చేనా?
Published Wed, Sep 28 2016 2:13 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement