కేంద్రంపై కోర్టు ధిక్కార కేసు | Tamil Nadu government files contempt plea against Centre, SC to hear on Monday | Sakshi
Sakshi News home page

కేంద్రంపై కోర్టు ధిక్కార కేసు

Published Sun, Apr 1 2018 1:59 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

Tamil Nadu government files contempt plea against Centre, SC to hear on Monday - Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వంపై శనివారం తమిళనాడు ప్రభుత్వం కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలుచేసింది. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల్ని ఏర్పాటుచేయాలన్న సుప్రీం తీర్పును కేంద్రం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 6 వారాల్లో అభివృద్ధి మండలి,  కమిటీల్ని ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన గడువు మార్చి 29తో ముగిసిపోవడంతో తమిళసర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలుచేయడానికి గల కారణాలను తమిళనాడు అధికారులు కోర్టుకు తెలిపారు.

దీంతో వీటి ఏర్పాటులో వెనక్కు తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ కేంద్రం మరో పిటిషన్‌ దాఖలుచేసింది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కర్ణాటకలో అల్లర్లు చెలరేగి అసెంబ్లీ ఎన్నికలు నిలిచిపోయే ప్రమాదముందని కోర్టుకు విన్నవించింది. కేంద్రం వ్యవహారశైలిపై తమిళనాడులో  ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. చెన్నైలోని మెరీనాబీచ్‌లో జల్లికట్టు తరహా ఉద్యమానికి ప్రయత్నం జరగ్గా.. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై తదుపరి కార్యాచరణను రూపొందించేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement