all-party meet
-
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
లంకకు 20న కొత్త అధ్యక్షుడు
కొలంబో/ఐరాస: కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్లగుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లో సేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు. -
అఖిలపక్ష భేటీ పెట్టండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: గాల్వన్ లోయ ఘటనపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మౌనం వహించడాన్ని మంగళవారం ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దేశ ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. చైనాతో ఘర్షణల్లో భారత సైన్యం అమరులు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలంది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగం గురించి తన బాధను వ్యక్తం చేసేందుకు మాటలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించి అన్ని వివరాలను వారితో పంచుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచే చైనా లద్దాఖ్‌లో దుందుడుకుగా వ్యవహరిస్తున్నా.. మోదీ ప్రభుత్వం చూస్తు కూర్చుందని మండిపడ్డారు. చైనా చర్యను తీవ్రంగా తీసుకుని సరైన రీతిలో స్పందించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. చర్చల ద్వారా ప్రస్తుత ప్రతిష్టంభన తొలగుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సీపీఐ పేర్కొంది. 20 మంది సైనికులను చైనా చంపేసిందంటే లద్దాఖ్‌లో సరిహద్దుల వద్ద పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ భౌగోళిక సమగ్రతపై రాజీ లేదని స్పష్టం చేశారు. -
కేంద్రంపై కోర్టు ధిక్కార కేసు
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వంపై శనివారం తమిళనాడు ప్రభుత్వం కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలుచేసింది. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల్ని ఏర్పాటుచేయాలన్న సుప్రీం తీర్పును కేంద్రం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 6 వారాల్లో అభివృద్ధి మండలి, కమిటీల్ని ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన గడువు మార్చి 29తో ముగిసిపోవడంతో తమిళసర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుచేయడానికి గల కారణాలను తమిళనాడు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో వీటి ఏర్పాటులో వెనక్కు తగ్గడానికి గల కారణాలను వివరిస్తూ కేంద్రం మరో పిటిషన్ దాఖలుచేసింది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కర్ణాటకలో అల్లర్లు చెలరేగి అసెంబ్లీ ఎన్నికలు నిలిచిపోయే ప్రమాదముందని కోర్టుకు విన్నవించింది. కేంద్రం వ్యవహారశైలిపై తమిళనాడులో ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. చెన్నైలోని మెరీనాబీచ్‌లో జల్లికట్టు తరహా ఉద్యమానికి ప్రయత్నం జరగ్గా.. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై తదుపరి కార్యాచరణను రూపొందించేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. -
ఈవీఎంలపై 12న కీలక భేటీ
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 12న ఢిల్లీలో అఖిలపక్ష భేటీని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీ నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలను ఎత్తివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపనను అందజేసింది. అయితే, ఈవీఎంలపై ఆరోపణలు ఖండించిన ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈవీఎంలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు ఈసీ తెలిపింది. -
యోగి సర్కారు పరీక్షలో నెగ్గుతుందో? లేదో?
లక్నో: ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనను ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వాగతించారు. గతంలో ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిసిన నేపథ్యంలోనే ఈ మేరకు కదలిక వచ్చిందని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని, భారత్‌లో ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పనిచేస్తుందా? లేదా? అన్నదే తాము ఎదురుచూస్తున్నామని, ఈ పరీక్షలో యోగి ప్రభుత్వం నెగ్గుతుందా? లేదో చూడాలని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయమై సందేహాలను నివృత్తికి త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు. -
ఈవీఎంలపై త్వరలోనే కీలక మీటింగ్!
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ చండీగఢ్: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు. ఈవీఎంల విషయంలో మరింత పారదర్శకతను ప్రదర్శించేందు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘త్వరలోనే అఖిలపక్షం భేటీ నిర్వహించి.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ఈ విధంగా కుదరదో వివరిస్తాం. ఇందులో భద్రతాపరమైన, పాలనపరమైన రక్షణల గురించి స్పష్టత ఇస్తాం’ అని జైదీ మీడియాకు చెప్పారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఇటీవల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. -
పార్లమెంటులో ముగిసిన అఖిలపక్ష భేటి!