యోగి సర్కారు పరీక్షలో నెగ్గుతుందో? లేదో?
లక్నో: ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనను ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వాగతించారు. గతంలో ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిసిన నేపథ్యంలోనే ఈ మేరకు కదలిక వచ్చిందని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని, భారత్‌లో ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పనిచేస్తుందా? లేదా? అన్నదే తాము ఎదురుచూస్తున్నామని, ఈ పరీక్షలో యోగి ప్రభుత్వం నెగ్గుతుందా? లేదో చూడాలని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయమై సందేహాలను నివృత్తికి త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు.