ఈవీఎంలపై త్వరలోనే కీలక మీటింగ్!
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ
చండీగఢ్: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు. ఈవీఎంల విషయంలో మరింత పారదర్శకతను ప్రదర్శించేందు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘త్వరలోనే అఖిలపక్షం భేటీ నిర్వహించి.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ఈ విధంగా కుదరదో వివరిస్తాం. ఇందులో భద్రతాపరమైన, పాలనపరమైన రక్షణల గురించి స్పష్టత ఇస్తాం’ అని జైదీ మీడియాకు చెప్పారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఇటీవల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.