
నేడు సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న జైదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నసీం జైదీ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన హెచ్ ఎస్ బ్రహ్మ పదవి కాలం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీగా నసీం జైదీని నియమిస్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నిక కమిషనర్గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నసీం జైదీ పూర్తి పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ. 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. జైదీ సీఈసీగా జులై 2017 వరకు కొనసాగనున్నారు.