సీఎం కుమారస్వామితో కమల్‌ భేటీ | Kamal Haasan Meets With Karnataka CM Kumaraswamy Over c | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 2:53 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

Kamal Haasan Meets With Karnataka CM Kumaraswamy Over c - Sakshi

సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సోమవారం భేటీ అయ్యారు. కావేరీ నదీజలాల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు కమల్‌ హాసన్‌ తెలిపారు. కావేరీ నదిజలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రితో కమల్‌ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

రజనీకాంత్‌ ‘కాలా’  సినిమాపై..
తాజాగా తూత్తుకుడిని సందర్శించిన రజనీకాంత్‌ కావేరీ నదీజలాలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారం రేపాయి. ఆయన కొత్త చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రజనీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్‌ కాకుండా అడ్డుకుంటామని కొంతమంది నిరసనకారులు ప్రకటించారు. కాగా కాలా విడుదలపై ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చ జరగలేదని కమల్‌ హాసన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement