Kumara swmay
-
బీజేపీతో స్నేహం.. మరోసారి సీఎం అవుతా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో విపక్ష కాంగ్రెస్-జేడీయూ మధ్య మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం మూలంగా తన 12 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించుకున్న ఘనతంతా వృథా అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తనపై అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. ఆయన కారణంగానే అనేకసార్లు కన్నీరుకార్చాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. (యడియూరప్ప స్థానంలో యువ సీఎం!) గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను గుర్తించలేకపోయానని పేర్కొన్నారు. తనన కలల్ని, రాజకీయ జీవితాన్ని ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి హెచ్డీ దేవెగౌడ ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌తో చేతులు కలిపానని వెల్లడించారు. తాను బీజేపీతో సన్నిహితంగా మెలిగితే మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో స్నేహంగా ఉన్న సమయంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. కాగా (2006-07) సమయంలో బీజేపీ మద్దతుతో కుమారస్వామి సీఎంగా సేవలు అందించిన విషయం తెలిసిందే. (పవార్ సంచలన వాఖ్యలు.. ఖండించిన కర్ణాటక) మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అబద్దాలు చెప్పడంలో ఆ కుటుంబం దిట్టగా వర్ణించారు. అన్నీ చేసి చివరకు కన్నీరు కార్చడం కుమారస్వామికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతు కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలలకే ఆ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీఎస్ యడియూరప్ప సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
నిఖిల్ పెళ్లిపై వివాదం: విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహ వేడుకపై వివాదం నెలక్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు కనీసం పాటించకుండా వివాహం జరిపించారని అధికార బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకపై విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశించారు. కాగా బెంగళూరు సమీపంలోని రాంనగర్‌లోని ఫాంహౌస్‌లో నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించినట్లు కనిపించట్లేదు. ఈ వివాహానికి వందలాది మంది అతిథులు వచ్చారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. (నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి) ఇక దీనిపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎలాంటి భద్రతలేకుండా వివాహం వేడుకలేంటని అసహనం వ్యక్తం చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి లాక్డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కాగా పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హాజరుకావడం గమనార్హం. కుమారస్వామితో కరచాలనం చూస్తూ సీఎం ఫోటోలకు పోజులిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 359గా నమోదైంది. శుక్రవారం తాజాగా 44 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. -
బీజేపీకి కుమారస్వామి మద్దతు!
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తదుపరి బలపరీక్షపై వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ సభ్యుల మద్దతును కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం రాత్రి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌తో జేడీఎస్ చెలిమిని కొనసాగిస్తుందా? బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతుందా? కాంగ్రెస్‌తో చెలిమికి గుడ్‌బై చెప్పి, బీజేపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాటం చేస్తుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు బీజేపీ కూడా జేడీఎస్ సభ్యుల మద్దతు కోరడంపై ఆలోచనలు చేస్తున్నట్ల తెలిసింది. వారితోపాటు రెబల్స్‌ను కూడా తమవైపునకు తిప్పుకునేందుక ప్రయత్నలను ముమ్మరం చేస్తోంది కమళ దళం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. -
కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికాసేట్లో బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప గవర్నర్‌ను కలవనున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బల పరీక్షలో కుమారస్వామి ఓటమి అనంతరం.. యడ్యూరప్ప స్పందించారు. ఇది కర్ణాటక ప్రజల విజయమన్నారు. కన్నడ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, 105 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జేడీఎస్- కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూలిపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలాల్సిఉంది. -
నన్ను క్షమించండి: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠ పరిణామాల నడుమ కర్ణాటక రాజకీయం తుదిదశకు చేరుకుంది. విశ్వాస పరీక్షపై సభ్యులంతా ప్రసంగించిన అనంతరం.. చివరగా సీఎం కుమారస్వామి మాట్లాడారు. విశ్వాసపరీక్షపై సీఎం ఉద్వేగంగా ప్రసంగించారు. కన్నడ ప్రజలకు తన పాలనలో ఎన్నో మంచి పనులు చేశానని, ఏమైనా తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని ప్రజలను కోరారు. అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. పాలనలో పొరపాటున కొన్ని తప్పులు కూడా చేశానని అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. కన్నడ సంక్షోభంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కోసం.. విశ్వాస పరీక్ష కొంత ఆలస్యమయినట్లు సభలో ఒప్పుకున్నారు. సంకీర్ణాన్ని భాజపా ఎలా అస్థిరపరిచిందో సభలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రసంగం అనంతరం రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం సభలో ఆయన ప్రసంగం కొనసాగుతోంది. ఆయన మాట్లాడిన వెంటనే స్పీకర్ విశ్వాస పరీక్షను చేపట్టనున్నారు. కుమార స్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో బార్ షాపులను మూసేశారు రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్‌తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు -
కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయ విలువలను సమాధి చేశారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ, 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బీజేపీ నేతలు వెచ్చించారని, ఆ డబ్బాంతా ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచిన తిరుగుబాటు దారులపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన కర్ణాటక రాజకీయం చివరిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగం అనంతరం విశ్వాసపరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్‌తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపడితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని బెంగళూరులో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిసింది. -
‘మధ్యంతర ఎన్నికలు రావొచ్చు’
బెంగళూరు : త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తొలుత కాంగ్రెస్ తమకు ఐదేళ్ల పాటు పూర్తి మద్దతిస్తానని చెప్పిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల పద్దతి చూస్తూంటే.. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పేరుకే కుమారస్వామి సీఎం అని.. పెత్తనం మొత్తం కాంగ్రెస్ చేతిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలన్నింటిని జేడీఎస్ ఒప్పుకుందని తెలిపారు. వీటన్నింటిని కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. Former PM & JDS leader HD Deve Gowda in Bengaluru: There is no doubt that there will be mid-term polls. They said they will support us for 5 years but look at their behaviour now. Our people are smart. #Karnataka pic.twitter.com/OjGsy2lKYW — ANI (@ANI) June 21, 2019 సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ. అందుకే కూటమిలో భాగంగా కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని తాను కోరుకోలేదన్నారు. తన కుమారుడి బదులు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయమని రాహుల్ గాంధీని కోరానని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. అంతేకాక కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కూటమి ఏర్పాటుకు ఒప్పుకున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఆ పార్టీ ఓటమి పాలయ్యిందన్నారు దేవేగౌడ. -
ప్రభుత్వానికి పతన భయం?
కనీవినీఎరుగని ఘోర పరాజయం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సంబంధాలను చరమాంకంలోకి నెట్టింది. విజయంతో అన్నింటినీ సర్దుబాటు చేయవచ్చని ఆశించినా అలా జరగకపోవడంతో సంకీర్ణ పెద్దలకు దిక్కుతోచడం లేదు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక సీటును కోల్పోవడం మరో ముప్పుగా మారింది. మ్యాజిక్ నంబర్‌కు దగ్గరవుతున్న బీజేపీ త్వరలోనే భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నందని అంచనా. సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఆరంభం నుంచి అయోమయం నెలకొంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రభుత్వ ఏర్పాటు ప్రచారం సాగించింది. బీజేపీ తెరవెనుక ఉంటూ ‘ఆపరేషన్ కమల్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది కాలంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊరించి.. ఊరించి వెనక్కి తగ్గింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంలో సార్వత్రికం ముగిసే వరకు మౌనం వహించారు. అయితే ప్రస్తుతం సార్వత్రికం ఫలితాలు కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వం మరింత సంకటంలోకి వెళ్లింది. వెంటనే కాంగ్రెస్ – జేడీఎస్ అవలోకన పేరుతో పోస్టుమార్టం సమావేశాలు నిర్వహించారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమారస్వామి వాపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే బీజేపీ చేతుల్లోకి అధికారం వెళ్తే తమ మనుగడ కష్టసాధ్యమని కాంగ్రెస్ భయపడుతోంది. దీంతో సీఎం పదవి మీదేనని జేడీఎస్‌ను బుజ్జగిస్తోంది. బీజేపీ అప్రమత్తం సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం సాగడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి అందరు ఒకేతాటిపై ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభు త్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయొద్దని వారి మధ్య విభేదాలే ప్రభుత్వానికి కారణం అవుతాయని సూచించారు. వరుస భేటీల్లో జేడీఎస్ లోక్‌సభ ఫలితాల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం సాగడంతో దళపతులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవెగౌడతో సీఎం కుమారస్వామి రెండుసార్లు భేటీ అయ్యారు. అదేవిధంగా సీఎం కుమారస్వామితో జేడీఎస్ మంత్రులు సమావేశమయ్యారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ భేటీ అయ్యారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సమావేశమై రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఇక బీజేపీకి అధికారం ఇస్తే పార్టీ మనుగడ కష్టమని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు గట్టి పోరాటం చేస్తోంది. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వెళ్తారని ప్రచారం సాగినా.. కేవలం చించోళి ఎమ్మెల్యే ఉమేశ్ జాదవ్ మాత్రమే వెళ్లారు. ఉప ఎన్నికతో మరో దెబ్బ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు కుందగోళ, చించోళి ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు దెబ్బ పడింది. చించోళి స్థానంలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ జాదవ్ గెలవడంతో సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్య తగ్గింది. గతంలో చించోళి, కుందగోళ స్థానాలు కాంగ్రెస్‌వే. అయితే ప్రస్తుతం ఒక్క సీటు జారిపోయింది. -
‘రాహుల్, కుమారస్వామి జోకర్లు’
హుబ్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మై అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని హీరోగా వర్ణించారు. ‘వారి(రాహుల్, కుమారస్వామి) నడవడిక, ఆలోచనా విధానంతో హాస్యం పండిస్తున్నారు. ఎవరు హీరో, ఎవరు జోకర్లు అనేది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తార’ని వ్యాఖ్యానించారు. లింగాయత్ అంశాన్ని రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని మండిపపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకోనివ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మోదీ సర్కారును విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. మహదాయి నది వివాదాన్ని పరిష్కరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు. కర్ణాటకలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు ఈనెల 18న జరిగాయి. రెండో విడత ఎన్నికలు 23న జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. -
అవాక్కవకుండా ఆన్సర్ చెప్పండి.!
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. -
ఒక పౌరునిలా అలా అన్నా: కుమారస్వామి
మండ్య: జేడీఎస్ నాయకుడిని చంపేసిన దుండగులను వెంటనే కాల్చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘జేడీఎస్ నేత ప్రకాశ్‌ను చంపేశారని తెలియగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి, ఆవేశానికి గురయ్యాను. అందుకే కాల్చేయాలని ఆవేశంగా అన్నాను’ అని కుమారస్వామి వివరణ ఇచ్చారు. సీఎం హోదాలో కాకుండా సాధారణ పౌరుడిలా ఆవేశంతో అలా స్పందించానని చెప్పారు. మంగళవారం ఆయన మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో హత్యకు గురైన నేత కుటుంబాన్ని పరామర్శించారు. హత్యకు గురైన ప్రకాశ్ తనకు ఆప్తుడంటూ కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. కాగా, హత్యకు కారకులని ఆరోపిస్తూ తుప్పనహళ్లిలో కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై జేడీఎస్ కార్యకర్తలు దాడులు చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ముఖ్యమంత్రికి మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. -
సీఎం కుమారస్వామితో కమల్ భేటీ
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం భేటీ అయ్యారు. కావేరీ నదీజలాల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు కమల్ హాసన్ తెలిపారు. కావేరీ నదిజలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రితో కమల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ ‘కాలా’ సినిమాపై.. తాజాగా తూత్తుకుడిని సందర్శించిన రజనీకాంత్ కావేరీ నదీజలాలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారం రేపాయి. ఆయన కొత్త చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రజనీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కొంతమంది నిరసనకారులు ప్రకటించారు. కాగా కాలా విడుదలపై ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చ జరగలేదని కమల్ హాసన్ తెలిపారు. -
కుమారస్వామి సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూర్ : దుబారా వ్యయాన్ని తగ్గించుకోవాలని కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే క్రమంలో కొత్తగా కార్ల కొనుగోలును, నూతన వాహనాల అలవెన్సులకు పంపిన ప్రతిపాదనలను పునఃసమీక్షించాలని ఈ మేరకు ఆయన ఓ అధికారిక ప్రకటనలో కోరారు. కార్యాలయాల పునరుద్ధరణను కూడా అవసరరమైతే వాయిదా వేయాలని కూడా కుమారస్వామి అధికార యంత్రాంగానికి సూచించారు. కీలక సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు మొబైల్ ఫోన్ల వాడకానికి దూరంగా ఉండాలని కోరారు. సమావేశాల్లో మొబైల్ ఫోన్లు వాడరాదని అధికారులను కోరుతూ ఈనెల ఒకటిన సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.శాఖల కేటాయింపుపై జేడీఎస్, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదిరిన అనంతరం కుమారస్వామి ఈ చర్యలు చేపట్టారు. ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం జేడీఎస్ ఆర్థిక శాఖను, కాంగ్రెస్ హోంమంత్రిత్వ శాఖను చేపడుతుంది. జూన్ 6న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం కుమారస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఈ దివ్య మంగళరూపం శ్రీవారిదే!
తిరుమలేశుని చెంత సాక్షాత్తూ కుమారస్వామి తపస్సు చేసి, తారకాసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే ఆ పుణ్యస్థలం ‘కుమారధార తీర్థం’గా ప్రసిద్ధ్ది పొందింది. పుష్కరిణి గట్టుపై ఆలయంలో కొలువైన దేవుడు ముమ్మాటికీ శ్రీవేంకటేశ్వరుడే. పద్మపీఠం వల్ల బ్రహ్మ అనీ, శుక్రవారం అభిషేకించటంతో శక్తి స్వరూపమనీ, నాగాభరణం అలంకరణ, బిల్వార్చన పూజల వల్ల శివుడునీ, ‘స్వామి’ అన్న నామం వల్ల కుమారస్వామి అనీ... ఇలా తిరుమలేశుని గురించి రకరకాలుగా ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ స్వామి రూపం ఎవరిది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు గర్భాలయ ఉపద్యక పుణ్యప్రదేశంలో సువర్ణ పద్మపీఠంపై స్వయంవ్యక్త సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉన్నాడు. కుడిచేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో పాంచజన్య శంఖాన్ని, దిగువ కుడిచేయి వరదహస్తంగా, ఎడమవైపు కటి హస్తంతో దివ్యకాంతులతో దర్శనమిస్తుంటాడు. పద్మపీఠంపై కొలువైంది బ్రహ్మకాదు, శ్రీవేంకటేశ్వరుడే శ్రీవేంకటేశ్వరుడు పద్మపీఠంపై కొలువై ఉంటాడు. అందువల్ల స్వామి బ్రహ్మదేవుడని ప్రచారంలో ఉంది. పద్మపీఠంపై బ్రహ్మ మాత్రమే కొలువై ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ప్రతిరోజూ వేకువజాము సుప్రభాత సేవకు ముందు బ్రాహ్మీముహూర్తంలో స్వయంగా బ్రహ్మదేవుడే శ్రీ స్వామిని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇదే సంప్రదాయంగా నేటికీ తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేకమైన ఓ బంగారు పాత్రలో జలాన్ని ఉంచుతారు. తర్వాత అదే పుణ్యజలాన్ని బ్రహ్మతీర్థంగా భక్తులకు వితరణ చేస్తారు. తొలుత శ్రీవేంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు జరిపించింది ఆ బ్రహ్మదేవుడే. అందువల్ల పద్మపీఠంపై కొలువైనది బ్రహ్మ కాదు ... కలియుగ వేంకటేశ్వరుడే. నాగాభరణంలో దర్శనమిచ్చే శ్రీనివాసుడు శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు సర్వవిధాలా సేవకుడు. అందుకే శేషుణ్ణి స్వామి ఆభరణంగా చేసుకున్నాడని బ్రహ్మపురాణం తెలిపింది. శ్రీ మహాలక్ష్మికి మారేడు పత్రమంటే ప్రీతి. వక్షఃస్థలంపై శ్రీమహాలక్ష్మితో వెలసిన శ్రీవేంకటేశ్వరునికి మారేడుపత్రంతో పూజార్చనలు జరగటం ఇక్కడి సంప్రదాయం. తిరుమలేశుడు నాగాభరణం ధరించి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ధనుర్మాసంలో మారేడుదళాలతో పూజలందుకుంటాడు. అందుకేనేమో... తిరుమల దేవుడు శివుడని భావించడానికి అవకాశం ఏర్పడింది. అయితే శివుని అర్చనలో వాడని తులసి దళాలను శ్రీవేంకటేశ్వరుని అర్చనలో వాడతారు. అందుకే తిరుమల క్షేత్రంలో వెలసిన దేవుడు శ్రీవేంకటేశ్వరుడేనని చెప్పక తప్పదు. కుమారస్వామి కాదు, కోనేటిరాయుడే తిరుమల ఆలయం పక్కన ఉండే కోనేరు ‘స్వామి పుష్కరిణి’ గా ప్రసిద్ధి పొందింది. స్వామి అన్న శబ్దం కుమారస్వామికే సొంతం కాదు. అమ్మవారి కోసమే శుక్రవారం అయ్యవారికి అభిషేకం ప్రతి శుక్రవారం అభిషేకం జరపటం, ఆనంద నిలయం ప్రాకారంపై నాలుగు దిక్కుల్లోనూ ‘సింహం’ బొమ్మలు ఉండటంతో ఇక్కడ వెలసింది శక్తి స్వరూపమే అనే వాదన ప్రచారంలో ఉంది. స్వామి వక్షఃస్థలంపై కొలువైన శ్రీమహాలక్ష్మి కోసమే అభిషేకం నిర్వహిస్తుంటారు. ఆ రోజు అమ్మవారికి మాత్రమే అభిషేకం చేయటం వల్ల మూలవర్లు సగం మాత్రమే తడుస్తారు. అందుకోసమే స్వామికి కూడా సంపూర్ణంగా అభిషేకం చేయటం సంప్రదాయంగా మారింది. సింహాలు శౌర్యానికి ప్రతీక. వాటి ప్రతిమలకు వైఖానస, శైవం, శాక్తేయ ఆగమాలు ప్రాధాన్యత ఇచ్చాయి. గరుడ ప్రతిమలకు వైఖానస ఆగమం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. అందువల్లే తిరుమల ఆలయ ప్రాకారాలపై సింహాలతోపాటు గరుడ ప్రతిమలు కూడా అలంకరించి ఉంటారు.