‘పదేపదే అన్యాయం జరుగుతోంది’
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడుతో కావేరి జలాల పంపకం విషయంలో పదేపదే తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం నిర్వహించారని చెప్పారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్నారు.
కావేరి నది నుంచి ఈ నెల 27 వరకు రోజుకు 6 వేల క్యుసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు మండ్య ప్రాంతంలో ఆందోళనకారులు, రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.