g parameshwara
-
బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసులో పురోగతి
బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.అయితే మహాలక్ష్మి కేసు నేపథ్యంలో మహిళల భద్రతపై నెలకొన్న ఆందోళనపై పరమేశ్వర్ స్పందించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.బెంగళూరు వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నట్టు బెంగళూరు వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్ ఎన్ సతీశ్ కుమార్ తెలిపారు. -
దళితుడ్ని డిప్యూటీ సీఎం చేయకపోతే తీవ్ర పరిణామాలు
బెంగళూరు: ఐదు రోజులపాటు అలుపెరగకుండా చర్చించింది. చివరకు.. కర్ణాటక ముఖ్యమంత్రి అంశం ఓ కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. ఈ తరుణంలో కొత్త తలనొప్పులు సిద్ధం అవుతున్నాయా?. సామాజిక వర్గాల వారీగా పలు డిమాండ్లు తెర మీదకు రాబోతున్నాయా?.. కర్ణాటక సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననిపిస్తోంది. దళితుడ్ని గనుక డిప్యూటీ సీఎం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ హెచ్చరించారాయన. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత జి. పరమేశ్వర పార్టీ అధిష్టానానికి ముందస్తుగా ఈ హెచ్చరికలు పంపారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకకే శివకుమార్‌ను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించిన తరుణంలోనే.. పరమేశ్వర మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తానే ఏకైక సీఎంగా ఉండాలని శివకుమార్ పెట్టిన షరతును కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘శివకుమార్ కోణంలో ఆయన కోరింది సరైందే కావొచ్చు. కానీ, హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉండాలి. అదే మేం ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. డిప్యూటీ సీఎం పదవితోనే దళితులకు న్యాయం జరుగుతుందా? అని మీడియా ప్రశ్నించగా.. దళిత వర్గం భారీ అంచనాలు పెట్టుకోవడం సహజమే కదా అని పేర్కొన్నారు. ‘‘ఈ అంచనాలను అర్థం చేసుకుని.. మా నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. ఒకవేళ అది జరగకపోతే.. సాధారణంగానే ప్రతికూల స్పందన వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మేల్కొనే బదులు.. ఇప్పుడే ఆ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకుంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అదే అర్థం చేసుకోమని నేను హైకమాండ్‌ను కోరుతున్నా’’ అని పరమేశ్వర కాంగ్రెస్ అధిష్టానానికి సున్నితంగా హెచ్చరికలు పంపించారు. అలాగే.. తానూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను ఆశించిన వాళ్లలో ఉన్నట్లు చెబుతున్నారాయన. కానీ, హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కదా అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతానికి వాళ్లిద్దరి పోస్టులను ప్రకటించారు. చూద్దాం.. కేబినెట్ ఏర్పాటులో దళితులకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో’’ అని వ్యాఖ్యానించారాయన. దళిత సామాజిక వర్గానికి చెందిన 71 ఏళ్ల వయసున్న జి. పరమేశ్వర, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాదు.. సుదీర్ఘకాలం కర్ణాటక పీసీసీగా పని చేసిన రికార్డు కూడా(ఎనిమిది ఏళ్లు) ఈయన పేరిట ఉంది. 2013లో కేపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పరమేశ్వర.. ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకుంది ఈయన్నే. కానీ, ఓడిపోవడంతో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది. ఆ తర్వాత పరమేశ్వరని ఎమ్మెల్సీని చేసి.. తన ప్రభుత్వంలో మంత్రిని చేశారు సిద్ధరామయ్య. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం పరమేశ్వర కొరటగెరె స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇదీ చదవండి: డీకే శివకుమార్ నిజంగానే తలొగ్గాడా? -
మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో రూ. 4.25 కోట్లు
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. బెంగుళూరు, తుముకూరుతోపాటు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పరమేశ్వరతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 4.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు పరమేశ్వర, ఎంపీ ఆర్ఎల్ జలప్ప ఇళ్లల్లో... తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారుల బృందం తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 300 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా పరమేశ్వర కుటుంబం దొడ్డబల్లాపురలో సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూట్ కళాశాల నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ జలప్ప కోలార్‌లో ఆర్ఎల్ జలప్ప ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హత లేని విద్యార్థులకు మెడికల్ సీటును రూ. 50-60 లక్షల చొప్పున అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఐటీ అధికారులు దాడులకు దిగగా పెద్ద మొత్తంలో సొమ్ము దొరకటంతోపాటు, అక్కడ లభ్యమైన పత్రాలతో ఆరోపణలు వాస్తవమేనని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అదే విధంగా పరమేశ్వర సోదరుడు ఆనంద్ ఇంట్లో, సిద్దార్థ మెడికల్ కళాశాలలోనూ నేడు సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ దాడులపై పరమేశ్వరన్ స్పందిస్తూ సోదాల పట్ల తనకేమీ అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ జలప్ప మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఐటీ దాడులు తప్పకుండా జరుగుతాయనడానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ కార్గే విమర్శించారు. మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అది జరగని పని స్పష్టం చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరమేశ్వర డిప్యూటీ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం జూలైలో కుప్పకూలిగా.. యెడ్డీ సీఎంగా బీజేపీ సర్కారు కొలువుదీరింది. -
జి. పరమేశ్వర ఇంట్లో రెండో రోజూ సోదాలు
-
కన్నడ సంక్షోభం: లోక్‌సభను కుదిపేసిన ‘కర్నాటకం’
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు ఉంటుందా? ఊడుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ముంబైలో మకాం వేయడంతో రసవత్తర పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. కన్నడ రాజకీయ సంక్షోభానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి.. లోక్‌సభలో ‘కర్ణాటక’దుమారం! ఢిల్లీ: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం లోక్‌సభను కుదిపేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి సభలో మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 303 ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీ కడుపు నిండడం లేదని, అందుకే కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ విమర్శలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీటుగా బదులిచ్చారు. కర్ణాటక సంక్షోభంలో తమ ప్రమేయం లేదని, కాంగ్రెస్‌లోనే రాజీనామాల పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మొదలుకొని.. అందరూ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, రాజీనామాలు ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. కుమారస్వామీ.. రాజీనామా చేయ్..! కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం నేపథ్యంలో బీజేపీ క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని కుమారస్వామి ప్రభుత్వం పూర్తిగా మైనారిటీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి సాయంత్రం 5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప భేటీ అవుతున్నారు. ఈ భేటీ నేపథ్యంలో యడ్యూరప్ప నివాసానికి వచ్చిన బీజేపీ సీనియర్ నేత శోభా కర్లందాజే మీడియాతో మాట్లాడారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని, ఆయన మెజారిటీ కోల్పోయారని శోభా డిమాండ్ చేశారు. రాజీనామాతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కుమారస్వామిని ఆమె కోరారు. స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్ మంత్రి పదవికి రాజీనామా చేసి.. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడాన్ని ఆమె స్వాగతించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎమ్మెల్యేలు మద్దతిస్తే తాము స్వీకరిస్తామని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు సంబంధం లేదన్నారు. మంత్రులందరి రాజీనామా ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ముంబైలో క్యాంప్ వేసిన నేతలను బుజ్జగించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా కుమారస్వామి కేబినెట్లోని మంత్రులందరూ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన 22మంది, జేడీఎస్‌కు చెందిన 10 మంది తమ మంత్రి పదవులను త్యజిచేందుకు సిద్ధపడ్డారు. (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కాంగ్రెస్ ప్లాన్ బీ) (స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్ గవర్నర్‌కు సమర్పించిన లేఖ) సంకీర్ణ సర్కార్‌కు మరో భారీ షాక్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే 13మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తాజాగా మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి కూడా రాజీనామా బాట పట్టారు. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన నాగేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే.. బీజేపీ సర్కారుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని నాగేశ్ వెల్లడించారు. ఈ ఏమేరకు గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసి లేఖలు అందించారు. ఇక, ఇప్పటికే రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేలకు తోడు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే బెలగావి అంజలి నింబల్కర్, మరో ఎమ్మెల్యే బాగేపల్లి సుబ్బారెడ్డి సోమవారం రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేసులోకి మరో నేత.. పోస్టర్లతో కలకలం కర్ణాటకలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి పదవి కోసమే సీఎల్పీ నేత సిద్దరామయ్య ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వెలువడ్డాయి. ప్రస్తుత సంక్షోభ నివారణకు రామలింగారెడ్డిని సీఎంను చేయాలంటూ పోస్టర్లు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న రామలింగారెడ్డిని సీఎం కుమారస్వామి ఓ రహస్య ప్రదేశంలో కలిసి బుజ్జగించినట్టు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటు ముందుకు వచ్చింది. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలో ఇరకాటంలో పడిన కాంగ్రెస్ పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే బెలగావి అంజలి నింబల్కర్, మరో ఎమ్మెల్యే బాగేపల్లి సుబ్బారెడ్డి సోమవారం ఉదయం రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. (మీడియాతో మాట్లాడుతున్న జీ పరమేశ్వర) మూకుమ్మడి రాజీనామాలకు రెడీ.. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి బీజేపీ కారణమని, కమలం పార్టీ నేతలు తెరవెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఈ సమావేశంలో నేతలు భావించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించినట్టు సమాచారం. తమ మంత్రి పదవులను వీడి.. వాటిని అసంతృప్తులకు కట్టబెడితే ప్రభుత్వం నిలబడుతుందని చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామని, అవసరమైతే.. అందరం మూకుమ్మడిగా రాజీనామా చేసి.. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర మీడియా తెలిపారు. ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పార్టీ నాయకుడు సిద్దరామయ్య, మంత్రులు యుటి ఖాదర్, శివశంకరరెడ్డి, వెంకటరమణప్ప, జయమాల, ఎంబీ పాటిల్, కృష్ణ బైరే గౌడ, రాజ్‌శేఖర్ పాటిల్, డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందుకే మూడుసార్లు సీఎం పదవి చేజారింది.
సాక్షి, బెంగళూరు : తాను దళితుడినైన కారణంగానే మూడు సార్లు సీఎం పదవి చేజారిందంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం దావణగెరెలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను అయిష్టంగానే ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాను. అసలు నాకు ఆ పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదు. దళితుడినైన కారణంగానే మూడుసార్లు సీఎం పదవి చేజారింది. కొంతమంది కావాలనే రాజకీయంగా నన్ను అణచివేయాలని చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. వాళ్లకి కూడా అందుకే మొండిచేయి..! రాజకీయాల్లో ఎదిగేందుకు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారని.. అందువల్లే అర్హులైన నాయకులకు కూడా పదవులు దక్కవని పరమేశ్వర అన్నారు. ‘పీకే బసవలింగప్ప, కేహెచ్ రంగనాథ్ సీఎం పదవి చేపట్టలేకపోయారు. కలబురగి ప్రస్తుత ఎంపీ మల్లికార్జున ఖర్గే కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. నేను కూడా ఆ పదవి నిర్వహించలేకపోయాను. ఇదంతా మేము దళితులమనే కారణంగానే జరిగింది. ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది. రిజర్వేషన్ ఉన్నా ప్రమోషన్లలో మా వర్గానికి అన్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దళితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, అందుకు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని కర్ణాటక మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శించారు. ఇక పరమేశ్వర వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పరమేశ్వర వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ దళితులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. -
కర్ణాటక ప్రభుత్వం కూలిపోయే ప్రసక్తే లేదు
-
కర్ణాటక సర్కారులో మంత్రులకు శాఖలు కేటాయింలు
-
నాకు ఇప్పుడే మంత్రి పదవి కావాలి...
సాక్షి, బెంగళూరు : మాజీ మంత్రి, బీదర్ జిల్లా బబలేశ్వర్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్‌కు మంత్రివర్గంలో తాజా కేబినెట్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఆయన కూడా మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెంగళూరులోని ఎంబీ పాటిల్ నివాసానికి క్యూ కట్టారు. సీఎం కుమారస్వామితో సహా ఎంతో మంది సీనియర్ నాయకులు, మంత్రులు వెళ్లి మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలించలేదు. ఆయన ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశపాండే వెళ్లి ఎంబీ పాటిల్‌తో మాట్లాడారు. అనంతరం ఉపముఖ్యమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, మంత్రి కేజే జార్జ్ తదితరులు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎంబీ పాటిల్ మాత్రం ఎవ్వరి మాట వినకుండా పట్టిన పట్టు వదలడం లేదు. ఎంబీ పాటిల్ ఇంటికి సీఎం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లో ఉన్న మాజీ మంత్రి ఎంబీ పాటిల్ ఇంటికి కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి స్వయంగా వెళ్లారు. సుమారు గంటన్నర పాటు సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఎంబీ పాటిల్ కుటుంబ సభ్యులకు తనకు ఎంతోకాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎంబీ పాటిల్‌కు మంత్రి పదవి రాలేదని అసమ్మతి వ్యక్తం చేశారని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతానని సీఎం అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్‌తో మాట్లాడితే అన్ని సర్దుకుంటాయని సీఎం కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్నీ గమనిస్తోందని.. సీఎం కుమారస్వామి ఎంబీ పాటిల్‌కు సూచించారు. వచ్చే జాబితాలో చోటు త్వరలో మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఎంబీ పాటిల్‌కు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం తనకు ఇప్పుడే మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. తాజా జాబితాలో తన పేరు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ఎంబీ పాటిల్ కోరారు. లింగాయత్– వీరశైవుల ప్రత్యేక మతం కోసం పోరాటాలు చేసినా ఫలితం లేకపోయిందని పాటిల్ ఆవేదన చెందారు. చెప్పడానికి వచ్చిన మంత్రులతో మాట్లాడుతూ మీకు (మంత్రులకు) పదవులు ఇచ్చారు. ఏమైనా మాట్లాడుతారు. కానీ నాకు మంత్రి పదవి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఎవరు చెప్పినా ఎంబీ పాటిల్ వినే పరిస్థితిలో లేరన్నారు. ఆయనతో జరిపిన చర్చలన్నీ విఫలమైనట్లు తెలిపారు. మద్దతుదారుల ఆందోళన మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌తో మాట్లాడటానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక్కడిని కాను.. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎంబీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ... తాను ఒక్కడినే పార్టీకి వ్యతిరేకంగా లేరన్నారు. తనతో పాటు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. సీఎం కుమారస్వామి తన ఇంటికి వచ్చి మాట్లాడిన సంగతి వాస్తవమే అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని వ్యవహారాలపై సీఎం ఏం చెప్పలేరు కదా అన్నారు. గత రెండు రోజుల నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలందరు చర్చించినట్లు తెలిపారు. -
ఈవీఎంలపై డిప్యూటీ సీఎం సందేహాలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్నికైన జీ పరమేశ్వర ఆరోపించారు. తమ పార్టీ నేతలతో పాటు వ్యక్తిగతంగా తాను కూడా బీజేపీ ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడిందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లోనూ పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని, బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించాలని కోరతామని చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ రసీదు యంత్రాలను (వీవీపీఏటీ) ఎన్నికల కమిషన్ ఉపయోగించింది. కాగా తాను దళితుడి కావడంతోనే డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యాననడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దళిత సీఎం అధికార పగ్గాలు చేపట్టేందుకు తాను వ్యతిరేకం కాదని అప్పటి సీఎం సిద్ధరామయ్య పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కేపీసీసీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర సంపన్న దళిత కుటుంబంలో పుట్టి విదేశాల్లో ఉన్నత చదువులు కూడా చదివారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కష్టకాలంలోనూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2010 అక్టోబరులో కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై బుధవారంవరకూ నిరంతరాయంగా కొనసాగి ఆ పదవిలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా రికార్డులకెక్కారు. తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూనే మృదువుగా మాట్లాడగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన అనంతరం ఆస్ట్రేలియాలోని వైటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత తమ కుటుంబం స్థాపించిన విద్యాసంస్థలకు పరిపాలనాధికారిగా పనిచేశారు. 1989లో పరమేశ్వర గురించి తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే ఏడాది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో 55.8 వేల ఓట్ల మెజారిటీ సాధించి తొలిసారిగా ఎస్ఎం కృష్ణ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి పొందారు. 2013లో ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినా పరమేశ్వర అనూహ్యంగా ఓడిపోయారు. -
డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత జీ పరమేశ్వర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక సీఎం పగ్గాలు చేపట్టనున్న హెచ్డీ కుమారస్వామి డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ నియామకాన్ని నిర్ధారించారు. మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు. కేబినెట్ మంత్రుల శాఖల కేటాయింపును గురువారం నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రివర్గ కూర్పు సహా అన్ని అంశాలపై కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ముందుకుసాగుతాయని, ఎలాంటి విభేదాలు లేవని కుమారస్వామి స్పష్టం చేశారు. కాగా బుధవారం బెంగళూర్‌లో కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు విపక్ష నేతలు హాజరవనున్నారు. -
కర్ణాటక: ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు!
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టినట్టు వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరైయ్యారని చెప్పారు. బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారని వివరించారు. కాగా, కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన పార్టీ శాసనసభా భేటీకి కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. డిప్యూటీ సీఎం అడగలేదు: శివకుమార్ మరోవైపు తమ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, ఎటువంటి ప్రలోభాలకు లొంగబోరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పదవి అడిగినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తానేమీ అడిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే తమ తక్షణ ప్రాధాన్యత అని చెప్పారు. -
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు గవర్నర్ షాక్
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీనేతలు ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత గడువుకు కంటే ముందే కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకోవడానికి వెళ్లిన పీసీసీ చీఫ్ పరమేశ్వరకు చేదు అనుభవం ఎదురైంది. మద్దతుదారుల జాబితాతో వెళ్లిన ఆయనకు.. రాజ్‌భవన్‌లోకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు. చాలాసేపు అక్కడే వేచిచూసిన పరమేశ్వర.. చివరికి గవర్నర్ సందేశంతో వెనుదిరిగారు. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనందున ఇప్పుడప్పుడే తాను ఎవరినీ కలవబోనని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతల బృందంతో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ ఆ సమయం కంటే ముందే వజుభాయ్‌ని కలిసేందుకు పరమేశ్వర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
సిద్దూకి.. అక్కడైతే గెలుపు సులభం..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. పరమేశ్వర రెండేసి స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావించిన సీఎం.. ఆ స్థానంలో జేడీఎస్, బీజేపీ ఒప్పందం చేసుకున్నాయన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో చాముండేశ్వరి నియోజక వర్గంతో పాటు, బగల్కోట్ జిల్లాలోని బదామి నుంచి సీఎం పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆయన కోసం బదామి ప్రస్తుత ఎమ్మెల్యే బీబీ చిమ్మనకట్టి తన సీటు త్యాగం చేయడానికి సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడైతే గెలుపు సులభం.. బదామీలో కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. సిద్దరామయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. అక్కడి ప్రజలు సీఎంను తమ నాయకుడిగా అంగీకరించారనే కారణంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అయితే రెండు స్థానాల నుంచి పోటీచేసేందుకు అధిష్టానం నుంచి సిద్దరామయ్యకు గ్రీన్ సిగ్నల్ రాగా.. జి.పరమేశ్వరకు రెండు స్థానాలకు సంబంధించి టికెట్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పరమేశ్వర ఈసారైనా విజయం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడి కోసం.. చాముండేశ్వరి నుంచి ఐదుసార్లు గెలుపొందిన సిద్దరామయ్య నియోజకవర్గాల విభజన తర్వాత వరుణ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కుమారుడు యతీంద్ర కోసం తనకు అనుకూలంగా ఉన్న ఈ స్థానాన్ని సిద్దు వదులుకున్నారని తెలుస్తోంది. కాగా చాముండేశ్వరి ప్రస్తుత ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మద్దతు ఉంది. సిద్దును ఓడించేందుకు ఆయన ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే హెచ్డీ దేవెగౌడ.. ‘సిద్దరామయ్య ఒక దురహంకారి. పార్టీని దుర్వినియోగం చేశాడు. అటువంటి మోసకారిని చాముండేశ్వరి ప్రజలు ఎంతమాత్రం నమ్మరంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామనే భయం వల్లే... కాంగ్రెస్ నాయకులకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. వారు పిరికిపందలని.. అందుకే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
రాజీనామాకు సిద్ధపడ్డ హోంమంత్రి!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామం. కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర రాజీనామాకు సిద్ధపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. కర్ణాటకలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు వెళ్లనుంది. సీఎం అభ్యర్థిగా మరోసారి సిద్దరామయ్యకే కాంగ్రెస్ చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సీఎం అభ్యర్థిగా శక్తిమంతమైన నేత యడ్యూరప్ప ఖరారయ్యారు. ఈ క్రమంలో సిద్దరామయ్య వర్సెస్ యడ్యూరప్పగా ఈ ఎన్నికల పోరు జరగనుంది. -
త్వరలో మా పార్టీలోకి 20మంది బీజేపీ నేతలు!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వరుస వలసలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ గూటిలోకి చేరగా.. మాజీ మంత్రులైన శ్రీనివాస్ ప్రసాద్, కుమార్ బంగారప్ప, కే జయప్రకాశ్ హెగ్డే వంటి నేతలు కూడా హస్తాన్ని వీడి.. కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ వలసల్లో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. త్వరలోనే దాదాపు 20 మంది బీజేపీ నేతలు, మరికొందరు జేడీఎస్ నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. గతంలోనే ఈ విషయాన్ని చెప్పిన పరమేశ్వర తాజాగా గురువారం తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? వారు ఏ ప్రాంతానికి చెందినవారు? అన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఆయన చెప్పారు. ఇంతకు ఎంతమంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారు? వారు చోటామోటా నేతలా? లేక బడా నేతలా? అంటు కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. -
బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో మహిళలు బహిరంగంగా లైంగిక వేధింపులకు గురైన ఘటనపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరకు, ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) షాక్ ఇచ్చింది. ఆ ఇద్దరు నేతలకు సమన్లు జారీచేసింది. 'పార్టీలకతీతంగా కొందరు వ్యక్తులు జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. దేశం ఎటువైపు వెళ్తున్నట్టు?' అని ఎన్సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమారమంగళం అన్నారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు బహిరంగంగా రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ యువత పాశ్చాత్య ధోరణిని అవలంబిస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, యువతులు కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారని, ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దేశ మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 'ఒక హోంమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్ణకరం, ఆమోదనీయం కాదు. వేడుకల సందర్భంగా మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నంత మాత్రాన భారతీయ పురుషులు అదుపుతప్పి రెచ్చిపోతారా? అని నేను మంత్రిని అడుగదలుచుకున్నా. మహిళలను గౌరవించడం భారతీయ పురుషులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలి' అని లలిత కుమారమంగళం స్పష్టం చేశారు. -
‘పదేపదే అన్యాయం జరుగుతోంది’
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడుతో కావేరి జలాల పంపకం విషయంలో పదేపదే తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం నిర్వహించారని చెప్పారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్నారు. కావేరి నది నుంచి ఈ నెల 27 వరకు రోజుకు 6 వేల క్యుసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు మండ్య ప్రాంతంలో ఆందోళనకారులు, రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. -
‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’
బెంగళూరు: కర్ణాటక ప్రజలు సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర విజ్ఞప్తి చేశారు. కొన్ని సంస్థల పేరుతో కొంత మంది వ్యక్తులు హింసకు పాల్పడ్డారని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హింసకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులను వెంటనే అదుపులోకి తెచ్చామని, లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేదని పరమేశ్వర అన్నారు. పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుతో కావేరి నీటి వివాదం నేపథ్యంలో బెంగళూరు సహా కర్ణాటకలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసకు దారి తీశాయి.