
కర్ణాటక డిప్యూటీ సీఎం జీ. పరమేశ్వర (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్నికైన జీ పరమేశ్వర ఆరోపించారు. తమ పార్టీ నేతలతో పాటు వ్యక్తిగతంగా తాను కూడా బీజేపీ ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడిందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లోనూ పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు. దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని, బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించాలని కోరతామని చెప్పారు.
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ రసీదు యంత్రాలను (వీవీపీఏటీ) ఎన్నికల కమిషన్ ఉపయోగించింది. కాగా తాను దళితుడి కావడంతోనే డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యాననడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దళిత సీఎం అధికార పగ్గాలు చేపట్టేందుకు తాను వ్యతిరేకం కాదని అప్పటి సీఎం సిద్ధరామయ్య పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment