కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment