Association for Democratic Reforms
-
79.39% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా పలు పార్టిల అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో 555 మందికి(79.39 శాతం) కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురికే డిపాజిట్లు దక్కాయి. మిగతా వారంతా తెల్లమొహం వేయాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీతోపాటు బీజేపీ మిత్రపక్షాలైన జనతాదళ్(యునైటెడ్), లోక్‌జనశక్తి పార్టి(రామ్‌విలాస్) అభ్యర్థులంతా డిపాజిట్లు నిలబెట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మొత్తం 70 మంది బరిలోకి దిగారు. 67 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేయగా, కేవలం ఒక్కచోటే డిపాజిట్ దక్కింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థి ఎన్నికల సంఘం వద్ద రూ.10,000 డిపాజిట్ చేయాలి. దీన్ని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోలై చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లలో అభ్యరి్థకి ఆరింట ఒక వంతు ఓట్లు లభిస్తే డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. లేకపోతే డిపాజిట్ కోల్పోయినట్లే. అంటే ప్రతి ఆరు ఓట్లలో కనీసం ఒక్క చోటు వచ్చి ఉండాలి. 10 శాతం తగ్గిన ఆప్ ఓట్ల శాతం దేశ రాజధానిలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. పదేళ్లలో 13 శాతం పెరగడం విశేషం. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 10 శాతం పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గగా, ఆప్ పరాజయం పాలైంది. కానీ, రెండు పార్టిలు సాధించిన ఓట్ల మధ్య తేడా కేవలం 2 శాతమే. ఈసారి పోలైన మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 45.56 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ బలం కూడా స్వల్పంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 6.34 శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. అంటే కాంగ్రెస్ ఓట్లు 2 శాతానికి పైగానే పెరిగాయి. నేర చరితులు 31 మంది దేశ రాజధాని ఢిల్లీ 8వ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది, 44% మంది నేర చరితులున్నారు. ఈ ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్రమైన అభియోగాలున్నా యి. 2020 ఎన్నికల్లో ఎన్నికైన వారిలో నేర చరితులు 43 మంది, అంటే 61% మంది కాగా వీరిలో తీవ్రమైన నేరారోపణలున్న వా రు 37 మంది. ఈ సంఖ్య తాజా అసెంబ్లీ ఎ న్నికల్లో తగ్గింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్), ఢిల్లీ ఎ లక్షన్ వాచ్ సంస్థలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి అఫిడవిట్లను విశ్లేషించి ఆదివారం ఒక నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన 48 మందిలో 16 మంది అంటే 33% మందిపై క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆప్ నుంచి గెలిచిన 22 మందిలో 15 మంది, 68% నేరచరితులున్నారు. మరోవైపు మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు బిలియనీర్లు కాగా షాకుర్బస్తీ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన కర్నయిల్ సింగ్ రూ.259 కోట్లతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో రూ.248 కోట్లతో రాజౌరి గార్డెన్స్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా, రూ.115 కోట్లతో న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు. అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలోనూ రూ.74 కోట్లతో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొత్తం 70 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,542 కోట్లుగా ఉంది. వీరిలో 45 మంది, 64% గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, 23 మంది, 33% మంది 5వ నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. అంతేగాక 41– 60 ఏళ్ల మధ్య వయసు్కలైన ఎమ్మెల్యేలు 47 మంది (67% కాగా 14 మంది అంటే 20% మంది వయస్సు 61– 80 ఏళ్ల మధ్య ఉంది. రాజిందర్ నగర్ నుంచి గెలిచిన 31 ఏళ్ల ఉమంగ్ బజాజ్ పిన్న వయసు్కడైన ఎమ్మెల్యేగా నిలిచారు. అదేవిధంగా, సిట్టింగుల్లో 22 మంది మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. 38 శాతం మంది పట్టభద్రులు ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్నికయ్యారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ఈ సంస్ధ ఇందుకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. మొత్తం 70 మంది శాసనసభ్యులకుగాను ఈ దఫా కేవలం ఐదుగురు మాత్రమే, అంటే 7 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని తెలిపింది. వీరిలో నలుగురు బీజేపీ నుంచి, ఒకే ఒక్కరు ఆతిశీ ఆప్ నుంచి గెలిచారంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో 8 మంది మహిళలు ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేసింది. అదేవిధంగా, గత అసెంబ్లీలో 34 శాతం మంది పట్టభద్రులుండగా ఈసారి వీరి సంఖ్య 38 శాతానికి పెరిగింది. పీజీ, అంతకంటే ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య 26 శాతంగానే ఉందని వివరించింది. కొత్త శాసనసభ్యుల్లో 61 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా పేర్కొన్నారంది. గత అసెంబ్లీలో 29% మంది వ్యాపారాన్ని వృత్తిగా పేర్కొనగా ఈ దఫా వీరి సంఖ్య ఏకంగా 49 శాతానికి పెరిగిందనిఆ నివేదిక తెలిపింది. సభ్యుల సరాసరి వయస్సు 52 ఏళ్లుగా పేర్కొంది. కొత్త ఎమ్మెల్యేల్లో 25–40 ఏళ్ల మధ్య ఉన్న వారు 13% కాగా, గత అసెంబ్లీలో వీరు 23 శాతంగా ఉన్నారని విశ్లేషించింది. 70 ఏళ్లు పైబడిన వారి వాటా 4శాతమని తెలిపింది. -
Association of Democratic Reforms: ఈ వ్యత్యాసాలు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు. ఏపీలోనే అత్యధికం పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. -
538 నియోజకవర్గాల ఓట్లలో తేడా: ఏడీఆర్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. -
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
Lok Sabha Election 2024: లోక్‌సభ అభ్యర్థుల్లో... 121 మంది నిరక్షరాస్యులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులు. 359 మంది 5వ తరగతి దాకా, 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది ట్వెల్త్ గ్రేడ్ పాసయ్యారు. 1,502 మంది డిగ్రీ చదవగా 198 మంది డాక్టరేట్ అందుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు వెల్లడించింది. ఏడు దశల్లో బరిలో ఉన్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను ఏడీఆర్ విశ్లేíÙంచింది. -
Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 10 శాతం కంటే తక్కువే ఉంది! ఈసారి మహిళా అభ్యర్థులు కేవలం 797 మందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అంటే 9.5 శాతం! తొలి విడతలో 1,618 మంది అభ్యర్థుల్లో మహిళలు 135 మంది. రెండో విడతలో 1,192 మంది అభ్యర్థుల్లో 100 మంది, మూడో విడతలో 1,352 మందిలో 123, నాలుగో విడతలో 1,717 మందిలో 170, 5వ విడతలో 695 మందిలో 82 మంది మహిళలున్నారు. పోలింగ్ జరగాల్సిన ఆరో విడతలో 869 మంది అభ్యర్థుల్లో 92 మంది మహిళలున్నారు. ఏడో విడతలో కూడా 904 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 95 మందే. మహిళా రిజర్వేషన్ల అమలుపై పారీ్టల చిత్తశుద్ధి ఏపాటితో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి మొత్తం 8,337 మంది అభ్యర్థులు లోక్‌సభ బరిలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉండటం 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996లో రికార్డు స్థాయిలో 13,952 మంది పోటీ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
తొలి నాలుగు విడతల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వీరిలో మహిళలు 82 మందే! అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొదటి, రెండో విడతలో 8 శాతం చొప్పున, మూడో విడతలో 9 శాతం, నాలుగో విడతలో 10 శాతం మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఐదో విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 18 శాతం మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి తీవ్ర అభియోగాలకు సంబంధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పారీ్టలవారీగా చూస్తే మజ్లిస్‌లో 50 శాతం, సమాజ్‌వాదీలో 40 శాతం, కాంగ్రెస్‌లో 39 శాతం, శివసేనలో 33 శాతం, బీజేపీలో 30 శాతం, టీఎంసీలో 29 శాతం, ఆర్జేడీలో 25 శాతం, శివసేన (ఉద్ధవ్)లో 13 శాతం మంది అభ్యర్థులపై తీవ్ర క్రిమినల్ కేసులున్నాయి. మొత్తమ్మీద 29 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 33 శాతం కోటీశ్వరులు ఐదో విడత అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. యూపీలోని ఝాన్సీ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ అత్యధికంగా రూ.212 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మహారాష్ట్రలోని బివాండీ స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ భగవాన్ సాంబ్రే రూ.116 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత రూ.110 కోట్లతో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (మహారాష్ట్ర ముంబై నార్త్) మూడో స్థానంలో ఉన్నారు. సురేష్ గోపీనాథ్ మాత్రే (ఎన్సీపీ–ఎస్పీ) రూ.107 కోట్లు, కృష్ణానంద్ త్రిపాఠీ (కాంగ్రెస్)రూ.70 కోట్లు, సంగీత కుమారీ సింగ్‌దేవ్ (బీజేపీ) రూ.67 కోట్లు, రవీంద్ర దత్తారాం వైఖర్ (శివసేన) రూ.54 కోట్లు, కపిల్ మోరేశ్వర్ పాటిల్ (బీజేపీ) రూ.49 కోట్లు, కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ) రూ.49 కోట్లు, సంజయ్ మఫత్‌లాల్ మొరాఖియా (స్వతంత్ర) రూ.48 కోట్లతో టాప్ 10లో ఉన్నారు. విద్యార్హతలు 42 శాతం మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి పన్నెండో తరగతిలోపే. వీరిలో 21 మంది ఐదో తరగతి వరకే చదివారు. 64 మంది ఎనిమిదో తరగతి, 97 మంది పదో తరగతి గట్టెక్కారు. 50 శాతం మందికి గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యార్హతలున్నాయి. 26 శాతం మంది డిప్లోమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
తొలి రెండు విడతల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల మూడో విడతలోనూ మహిళలకు సముచిత స్థానం దక్కలేదు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. 1,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళలు 123 మందే (9 శాతం) ఉన్నారు. ఇక ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఇద్దరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) డేటా వెల్లడించింది. వీరిలో13 శాతం మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్ర కేసులున్నాయి. మొత్తం 38 మంది అభ్యర్థులు మహిళలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శివసేన (ఉద్ధశ్) అభ్యర్థుల్లో ఏకంగా 80 శాతం, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థుల్లో 67 శాతం, ఎస్పీ అభ్యర్థుల్లో 50 శాతం, జేడీ(యూ)లో 33 శాతం, తృణమూల్ కాంగ్రెస్‌లో మందిపై క్రిమినల్ కేసులుండటం విశేషం! బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 26, ఆర్జేడీ నుంచి ముగ్గురిపై కేసులున్నాయి. అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులున్నప్పుడు ప్రకటించే రెడ్ అలర్ట్‌ను 43 నియోజకవర్గాల్లో జారీ చేశారు. మూడో వంతు కోటీశ్వరులే మొత్తం అభ్యర్థుల్లో 392 మంది కోటీశ్వరులేనని వారు దాఖలు చేసిన అఫిడవిట్లు తెలియజేస్తున్నాయి. దక్షిణ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవీ శ్రీనివాస్ డెంపో రూ.1,361 కోట్ల ఆస్తులతో టాప్‌లో ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్ గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా రూ.424 కోట్లు, మహారాష్ట్రలో కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఛత్రపతి సాహు మహారాజ్ రూ.342 కోట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. మూడో దశలో 82 మంది బీజేపీ అభ్యర్థుల్లో 77 మంది; 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లోనూ ఏకంగా 60 మంది కోటీశ్వరులే. జేడీ(యూ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఐదుగురు అభ్యర్థులు తమకెలాంటి ఆస్తులూ లేవని పేర్కొనడం విశేషం. సగం మంది ఇంటర్ లోపే అభ్యర్థుల్లో 639 మంది విద్యార్హత ఆరో తరగతి నుంచి ఇంటర్ లోపే! 19 మందైతే ఏమీ చదువుకోలేదు. 56 మంది ఐదో తరగతి లోపే చదివారు. 591 మందికి డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. 44 మంది డిప్లొమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలావి మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడార్) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.► 21 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!► టాప్–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్’ లేపారు. బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ (రూ.215 కోట్లు) టాప్–10లో నిలిచారు.► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే. చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి. క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు. -
దేశంలో అత్యంత ధనిక-పేద ఎమ్మెల్యేలు వీళ్లే..
బెంగళూరు: దేశంలోనే అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. టాప్ ప్లేస్‌లో నిలిచారు. రూ. 1,400 కోట్లకు పైగా ఆస్తులతో.. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారాయన. 2023లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిఢవిట్లలోని వివరాల ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్).. దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేల లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 1,400 కోట్ల ఆస్తులతో డీకే శివకుమార్ అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. తరువాత రూ. 1,267 కోట్ల విలువైన ఆస్తులతో కర్ణాటకకే చెందిన గౌరిబిదనూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రియ కృష్ణ రూ. 1,156 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక తొలి 10 మంది ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. తన ఆస్తుల గురించి శివకుమార్‌ను ప్రశ్నించగా.. తాను ధనికుడిని కాదని, అలాగని పేదవాడిని కూడా కాదని అన్నారు. ప్రస్తుతం తనకున్న ఆస్తులన్నీ సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవని పేర్కొన్నారు. తన ఆస్తులన్నీ తన పేరు మీదే ఉన్నాయని, అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. వ్యాఖ్యానించారు. కొందరు తమ ఆస్తులను వివిధ వ్యక్తుల పేరిట రాసుకుంటారని, తనకి అలా ఇష్టం ఉండదని చెప్పారు. అందుకే తన పేరిట ఇన్ని ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా ఉన్నారు. తన పేరు మీద కేవలం రూ. 1,700 ఆస్తులే ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతని తరువాత ఒడిశాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముదులి రూ. 15,000 వేల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా తొలి 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటకకు చెందిన వారే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అంతేగాక రాష్ట్రంలో 14 శాతం మంది ఎమ్మెల్యేలు బిలియనీర్లు కాగా వారు రూ.100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 59 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కోటీశ్వరులు ఉన్నారు. చదవండి: Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. ఆరోజు జరిగింది ఇదేనా! -
ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) తేలి్చంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. -
విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల సేకరణలో అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందంజలో ఉంది. భారత రాజకీయాల్లో సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్లు, ప్రత్యక్ష కార్పొరేట్ విరాళాలు సహా ఇతర విరాళాల ద్వారా మొత్తంగా ఆరేళ్లలో రూ.10,122 కోట్లు బీజేపీకి వచ్చాయి. బీజేపీ ప్రకటించిన మొత్తం విరాళాలు ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విరాళాల రూపంలో రూ.1547.439 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.823.301 కోట్లు, సీపీఐ(ఎం) రూ.367.167 కోట్లు, ఎన్సీపీ రూ.231.614 కోట్లు సేకరించాయి. ప్రాంతీయ పార్టీల్లో బీజేడీ తీయ పార్టీల జాబితాలో బిజు జనతాదళ్ (బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్లు విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణరాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ రూ.476.89 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు, వైఎస్ఆర్సీపీ రూ.456.20 కోట్లు, శివసేన రూ.267.90 కోట్లు, ఆప్ రూ.169.70 కోట్లు, టీడీపీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి. చదవండి: ఆ తేనేలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
Tripura Assembly Election: 45 మంది కోటీశ్వరులు, 41 మందిపై క్రిమినల్ కేసులు
అగర్తాలా: త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 259 మంది అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులని, 41 మంది క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు 17 మంది ఉంటే, టిప్రామోతాకి చెందిన వారు తొమ్మిది మంది, సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు కోట్లకు పడగలెత్తితే, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు నలుగురు ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వరులేనని ఆ నివేదిక చెప్పింది. త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ రూ.15.58 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉంటే రూ.13.90 కోట్ల ఆస్తిపాస్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి , డాక్టర్ కూడా అయిన మాణిక్ సాహ నిలిచారు. ఇక 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడివిట్లో దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏకంగా ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. -
గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు..
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ ఒకటిన మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో అత్యధికంగా ఆప్, ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఉన్నాయి. 89 స్థానాలకు గాను బరిలో ఉన్న 788 మందికి గాను 167 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 100 మంది హత్య, రేప్ వంటి తీవ్ర నేరారోపణలను సైతం ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం తెలిపింది. అదేవిధంగా, బరిలో ఉన్న 788 మందిలో 211 మంది కోట్లకు పడగలెత్తిన వారు కాగా వీరిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 79 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. రాజ్‌కోట్ సౌత్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేశ్ తిలాలా రూ.175 కోట్ల ప్రకటిత ఆస్తులతో అత్యంత ధనికుడు కాగా రాజ్‌కోట్ వెస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా ఎటువంటి ఆస్తులు లేవంటూ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని పేర్కొంది. చదవండి: యువతరం.. ఎవరి పక్షం...! -
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు!
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమితో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జట్టుకట్టి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని కొలువుతీర్చిన సీఎం నితీశ్‌కుమార్ క్రిమినల్ కేసులున్న నేతలతో దాదాపు మొత్తం మంత్రివర్గాన్ని నింపేశారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో 70 శాతానికిపైగా నేతలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదించింది. రెండేళ్ల క్రితం రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా వీరంతా సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్, బిహార్ ఎలక్షన్ వాచ్ సంస్థ సంయుక్తంగా క్షుణ్ణంగా పరిశీలించాక ఈ నివేదికను బహిర్గతంచేసింది. ఇందుకోసం సీఎం నితీశ్ సహా 33 మంది మంత్రుల్లో 32 మంది అఫిడవిట్లను పరిశీలించారు. మొత్తం మంత్రుల్లో 23 మంది(72 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మంది మంత్రులు(53 శాతం) తమపై తీవ్రమైన నేరమయ కేసులున్నాయి. మొత్తం మంత్రుల్లో 27 మంది(84 శాతం) కోటీశ్వరులుకాగా, మొత్తం 32 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.5.82 కోట్లు. పాతిక శాతం మంది మంత్రులు తమ విద్యార్హతలు 8వ తరగతి నుంచి ఇంటర్‌లోపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. జేడీ(యూ) నుంచి 11 మంది, ఆర్జేడీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే మంత్రులుగా కొనసాగుతున్నారు. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు; విస్తుగొలిపే నిజాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేర చరితులకు పెద్దపీట ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. పోటీలో కోటీశ్వరులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్ఎల్డీ(66), ఎన్పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ టాప్.. బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్ఎల్డీ(32), ఎన్పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి. మహిళలకు దక్కని ప్రాధాన్యం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా) కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు.. వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?) -
విరాళాల సేకరణలో శివసేన టాప్
సాక్షి, న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు వచ్చిన విరాళాలు 37,794 శాతం, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి విరాళాలు 410 శాతం, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి 317 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 156 శాతం పెరిగాయి. 2018–19లో జేఎంఎంకు 0.017 కోట్లు, ఎల్జేపీకి 0.515 కోట్లు, ఎస్పీకి రూ.1.054 కోట్లు రాగా, 2019–20లో ఆయా పార్టీలకు వరుసగా రూ.6.442 కోట్లు, రూ.2.629 కోట్లు, రూ.4.392 కోట్లు వచ్చాయి. పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక శుక్రవారం విడుదలయ్యింది. 2019–20లో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్–5 పార్టీల్లో శివసేన, ఏఐఏడీఎంకే, ఆప్, బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. 2018–19లో కంటే 2019–20లో తమకు విరాళాలు తగ్గాయని శివసేన, బీజేడీ, వైఎస్సార్సీపీ ప్రకటించగా, తాము స్వీకరించిన విరాళాలు పెరిగాయని ఏఐఏడీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించాయి. టాప్–5 పార్టీలకు రూ.189.523 కోట్లు తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉందని ఏడీఆర్ గుర్తించింది. ఇందులో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించినట్లు ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంటున్నట్లు తెలిపింది. ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి. తగ్గిన విరాళాలు 2018–19 నాటి విరాళాలతో పోలిస్తే 2019–20లో జేఎంఎం, ఎల్జేపీ, ఎస్పీ, ఆప్‌లకు విరాళాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీకి రూ.71.651 కోట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి రూ.40.876 కోట్లు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి రూ.23.573 కోట్లు, శివసేనకు రూ.7.371 కోట్లు, జేడీయూకు రూ.7.098 కోట్ల మేర విరాళాలు తగ్గాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం రూ.233.686 కోట్ల విరాళాలలో, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 421 విరాళాల నుండి రూ.4.884 కోట్లు నగదు రూపంలో స్వీకరించాయి. ఇది పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలలో 2.09% అని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచే విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్/వ్యాపార రంగాల నుంచి విరాళాల ద్వారా రూ.181.522 కోట్లు రాగా, 5,916 మంది వ్యక్తిగత దాతలు రూ.42.48 కోట్లు ఇచ్చారు. అదే సమయంలో మరో రూ.30.766 కోట్ల విరాళాల సమాచారాన్ని పార్టీలు బయటపెట్టలేదు. విరాళాలు స్వీకరించినట్లు ప్రకటించిన 27 ప్రాంతీయ పార్టీలలో 16 పార్టీలు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) వివరాలు లేకుండా రూ.24.779 కోట్ల విరాళాలు స్వీకరించినట్లు వెల్లడించాయి. కాగా, 14 ప్రాంతీయ పార్టీలు.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేడీ, డీఎంకే, శివసేన, ఆప్, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, జేఎంఎంలు రూ.447.498 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్డీపీపీ, డీఎండీకే, జేకేఎన్సీ పార్టీలు తాము అందుకున్న విరాళాల వివరాలను ప్రకటించలేదు. -
363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హతకు వీలున్న క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడే అవకాశమున్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఈ కేసులు నిరూపణ అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టంలోని 8వ సెక్షన్ కింద వీరిపై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్ పేర్కొంది. నేరాభియోగాలు నమోదైన వారిలో 39 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 2019 నుంచి 2021 కాలానికి 542 మంది లోక్‌సభ సభ్యులు, 1,953 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించి ఆయా వివరాలను ఏడీఆర్ బహిర్గతంచేసింది. బీజేపీకి చెందిన 83 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 47 మంది కాంగ్రెస్, 25 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 111 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మొత్తంగా 315 కేసులున్నాయి. బిహార్‌కు చెందిన 54 మంది ఎమ్మెల్యేలపై, కేరళలో 42 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నలుగురు కేంద్ర మంత్రులు, 35 మంది రాష్ట్ర మంత్రులపై కేసులు ఉన్నాయి. -
నితీశ్ కేబినెట్లో 57% మంది నేరచరితులే
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిందో లేదో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత కలిగిన వారికి నితీశ్ కేబినెట్లో చోటు దక్కడంతో విపక్షాలు దాడికి దిగాయి. విద్యాశాఖ మంత్రిగా జేడీ(యూ)కి చెందిన మేవాలాల్ చౌధురిని నియమించడంతో రగడ మొదలైంది. గతంలో వ్యవసాయ యూనివ ర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా మేవాలాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంతో విపక్ష ఆర్జేడీ కూటమికి ఒక ఆయుధం దొరికింది. కేబినెట్లో మరో ఏడుగురు నేర చరిత కలిగిన వారు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. నితీశ్ కేబినెట్లో బెర్త్ సంపాదించిన 14 మంది ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ ఎనిమిది మంది (57%) నేరచరిత్ర కలిగినవారని పేర్కొంది. వారిలో ఆరుగురు (43%)అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది కళంకిత మంత్రుల్లో బీజేపీ నుంచి నలుగురు, జేడీ(యూ) నుంచి ఇద్దరు కాగా మిగతా ఇద్దరు కూటమి పార్టీలకు చెందినవారు. -
బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!
పట్నా: బిహార్ అసెంబ్లీ విజేతల సామాజిక నేపథ్యాలను విశ్లేషించగా, గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ధనవంతులు, నేర చరితులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, ఆర్జేడీ నాయకత్వంలో మహా కూటమితోపాటు ఏఐఎంఐఎం పార్టీలు కలిసి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 54.5 శాతం టిక్కెట్లను క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఇవ్వగా, 58.2 శాతం మంది విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో అవే పార్టీలు 61.7 శాతం టిక్కెట్లు ఇవ్వగా, 66.8 శాతం ఎమ్మెల్యేలు గెలిచారని ‘అసొసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్’ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. 2015 ఎన్నికల్లో 25 శాతం మంది అభ్యర్థులు కోటి రూపాయలు దాటిన ధనవంతులు కాగా, 2020 ఎన్నికల్లో వారి సంఖ్య 33 శాతానికి చేరుకుంది. వారిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున 86 శాతం మంది ధనవంతులు పోటీ చేయగా, 78 శాతం మంది విజయం సాధించారు. సీపీఐ నుంచి గెలిచిన రామ్ రతన్ సింగ్ బహుళ కోటీశ్వరుడు. లోక్‌జన శక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రాజ్ కుమార్ సింగ్ 1.9 కోట్ల అధిపతి. ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అనంత్ కుమార్ సింగ్ నగదు ఆస్తులు 51 కోట్లు. ఆయనపై అత్యధికంగా 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 11 హత్యాయత్నం కేసులు, నాలుగు కిడ్నాపింగ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో ఆస్తిపరులు, నేరస్థులు గణనీయంగా పెరిగారు. (చదవండి: బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు) -
‘రెడ్ అలర్ట్’నియోజకవర్గాలు
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్నింటిని రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా పరిగణిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనయినా పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకు మించి అభ్యర్థులపై ›క్రిమినల్ కేసులు ఉంటే ఆ నియోజకవర్గాన్ని రెడ్ అలర్ట్ నియోజకవర్గంగా గుర్తిస్తారు.పోలింగు సమయంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు.ఆరో దశ కింద మే 12న పోలింగు జరిగే 59 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాలు రెడ్ అలర్డ్ నియోజకవర్గాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) పేర్కొంది. కాగా, ఆరో దశలో పోటీ చేస్తున్న మొత్తం 967 మందిలో 20శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్ధుల్లో 48శాతం, కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 44శాతం నేర చరితులున్నారు. ఆరో దశలో బీజేపీ తరఫున మొత్తం 54 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 26 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అలాగే, కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న 46 మందిలో 20 మందిపై కేసులున్నాయి.బీఎస్పీ అభ్యర్థులు 49 మందిలో 19 మంది,307 ఇండిపెండెంట్లలో 34 మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. మొత్తం 967 మందిలో 146 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో నలుగురిని కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆరుగురిపై హత్య కేసులున్నాయి.25 మందిపై హత్యాయత్నం కేసులు పెండింగులో ఉన్నాయి.21 మందిపై మహిళలపై అకృత్యాల కేసులున్నాయి. -
దాతలు తెలీకుండా నల్లధనం నియంత్రణా?
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో జారీ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేదెవరో తెలియనప్పుడు ఎన్నికల్లో నల్లధనాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ ప్రయత్నాలు వృథా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలి లేదా బాండ్లను కొనుగోలు చేసే వారి వివరాలను బహిర్గతం చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) సంస్థ వేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల్లో నల్లధనం కట్టడికే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ తెలిపారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, ఎన్నికల తర్వాతే ఈ విధానం పనిచేస్తుందా లేదా అనేది పరిశీలించాలని కోరారు. అయితే, బాండ్ల కొనుగోలు దారుల వివరాలు బ్యాంకులకు తెలుస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి వేణుగోపాల్.. అతని వివరాలు తెలిసినప్పటికీ ఏ బాండ్ ఏ పార్టీకి అందిందో తెలపడం కష్టమని బదులిచ్చారు. అలాంటప్పుడు, ఆదాయపన్ను చట్టాల్లో లొసుగుల ఆధారంగా నల్లధనాన్ని నియంత్రించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృథాయే కదా అని ధర్మాసనం పేర్కొంది. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా మాత్రమే అసలైన డబ్బు బాండ్ల కొనుగోలు దారుల ద్వారా బ్యాంకులకు చేరుతుందని ఏజీ వేణుగోపాల్ పేర్కొనగా దాతలు ఎవరో తెలియకపోతే బినామీ కంపెనీలు కూడా నల్లధనాన్ని ఈ మార్గంలో పార్టీల నిధులుగా మార్చుకునే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, ఎన్నికల్లో తాము ఎన్నుకోబోయే అభ్యర్థులకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఎలక్టోరల్ బాండ్లపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అమలుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లపై లోతుగా విచారించాల్సిన అవసరముందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)కు సూచించింది. ఏడీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో 95 శాతం అధికార పార్టీకే దక్కాయని గుర్తుచేశారు. నిధులపై పారదర్శకత లోపించిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ఈ వాదనల్ని ఖండించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్.. నల్లధనాన్ని నియంత్రించేందుకే ఈ బాండ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. -
పార్టీలను పోషిస్తున్నది నల్లడబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే, వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం. అమెరికా, యూరప్ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో నల్లడబ్బును ఏ మాత్రం అరికట్టలేక పోగా, కట్టలు తెంచుకొని నల్లడబ్బు పారేలాగా వెయ్యి, పదివేలు, లక్షా, పది లక్షలు, కోటి రూపాయల ఎన్నికల బాండులను 2017 బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రవేశపెట్టింది. 2017–18 సంవత్సరానికి ఏయే పార్టీకి ఏయే రూపంలో ఎన్ని విరాళాలు వచ్చాయో ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. 20 వేల రూపాయలకు లోపయితే ఎవరైనా 20 వేల రూపాయలు, అంతకులోపు విరాళాలు ఇస్తే వారు తమ గుర్తింపును వెల్లడించాల్సి అవసరం లేదు. గతంలో అన్ని పార్టీలకు 20 వేల రూపాయలే ఎక్కువగా వచ్చేవి. లక్ష రూపాయలు ఇవ్వదల్చిన దాతలు కూడా దాన్ని ఐదు భాగాలుగా విడగొట్టి 20 వేల రూపాయల చొప్పున ఇచ్చేవాళ్లు. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీకి 20 వేల రూపాయలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే 437.04 కోట్ల రూపాయలు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం 26.66 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 20 వేల రూపాయలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి. ఎన్నికల బాండుల్లో బేజేపీకే 95 శాతం 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే 834.7 కోట్ల రూపాయల ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, 689.44 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే 467.13 కోట్ల రూపాయలు తెల్సిన దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే. భారతీయ స్టేట్ బ్యాంకుల నుంచి ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎన్నికల బాండులను కొనుక్కోవచ్చు. వారి వివరాలను బ్యాంకు లావాదేవీల అవసరార్థం బ్యాంకు బ్రాంచులు నమోదు చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఆ బాండ్‌ను ఏ పార్టీకి ఇచ్చేది ఆ దాత వెల్లడించాల్సిన అవసరం అస్సలు లేదు. దాత ఆ బాండును తీసుకెళ్లి ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ఆ దాత వివరాలను నమోదు చేసుకుంటుంది. అయితే ఇటు బ్యాంకులుగానీ, రాజకీయ పార్టీలుగానీ ఎన్నికల బాండుల దాతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రజలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట బీజేపీ ప్రభుత్వం ఈ బాండుల దాతల వివరాలను విధిగా వెల్లడించాలనే నిబంధన తీసుకరావాలనుకుంది. నల్లడబ్బుకే ప్రాధాన్యత దాతల వివరాలను వెల్లడిస్తే అధికారంలో ఉన్న తమ పార్టీకి ఎక్కువ విరాళాలు రాకపోవచ్చని, ముఖ్యంగా నల్లడబ్బుకు అవకాశం లేకపోయినట్లయితే నిధులు బాగా తగ్గి పోతాయని మోదీ ప్రభుత్వం భావించి ఈ మోసపు విధానానికే మొగ్గు చూపింది. నల్లడబ్బుకు ముసుగు వేయడానికే ఎన్నికల బాండులను తీసుకొచ్చారని మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. -
ఎమ్మెల్యే ఆదాయం 24.59 లక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏడాదికి సరాసరి ఒక్కొక్కరు రూ. 24.59 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఆ జాబితాలో కర్ణాటక ఎమ్మెల్యేలు సగటున రూ. కోటికి పైగా వార్షిక ఆదాయంతో ముందంజలో, ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు రూ. 5.4 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికల సంస్కరణ కోసం కృషి చేస్తున్న అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ.. దేశవ్యాప్తంగా 4,086 మంది ఎమ్మెల్యేలకు గాను 3,145 మంది ఎన్నికల అఫిడవిట్ల వివరాల్ని విశ్లేషించి జాబితాను రూపొందించింది. 941 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ఆదాయాన్ని ప్రకటించనందున వారిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నివేదిక అంశాల్ని పరిశీలిస్తే.. 1. దేశంలోని 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వార్షిక సరాసరి ఆదాయం 24.59 లక్షలు.. 2. దక్షిణ భారతదేశంలో 711 మంది ఎమ్మెల్యేల గరిష్టంగా ఒక్కొక్కరు 51.99 లక్షలు ఆర్జిస్తున్నారు. 3. తూర్పు ప్రాంతంలోని 614 మంది ఎమ్మెల్యేలు సరాసరి ఒక్కొక్కరు 8.53 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నారు. 4. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలోని 203 మంది ఎమ్మెల్యేలు సరాసరిన ఏడాదికి రూ. 1.12 కోట్లు ఆర్జిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు. 5. ఆ తర్వాతి స్థానంలో మహరాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 43.4 లక్షల సంపాదిస్తూ రెండో స్థానంలో ఉన్నారు. 6. ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు అతితక్కువ ఆదాయం పొందుతున్నట్లు ఏడీఆర్ సర్వే విశ్లేషించింది. ఆ రాష్ట్రంలో 63 మంది ఎమ్మెల్యేల ఆదాయాల్ని విశ్లేషించగా.. ఒక్కొక్కరు సగటును రూ. 5.4 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేల ఆదాయం రూ. 7.4 లక్షలు. 7. ఆదాయార్జనలోను లింగ వివక్ష స్పష్టంగా కనిపించింది. మహిళా ఎమ్మెల్యేల కంటే పురుష ఎమ్మెల్యేల ఆదాయం రెండు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పురుష ఎమ్మెల్యేల వార్షికాదాయం 25.85 లక్షలుగా ఉండే మహిళా ప్రజాప్రతినిధుల ఆర్జన కేవలం రూ. 10. 53 లక్షలే. మొత్తం 3,145 మందికిగాను 55 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లో వృత్తి వివరాలు పేర్కొనలేదు. ఇక వ్యాపారాన్ని 777 మంది, వ్యవసాయాన్ని 758 మంది తమ వృత్తిగా పేర్కొన్నారు. 1,052 మంది విద్యార్హత 5 నుంచి 12వ తరగతి వరకూ పేర్కొనగా వారి వార్షికాదాయం 31 లక్షలుగా ఉంది. 1,997 మంది విద్యార్హతను డిగ్రీగా పేర్కొనగా వారి ఆదాయం 20.87 లక్షలు. 134 మంది ఎమ్మెల్యేల విద్యార్హత 8వ తరగతి కాగా.. వారి ఆదాయం 89.88 లక్షలు. -
స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
న్యూఢిల్లీ: అత్యాచారాలు సహా మహిళలపై అనేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న 48 మంది ప్రస్తుతం దేశంలోని వివిధ చట్టసభల్లో దర్జాగా సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచే 12 మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే ప్రమాణ పత్రాల్లోని కేసులను విశ్లేషించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎన్నికల సంస్కరణల కోసం శ్రమిస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ మొత్తం 4,845 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన మీదట ఓ నివేదికను తయారుచేసింది. నేరాలకు పాల్పడి చట్టసభల్లో కూర్చుంటున్న ఈ 48 మందిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, మిగిలిన 45 మంది వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 12 మంది, పశ్చిమ బెంగాల్లో 11 మంది, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో చెరో 5 మందితో కలిపి 48లో మొత్తం 33 మంది ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. పార్టీల వారీగా అయితే ఈ 48 మందిలో బీజేపీకి చెందినవారు 12 మంది, శివసేన పార్టీ వారు ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు కలిపి ఈ మూడు పార్టీల నుంచే 25 మంది ఉన్నారు. తీవ్ర నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో నిర్ణీత సమయంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నేరం రుజువైతే వారి సభ్యత్వాలను రద్దుచేయడం తదితర సంస్కరణలను ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. అన్ని పార్టీలూ నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నాయనీ, గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 327 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. -
కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
► ఆస్తుల సగటులోనూ ఏపీ మంత్రులదే మొదటి స్థానం ► మంత్రులపై క్రిమినల్ కేసుల్లో మూడోస్థానంలో తెలంగాణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై ఓ సంస్థ చేసిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలపై విశ్లేషణ జరిపిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలు తెలిపింది. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్(రూ. 251 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ. 45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర(రూ. 31.67 లక్షలు)గా నిలిచింది. 34 శాతం రాష్ట్రాల మంత్రులు (210 మంది)లపై క్రిమినల్ కేసులున్నాయి. 113 మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్ర కేసులున్నాయి. ఈ జాబితాలో 18మంది మంత్రులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, బిహార్(11), తెలంగాణ(9), జార్ఖండ్ (9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 609 మందిలో 51 మంది మహిళా మంత్రులుండగా.. వీరిలో అత్యధికం మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచే ఉన్నారు. అటు కేంద్ర మంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులుండగా.. సగటు ఆస్తి రూ. 12.94 కోట్లుగా వెల్లడైంది. -
కేరళ ఎన్నికల బరిలో 311 మంది నేరచరితులు
న్యూఢిల్లీ: కేరళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 202 మంది కోటీశ్వరులున్నారు. 311 మంది తమపై నేర కేసులున్నట్లు ప్రకటించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక గురువారం ఈ వివరాలు వెల్లడించింది. పోటీలో ఉన్న 1203 అభ్యర్థుల్లో 1125 మంది స్వీయ ధృవీకరణ పత్రాలను విశ్లేషించింది. మే16న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఏడీఆర్ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు: కోటీశ్వరుల్లో 43 ఐఎన్‌సీ, 24 సీపీఎం, 18 బీజేపీ, 18 భారత్ ధర్మ జనసేన, ఇద్దరు ఏఐఏడీఎంకే, 17 ఐయూఎంఎల్ అభ్యర్థులున్నారు. 30 మంది స్వతంత్రుల ఆస్తులు కోటిపైనే ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించారు.అభ్యర్థుల సగటు ఆస్తులు 1.28 కోటు.్ల నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో 72 మంది సీపీఎం, 42 బీజేపీ,37 ఐఎన్‌సీ, 15 సీపీఐ, 25 ఎస్పీడీఐ అభ్యర్థులున్నారు. 834 మంది ఆదాయ వివరాలు వెల్లడించలేదు. 669 మంది విద్యార్హతలు 5 నుంచి 12 తరగతుల మధ్య ఉన్నాయి. 380 అభ్యర్థులు డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హతలున్నట్లు ప్రకటించారు. 29 మందికి చదవడం, రాయడం మాత్రమే వచ్చు. ఏడుగురు నిరక్షరాస్యులున్నారు. 104 మంది మహిళలు బరిలో ఉన్నారు. -
జాతీయ పార్టీలకు రూ.622.38 కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో విరాళాలు అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీలకు రూ.20 వేలకు పైగా వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలకు వచ్చిన విరాళాల వివరాలు ఇందులో పేర్కొంది. అన్నిజాతీయ పార్టీలకు కలిపి మొత్తం 1,695 విరాళాలు అందగా, వాటి విలువ రూ. 622.38 కోట్లు. ఈ రేసులో సహజంగానే అధికార బీజేపీ ముందంజలో ఉంది. ఆ పార్టీకి రూ. 437.35 కోట్ల విరాళాలు వచ్చాయి. గత పదేళ్లుగా బీఎస్పీకి వస్తున్న విరాళాలను వెల్లడిస్తున్నా, ఈ ఆర్థిక సంవత్సరానికి తమకు రూ. 20 వేల పైన విరాళాలు ఏవీ అందలేదని ఆ పార్టీ తెలిపింది. జాతీయ పార్టీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలు పార్టీలు విరాళాల సంఖ్య రూ. కోట్లలో బీజేపీ 1234 437.35 కాంగ్రెస్ 280 141.46 ఎన్సీపీ 52 38.82 సీపీఎం 74 3.42 సీపీఐ 55 1.33 2013-14 ఆర్థిక సంవత్సరంతో 2014-15 ఆర్థిక సంవత్సరం పోల్చితే అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. పార్టీలు 2013-14 2014-15 బీజేపీ 170.86 437.35 ఐఎన్‌సీ 59.58 141.46 ఎన్సీపీ 14.02 38.82 సీపీఎం 2.09 3.42 సీపీఐ 1.22 1.33 రెండు పార్టీలకూ ఆ కంపెనీల విరాళాలు కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఇస్తాయి. బీజేపీకి సత్యా ఎలక్టొరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 107.25 కోట్లు, జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 63.02 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ 54.01 కోట్లను, సత్యా ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భారతీ గ్రూప్ రూ 18.75 కోట్లను విరాళాలుగా ఇచ్చాయి. -
ఆ ఎమ్మెల్యేల్లో నేర చరితులే ఎక్కువ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది నేర చరిత్ర ఉన్నవారని ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, వారిలో 142 మంది(58 శాతం)ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు బిహార్ ఎన్నికలపై అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ఆ ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడడం వంటి కేసులు నమోదైనట్లు సమాచారం. క్రిమినల్ చేష్టలకు పాల్పడినందుకు 70 మంది ఎమ్మెల్యేలపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలపై హత్య, హత్యాచారం కేసులున్నాయి. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన 228 ఎమ్మెల్యేలపై సర్వే చేయగా 76 మంది(33 శాతం)ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గతంలోనే వెల్లడైంది. కొత్తగా ఎన్నికైన ప్రతి నలుగురిలో ఒకరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. -
'ఎంపీ కావడానికి 40.30 లక్షలు ఖర్చు చేశారు'
న్యూఢిల్లీ : దేశంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బుల మీదే నడుస్తుంది. ఓ మాటలలో చెప్పాలంటే డబ్బు అనే పదం ఎన్నికల పర్యాయపదంగా మారింది. అయితే ఇటీవల జరిగిన16వ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన లోక్‌సభ అభ్యర్థులు ... వారు విజయం సాధించే క్రమంలో ఒక్కోక్కరు సగటున రూ. 40.3 లక్షలు ఖర్చు చేశారని నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్యూ), అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 537 మంది ఎంపీలుగా ఎన్నికైన నేపథ్యంలో వారు జామా ఖర్చులపై అందించిన నివేదిక ఆధారంగా ఆ సంస్థలు ఈ మేరకు తెలిపింది. బీజేపీకి చెందిన 277మంది ఎంపీలు ఎన్నికల కోసం 40.18 లక్షలు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎంపీలు 40.16 లక్షలు ఖర్చు చేసి రెండ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాలు వరుసగా ... ఏఐఏడిఎంకే 37 మంది ఎంపీలు ఒక్కొక్కరు 30.5 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 34 మంది 40.6 లక్షల ఖర్చుతో తర్వాత స్థానాన్ని ఆక్రమించారు. కాలిబోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ్ గోగోయి 80.2 లక్షలు ఖర్చు చేశారు. గుజరాత్‌లోని బరూచ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన మన్సుఖ్ భాయ్ దంచీభాయ్ వసావా, అలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా 60.7 లక్షలు ఖర్చు చేసి ఆ తర్వాత వరుస స్థానాలలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన అశోక్ గజపతిరాజు రూ.39,369 ఖర్చు చేసి అత్యల్పంగా ఖర్చు చేసిన ఎంపీల జాబితాలో నిలిచారు. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్... నుంచి లోక్‌సభ బరిలో దిగే అభ్యర్థులకు రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షలకు అలాగే చిన్న రాష్ట్రాలైన గోవా... నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు 20.2 లక్షల నుంచి 50.4 లక్షలకు ఈ ఏడాదే పెంచిన సంగతి తెలిసిందే. -
క్రిమినల్ కేసుల్లో 53 మంది ఎంపీలు
* 24 మంది బీజేపీ, ఐదుగురు శివసేన సభ్యులపై అభియోగాలు * ఏడీఆర్ వెలువరించిన జాబితాలో ఒవైసీ, బాల్క సుమన్ పేర్లు సాక్షి, న్యూఢిల్లీ: పదహారవ లోక్‌సభకు ఎన్నికైన 541 మందిలో సభ్యుల్లో 53 మందిపై వివిధ నేరాభియోగాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (1), సెక్షన్ 8 (3) కింద ఈ అభియోగాలు నమోదైనట్టు తమ పరిశీలనలో తేలిందని ఏడీఆర్ వెల్లడించింది. అభియోగాలున్న వారంతా దోషులుగా తేలితే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హులవుతారని పేర్కొంది. నేరాభియోగాలు ఉన్న సభ్యుల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, బీజేపీ ఎంపీలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ కూడా ఉన్నారని ఏడీఆర్ స్పష్టం చేసింది. ఏడీఆర్ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ జగదీప్ చొక్కర్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు తెలిపారు. - అభియోగాలున్న సభ్యులనుంచి పార్లమెంటుకు విముక్తి కల్పించేందుకు, పెండింగ్ కేసులను ఏడాదిలోపు తేల్చేయాలంటూ సుప్రీంను కోరదామంటూ ప్రధాని మోడీ ఇటీవలే పిలుపు ఇచ్చారని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని జగదీప్ చొక్కర్ గుర్తుచేశారు. క్రిమినల్ కేసులున్న 53 మంది సభ్యుల్లో 23మంది తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనవారని తెలిపారు. - {పజాప్రాతినిధ్య చట్టం కింద నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ ఎంపీలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహేశ్ గిరి, నళిన్ కుమార్ ఖతిల్, సురేష్ అంగాడి, గణేశ్ సింగ్, ఎన్సీపీ ఎంపీ ప్రతాప్ సిన్హా భోంస్లే, పీఎంకే ఎంపీ ఎ.రాందాస్ ఉన్నారన్నారు. - అభియోగాలున్న వారి జాబితాలో 24 మంది బీజేపీ సభ్యులు, ఐదుగురు శివసేన సభ్యులు ఉన్నారు. తృణమల్ నుంచి నలుగురు, ఏఐఏడీఎంకే, ఆర్జేడీల నుంచి ముగ్గురేసి సభ్యులు, సీపీఎంనుంచి ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్, జేఎంఎం, ఎల్జేపీ, ఎన్సీపీ, పీఎంకే, ఆర్ఎస్పీ, బీజేడీ, ఎంఐఎం, స్వాభిమాన్ పక్ష, టీఆర్ఎస్ పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారని జగదీప్ చొక్కర్ చెప్పారు. - తెలంగాణలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై ఉన్న కేసులతో వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉందన్నారు. -
మోడీది.. కోటీశ్వరుల కేబినెట్
* కోట్లకు పడగలెత్తిన 40 మంది అమాత్యులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కోటీశ్వరులతో నిండిపోయింది. ప్రధాని సహా మొత్తం 46 మంది అమాత్యులున్న కేబినెట్లో 40 మంది రూ. కోట్లకు పడగలెత్తగా కేవలం నలుగురు మాత్రమే లక్షాధికారులుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న సంపదల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన అరుణ్ జైట్లీ సహా మంత్రులు గోపీనాథ్ ముండే, మేనకా గాంధీ, పీయూష్ గోయల్ ఇలా 40 మంది మంత్రి వర్యులు కోటీశ్వరులేనని ఏడీఆర్ పేర్కొంది. కాగా, ధాంజీభాయి వాసవ రూ.65 లక్షలు, థావర్‌చంద్ గెహ్లాట్ రూ.86 లక్షలు, సుదర్శన్ భగత్ రూ.90 లక్షలు, రాం విలాస్ పాశ్వాన్ రూ.96 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారని వివరించింది. ఇక, మరో ఇద్దరు మంత్రులు ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్‌లు ఏ సభకూ ఎన్నిక కాకపోవడంతో వీరి ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. -
ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులే!
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ), అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో వెల్లడైంది. మొత్తం 543 ఎంపీలకు 541 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను న్యూ, ఏడీఆర్ పరిశీలించాయి. వారిలో 186 మందిపై (మొత్తం ఎంపీల్లో 34 శాతం మంది) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ 186 మంది ఎంపీల్లో 112 మంది (21 శాతం మంది)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. పార్టీలవారీగా చూస్తే బీజేపీ నుంచి ఎన్నికైన 281 మంది ఎంపీల్లో 98 మంది (35 శాతం మంది) ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. అలాగే శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 15 మంది, 44 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 8 మంది, 34 మంది తృణమూల్ ఎంపీల్లో ఏడుగురు, 37 మంది అన్నాడీఎంకే ఎంపీల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 30 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 34 శాతానికి పెరిగింది. -
కౌన్ బనేహై కరోడ్ పతి?
పార్టీలు ఏవైనా ఈసారి మాత్రం మన రాష్ట్రంలో పోటీ చేస్తున్న రాజకీయ అభ్యర్ధుల ఆస్తులు మాత్రం 5 రెట్లు పెరిగాయి. ఒకరు కారు, ఇద్దరు కారు.... ఏకంగా 74 మంది కోటీశ్వర్లు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ జారీ చేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న మొత్తం 265 మంది రాజకీయ నాయకుల్లో 74 మంది నాయకులు కోటీశ్వరులు. అంతేకాదు, రాజకీయ నాయకుల సంపద ఏ ఏడాదికాఏడాది భారీగా పెరుగుతోంది. కోటీశ్వరులైన రాజకీయ నాయకుల సంఖ్య 2009 తో పోలిస్తే 20 శాతం నుంచి 28శాతంకు పెరిగింది. 2009లో కోటీశ్వరులుగా ఉన్న రాజకీయ నాయకులు సగటు ఆస్తులు 2.50 కోట్లుగా ఉంటే ఇపుడు అవి 8.49 కోట్లకు పెరిగాయని ఏడీఆర్ తెలిపింది. రాష్ట్రంలో ఎక్కువ మంది కోటీశ్వరులు టిడిపి లోనే ఉన్నారు. టీడీపీలో పోటీ చేస్తున్న 89 శాతం మంది కోటీశ్వరులే . ఇక రెండో స్ధానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులున్నారు. టీఆర్ ఎస్ తరఫున పోటీ దారుల్లో 82 శాతం మంది కోటీశ్వరులే . ఆ తరువాత స్ధానంలో 81శాతం కోటీశ్వరులు కాంగ్రెస్ లో ఉన్నారు. చివరకు కామన్ మ్యాన్ పోటీ చేస్తారని చెపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోనూ 50 శాతం మంది పోటీదారులు కోటికి మించి ఆదాయం ఉన్నవారే కావడం విశేషం. ఇక క్యాండెట్ల వారిగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొండావిశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 528 కోట్లు. రెండో స్థానంలో టిడిపికి చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 338 కోట్లు . ఇక మూడో రిచెస్ట్ అభ్యర్ధి కాంగ్రెస్ కి చెందిన జి వివేక్. ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 266కోట్లు. వివిధ పార్టీలకు చెందిన దాదాపుగా ఆరుగురు అభ్యర్ధుల ఆస్తుల విలువ వందేసి కోట్లు. తక్కువ ఆస్తులు ఉన్న పార్టీలలో 13 మంది వైఎస్సార్ సిపికి చెందిన వారు. వారి సరాసరి ఆస్తుల విలువ 4.29 కోట్లు. కాగా ఎనిమిది మంది బిజెపి అభ్యర్ధుల విలువ సరాసరిన 29.73 కోట్లు. ఇక ఆఫిడవిట్ సమర్పించిన వారిలో ఆన్కంటాక్స్ వివరాలు ప్రకటించని వారిశాతం 51కాగా 23శాతం మంది ప్యాన్ కార్డ్ వివరాలు అందించలేదు. -
'నాపై వ్యభిచారం కోసం మైనర్ ను కొనుగోలు చేసిన కేసుంది'
నేరచరిత్ర ఉన్న నేతలు ఎన్నికల్లో ఉండటం కొత్తేమీ కాదు. అయితే ఈ సారి పోటీలో ఉన్న వారిలో కొందరిపై ఉన్న కేసులు కంగారుపుట్టిస్తున్నాయి. బీహార్ లోని పూర్ణియా నుంచి లోకసభకు పోటీ చేస్తున్న సీపీఐఎంఎల్ అభ్యర్థి పంకజ్ కుమార్ సింగ్ పై వ్యభిచారం చేయించేందుకు మైనర్ బాలికను కొనుగోలు చేసినట్టు కేసుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 373 ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆయన తన అఫిడవిట్ లోనూ పేర్కొన్నారు. కన్యా కుమారి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్ పి ఉదయకుమార్ పై 382 క్రిమినల్ కేసులున్నాయి. హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఆయన కేసుల జాబితాకి పలు పేజీలు కేటాయించాల్సి వచ్చింది. ఆయనపై 19 హత్యాయత్నం కేసులు, 16 దేశద్రోహ కేసులు, 5 దొంగతనం కేసులు, మూడు దోపిడీ కేసులు ఉన్నాయి. ఇంకో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎం పుష్పరాయన్ తమిళనాడు తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై 380 కేసులున్నాయి. ఆరవ విడత లోకసభ పోలింగ్ కు వెళ్తున్న అభ్యర్థుల్లో మొత్తం 11 మంది అభ్యర్థులపై మహిళల వేధింపు కేసులున్నాయి. అందులో పంకజ్ కుమార్ సింగ్ ఒకరు. ఈ దశలో పోటీలో ఉన్న మొత్తం 2071 మందిలో 321 మంది అభ్యర్థులు నేరచరితులు. వీరిలో 204 మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. 11 మgదిపై హత్య కేసులున్నాయి, మరో 40 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. -
కేసులు, కాసులు ఉంటేనే ఎంపీ సీట్లు
గూండాయిజం, నేరచరిత్ర, దౌర్జన్యం ... ఈ మూడూ ఉంటే చాలు యూపీలో రాజకీయంలో రాణించవచ్చు. ఎన్నికల సంస్కరణలకోసం పొరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోటీశ్వరులైనా అయి ఉండాలి లేదా బోలెడన్ని క్రిమినల్ కేసులైనా ఉండాలి. యూపీలో ఏప్రిల్ 24 న 12 లోకసభ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్ లో 168 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 27 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయిని పేర్కొన్నారు. 58 మంది కోటీశ్వరులు. నేర చరిత్ర ఉన్న 27 మందిలో 19 మందిపై హత్యానేరం కేసులు ఉన్నాయి. వీరిలో బిఎస్ పీ కి చెందిన వారు ఏడుగురు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు అయిదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిల అభ్యర్థుల్లో చెరి ముగ్గురు నేరచరితులు ఉన్నారు. ఇక స్వచ్ఛమైన రాజకీయాలు, నేర రహిత రాజకీయాల గురించి మాట్లాడే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక నేరచరితుడికి టికెట్ ఇచ్చింది. కోటీశ్వరుల విషయంలోనూ బిఎస్ పీ దే పై చేయి. బిఎస్ పీ తరఫున 12 మంది, బిజెపి తరఫున 11 మంది, కాంగ్రెస్ తరఫున నలుగురు, ఆమ్ ఆద్మీపార్టీ తరఫున అయిదుగురు కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. మథుర నియోజకవర్గంలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న నటి హేమమాలిని తన ఆస్తి 178 కోట్లుగా పేర్కొన్నారు. -
వస్తున్నదెంత? ఇస్తున్నదెంత?
' పార్టీలకు వస్తున్నదెంత? ' అభ్యర్థులకు ఇస్తున్నదెంత? ' వారికి నిజానికి ముట్టుతున్నదెంత? ' వాళ్లు లెక్కచెప్పుతున్నదెంత? ' అసలు లెక్కెంత? అందులో తిక్కెంత? ఇచ్చిన డబ్బు, ముట్టిన డబ్బు ఒకటిగా ఉండకపోతే లెక్క తప్పినట్టే. అంటే ఏదో తిరకాసు ఉన్నట్టే. తమ అభ్యర్థికి పార్టీలు ఇచ్చామని చెబుతున్న మొత్తం, తనకు ముట్టిందని అభ్యర్థి చెబుతున్న మొత్తం ఒకటి కాకపోతే... ఎన్నికల ఖర్చుల లెక్కల్లోనే తిరకాసు ఉన్నట్టే. పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు లెక్కలు మ్యాచ్ కావడం లేదు. వారి ఖర్చుల స్టేట్ మెంట్లు చెబుతోంది ఇదే. ప్రణబ్ దా - పదిహేను లక్షలు - ఎన్నికల్లో పారదర్శకత, అవినీతి రహిత సంస్కరణల కోసం పోరాడుతున్న అహ్మదాబాద్ కి చెందిన అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ జరిపిన అధ్యయనంలో ఈ విషయమే వెలుగు చూసింది. 2009 ఎన్నికల ఖర్చుల లెక్కల ప్రకారం అభ్యర్థులకు పార్టీ నుంచి పొందినది 7.46 కోట్లు. కానీ పార్టీలు తాము అభ్యర్థులకు ఇచ్చామని చెబుతున్నది 14.19 కోట్లు. మరి మిగతా ఏడు కోట్లు ఏమైనట్టు. కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే - ఈ లెక్కల గజిబిజి గందరగోళంలో జాతీయ పార్టీలన్నీ భాగస్వాములే. కాంగ్రెస్ కి చెందిన 123 మంది అభ్యర్థుల వ్యయపత్రాలను ఏడీఆర్ పరిశీలించింది. వీరిలో 81 మంది తమకు పార్టీ నుంచి ఒక్క పైసా రాలేదని చెప్పారు. వీరిలో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నారు. అయితే ప్రణబ్ దాకి పదిహేలు లక్షలు ఇచ్చినట్టు పార్టీ ఖాతాలో ఉంది. మరి ఈ మొత్తం ఏమైనట్టు? ఆ సొమ్ములు ఏమైనట్టు?: ఇక కాంగ్రెస్ నాయకత్వం 33 మంది కేంద్ర మంత్రులకు 3.45 కోట్లు ఇచ్చినట్టు లెక్కల్లో చూపించింది. కానీ వీరిలో 22 మంది మంత్రులు తమకు పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పారు. మరి సొమ్ములు ఏమైనట్టు? ఇక బిజెపి సంగతికొస్తే పార్టీ మా అభ్యర్థులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వ్యయపత్రంలో తెలిపింది. కానీ ఆ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలు తమకు పార్టీ నుంచి నిధులు అందాయని తమ వ్యయపత్రాల్లో లెక్కలు చూపించారు. ఆ మొత్తం 2.75 కోట్ల రూపాయలు. పార్టీ ఇవ్వని డబ్బులు అభ్యర్థులకు ఎలా చేరాయి? కిరణ్ పార్టీకి ఎంతో సౌకర్యం: ఇంకా తమాషా ఏమిటంటే గుర్తింపులేని పార్టీలకు ఈ ఖర్చుల లెక్కలు చూపించాల్సిన అవసరమే లేదు. అంటే మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీకి తమ తమ అభ్యర్థులకు ఎంత డబ్బిచ్చారో చెప్పనవసరం లేదు. అలాగే పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేయడం లేదు. క్యాష్, చెక్, డీడీ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ వంటి వివిధ పద్థతుల్లో ఇస్తున్న విరాళాల వివరాలేవీ పార్టీలు ఎన్నికల సంఘానికి చెప్పడం లేదు. కాబట్టి వస్తున్నదెంత? ఇస్తున్నదెంత? ముట్టుతున్నదెంత? లెక్క చెప్పుతున్నదెంత? ఈ విషయంలో మరింత పారదర్శకత కావాలంటోంది అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్. -
ఎలక్షన్ ఇండియా
ఇది ఎన్నికల కాలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతూంటే... ఇతర రాష్ట్రాలు సార్వత్రిక ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. ఎవరికి ఓటేయాలి? ఏ పార్టీకి విజయం కట్టబెట్టాలన్న యోచనలో ఓటరు ఉన్నాడు. వీరి పని కొంత సులువు చేసే లక్ష్యంతో అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రీఫార్మ్స్ ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. ‘ఎలక్షన్ ఇండియా’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల పుట్టుపూర్వోత్తరాలతోపాటు ఆయా పార్టీల ముఖ్యనేతల వివరాలనూ అందుబాటు లో ఉంచింది. ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై వ్యాఖ్యానించేందుకు, అవ్యవహారాలేమైనా జరుగుతూంటే ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేసే ఏర్పాట్లూ చేశారీ అప్లికేషన్లో. రాజకీయ పార్టీలపై మీదైన విశ్లేషణలను ప్రచురించడంతోపాటు, ఇతరుల అభిప్రాయాలను, విశ్లేషణలను తెలుసుకునేందుకూ వీలుంది. 1952 మొదలుకొని తాజా సార్వత్రిక ఎన్నికల వరకూ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? పడ్డ ఓట్లు ఎన్ని? తదితర వివరాలూ ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మీరు ఏ పార్టీకి ఓటేయదలుచుకున్నారో ‘మాక్ ఓటింగ్’ ద్వారా చెప్పవచ్చు. వీటి ఫలితాలు రాష్ట్రాలు, పార్టీల వారీగానూ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇలాంటివే మరికొన్ని... గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నికలకు సంబంధించి మరికొన్ని అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ‘ఓట్ ఫర్ ఇండియా’, ‘ఇండియన్ ఎలక్షన్స్ 2014’, ‘ఇండియా ఎలక్షన్స్ 2014’, ‘ఈసీ ఓటర్’ వంటివి మచ్చుకు కొన్ని. ‘ఎలక్షన్ వాచ్ రిపోర్టర్’ అప్లికేషన్ ద్వారా ఎన్నికల సందర్భంగా జరిగే అవ్యవహారాలను రిపోర్ట్ చేసే ఉద్దేశంతో అభివృద్ధి చేశారు. జీపీఎస్ సాయంతో ఎక్కడ అవ్యవహారాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేయగలగడం, డబ్బు, మద్యం పంపిణీ, కోడ్‌ను ఉల్లంఘించే పోస్టర్లు వంటి ఎనిమిది వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. -
బరిలో నేరచరితులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 55 మందికి నేర చరిత్ర ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కర్ణాటక ఎలక్షన్ వాచ్‌లు పేర్కొన్నాయి. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థల రాష్ట్ర కో-ఆర్డినేటర్లు ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి, హరీశ్ నరసప్ప, వాసుదేవ శర్మ, కాత్యాయిని చామరాజ్, రవి జయరామయ్యలు మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా సమర్పించిన స్వీయ అఫిడవిట్ల ఆధారంగా వారి నేర చరిత్ర, ఆర్థిక, ఇతర నేపథ్య వివరాలను విశ్లేషించినట్లు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 434 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఇద్దరి అఫిడవిట్లు లభ్యం కాలేదని తెలిపారు. 30 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని వెల్లడించారు. పార్టీల పరంగా కాంగ్రెస్‌లో ఆరు గురు, బీజేపీలో తొమ్మిది మంది, జేడీఎస్‌లో ఎనిమిది మంది, 194 మంది ఇండిపెండెంట్లకు గాను 14 మందిపై క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రమోద్ ముతాలిక్‌పై హత్యా యత్నం కేసులు ఉన్నాయని అఫిడ్విట్లలో పేర్కొన్నట్లు తెలిపారు. కోటీశ్వరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 118 మంది కోటీశ్వరులున్నారు. కాంగ్రెస్‌లో 27 మంది, బీజేపీలో 26 మంది, జేడీఎస్‌లో 21 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో 12 మంది రూ.కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. బెంగళూరు దక్షిణ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నందన్ నిలేకణి రూ.7,710 కోట్ల ఆస్తులు, బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న జేడీఎస్ అభ్యర్థి ఆర్. ప్రభాకర రెడ్డి రూ.224 కోట్లు, బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి వీ. బాలకృష్ణన్ రూ.189 కోట్ల ఆస్తులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బీదర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి మీర్జా షఫీ బేగ్, బళ్లారిలో బీఎస్పీ అభ్యర్థి రాముడు, హావేరిలో సర్వ జనతా పార్టీ అభ్యర్థి బసవెంతప్ప హొన్నప్ప హుల్లట్టి, ఉడిపి-చిక్కమగళూరులో స్వతంత్ర అభ్యర్థి జీ. మంజునాథలు తమకు ఆస్తులే లేవని ప్రకటించారు. మండ్యలో భారతీయ డాక్టర్ అంబేద్కర్ జనతా పార్టీ అభ్యర్థి కే. మహదేవప్పకు రూ.500, బెంగళూరు సెంట్రల్లో ఇండిపెండెంట్ డీ. ఆంబ్రోస్కు రూ.575, కోలారులో స్వతంత్ర అభ్యర్థి ఎంఎస్. నారాయణ స్వామికి రూ.వెయ్యి విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయట. ఇక అప్పుల విషయానికొస్తే...ఆర్. ప్రభాకర రెడ్డి రూ.221.80 కోట్లు, చిక్కబళ్లాపురం జేడీఎస్ అభ్యర్థి హెచ్డీ. కుమారస్వామి రూ.72.96 కోట్లు, బెల్గాం బీజేపీ అభ్యర్థి సురేశ్ అంగడి రూ.36.62 కోట్లుగా చూపారు. 255 మంది అభ్యర్థులు ఆదాయ పన్ను వివరాలను వెల్లడించలేదు. ఆరుగురు నిరక్షరాస్యులు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఆరుగురు నిరక్షరాస్యులు కాగా 190 మంది పీయూసీ లేదా అంతకన్నా తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. 217 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతతో ఉన్నారు. 25-50 ఏళ్ల వయసు వారు 261 మంది పోటీలో ఉండగా, 51-70 ఏళ్ల వారు 150 మంది, 71-80 ఏళ్ల వారు 17 మంది బరిలో నిలిచారు. ఎనభై ఏళ్లు పైబడిన ఓ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు. మహిళలు 20 మంది రంగంలో ఉన్నారు. రెడ్ అలర్ట్ నియోజక వర్గాలు బెంగళూరు సెంట్రల్లో ఐదుగురు, ధార్వాడ, బెల్గాం, బళ్లారి, కొప్పళ నియోజక వర్గాల్లో నలుగురేసి, బీదర్, బిజాపుర, చిక్కోడిలలో ముగ్గురు చొప్పున నేర చరితులు పోటీలో ఉన్నారు. పెరిగిన ఎంపీల ఆస్తులు ఈ ఎన్నికల్లో 21 మంది సిట్టింగ్‌లు తిరిగి పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలప్పుడు వారి సగటు ఆస్తుల విలువ రూ.6.82 కోట్లు కాగా ప్రస్తుతం రూ.20.50 కోట్లకు ఎగబాకింది. అంటే..ఈ ఐదేళ్లలో ఒక్కొక్కరికి సగటున రూ.13.67 కోట్ల ఆస్తులు పెరిగాయి. ఆస్తుల వృద్ధి 200 శాతంగా నమోదైంది. 2009లో కుమారస్వామి రూ.49 కోట్ల ఆస్తులను చూపించగా, ఇప్పుడు రూ.167 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పీసీ. మోహన్ (బెంగళూరు సెంట్రల్) ఆస్తులు రూ.5 కోట్ల నుంచి రూ.47 కోట్లకు, జీఎస్. బసవరాజు (తుమకూరు) ఆస్తులు రూ.5 కోట్ల నుంచి రూ.27 కోట్లకు, సురేశ్ అంగడి ఆస్తులు రూ.22 కోట్ల నుంచి రూ.41 కోట్లకు పెరిగాయి.