సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల సేకరణలో అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందంజలో ఉంది. భారత రాజకీయాల్లో సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్లు, ప్రత్యక్ష కార్పొరేట్ విరాళాలు సహా ఇతర విరాళాల ద్వారా మొత్తంగా ఆరేళ్లలో రూ.10,122 కోట్లు బీజేపీకి వచ్చాయి.
బీజేపీ ప్రకటించిన మొత్తం విరాళాలు ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విరాళాల రూపంలో రూ.1547.439 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.823.301 కోట్లు, సీపీఐ(ఎం) రూ.367.167 కోట్లు, ఎన్సీపీ రూ.231.614 కోట్లు సేకరించాయి.
ప్రాంతీయ పార్టీల్లో బీజేడీ
తీయ పార్టీల జాబితాలో బిజు జనతాదళ్ (బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్లు విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణరాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్ రూ.476.89 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు, వైఎస్‌ఆర్‌సీపీ రూ.456.20 కోట్లు, శివసేన రూ.267.90 కోట్లు, ఆప్ రూ.169.70 కోట్లు, టీడీపీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి.
చదవండి: ఆ తేనేలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..
Comments
Please login to add a commentAdd a comment