అదానీతో లింకులపై ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు లేవు: రాహుల్
న్యూఢిల్లీ: సన్నిహితులైన వ్యాపారవేత్తలతో ఉన్న లింకులపై ప్రశ్నలకు, ఎలక్టోరల్ బాండ్లను దురి్వనియోగం చేయడంపై సమాధానాలు చెప్పుకోలేరు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ సీట్లలో కూటమిని గెలిపించాలని పిలుపిచ్చారు.
ఆసక్తికరమైన విషయమేమింటే నేను ఆప్‌కు ఓటేస్తాను, కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు ఓటేస్తారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల పాత్రికేయులకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ తనతో చర్చకు మాత్రం రారని, ఎందుకంటే తన ప్రశ్నలకు సమాధానమివ్వలేనని మోదీకి తెలుసన్నారు. అదానీ– అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ డబ్బు ముట్టిందని ప్రధాని ఆరోపిస్తారు.. కానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం మాత్రం చేయరు అని ఎద్దేవా చేశారు.
‘ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధాని మోదీతో చర్చకు నేను సిద్ధమే. ఆయన రారని నాకు తెలుసు. ఆయన్ను నేనడిగే తొలి ప్రశ్న.. అదానీతో మీకున్న బంధుత్వమేమిటి? రెండో ప్రశ్న... బీజేపీకి అందిన ఎలక్టోరల్ బాండ్ల గురించి’ అని రాహుల్ వివరించారు. మోదీ, రాహుల్‌లు చర్చ చేయాలని ఇద్దరు మాజీ జడ్జిలు, మాజీ సంపాదకుడు ఎన్.రామ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈడీæ అధికారులు అలసిపోయే దాకా 55 గంటల పాటు వారు నన్ను ఇంటరాగేట్ చేసేలా బీజేపీ చేసింది. నా ఇంటిని (ఎంపీ క్వార్టర్‌ను) లాగేసుకున్నారు. నాకు మీ క్వార్టర్ అవసరం లేదని.. మొత్తం దేశమే నా ఇల్లని వారికి చెప్పానని రాహుల్ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీలో చేరుతున్న వారిపై మాట్లాడుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని, పిరికిపందలు తమకు అక్కర్లేదని చెప్పారు. సీబీఐ, ఈడీ దాడులను భయపడి లొంగిపోయే వారు తమకు అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment