discus
-
డిస్కంలలో 3,260 కొత్త కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 2,212 జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్), 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్ల (ఎలక్ట్రికల్, సివిల్)తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 600 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో తెలిపాయి.2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. కాగా, ఐటీఐ చేసిన వారు జేఎల్ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్, బీఈ/బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం. -
Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
న్యూఢిల్లీ: సన్నిహితులైన వ్యాపారవేత్తలతో ఉన్న లింకులపై ప్రశ్నలకు, ఎలక్టోరల్ బాండ్లను దురి్వనియోగం చేయడంపై సమాధానాలు చెప్పుకోలేరు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ సీట్లలో కూటమిని గెలిపించాలని పిలుపిచ్చారు. ఆసక్తికరమైన విషయమేమింటే నేను ఆప్‌కు ఓటేస్తాను, కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు ఓటేస్తారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల పాత్రికేయులకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ తనతో చర్చకు మాత్రం రారని, ఎందుకంటే తన ప్రశ్నలకు సమాధానమివ్వలేనని మోదీకి తెలుసన్నారు. అదానీ– అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ డబ్బు ముట్టిందని ప్రధాని ఆరోపిస్తారు.. కానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం మాత్రం చేయరు అని ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధాని మోదీతో చర్చకు నేను సిద్ధమే. ఆయన రారని నాకు తెలుసు. ఆయన్ను నేనడిగే తొలి ప్రశ్న.. అదానీతో మీకున్న బంధుత్వమేమిటి? రెండో ప్రశ్న... బీజేపీకి అందిన ఎలక్టోరల్ బాండ్ల గురించి’ అని రాహుల్ వివరించారు. మోదీ, రాహుల్‌లు చర్చ చేయాలని ఇద్దరు మాజీ జడ్జిలు, మాజీ సంపాదకుడు ఎన్.రామ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈడీæ అధికారులు అలసిపోయే దాకా 55 గంటల పాటు వారు నన్ను ఇంటరాగేట్ చేసేలా బీజేపీ చేసింది. నా ఇంటిని (ఎంపీ క్వార్టర్‌ను) లాగేసుకున్నారు. నాకు మీ క్వార్టర్ అవసరం లేదని.. మొత్తం దేశమే నా ఇల్లని వారికి చెప్పానని రాహుల్ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీలో చేరుతున్న వారిపై మాట్లాడుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని, పిరికిపందలు తమకు అక్కర్లేదని చెప్పారు. సీబీఐ, ఈడీ దాడులను భయపడి లొంగిపోయే వారు తమకు అవసరం లేదన్నారు. -
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?
ఛత్తీస్‌గఢ్‌కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను బీజేపీ ఛత్తీస్‌గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’ -
ప్రజా అవసరాలపై ఎందుకు చర్చించరు
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజా అవసరాలపై రాష్ట్ర కేబినెట్ ఎందుకు చర్చించదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు, రుణమాఫీ, పోలవరం నిర్మాణం వంటి అంశాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ హామీతో రైతులు విష వలయంలో చిక్కుకున్నారని, వారికి బ్యాంకులూ రుణాలివ్వడం లేదన్నారు. వర్షాభావం, కరువు కారణంగా 13 జిల్లాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. తూర్పు గోదావరిలోని కొన్ని మండలాల్లో క్రాప్ హాలిడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. నదీ నీటి పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి సంజీవని లాంటిదైనా ఈసారి బడ్జెట్లో కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. వీటన్నింటికి కర్త, కర్మ, క్రియ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.