ఛత్తీస్‌గఢ్‌కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను బీజేపీ ఛత్తీస్‌గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్‌చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్‌చార్జ్ నితిన్ నబిన్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది.
ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’
Comments
Please login to add a commentAdd a comment