new
-
పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌పై మరో కేసు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త సమస్యలో చిక్కుకున్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ కేసు నమోదు చేసింది. సోషల్ మీడియాను ఉపయోగించి, ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించారంటూ ఖాన్‌పై ఈ కేసు నమోదు చేశారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో వివాదాస్పద పోస్ట్‌కు సంబంధించి ప్రశ్నించడానికి దర్యాప్తు, సాంకేతిక అధికారులతో కూడిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) బృందం అడియాలా జైలును సందర్శించింది.ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించినందుకు ఖాన్‌పై ఎఫ్ఐఏ కేసు నమోదు చేసిందని ‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది. అయితే తన న్యాయవాదులు లేకుండా తాను విచారణకు సహకరించనని ఖాన్ వారికి తెలిపారు. దీంతో ఎఫ్ఐఏ సిబ్బంది వెనుదిరిగారు. గత ఏడాది నుంచి అడియాలా జైలులో ఉన్న ఖాన్ తరచూ 'ఎక్స్'వేదికగా సైన్యాన్ని విమర్శిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి -
కొత్తగా.. కొంగొత్తగా గాంధీ ఆస్పత్రి (ఫొటోలు)
-
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
-
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్‌గా పని చేస్తుంది ఇది. డివైస్‌కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్‌తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్‌ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’
సమాజ్‌వాదీ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 22న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ పేరు రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ (ఆర్ఎస్ఎస్పీ). పార్టీ జెండా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడి ఉంటుంది. అయితే ప్రసాద్ మౌర్యను బుజ్జగించి, ఆయన ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఎస్పీ సీనియర్ నేత రామ్ గోవింద్ చౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ? -
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకుంటే తిరుగుండదు!
Index funds: సులువుగా అర్థమయ్యేలా ఉంటూ, పెట్టుబడులను సులభతరం చేసే చక్కని వ్యూహంగా ఇండెక్స్ ఫండ్స్ ఉపయోగపడతాయి. వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి? నిర్దిష్ట ప్రామాణిక సూచీని ట్రాక్ చేసే ఒక తరహా మ్యుచువల్ ఫండ్స్‌ను ( mutual fund ) ఇండెక్స్ ఫండ్స్ అంటారు. నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి విస్తృత సూచీలను లేదా నిర్దిష్ట రంగానికి చెందిన నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ వంటి సూచీలను ట్రాక్ చేసేలా ఇవి ఉండొచ్చు. సదరు సూచీలోని కంపెనీల షేర్లను, అదే వెయిటేజీతో ఈ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాలకు చెందిన కొన్ని కీలక స్టాక్స్ సమూహాన్ని ఇండెక్స్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా స్టాక్ మార్కెట్ పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వీటిలో ఉంటాయి. ఇవి రెండూ కూడా నిర్దిష్ట సూచీని ట్రాక్ చేసేవే అయినా వీటి పని తీరులో మార్పులు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే పని చేస్తాయి. రోజు ముగిసే నాటి ఎన్ఏవీ ప్రకారం వీటి యూనిట్లను ఏఎంసీల్లో కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. ఇక ఈటీఎఫ్‌లు పేరుకు తగ్గట్లే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి, షేర్ల తరహాలోనే ట్రేడ్ అవుతుంటాయి. ఏఎంసీ ప్రస్తావన లేకుండా ఇన్వెస్టర్లు వీటిని నేరుగా ఎక్సే్చంజ్ నుంచే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ప్రయోజనాలు ఏమిటి? సులభంగా అర్థం చేసుకోగలిగే వ్యూహం. వ్యక్తిగతంగా ఏ ఒక్క స్టాక్ పైనో పక్షపాతం చూపించే పరిస్థితి లేకుండా ముందుగానే నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టాక్స్ ఎంపిక ఉంటుంది. మార్కెట్‌ను బట్టి పని చేస్తుంది. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఫండ్ మేనేజర్ క్రియాశీలకంగా ఉండరు కాబట్టి సాధారణంగా యాక్టివ్ మ్యుచువల్ ఫండ్‌తో పోలిస్తే వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. వ్యయాలు తక్కువ ఎందుకంటే? ముందే చెప్పుకున్నట్లు ఇండెక్స్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజరు ప్రత్యేకంగా స్టాక్స్ ఎంపిక చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పని ఉండదు. కాబట్టి పరిశోధనలపరమైన వ్యయాలూ ఉండవు. పైగా యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే పోర్ట్‌ఫోలియోలో మార్పులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. అందుకే వీటి వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఎవరికి అనువైనవి? సులభతరమైన, సమర్ధమంతమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఎవరికైనా అనువైనవే. సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చు. ఇక అనుభవమున్న ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ క్యాప్వ్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసేందుకు, నిర్దిష్ట ఇండెక్స్ వ్యూహాలను అమలు చేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ట్రాకింగ్ వ్యత్యాసాలు అంటే? బెంచ్ మార్క్, ఫండ్‌కి సంబంధించి పనితీరు అలాగే రాబడుల్లో వ్యత్యాసాలను ట్రాకింగ్ ఎర్రర్‌గా వ్యవహరిస్తారు. ఇది ఫండ్ పనితీరు సమర్ధతను సూచిస్తుంది. ఇక, ఫీజులు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఫండ్ అందించే రాబడులు కొంత భిన్నంగా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏఎంసీకి (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ) ఆన్లైన్లో లేదా ఫిజికల్‌గా దరఖాస్తు చేసుకోవడం ద్వారా సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహాలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తమ డిస్ట్రిబ్యూటర్ లేదా రిలేషన్షిప్ మేనేజర్‌ను సంప్రదించడం ద్వారా కూడా చేయొచ్చు. అలాగే లేటెస్ట్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా చేసేందుకు వీలుంది. ఏమేమి రిస్కులు ఉంటాయి? సాధారణ మ్యుచువల్ ఫండ్స్ తరహా రిస్కులన్నీ ఇండెక్స్ ఫండ్స్‌కి కూడా ఉంటాయి. వాటికి అదనంగా ట్రాకింగ్ ఎర్రర్, ట్రాకింగ్ డిఫరెన్స్, సూచీ ఆధారిత రిస్కులు, నిర్వహణపరమైన రిస్కులు మొదలైనవి ఉంటాయి. పథకానికి సంబంధించిన రిస్కులను గురించి తెలుసుకునేందుకు స్కీమ్ సమాచారపత్రాన్ని ముందుగానే క్షుణ్నంగా చదువుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్‌పై పన్ను విధానం ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్‌ని బట్టి ఇండెక్స్ ఫండ్స్‌పై పన్నులు వర్తిస్తాయి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్‌కి ఈక్విటీ ట్యాక్సేషన్, అలాగే డెట్ ఇండెక్స్ ఫండ్స్‌కి డెట్ ట్యాక్సేషన్ విధానం ఆధారంగా పన్నులు ఉంటాయి. ఏదైనా సరే, ఇన్వెస్ట్ చేసే ముందుగానే స్కీమ్ వివరాలతో కూడిన డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. - సమాధానాలు - నీరజ్ సక్సేనా ఫండ్ మేనేజర్, బరోడా బీఎన్పీ పారిబాస్ -
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?
ఛత్తీస్‌గఢ్‌కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను బీజేపీ ఛత్తీస్‌గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్ రామ్’ -
సొగసైన కారుపై 'సాహో' భామ
-
కొత్త జిల్లా ఎలా ఏర్పాటవుతుంది? గవర్నర్ పాత్ర ఏమిటి?
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది. కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? -
పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక?
నూతన పార్లమెంట్ హౌస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌లోని ఆరు ద్వారాలకు జంతువుల పేర్లు పెట్టారు. వీటిలో కొన్ని మనకు కనిపించేవి. మరికొన్ని పౌరాణిక సంబంధమైనవి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ ద్వారాలకు ఉన్న చిహ్నాలు వివిధ అంశాలను తెలియజేస్తాయి. నేటి కథనంలో ఆ ద్వారాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. గజ ద్వారం నూతన పార్లమెంట్ ప్రాగణ ద్వారానికి గజ ద్వార్ అనే పేరు పెట్టారు. ఈ ద్వారం జ్ఞానం, జ్ఞాపకశక్తి, సంపద, తెలివితేటలను సూచిస్తుంది. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపున ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ బుధునికి సంబంధించినది. దీనిని మేధస్సుకు కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ద్వారంపై ఏనుగు బొమ్మలు కనిపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి శ్రేయస్సును, సంతోషాన్ని అందిస్తాయి. అశ్వ ద్వారం పార్లమెంట్‌లోని మరో ద్వారానికి అశ్వ ద్వారం అని పేరు పెట్టారు. అశ్వం అంటే గుర్రం. ఇది శక్తి, బలం, ధైర్యానికి చిహ్నం. గరుడ ద్వారం మూడవ ద్వారానికి పక్షుల రాజైన గరుడుని పేరు పెట్టారు. గరుడుని విష్ణువు వాహనంగా భావిస్తారు. త్రిమూర్తులలో రక్షకునిగా పేరొందిన విష్ణువుతో అనుబంధం కలిగిన గరుడ పక్షి.. శక్తి, కర్తవ్యాలకు చిహ్నమని చెబుతారు. గరుడ ద్వారం నూతన పార్లమెంటు భవనానికి తూర్పున ఉంది. మకర ద్వారం మకర ద్వారం అనేది పురాణాలలో పేర్కొన్న సముద్ర జీవిని గుర్తుచేస్తుంది. ఇది వివిధ జంతువుల కలయిక. మకర శిల్పాలు దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించిన హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో కనిపిస్తాయి. మకరం అనేది వివిధ జీవుల కలయికతో దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. ద్వారాల వద్ద కనిపించే మకర విగ్రహాలను రక్షకులని చెబుతారు. మకర ద్వారం పాత పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపు కనిపిస్తుంది. శార్దూల ద్వారం ఐదవ ద్వారానికి పురాణాల్లో పేర్కొన్న శార్దూలం అనే పేరు పెట్టారు. ఇది సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. గుర్రం, ఏనుగు, చిలుక తలను కలిగి ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటు వద్ద శార్దూలం ఉండటం దేశ ప్రజల బలానికి ప్రతీక అని ప్రభుత్వ నోట్లో పేర్కొన్నారు. హంస గేట్ నూతన పార్లమెంటులోని ఆరవ ద్వారానికి హంస గేట్ అనే పేరు పెట్టారు. జ్ఞాన దేవత అయిన సరస్వతీమాత వాహనంగా హంస గుర్తింపు పొందింది. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుండి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హంస విగ్రహం స్వీయ సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్ మీడియాలో సంబరాలు!
ఇటీవల సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రొఫెసర్ తన కొత్త ఉద్యోగం గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. దీనిని చూసినవారు తొలుత ఆశ్చర్యపోయారు. తేరుకున్నాక కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్‌ను చూసిన యూజర్లు వివరీతంగా ఎంజాయ్ చేస్తూ, రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు యూజర్స్ తమకు కొత్త ఉద్యోగం రాగానే ఇలాంటి పోస్ట్‌లు పెడతామని చెబుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో @akaPrateekshit అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. దీనిలోని వివరాల ప్రకారం ప్రతీక్షిత్ కాను పాండే అనే యువకునికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరనున్నారు. Happy to officially announce that I am joining the Department of Communication at UC Santa Barbara @CommUcsb as an Assistant Professor, starting January 2024. आइ वडिलांच्या आशीर्वाद आहेत भारी. https://t.co/BmGve47WYG pic.twitter.com/MiG4Y5v670 — Kanu (@akaPrateekshit) October 2, 2023 వైరల్‌గా మారుతున్న ఈ పోస్టులో ప్రతీక్షిత్ ఓ నాయకుని మాదిరిగా పూలదండలు వేసుకుని కనిపిస్తున్నారు. అలాగే భారీ ఓట్ల మెజారీతో గెలిచినట్లు విజయ సంకేతం చూపిస్తున్నారు. పోస్ట్‌లోని వివరాల ప్రకారం కాను పాండే జనవరి 2024లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరనున్నారు. ఒక యూజర్ ‘నేను చదువు పూర్తిచేసి, ఉద్యోగం సంపాదించినప్పుడు ఈ విధంగా అందరికీ తెలిసేలా ప్రకటిస్తాననని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘నా జీవితంలో ఎప్పుడూ నేను ఇలాంటి వృత్తిపరమైన ప్రకటనను చూడలేదు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఐ డ్రాప్స్ స్థానంలో జిగురు.. యువతి విలవిల! -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్‌పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్‌గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుకి చేరిన నిఫా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 706 మంది..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా 24 ఏళ్ల యువకుడు వైరస్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 706 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారు. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హై రిస్క్ జోన్లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్‌లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిఫా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
Oxygen-28: కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
టోక్యో: భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరం. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించింది. జపాన్‌లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్–28’ అనే కొత్తరకం ప్రాణవాయువును గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక ఐసోటోప్ అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఆక్సిజన్–28 ఐసోటోప్ 20 న్యూట్రాన్లు, ఎనిమిది ప్రోటాన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఇది పరిమాణంలో భారీగా ఉన్నట్లు తేల్చారు. ఈ ఆక్సిజన్ ఐసోటోప్ కొంత తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉందని గమనించారు. ప్రకృతిలో ఇది అసాధారణమైన ఆక్సిజన్ అని శాస్త్రవేత్తలు అభివరి్ణస్తున్నారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్‌తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
Kamal Haasan Indian 2 New Poster: ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్ విడుదల
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. లైకా ప్రోడక్షన్స్, ది రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
పేరు మార్చుకోనున్న కేరళ!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం అధికారికంగా పేరు మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేరళ పేరును 'కేరళమ్'గా మారుస్తారు. అసెంబ్లీ మద్దతు లభించడంతో ఈ బిల్లును కేంద్ర ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సీఎం పినరయ్ విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇంగ్లీష్‌తో సహా అన్ని భాషల్లో రాష్ట్ర పేరను కేరళమ్‌గా మార్చాలని అన్నారు. సభ్యులు తీర్మాణాన్ని అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా ఆమోదించారు. కేరళ రాష్ట్ర పేరును మలయాళంలో కేరళమ్ అనే అంటారు. కానీ, మిగిలిన అన్ని భాషల్లో కేరళగానే పిలుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మలయాళ భాష మాట్లాడే వారందర్ని కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరును కేరళగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పేరును రాష్ట్ర సర్కార్ మార్చాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: మరో వివాదంలో రాహుల్ గాంధీ -
‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్‌షాపులో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్ఎస్ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఆ మోసాలను బయట పెట్టండి కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్‌ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలవదు ‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్‌మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలవలేదు.. భవిష్యత్‌లో కలవబోదు.’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్ఎస్లో కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
నాడు విజయ్ పేరుతో వైరల్.. నేడు మళ్లీ ఇలా ట్రెండింగ్‌లో
తమిళ నటి షాలు షమ్ము అంటే తెలుగువారు ఎవరైన టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ కోలీవుడ్‌లో పాపులర్ నటి. అక్కడి సోషల్ మీడియాలో తనపేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. గతంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేయడంతో అప్పట్లో ఆమె పేరు తెలుగునాట కూడా వైరల్ అయింది. శివకార్తికేయన్ హీరోగా మిస్టర్ లోకల్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత తనకు పలు సినిమా అవకాశాలు వచ్చినా అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో షాలు షమ్ముకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఆమె షోషల్మీడియాకే పరిమితమై తన వర్కౌట్ వీడియోలతో పాటు సల్సా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసేది. అంతే కాకుండా చాలా ఆకర్షణీయమైన తన ఫోటోలను కూడా షేర్ చేసేది. అలా ఆమె పేరు అందరిలో ఉండేలా జాగ్రత్తపడేది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ) తర్వాత తనకు తమిళ్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. తాజాగా తను కోటి రూపాయల లగ్జరీ కారును తక్కువ ధరకు కొనుగోలు చేసిందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. షాలూ షమ్ము తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రూ.1 కోటి విలువ చేసే జాగ్వార్ కారును సెకండ్ హ్యాండ్లో రూ. 50 లక్షలకు కొన్నట్లు తెలిపింది. ఆ కారు కొనడం తన చిరకాల కోరికని తెలిపింది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఓ వైపు సినిమా అవకాశాలు లేనప్పుడు ఇంత డబ్బు ఎలా వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాలేనా? మరేదైనా చేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆమె తిరిగి ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. కానీ నటి షాలు షమ్ము స్కిన్ కేర్ క్లినిక్ కూడా నడుపుతున్నట్లు గతంలో తెలిపింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన మొత్తంతోనే ఆమె ఈ కారును కొనుగోలు చేసి ఉంటుందని పలువురు అంటున్నారు. విజయ్ దేవరకొండతో సినిమా.. గతంలో ఇలాంటి కామెంట్ చేసింది గతంలో తను చేసిన ఆరోపణలు ఇవే.. తెలుగు పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడు తనకు విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామని ఆఫర్ చేశాడు, అయితే ఆ సినిమాలో ఆఫర్ రావాలంటే.. తన కోరిక తీర్చాల్సి ఉంటుందని కండీషన్ పెట్టినట్లు అప్పట్లో కామెంట్ చేసింది. ఆ కారణంతో విజయ్‌తో వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆ దర్శకుడెవరో మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు తమిళ్, తెలుగు పరిశ్రమలో సంచలనంగా మారిపోయింది. View this post on Instagram A post shared by ❣️ ஷாலு ஷம்மு ❣️ (@shalushamu) -
తెలుగు రాష్ట్రాల్లో NS ఏవియేషన్ విమానం ఎగరవేస్తాం
-
క్రైమ్ థ్రిల్లర్‌గా 'ఎవోల్' (EVOL)
టాలీవుడ్లో ఒక్కోసారి చిన్న చిత్రాలే మెప్పిస్తుంటాయి. ఇదే కోవలో సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్’. దాని ట్యాగ్ లైన్ (a love story in reverse) రామ్‌యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్) దర్శక నిర్మాత రామ్‌యోగి మాట్లాడుతూ 'ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ జానర్ అంశాలతో పాటు వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. కథ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో సెన్సార్‌కు ఈ చిత్రం వెళ్లనుంది. ఈ లోపు ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం. దర్శక నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నమిది. ప్రేక్షకుల ఆదరణ కావాలని కోరుతున్నా' అని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జజర్దస్త్ కమెడియన్)