తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్‌చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక నిమిషం 46 సెకన్ల నిడివిగల ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
(ఇదీ చదవండి: Jr NTR: ఎన్టీఆర్ కోసం క్రేజీ హీరోయిన్‌ను ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్)
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అని చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మ ‘కొండా’ సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది. దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు.
(ఇదీ చదవండి: Custody Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?)
Comments
Please login to add a commentAdd a comment