
లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్ వాక్‌తో హీట్ పెంచింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. ఆయన డిజైన్ చేసిన దుస్తులను ఎందరో మోడల్స్ ధరించి పలు స్టేజీలపైనా ర్యాంప్ వాక్ చేశారు. ఇప్పుడు తొలిసారి జాన్వీ కూడా రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆకట్టుకుంది.
జాన్వీ కపూర్ నల్లటి దుస్తుల్లో ర్యాంప్‌పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు కింద అద్భుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్‌లో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలోనే జాన్వీ తన కోటు తీసేసి పోజులిచ్చింది. కొంతదూరం అలా తన ర్యాంప్ వాక్‌ను కొనసాగించింది. డ్రెస్ డిజైనర్ బ్రాండ్ (AFEW Rahul Mishra) కోసం జాన్వీ భాగమైంది. భవిష్యత్‌లో మరిన్ని కొత్త డిజైన్ డ్రెస్‌లతో ఆమె ఫోజులు ఇవ్వనుంది.

ఆమె ఆకర్షణీయమైన దుస్తులు, డైనమిక్ స్టైల్‌తో పాటు అక్కడ వినిపించే సంగీతం అన్నీ ఒకదానికొకటి ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. జాన్వీ ర్యాంప్ వాక్‌పై చాలా వరకు ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు మాత్రం ఆమెను తప్పుపట్టారు. వేదికపై నిజమైన మోడల్స్ ఎక్కడ ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వేదికలపై సెలబ్రిటీలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇలా అయితే కొత్త మోడల్స్ ఎలా పరిచయం అవుతారని నిర్వాహకులను తప్పపట్టారు.