Lakme Fashion Week
-
లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ
మోడలింగ్, ఫ్యాషన్ గురించి ప్రస్తావించగానే స్లిమ్, యంగ్‌గా కనిపించడాన్ని ప్రధానంగా చూస్తారు. వాటికే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈమె లేటు వయసులో మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ ఏజ్‌లో మోడల్‌గా ప్రయత్నించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో హేళనలు, అవమానాలు తట్టుకోవాల్సిందే. అన్ని దాటుకుని నిలబడటమే గాక మోడల్ అంటే యవ్వనంగా కనిపించే వాళ్లే కాదు తనలాంటి సీనియర్ సిటిజన్లు కూడా యంగ్ జనరేషన్‌కి ఏ మాత్రం తీసిసోని విధంగా దూసుకుపోతారని ప్రూవ్ చేసింది. ఆమె పేరు ముక్కాసింగ్. ఆమెనే యాక్సిడెంటల్ మోడల్‌గా చెప్పొచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో ర్యాంప్‌పై డిఫరెంట్ డిజైనర్ వేర్‌తో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా అర్థం కానీ రీతిలో కొందర్నీ అద్భుతంగా ప్రపంచం ముందు నిలబడేలా చేస్తుంది. అలానే ముక్తాసింగ్ మోడల్ అయ్యేందుకు ఇది ఓ గొప్ప ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది.సోషల్ మీడియాలో ఆమె ప్రస్థానం ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభయమయ్యింది. చివరికి 2021 నుంచి ఆమెకు గుర్తింపు లభించడం మొదలయ్యింది. అయితే ఆమె మోడల్‌గా మారడానికి కారణం మాత్రం తన మేనగోడలు వివాహ వేడుక . ఆ ఫంక్షన్లో ఆమె కట్టుకున్న చీర అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా కట్టిన తీరు మెచ్చుకుంటూ ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇక అప్పుడే డిసైడ్ అయ్యింది. తనకు తాను స్వతహా ఫ్యాషన్‌ని సెట్ చేసుకుని విన్నూతనంగా కనిపించాలని ఫిక్స్ అయ్యింది. అంతేగాదు ఆ ఫంక్షన్‌లోని తన పిక్స్‌ని నెట్టింట షేర్ చేయగా వేలల్లో వ్యూస్, లైక్‌లు రావడంతో ఈ రంగం వైపు అడుగులు వేసింది ముక్తా సింగ్. అలా ఆమె మోడల్‌గా ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ముక్తా రానున్న కల్కి2 మూవీలో కూడా నటిస్తోంది కూడా. కాగా, ముక్తాకి 15 ఏళ్ల వయసుకే జుట్టు మెరిసిపోయి అందవిహీనంగా అయిపోయింది. View this post on Instagram A post shared by Mukta Singh (@mukta.singh) ఆ తర్వాత పెళ్లి , పిల్లలు బాధ్యతలతో కెరీర్‌పై దృష్టి సారించే అవకాశమే దక్కలేదు. దీనికి తోడు ఆ టైంలోనే ముక్తా తల్లి కేన్సర్ బారిన పడటం, ఇవన్నీ ఆమెను కుంగుబాటుకి గురిచేసి తన ఆహార్యంపై దృష్టిపెట్టే అవకాశం లేకుండా చేశాయి. ఆ గడ్డు పరిస్థితు నుంచి బయటకు రావడానికి ఆమె హార్డ్ రాక్ సంగీతంవైపుకి మళ్లింది. అలా కోలుకుంటూ మళ్లీ ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి..తన కలను నిజం చేసుకుంది ముక్తా. అంతేగాదు ఈ వయసులోనా అని సమాజం నుంచే వచ్చే సవాళ్లకు లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకుసాగి ఫ్యాషన్‌కి సరికొత్త వివరణ ఇచ్చింది. View this post on Instagram A post shared by Mukta Singh (@mukta.singh) (చదవండి: ఓ పచ్చని నీడ! గ్రీన్ వారియర్..పద్నాలుగేళ్లకే..!) -
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: వయ్యారి భామల సందడి, ఫోటోలు
-
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: అందాల భామల సోయగాలు ఫోటోలు
-
లాక్మే ఫ్యాషన్ వీక్ : స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ హీరో, ఫోటోలు వైరల్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 ఈ నెల (మార్చి) 17 ఆదివారం దాకా జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో మార్చి 13న ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్‌లో రకరకాల థీమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by Lakmē Fashion Week (@lakmefashionwk) మాగ్నమ్ ఐస్ క్రీం డిప్పింగ్ బార్ థీమ్ సెలబ్రిటీలు సందడి చేశారు. మాగ్నమ్ డిప్పింగ్ బార్లో తమ ఫ్యావరేట్ను ఫ్లావర్ను ఆస్వాదించారు. ఈ సెలబ్రిటీస్‌లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేస్తూ స్టయిలిష్ లుక్‌లో ఆకర్షణీయంగా నిలిచారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో సస్టైనబిలిటీ డేలో ప్రముఖ నటి, మోడల్, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ దియా మీర్జా మెరిసింది. -
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 : ప్రముఖ డిజైనర్లు, మోడల్స్ సందడి
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో ఐదు రోజుల లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ భారతీయ డిజైనర్లు రాజేష్ ప్రతాప్ సింగ్, అనామికా ఖన్నా, JJV కపుర్తలా, అనుశ్రీ రెడ్డి, గౌరీ , నైనికా , శాంతను నిఖిల్ తమ డిజైన్లతో సందడి చేయనున్నారు. అకారో, గీషా డిజైన్స్, కల్కి ,IRTH వంటి స్వదేశీ బ్రాండ్లను కూడా ఇక్కడ చూడొచ్చు. మహాలక్ష్మి రేస్ కోర్స్ వంటి వివిధ ప్రదేశాలలో ఆఫ్-సైట్ కొన్ని షోలను కూడా ప్లాన్ చేశారు నిర్వాహకులు. మార్చి 13 నుంచి మొదలైన ఈ ఫ్యాషన్ వీక్ మార్చి 17వరకు మోడల్స్ పలు బ్రాండ్లను ప్రదర్శిస్తారు. -
Lakme Fashion Week 2023: తారల తళుకులు.. ర్యాంప్‌పై ఫ్యాషన్ మెరుపులు (ఫొటోలు)
-
ముంబైలో లాక్మీ ఫ్యాషన్ వీక్.. మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
సొగసరి.. వయ్యారి నడకలు, ఒక్కరు కాదు మరి! (లాక్మీ ఫ్యాషన్ వీక్ ఫొటోలు)
-
లాక్మే ఫ్యాషన్ వీక్.. తారల తళుకులు
-
లాక్మే ఫ్యాషన్ వీక్ ఫోటోలు
-
హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ
ముంబై : బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్లస్ సింబల్‌ను షేర్ చేస్తూ..తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, త్వరగా కోలుకునేలా ప్రార్థించాలని కోరారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ..మీరు తప్పకుండా కోలుకుంటారు, భయపడకండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఆదివారం జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ కియారా అద్వానీ, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హీరో కార్తీక్ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇటీవలె కియారా, టబులతో కలిసి భూల్ భులైయా 2 అనే సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో ఇప్పడు వీరిందరికి కరోనా భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా తనను కంటాక్ట్ అయిన వారిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్ తెలిపారు. చివరగా ఆయన ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు. గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి : బిగ్‌బాస్ భామకు కరోనా పాజిటివ్ ప్రముఖ కమెడియన్ తేపట్టి గణేశన్ మృతి -
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ భామలు
-
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ‘రకుల్’
సాక్షి, ముంబై : ప్రముఖ ఆన్లైన్ ఫాషన్ ఇ-రిటైలర్ అజియో.కామ్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన ఫ్యాషన్ దుస్తులతో సందడి చేసింది. ముంబైలోని జియో గార్డెన్స్‌లో బుధవారం జరిగిన లాక్మే ఫ్యాషన్ 20వ ఎడిషన్‌లో ’లాంగ్ లివ్ బోల్డ్’ పేరుతో యువతీ యువకులకోసం ట్రెండీ,క్లాసీ దుస్తులను ప్రదర్శించింది. గ్లామర్, స్టయిల్,ఫ్యాషన్ ల కాంబినేషన్‌తో తీసుకొచ్చిన తమ సరికొత్త వస్త్రాలు రాబోయే వేసవి సీజన్లో వినియోగదారులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయని కంపెనీ తెలిపింది. 2016లో డౌట్ ఈజ్ ఔట్ అంటూ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అజియో ప్రపంచ ఫ్యాషన్ పోకడలకు పర్యాయపదంగా నిలిచింది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తనదైన శైలి దుస్తులతో మరోసారి అదరగొట్టింది. ప్రముఖ స్టైలిస్ట్ మోహిత్ రాజ్ రూపొందించిన దుస్తులను ప్రదర్శించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అజియో రూపొందించిన స్టైలిష్ దుస్తుల్లో ర్యాంప్ మీద మెరిసారు. 2000 గ్లోబల్ సూపర్ బ్రాండ్లు, 2లక్షల 70వేల స్టైల్స్, విలక్షణమైన ప్రింట్లు, రంగులతో లాంగ్ లివ్ బోల్డ్ కలెక్షన్స్ ఆకట్టుకుంటాయనీ అజియో .కామ్ బిజినెస్ హెడ్ వినీత్ నాయర్ దీమా వ్యక్తం చేశారు.భారత దేశంలో ప్రధానంగా ఉన్న యంగ్ జనరేషన్ కోసం కంఫర్టబుల్, బోల్డ్ దుస్తులను తీసుకొచ్చామన్నారు. యువతుల కోసం జంప్ సూట్స్, క్యాజువల్ సూట్స్, క్రాప్‌టాప్స్ , డెనిమ్ జాకెట్స్, ఫ్లోరల్ ప్రింట్స్ మోడల్స్‌లో ఆకర్షణీయమైన దుస్తులను మోడళ్లు ప్రదర్శించారు. అలాగే యువకులకోసం తీసుకొచ్చిన ఫన్నీ బ్యాగ్‌లు జోడించిన ఓవర్సైజ్డ్ జాకెట్స్, జాగర్స్, క్లాసీ మిలటరీ ప్రింట్స్ హైలైట్‌గా నిలిచాయి. -
గర్భిణిగా ర్యాంప్ వాక్
ముంబైలో గురువారం ప్రారంభం అయిన లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌పై బాలీవుడ్ నటి, మోడల్ లీసా హేడన్.. క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో కలిసి నడిచి తను ధరించిన ‘ఫ్లక్స్’ దుస్తుల కలెక్షన్‌కు రిచ్ లుక్‌ను తెచ్చారు. లీసా ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు పాండ్యాతో పాటు లీసా దుస్తులను డిజైన్ చేసిన అమిత్ అగర్వాల్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులతో డిజైన్ చేయడంలో నిష్ణాతుడైన అమిత్.. లీసా కోసమే ప్రత్యేకంగా దుస్తులను రూపొందించి, ప్రదర్శింపజేశారు. గర్భిణి అయి ఉండి కూడా లీసా ర్యాంప్ వాక్ చెయ్యడం అక్కడొక ముచ్చటగొల్పే విశేషం అయింది. -
సెలబ్రిటీలూసై..
డిజైనర్ల కలల చిరునామా లాంటి ఫ్యాషన్ వేదికపై సిటీ మరోసారి తళుక్కుమంది. నగరానికి చెందిన డిజైనర్లు,సెలబ్రిటీలు ముంబైలో కొలువుదీరారు. దేశవ్యాప్తంగా డిజైనర్లు, స్టైల్ లవర్స్‌తో కళకళలాడే ఈ అగ్రగామి ఫ్యాషన్ వేడుకలో.. గత కొంతకాలంగా తనదైన సత్తాచాటుకుంటున్న సిటీ ఈసారి కూడా మెరుపులు మెరిపించింది. ముంబైలోని జియోగార్డెన్స్‌లో తాజాగా ముగిసిన స్ప్రింగ్సమ్మర్ ఫ్యాషన్ వీక్ విశేషాలలో భాగ్యనగరభాగస్వామ్యంపై ఓ ‘లుక్’ వేద్దాం. డిజైనర్ ఫ్రెండ్లీ..సమ్మర్ ట్రెండీ.. చలికాలం ముగుస్తున్న దశలో వేసవికి ముందుగా వచ్చేదే స్ప్రింగ్ సమ్మర్ సీజన్. రానున్న వేసవిలో డిజైనర్లు సరికొత్త ఆవిష్కరణలతో ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కదం తొక్కించే సమయం ఇది. దీనిని పురస్కరించుకుని లాక్మె స్ప్రింగ్ సమ్మర్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. దీనిలో పాల్గొని తమ తమ డిజైన్లను ప్రదర్శించమని దేశవ్యాప్తంగా ఉన్న డిజైనర్లను ఆహ్వానించింది. అయితే పోటాపోటీ ఎంట్రీల మధ్య మన నగరం నుంచి నలుగురు డిజైనర్లు ఈ వీక్‌కు హాజరయ్యే అవకాశం దక్కించుకున్నారు. దేశవ్యాప్త డిజైనర్లతో పోటీపడి తమదైన శైలిలో స్ప్రింగ్ సమ్మర్ ట్రెండ్స్‌ను ప్రదర్శించారు. డిజైనర్స్‘ఫోర్స్ ఇదే.. నగరం నుంచి అనుశ్రీరెడ్డి, శైలేష్ సింఘానియా, మిశ్రి సహా నలుగురు డిజైనర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గతంలోనూ లాక్మె వేదికపై రాణించిన అనుభవం ఉన్న శైలేష్ సింఘానియా మరోసారి తన సహానా కలెక్షన్లతో ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆయన కలెక్షన్లకు షోస్టాపర్‌గా జన్మతః హైదరాబాదీ అయినా బాలీవుడ్ నటి ఆదితి హైదరి వ్యవహరించారు. ‘నా ప్రదర్శనకు అద్భుతమైన స్పందన వచ్చింది. నేను పాల్గొన్నది కూడా ఈవెంట్‌కి చివరి రోజు కావడంతో ఫ్యాషన్ ప్రియులు మరింత అధిక సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాదీ డిజైనర్లకు గతంతో పోలిస్తే లాక్మె వీక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది’ అని శైలేష్ చెప్పారు. నగరం నుంచి లాక్మె అవకాశం దక్కించుకునే వారిలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న డిజైనర్ అనుశ్రీరెడ్డి కూడా తనదైన శైలి మెరుపుల్ని మెరిపించారు. ఆమె మరో డిజైనర్ నిఖిల్ తంపితో కలిసి తొలిసారిగా కంబైన్డ్ షోని సమర్పించడం విశేషం. సిటీ డిజైనర్ అనుశ్రీరెడ్డి తీర్చిదిద్దిన కలెక్షన్లకు షో స్టాపర్‌గా బాలీవుడ్ ‘మణికర్ణిక’ కంగనా రనౌత్ ర్యాంప్‌పై తళుక్కుమన్నారు. నగరానికే చెందిన మరో డిజైనర్ స్వప్న అనుమోలు తన లేబుల్ రిమైన్స్ పేరిట మరో ఇద్దరితో కలిసి తన కలెక్షన్‌ను ప్రదర్శించారు. ఈ కలెక్షన్‌కు జత చేసిన ఆర్ట్ వర్క్‌లో ఆమె సిటీకి చెందిన విశేషాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఆమె డిజైన్లకు షోస్టాపర్‌గా బాలీవుడ్ నటి డయానా పెంటీ వ్యవహరించారు. ఇక నగరానికి చెందిన శ్రియా సోమ్ ‘రివెరీ’ పేరుతో ఆకట్టుకునే ఆకులు, పువ్వులు, సూర్యకాంతి, సముద్రపు అందాలను తన కలెక్షన్ ద్వారా కళ్లకు కట్టారు. పేరొందిన డిజైనర్లతో భారీ స్థాయి ఫ్యాషన్ ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ఆకట్టుకునే లాక్మె ఫ్యాషన్ వీక్ మరోసారి ముంబైలో సందడిగా ముగిసింది. మన నగరం నుంచి కొంత కాలంగా ఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో.. ఈసారి కూడా సిటి డిజైనర్లు తమదైన స్టైల్స్‌ను ప్రదర్శించిఆకట్టుకున్నారు. సెలబ్రిటీలూసై.. సిటీ నుంచి ఈ ఈవెంట్‌కు ఈసారి ఫ్యాషన్ ప్రియులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరందరిలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిలిచారు. ఆమె ఈ ప్రదర్శనకు తగిన దుస్తులతో, గతంలో తనను ఎవరూ చూడనంత గ్లామరస్ డ్రెస్సింగ్‌తో చూపరులను కట్టి పడేశారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి. ప్రముఖ ఫుట్‌వేర్ బ్రాండ్ కోసం ఆమె లాక్మెలో ర్యాంప్‌వాక్ చేయడం విశేషం. మరో బ్యాడ్మింటన్ స్టార్, నగరానికి చెందిన సైనా నెహ్వాల్ కూడా ఈ షోకి హాజరయ్యారు. -
అభిమానులపైకి దూకిన హీరో..
-
ప్రేక్షకుల పైకి దూకిన హీరో.. పలువురికి గాయాలు
ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో కనిపించే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చర్యలు చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి పనే మరోటి చేశాడు ఈ యంగ్ హీరో. రణవీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గల్లీబాయ్. ఈ సినిమాలో రణవీర్.. రాప్ గాయకుడిగా ఎదగాలనుకునే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈసందర్భంగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో రణవీర్ లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. స్టేజ్ మీద పాటపాడుతూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అభిమానులపైకి దూకేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. రణవీర్ చర్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్క సెలబ్రిటీకి కనీస సివిల్ సెన్స్ లేదంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఆ రూమర్ నిజమైంది...
సాక్షి, ముంబై: పెళ్లి కబురుతో అభిమానులను ఆశ్చర్యపర్చిన బాలీవుడ్ నటి నేహాదుపియా, అంగద్ బేడి, జంట మరో గుడ్‌న్యూస్‌తో ఫాన్స్‌కి స్వీట్ షాకిచ్చారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామనే వార్తను సోషల్ మీడియాలో పంచకున్నారు. తద్వారా గత కొద్దికాలంగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ తార నేహా దూపియా తెరదించినట్టయింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేశారీ జంట. దీంతో ఇవి వైరల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ శుభవార్తను శుక్రవారం నేహా కన్ఫామ్ చేశారు. కొత్త ఆరంభం.. ఇపుడు మేం ముగ్గురం.. ఆ భగవంతుడి ఆశీర్వాదం తమతో ఉందంటూ కొన్ని పోటోలను షేర్ చేశారు. అలాగే రూమర్లు నిజమయ్యాయంటూ అంగద్ బేడీ చమత్కారంగా స్పందించారు. దీంతో లక్షలకుపైగా వ్యూస్నుసాధించాయీ ఫోటోలు. అభినందనల వెల్లువ కురుస్తోంది. అద్భుతమైన జంటకు కంగ్రాట్స్..మరో అందమైన ప్రేమకథకు ఆరంభం అంటూ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ విషెస్ చెప్పారు .మరోవైపు ముంబైలో అట్టహాసంగా జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్2018లో నేహా దూపియా, అంగద్ బేడి తళుక్కున మెరిసారు. మ్యాచింగ్ సాంప్రదాయ దుస్తుల్లో అక్కడున్న వారిని మెస్మరైజ్ చేశారు. చేతిలో చేయివేసుకొని ర్యాంప్‌పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. చాలాకాలం డేటింగ్ అనంతరం నేహా దుపియా, అంగద్ బేడీ ఈ ఏడాది మే 10న ఆకస్మాత్తుగా వివాహం చేసుకోవడం హాట్ టాపిక్‌గా నిలిచింది. నేహా గర్భం దాల్చడం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకొన్నారనే వార్లు మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే. -
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మోడళ్ల మెరుపులు
-
ల్యాక్మిలో బాలీవుడ్ అందాలు
-
నాటి స్టార్ల అట్రాక్షన్...
లాక్మే ఫ్యాషన్ వీక్ కొత్త తరం ధాటికి తెరవెలుగులకు దూరమైనా... ర్యాంప్‌పై మెరుపుల్లో మాత్రం వారి కంటే... ముందున్నారు నిన్నటి స్టార్ హీరోయిన్లు. ఫ్యాషన్ షోలలో తాజా లాక్మె ఫ్యాషన్ సమ్మర్ రిసార్ట్ షో దీనికి ఓ చక్కని నిదర్శనం. ముంబైలోని జియోగార్డెన్స్‌లో జరిగిన ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో మిడిల్ ఏజ్డ్ బాలీవుడ్ హీరోయిన్లు వన్నెతరగని సౌందర్యంతో వేదికను కళకళలాడించారు. షబానా ఆజ్మీ మొదలుకుని సంగీతా బిజిలానీ, జూహీ చావ్లా, లారా దత్తా, సుస్మితా సేన్, ప్రీతి జింటా, టాబూ... డిజైనర్ల క్రియేటివిటీకి తమ అందంతో ఆకర్షణను జత చేశారు. వీరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మాత్రం ఇటీవలే తల్లిగా మారినా కరీనా కపూర్‌ని చెప్పాలి. కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చి సరిగ్గా 46 రోజుల్లోనే ఫ్యాషన్ పట్ల తనకున్న సహజసిద్ధమైన ఆసక్తితో ఆమె లాక్మె గ్రాండ్ ఫినాలే రోజున టాప్ డిజైనర్ అనితా డోంగ్రే దుస్తుల్లో దేవతను తలపించారు. అతి తక్కువ మేకప్‌తో ‘లిక్విడ్ గోల్డ్’ థీమ్‌కు తగినట్టుగా దుస్తులు ధరించి మెరిశారు. అరుదుగా మాత్రమే సినిమాల్లో కనిపిస్తూన్న మరో సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ డిజైనర్ శశి వంగపల్లి రూపొందించిన పర్పుల్ కలర్ గౌన్‌లో ర్యాంప్‌పై వన్నెచిన్నెలు చిలకరించి, హర్షధ్వానాలు అందుకున్నారు. విచిత్రమేమిటంటే... ర్యాంప్‌వాక్ చేసిన పురుషుల్లో మాత్రం వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అమితాదాస్... వంటి యువహీరోలే ఉన్నారు. -
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్ అదిరింది
-
కలర్ఫుల్గా లాక్మీ ఫ్యాషన్ వీక్
-
చాలా పొరపాట్లు చేశాను: నటి
ముంబై: సినిమా జీవితం ఆరంభంలో ఫ్యాషన్ పరంగా చాలా తప్పులు చేశానని బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తెలిపింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చినందున తనకు అప్పట్లో ఫ్యాషన్ పరిజ్ఞానం అంతగా లేదని వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2016లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘17 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో అడుగుపెట్టాను. నాకప్పుడు ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియదు. ఫ్యాషన్ పరంగా చాలా పొరపాట్లు చేశాను. అయినప్పటికీ నా డ్రెస్సులను అందరూ మెచ్చుకునేవారు. సినిమాల్లోకి వచ్చేప్పటికి నేను చాలా చిన్నపిల్లని. స్కూల్ నుంచి వచ్చి సినిమాల్లో నటించడం సరదాగా అనిపించేది. అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. దర్శకులు, నిర్మాతలు ఏ డ్రెస్సులు వేసుకోమంటే అవే వేసుకునేదాన్ని. ఇండస్ట్రీతో పాటు నేను ఎదుగుతూ వచ్చాను. ఫ్యాషన్ పరిజ్ఞానం కూడా పెంచుకున్నాను. ఇప్పుడు నా స్టయిల్ ను అందరూ ఇష్టపడుతున్నార’ని 42 ఏళ్ల కరిష్మా కపూర్ చెప్పింది. అయితే ఇప్పటి హీరోయిన్లు ఫ్యాషన్ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని అంది. హీరోయిన్ల స్టయిల్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపింది. తనకు చేతినిండా ఎండార్స్మెంట్స్ ఉన్నాయని చెప్పింది. -
ఘనంగా లాక్మే ఫ్యాషన్ వీక్
-
లాక్మే ఫ్యాషన్ వీక్
-
నా మొదటి డిజైనింగ్ స్టూడియోకార్ గ్యారేజ్!
ఇటీవల ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్స్‌కి ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్న ఫ్యాషన్ డిజైనర్ శశికాంత్ నాయుడు. చేనేత వస్త్రాలను ప్రాణంగా భావించి, వాటితో అత్యుత్తమ డిజైన్లను సృష్టిస్తున్న ఈ డిజైనర్ హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉంటున్నారు. ఫ్యాషన్ రంగంలో తను చేస్తున్న కృషి, ఈ రంగంలో వస్తున్న మార్పులు, పోటీ గురించి ‘సాక్షి’తో ముచ్చటించారు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మీ డిజైన్స్‌కి కలంకారీ ఫ్యాబ్రిక్‌నే వాడారు. గతంలోనూ ఖాదీ స్పెషల్ చేశారు. చేనేతల ఎంపికకు కారణం? శశి: ఆరునెలలు దాటగానే ‘ఔట్ డేటెడ్’ అయిపోయే డిజైన్స్ నచ్చవు నాకు. ఎప్పుడు ధరించినా నా డిజైన్స్ ప్రత్యేకంగా, గ్రేస్‌గా కనిపించాలి. ఆ గొప్పదనం మన చేనేతలకు ఉంది. అందుకే నా డిజైన్స్ అన్నింటిలోనూ హ్యాండ్లూమ్స్కే ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. సాధారణంగా డిజైన ర్ డ్రెస్సుల ఖరీదు ఎక్కువ. అన్ని వర్గాలకు మీ డిజైన్స్ చేరడం కష్టం కదా! శశి: నిజమే, ఎప్పుడైనా మధ్యతరగతికి డిజైన్స్ చేరితేనే ఆ డిజైనర్ విజయం సాధించినట్టు. చేనేతల ఖరీదు ఎక్కువే. ఇక పెన్ కలంకారీ వంటి ఆర్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఎన్నో దశలు దాటితే తప్ప ఒక డిజైన్ రాదు. లాక్మె ఫ్యాషన్ వీక్ కోసం మచిలీపట్నం, శ్రీకాకుళంలో.. కలంకారీ నిపుణుల దగ్గర కూర్చొని, నాకు కావల్సిన ప్రింట్స్ చెప్పి మరీ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయించాను. వీటి డిజైనింగ్ ప్రతి పార్ట్‌లోనూ హ్యాండ్లూమ్నే వాడాను. దీంతో ఖరీదు కూడా బాగానే ఉంటుంది. అయితే, ఎప్పుడైనా డిజైన్స్ రెప్లికాస్ వస్తే అసలు డిజైన్ కన్నా ఖరీదు ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అలాంటి రెప్లికాస్ ఎన్నో వస్తున్నాయి. తక్కువ ఖరీదులో చేనేతలను ధరించాలంటే... ధరించే దుస్తుల్లో ఏదో ఒక పార్ట్ మాత్రమే చేనేతను ఎంచుకోవాలి. ఉదాహరణకు టాప్ హ్యాండ్లూమ్ తీసుకుంటే బాటమ్ జీన్స్ వేసుకోవచ్చు. లేదా మిక్స్ అండ్ మ్యాచ్‌గా ధరింవచ్చు. దీని వల్ల ఖరీదు తగ్గుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఎప్పుడు దృష్టి పెట్టారు? మీ కుటుంబ నేపథ్యం గురించి.. శశి: మా పూర్వీకులది విజయవాడ. నాన్న కేంద్రప్రభుత్వోద్యోగిగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఇద్దరు బ్రదర్స్, సిస్టర్. అంతా ఇంజినీరింగ్ పట్టభద్రులే. నేనూ ఇంజినీరింగ్ చేశాను. కానీ, ఎంతసేపూ కంప్యూటర్‌కు అతుక్కుపోయే ఉద్యోగం నాకు నచ్చలేదు. కొత్తగా ఆలోచించడం, పనిచేయడం చిన్ననాటి నుంచి అలవాటు. ‘డ్రెస్ డిజైనర్’ అవుతాను అన్నాను. ‘ఇంజినీర్వైయుండి బట్టలు కుడతావా’ అని కోప్పడ్డారు ఇంట్లో. వారికి నేను చెప్పింది అర్థం కాలేదు. వాళ్లు చెప్పింది నాకు అర్థం కాలేదు. నిఫ్ట్ ఫ్యాషన్ ఇన్స్టిట్య్యూట్లో చేరిపోయాను. ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పొందాను. కోర్స్ పూర్తయ్యాక డిజైనింగ్ స్టూడియో పెడదామను కున్నాను. కానీ, ఖర్చుతో కూడిన పని. అలా ఆలోచిస్తున్నప్పుడే నా బాధ నాన్నకు అర్థమైందను కుంటా.. ఇంటి కింద తన కార్ గరేజ్ ప్లేస్‌ను నా వర్క్ ప్లేస్‌గా మార్చుకోవడానికి ఇచ్చారు. అంతేకాదు 20 వేల రూపా యలు పెట్టుబడిగా ఇచ్చారు. అలా పదేళ్ల క్రితం.. కుట్టుమిషన్లు, పనివారితో ‘శశికాంత్ నాయుడు’ పేరుతో లేబుల్ డిజైన్స్ సృష్టించాను. మిషన్ల చప్పుడు విని, చుట్టుపక్కల వారు వచ్చారు. నోటి మాటతోనే చాలా మందికి నా డిజైన్స్ చేరిపోయాయి. ఈ రంగంలో స్ఫూర్తిగా నిలిచినవారు... శశి: నా డిజైన్స్‌కు వచ్చిన ప్రశంసలే నాకు స్ఫూర్తి. 2003లో నిఫ్ట్ అండ్ మినిస్ట్రీ టెక్స్‌టైల్స్‌లో నా కలెక్షన్స్ పరిచయం చేశాను. పేరొందిన బొటిక్స్ తరపునా షోస్ ఏర్పాటు చేశాను. గ్రాసిమ్ ఇండియా -2004లో నేను డిజైన్ చేసిన డ్రెస్ ధరించిన రవి కబ్రాకు ఫస్ట్ రన్నరప్ బెస్ట్ మేల్ డ్రెస్డ్ కేటగిరీలో అవార్డ్ లభించింది. 2003లో ఫెమినా బుక్ ఫ్యాషన్ కేటగిరీలో 50 మంది ప్రసిద్ధ డిజైనర్స్‌ని పరిచయం చేసింది. అందులో నేను ఉపయోగించిన భారతీయ సాంస్కృతిక గిరిజన కళ, రంగులు, వస్త్రం, దారాలు, డిజైన్లు.. ఇలా అన్నింటినీ కొనియాడారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పటికి మూడు సార్లు లాక్మెఫ్యాషన్ వీక్‌లో నా డిజైన్స్‌ని ప్రదర్శించాను. మొదటి డిజైనింగ్‌కి, ఇప్పటి డిజైనింగ్‌కి మధ్య వ్యత్యాసం... శశి: ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు ‘నా వర్క్ కొనుగోలుదారులకు నచ్చుతుందో లేదో.. అని చాలా భయపడ్డాను. అలాగే మొన్నటి లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ మొదటిసారి డ్రెస్ డిజైన్ చేసినంత భయపడ్డాను. మనసు పెట్టి డిజైన్ చేస్తాను. కానీ ‘చూపరులకు అవి ఎంత వరకు నచ్చుతాయో!’ అని భయపడతాను. ఇంకా మెరుగుపరు చుకోవడానికి కృషి చేస్తుంటాను. ఆ విధంగా సృజన, పని.. పెరుగుతూనే వస్తోంది. డిజైనింగ్‌లో మీ గరువు... శశి: ఫ్యాషన్ డిజైనర్ అపర్ణా రాథోర్ ఈ రంగంలో నాకు అతి గొప్ప గురువు. ఆవిడతో పది నిమిషాలు మాట్లాడినా చాలు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ పదేళ్లుగా ఆమె నా డిజైన్స్‌కి సలహాలు ఇస్తూనే ఉన్నారు. సినిమాలకు చేసిన వర్క్? శశి: తెలుగులో మార్నింగ్ రాగా (రాఘవేంద్రరావు తనయుడు హీరోగా) సినిమాకు చేశాను. ఆ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఈ వర్క్ సృజనకు సంబంధించింది. కొంత వ్యవధి, షరతులు ఉంటే వర్క్ సరిగ్గా రాదు. ఆ విధంగా పేరున్న దర్శకుల నుంచి ఆఫర్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. అత్యంత ఎక్కువ కష్టం అనిపించిన సందర్భాలు...? శశి: ప్రతీ నెలా డబ్బు పరంగా కష్టపడుతూనే ఉంటాను. ఇక మొన్నటి లాక్మె ఫ్యాషన్ వీక్కైతే డిజైనింగ్‌కి తక్కువ సమయం ఉంది. పైగా రంజాన్ మాసం. మాస్టర్స్ అందుబాటులో ఉండటం కష్టమైంది. నెలరోజులు తిండీ, నిద్ర పట్టించుకున్నదే లేదు. మొత్తం 14 డిజైన్స్. అన్నీ పూర్తయి, ప్రదర్శన ఇచ్చేంతవరకు నేను నేనుగా లేను. ఈ రంగంలో అమితానందాన్నిస్తున్నవి? శశి: పదేళ్ల క్రితం కస్టమర్లు ఇప్పటికీ నా డిజైన్స్ కోసం వస్తుంటారు. నా డిజైన్స్ వారికి ఇంకా నచ్చుతున్నాయనేది అమితానందం. అలాగే, ‘బట్టలు కుడతావా!’ అని ఆశ్చర్యపోయిన మా నాన్న ఈ రోజు ఏ పేపర్లో నా డిజైన్స్ వచ్చినా, ఇంటర్వ్యూ వచ్చినా అన్నీ ఫైల్ చేస్తుంటారు. మీ డిజైనింగ్‌లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యం? శశి: నా ఎఫర్ట్‌లో ఎక్కువ శాతం బ్లౌజ్ డిజైనింగ్‌పైనే. ‘శశి బ్రాండ్’ అనేలా ఉంటుంది బ్లౌజ్. అలాగే ఏ డిజైన్ అయినా హ్యాండ్లూమ్ వాడతాను. వాటిలో ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు, డిజైన్లు ఉండేలా జాగ్రత్తపడతాను. ఇలాంటివాటిలో భారతీయ ఆత్మ కనిపిస్తుంది. ఈ రంగంలో పోటీ గురించి...? శశి: ఇక్కడ కొనుగోలుదారుడే దేవుడు. వారిని మెప్పించడానికి చాలా కాలం ముందుకు వెళ్లి, వారి ఇష్టాయిష్టాలను ముందే ఆలోచించి, డిజైన్స్ సృష్టించాలి. అంతేకాదు, ఒక డ్రెస్ డిజైన్ చేస్తే.. దాని ప్రత్యేకత గురించి మనమే కొనుగోలు దారులకు వివరంగా చెప్పగలగాలి. ఆ విధంగా ఈ రంగంలో ఉన్నంత కష్టం, పోటీ మరే దాంట్లో ఉండదనిపిస్తుంది. అయితే కష్టానికి తగిన ఫలితమూ ఉంటుంది. -
అఖరి రోజు లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన తారలు
-
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు
-
లాఖోం మే ఏక్
ఇప్పుడు సిటీలో పేజ్‌త్రీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులంతా తమ చూపును ముంబై మీదే కేంద్రీకరించారు.దీనికి కారణం లాక్మే ఫ్యాషన్ వీక్! ప్రపంచవ్యాప్త మీడియా, టెక్స్టైల్, సినీ, గ్లామర్ ఇండస్ట్రీలను ఒకేసారి అటెన్షన్లోకి తెచ్చే ఈ ఫ్యాషన్ ఫెస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీ. ఈనెల 20న ముంబైలో ప్రారంభం కానున్న జాతీయస్థాయి డిజైనర్ వార్‌లో పాల్గొనేందుకు లాక్మే ఫ్యాషన్ వీక్లోసిటీకి చెందిన నలుగురు ఫ్యాషన్ డిజైనర్లు అవకాశం దక్కించుకున్నారు. ..:: ఎస్.సత్యబాబు ప్రపంచంలోని ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ప్రదర్శన లాక్మే ఫ్యాషన్ వీక్ ద్వారా దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించడంతో పాటు బాలీవుడ్‌నీ ఆకట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది. అందుకనే డిజైనర్లు, మోడల్స్, ఇంకా ఫ్యాషన్ పరిశ్రమలోని ఏ విభాగానికి చెందిన వారైనా సరే ఈ షోలో పాల్గొనడాన్ని గొప్ప విజయంగా భావిస్తారు. కొంతకాలంగా భాగ్యనగర సృజనకు లాక్మే రెడ్‌కార్పెట్ పరుస్తోంది. ముంబయిలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజైనింగ్ పండుగలో అరడజను మందిదాకా సిటీ డిజైనర్లు (యాక్సెసరీస్‌తో కలిపి) పాల్గొంటున్నారు. లాక్మే.. లక్ కాదు దేశవ్యాప్తంగా డిజైనర్లకు ప్రాతినిధ్యం కల్పించే ఈ ‘షో’లో అవకాశం దక్కడం అంత సులభం కాదు. ఈ షోలో పాల్గొనాలంటే కనీసం 18 నుంచి 30 డిజైన్ల వరకూ ప్రత్యేకంగా రూపొందించి నిర్వాహకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అంతేకాదు.. టాప్‌మోడల్స్, షోస్టాపర్స్, ఇంకా సంబంధిత ఖర్చుల కోసం కూడా భారీగా వ్యయం అవుతుంది. అయితే అవకాశం దక్కలేదని వాపోయేవాళ్ల కోసం ఈవెంట్ జరిగే చోట స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వెసులు బాటు కల్పిస్తారు. ఈ నేపధ్యంలో ఈ మెగా ఫ్యాషన్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న నగర డిజైనర్లను పలకరించినప్పుడు... ఇలా స్పందించారు. ‘టీ’టైమ్.. గత ఏడాది 2012లో లాక్మే కోసం జెన్ ఎక్స్‌లో పాల్గొన్నాం. అయితే ఈ సారి విభాగం మారింది. తొలిరోజే అంటే 20వ తేదీన నా షో ఉంటోంది. నా కలెక్షన్స్ పేరు ‘టీజమ్’. ఈ కలెక్షన్లో ఇండో వెస్ట్రన్ మిక్స్ ఉంటుంది. - అర్చనారావు తొలిసారి.. డిజైన్ల తొలకరి తొలిసారి లాక్మేలో పార్టిసిపేట్ చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే ఉద్వేగంగా కూడా ఉంది. ఈ ప్రదర్శన కోసం చాలా శ్రమిస్తున్నాను. ‘మిల్లె ఫ్లూర్స్’- ఎ థౌజండ్ ఫ్లవర్స్ పేరిట ప్రత్యేక కలెక్షన్‌ను ప్రదర్శిస్తున్నా. అచ్చమైన అర్బన్ స్టైల్స్‌కు అద్దం పట్టే కలెక్షన్ ఇది. - నేహ అగర్వాల్ శుభాముద్గల్ సంగీతం.. చిత్రసేన ప్రదర్శన లాక్మేలో పాల్గొనడం అనేది నాకు కొత్త కాదు. సందర్శకులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతినివ్వడం నా పంథా. నా సరికొత్త కలెక్షన్‌ను ‘చిత్-్రసేన’ పేరుతో లాక్మేలో ప్రదర్శిస్తున్నా. దీనికి హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జత కలపడం ఈసారి నేను చూపబోతున్న స్పెషాలిటీ. ఈ లైవ్మ్యూజిక్ను ప్రసిద్ధ గాయని శుభాముద్గల్ ఈ నెల 22న ప్రదర్శిస్తారు. ఇక నా చిత్-్రసేన విషయానికి వస్తే ఇదొక ప్రాచీన-ఆధునికతల శైలుల అపురూప సంగమం. పురాతన ఆలయ శిల్పాల నుంచి స్ఫూర్తి పొంది 16వశతాబ్దం నాటి వస్త్ర ైవె భవాన్ని, 21వ శతాబ్దపు చిత్రకళతో జత చేసి దీన్ని రూపుదిద్దాను. దాదాపు ఆరునెలల కృషి ఫలితమిది. కాంచీపురం చేనేత కళాకారుల పనితనం, అక్కడి కొర్వాయి నేత శైలి ఈ కలెక్షన్లో ప్రతిఫలిస్తాయి. నా దుస్తులన్నీ భారతీయ సంప్రదాయం, పురాణాల విశిష్టతకు అద్దం పడతాయి. ఊహించని కలర్ కాంబినేషన్స్, నాణ్యమైన సిల్క్ ఫ్యాబ్రిక్‌కు జర్దోసి ఎంబ్రాయిడరీ అద్దుకున్న ధోతీ, షేర్వానీ.. వంటివి నా కలెక్షన్లో కొన్ని మాత్రమే. - గౌరాంగ్షా ముచ్చటగా మూడోసారి గతంలో రెండుసార్లు లాక్మేలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇది మూడోసారి. అయితే ఈ సారి ఇండియన్ టెక్స్‌టైల్‌కు సంబంధించి సౌతిండియా నుంచి ఎంపికైన ఏకైక డిజైనర్‌ని కావడం సంతోషంగా ఉంది. ఈ నెల 21న ఇండియన్ టెక్స్టైల్ డే పేరిట జరిగే షోలో డిజైన్లను ప్రదర్శించనున్నాను. కళంకారి, పోచంపల్లి, ఇకత్ చేనేతల పనితనాన్ని చూపడం నా ప్రత్యేకత. ఇది వింటర్ సీజన్. అందుకే ఖాదీని వింటర్‌కు సైతం నప్పే చక్కని ఫ్యాబ్రిక్‌గా చూపబోతున్నా. ‘సపరేట్స్’ పేరిట నేను ప్రదర్శించే కలెక్షన్లో గాగ్రా, కుర్తా, స్టోల్, స్కర్ట్స్, జాకెట్స్, డ్రెసెస్, శారీస్ ఉంటాయి. కుర్తా, ప్యాంట్ ఇలా దేనికదే సెపరేట్‌గా కొనుగోలు చేయవచ్చు. మొత్తం 16 నుంచి 18 గార్మెంట్స్ చూపిస్తున్నా. - శశికాంత్ నాయుడు -
అందాల వేట
-
ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ ధూమ్
-
లాక్మేలో ఇలియానా, మలైకా, కరిష్మా మెరుపులు
-
లాక్మే ఫ్యాషన్ వీక్-వింటర్ ఫెస్టివల్ 2013